ప్రశ్నాతీతాలేవి??

Posted by

పదో తరగతిలో మాకు చరిత్ర మొత్తం “భారత స్వతంత్ర” పోరాటం గురించే పాఠాలు. ఎంతో ఆసక్తిగా ఉండేది చరిత్రంటే నాకు. చదివి ఊరుకునేది లేదు, దానిగురించి సమగ్ర చర్చలు జరిపేవాళ్ళం నేను నా మిత్రులు. అలా ఒకనాడు “గాంధీ వళ్ళ మనకు స్వాతంత్ర్యం రాలేదు. అప్పటికే రెండో ప్రపంచ యుద్ధంలో దారుణంగా నష్టపోయిన బ్రిటీషువాళ్ళు ఇంత సామ్రాజ్యాని పరిపాలించలేమేమో అన్న భయంతో కొంత, కొల్లగట్టడానికి భారత్ దగ్గర ఏమీ లేకపోవటం వల్ల మనకు స్వరాజ్యం వచ్చింది” అని ఒక అమ్మాయి అంది. ఆ వాదంలో నాకు ఏ మాత్రం నిజం కనిపించలేదు. అసలైతే నేను ఎందుకు ఒప్పుకోవటంలేదో చెప్పే దానను. కానీ ఆవేళ ఆ అమ్మాయి మీద భరించరాని కోపం వచ్చింది. “గాంధీ మహాత్మున్నే ప్రశ్నించే” తనతో ప్రతివాదన అనవసరమనిపించింది. జాతిపితను గౌరవించలేని తనను చూసి “అయ్యో!!” అనుకున్నా. ౩౦ కోట్ల భారతీయులను ఒక్క తాటిపై నిలబెట్టిన అవతారపురుషునిపైనా ఈ నెపం అని మధనపడ్డా!!

ఇంజనీరీంగు చేస్తున్న సమయంలో గాంధీజీ ఆత్మకథ “My experiments with Truth” చదివా. చదివే కొద్దీ గాంధీ మహాత్ముడన్న భావన సన్నగిల్లుతుందో, బలపడుతుందో అర్ధం కాలేదు. అవతారమూర్తి కాదని తెలిసింది. మనలా మామూలు మనిషే, నమ్ముకున్న సిద్ధాంతలను ఆమరణం చిత్తసుద్ధితో పాటించారు కాబట్టి, మహాత్మునిగా ఎదిగారు. నిజమేనేమో.. కేవలం అహింసావాదంతో మనకు స్వేఛ్చరాలేదేమో.. ఇంకా ఎన్నో త్యాగాలఫలం అది. ఎవరి దారీ తప్పు అనటానికి లేదు, ఎవరి సేవను విస్మరించడానికి లేదు. గాంధీ విధివిధానలను ఎవరైనా వ్యతిరేకిస్తే ఇప్పుడు ఆశక్తిగా వింటా.. వింటే పాపం అనే భ్రమపోయింది. ప్రశ్నించడం తప్పు కాదు, సరైన సమాధానం ఇవ్వక అసలు ప్రశ్నించడమే తప్పు అనడం అసమంజసంగా అని అవగతమైంది.

ప్రశ్న ఓ వింత ప్రహసనం. ప్రశ్నలేనిదే మానవ మనుగడే ప్రశ్నార్ధకం, ప్రశ్న అడగలేనప్పుడు ఎంత అస్సహాయతో!! ప్రశ్నకు జవాబు రానప్పుడు ఎంత నిరుత్సాహామో!! “అది ఏమిటి?”, “దీన్ని ఏమంటారు??” అన్న అమాయక ప్రశ్నలతో మొదలయ్యే జీవన ప్రయాణం, “నేను ఎవరు?” అన్న ప్రశ్నకు జవాబు కోసం అన్వేషిస్తుంది. ఆద్యంతాలకు నడుమ ఇంకెన్నో ప్రశ్నావళికి జవాబులు వెతకడమే జీవితం. ఇంత ముఖ్యమైన పాత్ర పోషించే ప్రశ్నకు ఏమి అడ్డంకులు ఉన్నవన్న ప్రశ్నే.. నన్ను నిలువనివ్వడంలేదు. “దేవుడే ఇవ్వన్నీ చేయమన్నాడా??” అంటూ నైవేద్యాలవంక చూపిస్తే లెంపలు వేసుకోమంటుంది. సినిమాలో సెన్స్ ఉందా అంటే ఫాన్స్ కి కోపం. రాముడున్నాడా అసలు అంటే మమల్ని అగౌరవిస్తున్నారు అంటారు. ఎక్కువ ప్రశ్నలు వేసే విద్యార్ది అంటే టీచరుకు మింగుడుపడదు. సీత స్థానంలో నువ్వుంటే రామున్ని ఇష్టపడేదానివా అనేది ఊహాజనితమైనా మనం ఆదరించలేము. కొన్ని ప్రశ్నలను ఎందుకు దాటవేస్తాము? ఎందుకు వాటిని ప్రశ్నలుగా భరించలేము? సమాధానం ఇవ్వకుండా ఎవేవో కారణాలు చెప్పి మనల్ని మనం సమాధానపరుచుకుంటాము? ప్రశ్నను అర్ధంచేసుకోకుండా.. అడిగినవాళ్ళను బద్ధ శత్రువులుగా భావిస్తారు.

“నువ్వు ఉన్నావా అసలు?” అని అడిగితే నిజంగా దేవుడుంటే ఆ ప్రశ్నకు ఆనందించాలి, తననే ప్రశ్నించే ధైర్యం, మేధస్సు ఉన్నందుకు సంతసించాలి గాని, నన్నే ప్రశ్నిస్తావా అంటూ శపించకూడదు కదా?? వీరిని ప్రశ్నించరాదు, ఇవ్వన్నీ ప్రశ్నలకు అతీతం అంటూ ఒక విభజన ఉందా?? మనకు నచ్చనవ్వన్నీ వ్యర్ధప్రశ్నలే అంటే మన పయనం కష్టమవదూ??

6 comments

  1. పూర్నిమగారు..

    భారతదేశానికి స్వాతంత్ర్యం ఎందుకొచ్చిందొ అన్న విషయం మీద నేను ఇక్కడ నా అభిప్రాయాన్ని తెలియజేయడం లేదు, కానీ మీరన్నట్లు.. “౩౦ కోట్ల భారతీయులను ఒక్క తాటిపై నిలబెట్టిన అవతారపురుషుడు .. ” అన్న statement కు మాత్రమే అని గ్రహించగలరు.
    మెదటి విషయం : నిజంగా ౩౦ కోట్ల మంది భారతీయులు అహింసా మార్గాన్నే పాటించారంటారా?? ఒక వేళ పాటించారను కుందాం.. వారంతా గాంధీగారి వల్లే ప్రేరేపితులయ్యారంటారా??

    రెండవ విషయం : ఒక వేళ నిజంగా ౩౦ కోట్ల భారతీయులు అహింసా మార్గాన్నే ఎంచుకున్నట్లైతే.. మరి మిగిలిన వివిధ పోరాటాలను వారి వారి మార్గాలుగా ఎంచుకున్న వీరుల సంగతేమిటి? వారికి followers లేరా.. ఉంటే వారు భారతీయులుకారా.. ఒక వేళ వాళ్ళందరూ భారతీయులనుకుందాం.. వాళ సంఖ్య ౩౦ కోట్ల మందిలో .. ఎంతలేదన్నా ౨౫ సాతం (25%) ఉండదంటారా??

    మూడవది : ఒక్క అహింశా పోరాటం వల్లనే మనకు స్వాతంత్ర్యం వచ్చిందంటారా.. మరి, సుభాష్ చంద్రబోస్ సేన చేసిన కృషి ఫలితం ఎమయ్యింది?? చిరునవ్వుతో ఉరికంబాన్ని అధిరోహించిన భగత్‍సింగ్ లాంటివారి త్యాగ ఫలమేమయ్యింది.. వీరంతా ఎందుకు.. మన మన్యం వీరుడు, సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన అల్లురి సీతారామరాజు పోరాటం వల్ల ఎవ్వరూ ప్రేరణ పోందలేదంటారా.. ఏమీ ఒరగలేదంటారా??

    మీరు పొందుపరచినట్లు, గాంధీగారు ఒక అవతార పురుషుడు కాదని తెలిసినా.. ఒక సిధాంతకర్తగా మనం తలచుకోవడంలో తప్పు లేదనిపిస్తుంది. ఏది ఏమయినా.. నా అభిప్రాయం నేను తెలియజేసాను.. ముగించే ముందుగా మరిక్క సారి .. “౩౦ కోట్ల మంది భారతీయులను ఒక్క తాటిపై గాంధీగారు నిలిపారు అన్న విషయాన్ని నేను ఖండిస్తున్నాను ..” అంతే కానీ మరే విషయం కాదని పెద్ద మనసుతో అర్దం చేసుకోగలరు.

    తప్పుగా అనిపిస్తే .. ముందస్తుగా .. మన్నించగలరు..

    ఇట్లు,
    భవదీయుడు,
    చక్రవర్తి

    Like

  2. చక్రవర్తి గారు:

    నమస్కారాలు!! మీరు ఇంత ఇలా ఖంఢించిన ఆ వాక్యం నేను ఎప్పుడో ఎవరినోటనో విన్నది. అందులో నిజానిజాలు గ్రహించక నమ్మడం పొరపాటు అనీను, ప్రశ్నించకుండా దేనినీ ఒప్పుకోకూడదనే ఈ టపా. ఆ విషయాన్ని మీ అంత విశీదీకరించకపోయినా.. క్లుప్తంగానైనా చెప్ప అనే అనుకుంటున్నా. ఆ వాక్యం తప్పు ఏలా అవుతుంది అని ఇప్పుడు ఎవరూ ప్రశ్నిచరులేండి.. మీ అభిప్రాయం చదివాక.

    టపా ఆసాంతం చదివి, మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు!!

    Like

  3. ఇప్పుడే నీ ఈ పాత టపా (?) చదువుతున్నా…నీ ప్రశ్నించే తీరు బాగుంది. అసలు ప్రశ్నించడం నేర్పకపోవడం వల్లే, మన చదువులిలా తగలడ్డాయని నా నమ్మకం.ఇక చక్రవర్తి గారి బాధ అసంబద్ధంగా అనిపించింది.ఆ వయసులో నీ ప్రశ్నని… ఇప్పటి నీ నమ్మకమనుకుని వాదించేసారు.

    “ప్రశ్నను అర్ధంచేసుకోకుండా.. అడిగినవాళ్ళను బద్ధ శత్రువులుగా భావిస్తారు” కేక..ఈ ధోరణి మీద నేనొక తులనాత్మన వ్యాసం రాశాను ఈ లంకె ద్వారా చూడు. http://parnashaala.blogspot.com/2008/05/blog-post_09.html

    Like

  4. All I can tell about Gandhi is that I’m still exploring him. I should be knowing many more things/ people to understand what he is.

    Would be posting, as soon as I get there. 🙂

    Like

  5. “Gandhi’s role in India’s independence” anna subject meeda, MVR Sastry garu anukuntaa, oka book rasaru. Veelaithey chadavandi.

    Meeru chadivi mee abhipraayam chepthey nenoo chaduvuthaanu 😛

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s