చివరి ప్రేమలేఖ


"హే... ఎవర్నైనా ప్రేమిస్తున్నావా??" అన్న ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు అంతా!! "యస్..యస్..ఐమ్ ఇన్ లవ్.. " అని చెపితే సరిపొతుందా?? అప్పటికప్పుడు అతని ఊరు పేరు చెప్పాలి, త్వరలో అతన్ని అందరి ముందు నిలబెట్టి పరిచయం చెయ్యాలి, "ఎప్పటికీ ఒక్కటైపోతున్నామోచ్!!" అంటూ కార్డులు పంచాలి, అటు తర్వాత ఇంకా కలిసే ఉన్నాము అని ఎప్పటికప్పుడు నిరూపిస్తూ ఉండాలి. ఇవ్వనీ నాతో workout కావు. అందుకే "అబ్బే అలాంటిది ఎమీ లేదులే" అని చెప్పుకొస్తున్నాను. నీతో అలా... Continue Reading →

వీకెండ్ అంటే శనాదివారాలు కాదా??


ఉద్యోగంలో చేరిన కొత్తలో మాచెడ్డ చిరాకు వచ్చిపడింది నాకు. వారమంతా ఆఫీసులో బాగానే ఉండేది, ఎక్కువ పనిభారం గానీ, బోరింగ్గా కానీ అనిపించేది కాదు. వారాంతరం అంటే కాస్త హాయిగా ఉండేది.. పనికి దూరంగా ఉన్నదానికన్నా ఓ 40 కి.మీ. ప్రయాణం చెయ్యక్కరలేదు అనే ఆనందమే ఎక్కువ. శుక్రవారం కాస్త పెందలాడే బయలుదేరి, మళ్ళా సోమవారం ఉత్సుకతో ఆఫీసుకు వెళ్ళడం అంటే భలే నచ్చేది నాకు. కానీ మండే మార్నింగ్ ప్రశ్న .. "వీకెండ్ ఏమి చేసావు"... Continue Reading →

ప్రశ్నాతీతాలేవి??


పదో తరగతిలో మాకు చరిత్ర మొత్తం "భారత స్వతంత్ర" పోరాటం గురించే పాఠాలు. ఎంతో ఆసక్తిగా ఉండేది చరిత్రంటే నాకు. చదివి ఊరుకునేది లేదు, దానిగురించి సమగ్ర చర్చలు జరిపేవాళ్ళం నేను నా మిత్రులు. అలా ఒకనాడు "గాంధీ వళ్ళ మనకు స్వాతంత్ర్యం రాలేదు. అప్పటికే రెండో ప్రపంచ యుద్ధంలో దారుణంగా నష్టపోయిన బ్రిటీషువాళ్ళు ఇంత సామ్రాజ్యాని పరిపాలించలేమేమో అన్న భయంతో కొంత, కొల్లగట్టడానికి భారత్ దగ్గర ఏమీ లేకపోవటం వల్ల మనకు స్వరాజ్యం వచ్చింది" అని... Continue Reading →

ఖుషీ ఇవ్వని “జల్సా”


"తెలుగు సినిమాలు జనంలోకి ఎంత ఎలా చొచ్చుకుపోయాయి అంటే.. ఇవ్వలా ఏ ఇద్దరు కలిసిన "బాగున్నారా" అన్న పలకరింపు తర్వాత ఫలానా సినిమా చూసావా?? ఆ పాట విన్నావా?? ఈ డైలాగు గుర్తుందా?? అన్నటాపికే!!" అంటూ మెగాస్టారు వారు ఒకానొక సందర్భంలో చెప్తుండగా వినే వరకు సినిమా గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు. ఓ మూడు గంటల పాటు ఎవరో చెప్పదలచుకున్న విషయాన్ని వాళ్లకు నచ్చిన విధంగా చెప్తుంటే, చూసే ఓపిక నాకుండదు. నన్ను పూర్తిగా మంత్రముగ్దం... Continue Reading →

ఏడకి పోతాండ్రు??


నమస్తే అన్నా!! ఎట్లున్నారే?? అంతా బాగేనా?? ఇన్ని దినముల సంది గా మూలన పడున్నా.. గివలా ఎందుకో ఊరు మీదకు పొవాలే అని తెచ్చిండ్రు. పొద్దుగాల నుండి ఒక్కటే చక్కర్లు. ఇక ఇంటికి పొతాంటే మీరు కానొచ్చినారు.. మాట మాట కలుపుకుంటూ పోదాము రాండ్రి. అసలు పొద్దుగాల రోడ్డు మీదకు రాగానే మస్తు పరెశాను అయ్యినా.. ఏడికాడికి గిట్లా తవ్విపెట్టినారు ఏమని? నడవలేక నడవలేక నడిచినా!! ఏమో మెగా సిటీ అంటున్నారు కదా, జుమ్మున పొదాం అనుకున్నా..... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑

%d bloggers like this: