తోడు


ఒంటరిగా ఉన్న నన్ను చూసి.. చంద్రుడు కన్ను గీటు నవ్వుతున్నాడు పవణుడు ఈల వేసి గోల చేస్తున్నాడు వరుణుడు చేయి గిల్లి కవ్విస్తున్నాడు!! కలలోని నీవు నిజమై తోడు నిలిస్తే .. చంద్రుడు మబ్బుల చాటు దాగి పోతాడు "వస్తున్నా" అంటూ వరుణుడు, ఎక్కడికో పయనమవుతాడు పవణుడు జోల పాడి నిద్రపుచ్చుతాడు!!

రామ కనవేమిరా??


నా స్వామిని పేరులో నింపుకున్న ఓ చిలుకా..నా స్వామి స్పర్శ తాకి ధణ్యమైన ఓ ఉడతా..నా స్వామి పాద ధూళి తాకిన ఓ నేలా..నా స్వామికి ఎంగిలి తినిపించిన ఓ శబరీ..నా స్వామి వింటె నారి శబ్దానికి ఉలికి పడ్డిన సంద్రమా..చప్పరే నా దేవునికి, లోకం కోసం నన్ను కాదనుకున్నా, అతడే నా లోకమని!!

క్షణం – మరుక్షణం


నీవు ఎదురుపడిన ప్రతిసారి మాటలు మరిచిన పెదవులు తెగ వణుకుతాయి ఒక క్షణం మదిలో దాచుకున్నవన్నీ కళ్ళు చదివిపెడతాయి మరుక్షణం నీ చేతిలో చేయి వేసి, అడుగులో అడుగు కలుపుతుంటే ప్రపంచమే మరుగున పడుతుంది ఒక క్షణం నువ్వే ప్రపంచమవుతావు మరుక్షణం నీ ధ్యాసలో ఉండగా, వీచే చల్లని గాలి మనసుకి చెక్కిలిగింతలు పెట్టి ఆడిస్తుంది ఒక క్షణం అంతులేని విరహాన్ని రగిలిస్తుంది మరుక్షణం నీ తలపులను ఊసులుగా మార్చాలి అంటే అనంత పదకోశం ఉందన్న ధైర్యం... Continue Reading →

జ్ఞాపకాలు


ఒక రోజు ఫిసిక్స్ క్లాసులో ఎదో మాటల మధ్యలో, "గంగా నదిలో పూజ చేసిన సామాగ్రి అంతా వేస్తారు; గంగలో చాలా మంది స్నానాలు చేస్తారు. నానా చెత్త పడేస్తారు. అఖరకు శవాల్ని కూడ!! ఐనా మనం ఆ నదిని దైవంగా కొలుస్తాం, పరమావధిగా భావిస్తాం. మనది అంతా గుడ్డి నమ్మకాలు...", టీచరు చెప్తునే ఉన్నారు. అంతకు ముందు రోజే ఎవరో కాశి నుండి తెచ్చిన నీళ్ళు అమ్మ ప్రసాదం అని ఇచ్చిన గుర్తుతో నా మొహం... Continue Reading →

పరిచయం


సాయం సంధ్యవేళ, సముద్ర తీరానా.. ఇసుకలో భారంగా నడిచే పాదాలు, అయినా అలసిన మనసుని తట్టి లేపే చల్లని గాలి; చెదురుతున్న కురులని సర్దడంలో సన్నని విసుగు, అయినా పెదాలపై చిరునవ్వు తెప్పించే ఆహ్లాదమైన వాతావరణం. ఎదురువస్తూ పలకరిస్తున్న గాలికి రెప్పలు వాలిపోతున్నా.. అనంతముగా కనిపించే నీలిసాగరం రెప్పని కట్టిపడేస్తుంది. "ఎంత గాంభీర్యం .. ఎంత నిఘూడత్వం.. ఊ..నీలో ఎముంది?" అంటూ ఆలోచించేలా చేసే సముద్రాన్ని చూస్తూ తెలియకుండానే ముందుకు నడక సాగుతుంది. అల్లంత దూరాన ఘోషిస్తూ... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑

%d bloggers like this: