తెర తీసిన తరుణంలో
నన్ను చదువ తొందరపడే అతని చూపులు
కొత్త రెక్కలు తొడిగే నా తలపులు
అతడు చాచిన చేతిలో నా దోసిలి పెట్టి
ముసి ముసిగా నవ్వుకుని మురిసిపొయే వేళ
భాజా భజంత్రీలతో మోగుతున్న మంటపంలో
వేద మంత్రాల నడుమ, “ఇహ నీదే నా చిట్టి తల్లి” అంటూ
కన్యాదానం చేసే నాన్న కన్నీళ్ళ పర్యంతమైతే..
ఏమి చేయను? ఎలా సంభాలించను?
అతడి గుప్పట్లో ఉండిపోయాయి చేతులు
వదలలేను, ఆ కన్నీటిని తుడవలేను, నా కంటి ధారను ఆపలేను
నాకై చాచిన చేతులలో నా నిన్నను మరువనా??
నన్ను మలచిన చేతిల్లో, నేన్నున్నాను అని నిలువనా??
(ఇవ్వాళ ప్రియ (నా ఫ్రెండ్) పెళ్ళికి వెళ్ళా!! కాళ్ళు కడిగి కన్యాదానం చేసేటప్పుడు వాళ్ళ నాన్న గారు భాధపడ్డారు. నా మనసు ఇంకా ఆ క్షణం చుట్టూనే తిరుగుతుంది 😦 )
భావాలు బాగున్నాయి. కానీ మీరు వ్యక్తీకరణ ఇంకా బాగా చేయగలుగుతారు ఇంకొంచెం శ్రధ్ధ పెడితే.
LikeLike
Hi Prasanti:
Thanks for the confidence. I’d give it a try, lemme see if things work.
LikeLike