తన అనురాగపు కిరణాలు నామీద ప్రసరించగానే
వానచినుకులా మబ్బుచాటున మాటువేసిన నేను
తెల్లని ఆ కిరణానికి ఏడు రంగులు పులిమి..
నే మనసు పడిన వెంటనే ఓ ఇంద్రధనుస్సు పొంగులే.. అని పాడాలనుకున్నా!!
కారుమబ్బులలో చిక్కుకుపోయింది కిరణం
విరహవేదనతో విలపిస్తూ భారంగా మారిన నన్ను
తనలో దాచుకున్న మబ్బే నేలకు సాగనంపింది.
మచ్చలేని మమతకు లోకంలో రంగులన్నీ పరిచయం చెయ్యాలనుకున్నా..
కానీ నలుపొక్కటే చూపించింది ఈ ప్రకృతి మాకు
నే మనసు పడిన వెంటనే ఓ ఇంద్రధనుస్సు పొంగులే.. కేవలం నా భ్రమేనా!!??
కవిత్వ పరంగా చూస్తే చివరి రెండు లైన్లు పలుచబడినట్టు అనిపిస్తోంది. భావం మాత్రం బాగుంది. ముఖ్యంగా మొదటి ఖండిక.
LikeLike
అసలు కవిత్వం నా కప్పూ కాదు మగ్గూ కాదు 😉 (it’s not my cup of tea) అని చెప్పే ప్రయత్నం)) నీ బ్లాగులు మొదలు పెడుతున్నామే గాని చివరి వరకు వెళ్ళటం లేదు అనే complaint కి, పోనీ తక్కువ పదాలతో భావం చెప్పడమే పనిగా పెట్టుకున్నా!! నా భావం నచ్చినంతవరుకూ నేను విజయం సాధించినట్టే.
Thanks for your comment.
LikeLike