Affectionately dedicated to HP Compaq 6720s

రాముడా?? రావణుడా??

నాపై అనుమానంతో అగ్నిపరీక్ష పెట్టిన రాముడా
నాకై బంగారు లంకను అగ్నికి ఆహుతిచ్చిన రావణుడా

నన్ను తప్ప ఇంకెవరినీ దరిచేరనివ్వని రాముడా
నాకై సర్వస్వాని పోగట్టుకున్న రావణుడా

తప్పుచేయకపోయినా లోకం కోసం కారడువులలో వదిలిన రాముడా
తప్పని తెలిసినా ఆత్మార్పణ చేసిన రావణుడా

ఎవరు నన్ను ఆరాధించిన వారు?ఎవరు నన్ను ప్రేమించింది?

తాగుబోతు కూతలకు ఆలిని కాదనుకున్న రాముడేమి దేవుడు?
హృదిలో కట్టిన వలపు గుడికై, పతనమైపోయినా రావణుడు రాక్షసుడా?? అని అనిపించినా

తన పతనానికి కారణభూతంగా నన్ను నిలిపిన రావణుడు కాడు
నను నిందించినా, తను మధనపడినా,
రామరాజ్యపు సౌధానికి నన్ను పునాదిగా మార్చిన రాముడే నా స్వామి!!

************************************************************************************
*అప్పుడెవరో.. “సీతకు రాముడు కరెక్టా?? రావణుడు ఆ?? ఎవరితో సీత సుఖంగా ఉండేది??” అని అడిగారు. నా
సమాధానం చదివారు కదా!! మరి మీ అభిప్రాయమేమిటో తెలియచేయగలరు.

9 Responses to “రాముడా?? రావణుడా??”

 1. రాధిక

  బాగుంది మీ వాదన.ఈ విషయం లో నేను ఏమీ చెప్పలేను కానీ సీతకు జరిగింది మాత్రం అన్యాయమే.

  Like

  Reply
 2. abcpqrxyz

  మీరు రాసేది కరెక్టు కాదు. అమ్మవారి గొంతుతో ఫెమినిజం రాయడం ఇంకా అభ్యంతరకరం. అమ్మవారూ అయ్యవారూ కొన్ని ఆదర్శాలు బోధించడానికి భూలోకంలో అవతరించారు. ఏ పరిస్థితిలో ఎలా ప్రవర్తించాలో మానవజాతికి ఒక ఆదర్శాన్ని చూపి వెళ్ళారు. మీరు దాన్ని వక్రీకరించడం పాపహేతువు. అమ్మవారు సాక్షాత్తు లక్ష్మీదేవి అనే విషయాన్ని మర్చిపోకండి. ఆమె ఆగ్రహానికి గురికాకండి. అదే సమయంలో రాములవారి గొప్పతనాన్ని కూదా తెలుసుకోండి !

  This will be my first and last comment on your blog.

  Like

  Reply
 3. Purnima

  ప్రవీణ్ గారు,
  లేదండి.. నా బ్లాగు కూడలిలో లేదు. ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వీలుపడితే సహాయం చేయగలరు.

  రాధిక గారు,
  నా వాదనను మన్నించినందుకు ధన్యవాదాలు. సీతకు అన్యాయం జరిగింది అంటే నేను కాదనలేను. 🙂

  @abcpqrxyz:
  గౌరవించడానికి సీతారాములు దైవం అని తెలియక్కరలేదు నాకు. వారు మామూలు మనుషులైనా, కాల్పనిక పాత్రలైనా .. మనసారా ప్రేమించాక, ఎన్ని కష్టాలైనా దుఃఖాలైనా మనిషిని మహితాత్ముని చేస్తాయేగాని, దిగజార్చవు అని నిరూపించారు కనుక.. వాళ్ళూ నాకెప్పుడూ ఆదర్శప్రాయులే. ఇదే నా బ్లాగులో చెప్పదలుచుకున్నది. ఆ భావం మీ వరకు చేరలేదని ఒక్కింత బాధగా ఉన్నా..
  “గమనిక: ఇది ఒక hypothetical ప్రశ్నకు సమాధానమిచ్చే ప్రయత్నమే గాని, ఎవరి విశ్వాసాలను, భక్తిశ్రద్ధలను ప్రశ్నించే ప్రయత్నం కాదని గమనించగలరు. ” అన్న వాక్యం మరిచానని గుర్తుచేసిందుకు Thanks.

  అన్నం ఉడికిందో లేదో అని చూడడానికి ఒక మెతుకు పట్టుకుంటే చాలు* అన్న సామెత ప్రకారం, this may well be your last comment on my blog. But lemme tell you *Conditions Apply here as well. అన్నం పాత్ర కింద పెద్దమంట పెట్టేసి, కలియబెట్టకుండా వదిలేస్తే.. కిందనున్న అన్నం మాడుతుంది, మధ్యన్నున అన్నం కాస్త ఉడుకుతుంది, పైన ఉన్న అన్నం బియ్యానికి అన్నానికి సరిగ్గా మధ్యలో ఉంటుంది. అన్నంవండడం వచ్చినవారికే ఆ సామెత చెల్లుతుంది అని గమనించగలరు.

  Like

  Reply
 4. బుసాని పృథ్వీరాజు వర్మ

  ప్రేమించే మనసును చూస్తున్నా, తలుచుకున్నా ఇంకెక్కడి కష్టాలు,సుఖాలు? ప్రేమించే వారిని గుర్తించటం కూడా కష్టమా? ఏదైనా చేస్తేనే ప్రేమ ఉన్నట్టా?నిజంగా ఒకరి ప్రేమ ఒకరి పతనానికి కారణం అవుతుందా? నా సమాధానం రాముడు ఉత్తమోత్తముడు. ఉత్తముల ప్రేమళ్లో కష్టాల గుళ్ళాలు ఉండక తప్పవు. kavitha, kavithahrudayam chaalaa baavundi.

  http://www.pruthviart.blogspot.com

  Like

  Reply
 5. prasanthi

  నాకు ఈ కవిత నచ్చలేదు. ఈ వాదన నచ్చలేదు. మీ ఉద్దేశ్యం మాత్రం కాదు. కాకపోతే ఒక స్త్రీగా స్త్రీకి సంబంధించినంత వరకు తన భర్త రావణుడైనా అతన్నే ప్రేమిస్తుంది. రాముడు ఉత్తమోత్తముడైనా దేవుడిగా పూజిస్తుంది. అలాంటప్పుడు సీతకి ఎవరు కరెక్టు అన్న వాదనే అర్థరహితం. సుఖం, సంతోషం అన్నవి నిర్వచనాల్లో ఉండవు, అనుభూతుల్లో ఉంటాయి.

  Like

  Reply
 6. Purnima

  పృథ్వీ గారు:
  మీకు ధన్యవాదాలు. కవితని నేను అనలేకపోతున్నా, చెప్పాలనుకున్నది, క్లుప్తంగా చెప్పె విధానం అంతే!! బహుశా నేనే ఈ ప్రక్రియకు ఓ కొత్త పేరు పెట్టాలి ఏమో!! (ఆఖరకు తవికలు కూడా అదిరిపొతున్నాయి కొన్ని బ్లాగుల్లో !!) నా కవితకన్నా అందులోని హృదయాన్ని చూసి మెచ్చుకున్నందుకు చాల సంతోషం. 🙂

  ప్రశాంతి గారు:
  మీ అభిప్రాయంతో ఎకీభవించకపోయినా, దాన్ని గౌరవిస్తాను. ఎదో ఇంటర్వూలో అడిగిన ప్రశ్నకు సమాధానం అది. ఆ ప్రయాసలో వాస్తవాలను తప్పుబట్టె ఆలోచన లేదు. భర్త అన్నవాడినే భార్య ప్రేమిస్తుంది. కాదనలేను.. సత్యం గనుక. కానీ ఇక్కడ ప్రశ్న వేరు, రాముడు రావణుడు లో ఎవరు, నీ ఉద్ధేశ్యంలో సీతను ప్రేమించారు అని. అమ్మాయిని కనుక, సీతను నేనే ఐతే అని ఊహించుకుని వ్రాశా. అబ్బాయి అయ్యుంటే, రాముడిలాగా వ్రాశెదాన్ని. అంతే!!

  Like

  Reply
 7. కత్తి మహేష్ కుమార్

  విన్నూత్న పోకడలు. నాకైతే రావణుడే ఓకే…వెధవతనం లో కూడా సిన్సియారిటీ చూపేవాడే అసలైన మొగాడు(ఫెమినిస్టులు క్షమించాలి). చేతగాక సిన్సియర్ గా ఉన్న వెధవలు మనకెందుకూ!

  ఆ abcpqrxyz గారు ఎవరోగానీ, వాల్మీకి రామాయణానికీ, తులసీ రామాయణానికీ, కంబ రామాయణానికీ తేడా తెలీకుండా మాట్లాడాడు. పాపం వారి అజ్ఞానానికి బాధ కలిగింది.

  Like

  Reply
 8. sujji

  కవితలొ చివరి లైన్లు కాంప్రమ్మస్ ఐయి రాసినట్లు ఉంది. తేడాగా రాస్తే బాగోదేమో అని ..

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Basic HTML is allowed. Your email address will not be published.

Subscribe to this comment feed via RSS

%d bloggers like this: