“చిలక పలుకులు, చిలక ముక్కు, చిలక కొరికిన జాంపండు, చిలకా గోరింక లాంటి జంట” అంటూ నాకు చాలనే విలువ ఇచ్చారు మీ తెలుగు వారు. ఎంతైనా మీ జాతి ప్రేమభిమానాలే వేరులే! తిట్టినా కొట్టినా మీకే చెల్లుతుంది. ఏ పూర్వ జన్మ పుణ్యమో గాని మీతో విడదీయలేని బంధం ఏర్పడింది. మా అమ్మ చెప్తూ ఉండెది.. పూర్వ జన్మ లో రామచిలుకను కష్టపెట్టినందుకే, రాముదు 14 ఏళ్ళు గడిచేదాక రామదాసుని ఆదుకోలేదు అని. మొన్నీ మధ్య రామదాసు సినిమా వచ్చిందే!! ఈ విషయం చెప్పే ఉండాలి.. అవునా??
ఏ చరిత్ర చూసినా ఏమి ఉన్నది గర్వకారణం అని ఇప్పుడు ఇవ్వన్నీ ఎందుకులే? పోట్ట కూటి కోసం కోటి విద్యలు అని ఏదో జ్యోత్సం చెప్పుకుంటూ బ్రతుకుతున్నా. గోదావరి సినిమా లో రోల్ చేసినా .. ఇళ్ళల్లో పెంపుడు జంతువుగా ఉన్నా, చెట్టు కింద కూర్చుని జాతకాలు చెప్పినా అంతా బ్రతుకుతెరువు కోసమే! కాకుల తర్వాత మీతో ఏదో లాగా నేగ్గుకొస్తున్న జాతి మేమే ఏమో!
నా పనికి గిరాకీ బాగానే ఉందండోయ్. “ఉద్యొగం వస్తుందా?, మేము అనుకున్నది అవుతుందా? నాకు కొడుకు పుడతాడా? నేను కోటీశ్వరుడిని అవుతానా?” అంటూ కోటి ప్రశ్నల జడిలో నన్ను తడిపేస్తారు. “నా వాడు ఎవడే..నా తోడు ఎవడే” అని ఆడ పిల్లలు నా మీద ఆశలు పెట్టుకున్న వారే. నేను ఏదైనా చెప్పేలోపే, “ఆ అందగాడు, నా చందురుడో..” అంటూ ఊహల్లో విహరిస్తారు. తీర ఇదీ సంగతి అని చెప్పాకా.. చిలకకు ఏమి తెలుసు అని వెక్కిరిస్తారు. ఇంతకీ చెప్పటం మరిచా.. ఎప్పుడూ ఏ చెట్టు కిందనో ఉండే నేను, మొన్న ఓ సాఫ్టువేరు కంపన్నీ వాళ్ళు పిలిస్తె వెళ్ళా. కొత్త యుగం వాళ్ళు, పాత పద్ధతులు ఎందుకు పాటిస్తారా అనుకున్నా… కానీ వచ్చిన ప్రతీ వారు చూపించుకున్నారు జాతకం. (డబ్బులు కట్టి చూపించుకోవాలి అంటే ఎంత మంది వచ్చే వారో??)
మనుషులు కూడ వింత ప్రాణులు. తమకు అంతా తెలుసును అంటారు.. కానీ ఒక్కోసారి అమాయకులుగా మిగిలిపొతారు. మేమే నయం. మా పిల్లలని రెక్కలు రాగానే పంపిచేస్తాం. మీరు ఎప్పటికీ విడదీయలెని బంధం అని అంటారు. అందులో స్వార్ధం కూడా ఉండనే ఉంది. ఈ పూట గడిచిందా అనేదే మా సమస్య. ఎప్పటికో ఆలోచిస్తూ ఈ నిమిషాన్ని విస్మరిస్తారు. పుస్తకాలు తెగ చదువుతారు కదా?? ఆఖరు పేజీ ముందు చదివెస్తే.. ఇంకా పుస్తకం చదివే అనుభూతి ఏమి ఉంటుంది? పెరుగన్నం తిన్నాకా..ఆవకాయ పప్పు తింటారా? రేపు నీ జీవితంలో ఇది జరుగుతుంది, అది జరగదు అని తెలిసినప్పుడు.. ఉదయాన్నే లేచి “ఇవ్వలా ఎలా గడుస్తుంది చెప్మా?” అని ఎట్లా వాపోయెది? నిరాశ, ఓటమి, ఎదురుచూపులు, ఆశ భంగం, చమత్కారాలు ఇవి లేకపోతే జీవితం ఇంత మధురంగా ఉంటుందా? నిన్న మీద సంతృప్తి,నేటి మీద విశ్వాసం, రేపు మీద ఆశ లేని మనిషి .. ఏమి సాధించినట్టు?
నా దగ్గరకే ఓ మనిషి వచ్చి జాతకం చెప్తా అంటే.. “ఛీ పో” అంటా!! “అంత లేదు నీకు” అనుకుంటున్నారా మనసులో. నిజమే..మొన్న ఎవరో పెద్దాయన మా బాసును ఎడా పెడా వాయించి పొయాడు.. అవే మీకు అప్పచెప్పా! ఎంతయినా నేను చిలుకను కదా?? 😉
చాలా బాగుంది. ఈరోజు మీరు రాసిన టపా కూడలిలో మొదటిదిగా కనబడిందాక మీ బ్లాగు నా కంటబళ్లేదిన్నాల్లూ. 🙂
LikeLike
మంచి ఆలోచన..అంతకు మించిన ఎత్తుగడ. కాని కాస్త ‘స్పార్క్’ లొపించినట్టైంది. ఎందుకో!
LikeLike
ఆ ఎందుకో కి.. అందుకే అని చిన్నగా చెప్పలేను. ఓ ఆదివారం ఆమావాస్య అర్ధరాత్రి .. ఈ బ్లాగు మొదలు పెట్టి.. ఏదో ఒకటి రాయాలి అని రాసిన టపా ఇది. చదివినందుకు నెనర్లు.
LikeLike