జ్ఞాపకాలు

Posted by

ఒక రోజు ఫిసిక్స్ క్లాసులో ఎదో మాటల మధ్యలో, “గంగా నదిలో పూజ చేసిన సామాగ్రి అంతా వేస్తారు; గంగలో చాలా మంది స్నానాలు చేస్తారు. నానా చెత్త పడేస్తారు. అఖరకు శవాల్ని కూడ!! ఐనా మనం ఆ నదిని దైవంగా కొలుస్తాం, పరమావధిగా భావిస్తాం. మనది అంతా గుడ్డి నమ్మకాలు…”, టీచరు చెప్తునే ఉన్నారు. అంతకు ముందు రోజే ఎవరో కాశి నుండి తెచ్చిన నీళ్ళు అమ్మ ప్రసాదం అని ఇచ్చిన గుర్తుతో నా మొహం కలవికలు మారాయి. “నిజంగా మనవి గుడ్డి నమ్మకమేనా?? మనలో సైంటిఫిక్ అప్రోచ్ లేదా?” అని టీచరు అనేసరికి, మళ్ళీ క్లాసులోకి వచ్చా!! “కాని ఆ గంగా నది ప్రవహిస్తూనే ఉంటుంది కదా?? కదిలే నీరు మలినాన్ని తనతో పాటే తీసుకుపోదా??” ఒక అమ్మాయి ప్రశ్న అడుగుతూనే జవాబు చెప్పింది.

ఇది ఎప్పుడో జరిగిన విషయం. కానీ మనసు ఎందుకో ఆ ఙాపకం చూటూనే తిరుగుతుంది. ఙాపకం అంటే గుర్తువచ్చింది. మన జీవితంలో ఙాపకాలకు నదికి ఎందుకో పోలిక ఉన్నట్టు లేదూ?? అసలు జీవితం అంటే ఎంటి? మన జీవితాన్నే మనవళ్ళకు కథగానో, లేక ఓ పుస్తకంగానో, ఓ సినేమాగానో తీయ్యాలి అనుకుంటే, అందులో ఉండేవి ఎంటి? ఙాపకాలే కదా!! కొన్ని మనకు నచ్చినవి, మరి కొన్ని బాధించేవి. ప్రతీది మనతో ముడిపడింది కనుక అవి ప్రత్యేకం. జీవితం చిన్ని చిన్ని ఙాపకాల సమాహారం.అవి లేని జీవితం నిరర్దకం. గతం గుర్తులేక అనుభవించే నరకం, ముందర ఎంత వెలుగున్నా హరించేస్తుంది. బ్రతికున్న జీవచ్చవం లా మారుస్తుంది.

సన్నిహితులు దూరమైనప్పుడు, ఆత్మీయుల దరి చేరలేనప్పుడు, ఙాపకం ఊరట నిలుస్తుంది. దూరాలు దూరంగా పొతాయన్న ఆశ కలిగిస్తుంది. ఆ వేదనలో ఊరటనిస్తుంది. ఒక వేళ ఆ దూరం చెరగకపొతే, చెరపలేనిది ఐతే?? మనం ‘ఙాపకాలలోనే జీవించగలమా??!! ఊరటనిచ్చే ఆ ఙాపకాలే, ఇప్పుడు ఉరి తాడులు అవుతాయి. ఉ.. గంగ నిత్య ప్రవాహిని. అందుకే అది ఆరోగ్యకరం. కాని అదే గంగను ఓ సీసలో బంధించి, నెల తర్వాత తాగితే మ్రుత్యువు. ఙాపకాలు అంతే, జీవితం సాగేంతవరకు అవి ఓ ఆలంబన. వాటినే జీవితం చేసుకోవాలి అని బంధించామా, అవే ఉరి తాడులు.

మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరాలు: ఙాపకం, ఇంకోటి మరుపు. ఒకటి జీవితాన్ని ఆస్వాదించటానికి, మరోకటి ఏమి ఎదురైనా జీవితం సాగించటానికి. వీటిలో ఏది సమపాళ్ళు మించినా, మనుగడ కష్టమే!!

3 comments

 1. గంగ నిత్య ప్రవాహినే…కానీ మన మనుషులు ఎంత మాలిన్యాన్ని ఆ గంగమ్మతల్లి కడుపులో చేర్చారన్నది వింటే “పవిత్రత” ఆలోచనలన్నీ పటాపంచలవుతాయి.

  ఒక సర్వే ప్రకారం గంగా నది పొడవునా ఉండే పుణ్యక్షేత్రాల దగ్గర faecal coliform level(దీన్ని తెలుగులో రాస్తే డోకొస్తుందని రాయటం లేదు) దాదాపు 1000 కౌంట్లు దాటింది. సాధాన త్రాగునీటిలో దాని కౌంట్ విలువ “౦” ఉండాలి, అంటే అస్సలుండకూడదన్నమాట.

  Like

 2. mahesh gaaru:

  mee antha vishaya parignyanam.. vak chaaturyam naaku etoo levoo.. :-(( kaneesam ila prati tapaa nu chadive manchi alavaatu elaa chesukovaalo cheptaaraa??

  Purnima

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s