చివరి ప్రేమలేఖ

Posted by

“హే… ఎవర్నైనా ప్రేమిస్తున్నావా??” అన్న ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు అంతా!! “యస్..యస్..ఐమ్ ఇన్ లవ్.. ” అని చెపితే సరిపొతుందా?? అప్పటికప్పుడు అతని ఊరు పేరు చెప్పాలి, త్వరలో అతన్ని అందరి ముందు నిలబెట్టి పరిచయం చెయ్యాలి, “ఎప్పటికీ ఒక్కటైపోతున్నామోచ్!!” అంటూ కార్డులు పంచాలి, అటు తర్వాత ఇంకా కలిసే ఉన్నాము అని ఎప్పటికప్పుడు నిరూపిస్తూ ఉండాలి. ఇవ్వనీ నాతో workout కావు. అందుకే “అబ్బే అలాంటిది ఎమీ లేదులే” అని చెప్పుకొస్తున్నాను. నీతో అలా తప్పించుకోలేను.

ప్రేమ ఎప్పుడూ పరస్పరంగా ఎందుకు ఉండాలి?? నాకు నువ్వు నచ్చావ్.. ఎంతగా అంటే ఏం చెప్పను? కొలబద్దలు ఉన్నాయా.. ఇష్టానికి? ఇది కేవలం ఆకర్షణ మాత్రమే అనుకున్నాను మొదట్లో .. ఆరడుగుల అందగాడివి, అరవిందనేత్రుడివి పడిపోయాననే అనుకున్నా!! Sense of humor కి కోచింగ్ సెంటర్స్ ఉంటే బాగున్ను!! నీ నవ్వు.. నీ కళ్ళల్లో స్థిరపడినప్పుడు.. నా మనసు ఆనందతాండవం చేస్తుంది!! నిన్ను భరించగలను అనిపించింది.. అందరిలో కుళ్ళు జోకులు వేసి నన్ను corner చేస్తున్నా.. నన్ను చూసి నీతో పాటు నవ్వాను చూడు అప్పుడు. నీ వేలి గాయానికి నా మనసు మూల్గుతుంటే.. ఆకర్షణ మాత్రమే కాదేమోననిపించింది!!

కానీ నిన్ను ప్రేమించానని ఎప్పుడు తెలిసిందో తెలుసా?? నువ్వు నా ముందే ఇంకో అమ్మాయికి లైన్ వేస్తుంటే. కోపం వచ్చింది పీకల దాకా.. మల్లా నీ మొహం చూడకోడదనుకున్నా.. అయినా అందులో నీ ఆనందం ఉందన్న విషయం గ్రహించిన మరుక్షణం కోపం మాయమయ్యింది. నీ choice కరెక్ట్ అవ్వాలని ప్రార్ధించాను. నీ బాధను పంచుకోవాలనే తాపత్రయమే కాదు, నీ సంతోషం నన్ను బాధించినా ఫర్వాలేదు అని తెలిసినప్పుడు.. నాకు శాశ్వతంగా దూరమవుతావని కన్నీరు కారుస్తూనే, నీ కోరిక నెరవేరితే నీకన్నా నాకు ఎక్కువ ఆనందం అని నిర్దారించుకున్నాను. అందుకే నిస్సంకోచంగా చెప్పగలను.. “I’m in love with you.. truly, madly”. కానీ చెప్పను. ఆ అవసరం రాదు.

“ఏంటీ.. వీకెండ్ అంతా సినిమాలు చూశావా?? ఇప్పుడు నీది త్యాగం అనుకోవాలా??” అన్న ప్రశ్న నీ మెదడులో ఇప్పటికే వచ్చి ఉండాలి. మనతో వచ్చిన ప్రాబ్లమే అది.. నువ్వు అనుకునే లోపే నేను చదివేస్తాను నిన్ను. నేను నీకు అర్దం కాను.. బొత్తిగా!! నా ఒక్కో మాటని డీకోడ్ చెయ్యటం నీకు యజ్ఞంతో సమానం. నువ్వు వెతికేవి నాలో లేవు.. నీ నవ్వులో నా నవ్వు కలిస్తే అపశృతి. నా మాటలో గమకాలు వినపడవు. నా నడకలో లయ లేదు. నీ మనసులో పట్టలేనంత భారీ నేను. నిన్ను ఊహల్లో విరహింపచేయలేను. సాన్నిహిత్యంలో కట్టిపడేయలేను. నీకు పేమంటే శాస్త్రీయ సంగీతంలా ఉండాలి.. అది పూర్వజన్మ సుకృతం, నాకు వంటబట్టదు ఈ జన్మకి. అందుకే అన్నాను Workout కాదని.

ఈ అనుభూతులన్నీ నీ వరకూ చేరకూడదని చాల జాగ్రత్త పడ్డా ఇన్నాళ్ళూ, ఎట్టి పరిస్థితుల్లో మన స్నేహం గాయపడకోడదని!! “నీ మనసులో ఎవరో ఉన్నారని అంటున్నారంతా.. నాకు చెప్పవూ, లేకపోతే నా మీద ఒట్టే!!” అని నన్ను Emotional Blackmail చేశావు గనుక, మొదలే కాని నా ప్రేమకు ఇది “చివరి ప్రేమలేఖ”గా నిలిచింది!! జరిగినదాంట్లో నువ్వు guilty గా అనుకోవడానికి ఏమీ లేదు.. We were never made for one another..అంతే!! ఎవరైనా, ఎప్పుడైనా, ఎవరినైనా, ఎక్కడైనా ప్రేమించచ్చు. సహజీవనం మాత్రమే ప్రేమకు పరమావధి కాదు. ఇచ్చిపుచ్చుకోవటంలోనే పరిపూర్ణత లేదు.

ఇదంతా తెలిసి నాతో normal గా ఉండడం నీకు కష్టమైన పని. ఆ ఇబ్బంది నుండి తప్పించటానికే నేను వెళ్ళిపోతున్నాను.. నీ కంటికి కష్టం రానివ్వనని మాటిస్తున్నాను.. మనసుకు నువ్వే సర్దిచెప్పాలి. “నీ ప్లానింగ్ అంతా meticulous రా!!” అని నువ్వే అంటుంటావు.. నన్ను వెతకాలనే ప్రయత్నం వ్యర్దం అని మళ్లీ చెప్పాలా??
నీకు తెలియకుండానే ఓ జీవితకాలపు అనుభూతుల్ని నాకిచ్చావు. వాటితో నేను హాయిగా బ్రతికేస్తాను.. ఒక్క షరతు మీద. నాకు intuitions ఎక్కువ.. నీ విషయంలో మరీను.. సో.. నేను హాయిగా ఉండాలంటే.. నీవు ఆనందంగా ఉండాలి. మర్చిపోకు!! నాకోసం ఎమైనా చెయ్యాలనిపిస్తే ఈ ఒక్కటీ చెయ్యి.
నీ నేస్తం.
===================================================================
“ఏమీ ఆశించకుండా ప్రేమించటం గొప్పా?? తిరిగివచ్చేది గాయమే అని తెలిసీ కూడా ప్రేమించటం గొప్పా??” అని నా మనసు తెగ మీమాంశ పడుతుంది. బాధ కల్గుతున్నా ఆనందంగా ప్రేమించే మనసును ఇలా ఉంటుంది అన్నా ఊహను ఆవిష్కరించే ప్రయత్నమే ఈ చివరి ప్రేమలేఖ!!

14 comments

  1. మనసు పడే సంఘర్షన ని చాలా చక్కగా రాసారు… మొదట్లొ స్వార్ధం చూసుకోని ప్రేమ, నీ సంతోషం
    కోసం ఎదైనా చెయ్యగలను అనుకునే ప్రేమ, త్యాగంలో సంతృప్తిని వెతుక్కునే ప్రేమ… నువ్వు నాకు దూరమైపొతుంది
    అని తెలిసినప్పుడు, శాశ్వతంగా దూరమైపోతున్నావు అని తెలిసినప్పుడూ, భరించలేక పోతుంది… తను స్వార్ధాన్ని
    ఎందుకు చూసుకోలేదని ప్రశ్నిస్తుంది… ఇక త్యాగం చెయ్యలేను అని ఏడుస్తుంది… కానీ అప్పటికే చేయిదాటిపోతుంది…

    గెలిచే ప్రేమ స్వార్ధాన్ని కోరుకుంటుంది… కానీ చాలా మందికి అది అసలైన ప్రేమల కనపడదు…
    అలా అని సొంతం కానప్పుడు “ఏది నిజమైన ప్రేమ” అనే సంఘర్షణని తప్పించుకోలేను… ఎందుకు వస్తుందొ
    అర్ధం కాని కన్నీటిని ఆపలేను… నా ప్రేమ గెలిచిందో, ఓడిందో కూడా చెప్పలేను..

    Like

  2. చాలా బావుంది.

    ఒక నిర్దుష్టమైన భావాలు కల అమ్మాయి ఎలా ఉంటుందో బాగా చూపారు.

    తన- పర ఆలోచనా విధానాలను బాగా పరికించి చూసే మనస్తత్వం కల వారికి ఈ “ఇష్టం- కర్తవ్యం” అనే రెంటి మధ్య జరిగే ఈ మానసిక సంఘర్షణ నిత్య సత్యం.

    పైగా “ప్రేమ” అంటే మానసిక/శారీరిక ఆకర్షణ, స్వార్థము, త్యాగము, అభిరుచుల కలయిక, సహ జీవనానికి మార్గము ఇలా చాలా “concepts & components” ఉన్నాయి. వాటిలో ఎవరికీ వారు తాము కావలసిన components వెతుక్కోవటం మంచిది అంతే కాని సినిమాలో చూపెట్టారు అని “త్యాగం అంటే గొప్ప, స్వార్థం చూసుకోవటం తప్పు” అని అనుకోవటం తప్పు అనే subtle సందేశం కనపడింది.

    “ప్రేమకు సహజీవనమే పరమావధి అనుకోరాదు” అన్నది నచ్చింది.

    మొత్తానికి చాలా బావుంది. “మీరు వెతికే ప్రేమ” మీకు జీవితంలో మెండుగా ఉండాలని సుభాశీస్సులతో ……

    Like

  3. @Deepu:

    Thanks for the lovely comment. asalu nenu emi anukuni raasaanO.. ave aalochanalu mee comment lo kanipinchaayee. I felt ecstatic about it.

    @bhaavakundan:

    hmmm..mee comment gurinchi chaalane raayali ani undi. inko blog post avutundi emo. ee uttaram raasina ammayi naa oohalo unna.. meru aamenu ardam chesukunna teeru amogham.

    True analysis of the psyche of a person. Thanks for the comment.

    Like

  4. పూర్ణిమగారు, ఎలా చెప్పాలో తెలీటం లేదు కానీ చాన్నాళ్ళ తరువాత చలం ప్రేమలేఖని చదివినంత ఆనందాన్నిచ్చింది,

    ఈ సిరీస్ లో ఇంకొన్ని ప్రేమలేఖలకోసం ఎదురుచూడొచ్చా?

    Like

  5. @Purnima
    Even I felt ecstatic when I was going through the post. Every responsible person in love will face that confrontation.

    etocchee aalochinchevaallake aa confrontation antha… konta mandi ekkuvagaa aalochinchakundaa vaallaki nachindi chesestaaru… nachindi sontam chesukuntaaru…

    anubhavamlO ekkuvagaa aalochinchakoodadu ani ardham chesukunnaanu… endukante manam evari gurinchaite aalochistunnaamo vaallu vaalla gurinchi koodaa manam aalochistunnanta aaalochincharu… evarikishtamaindi vaallu chestaaru, vaallaki manchi ani cheyyaru… mana aalochanalo ardham ledanipistundi oka samayamlo… kaanee chese mundu aalochinchadam anE naijaanni poortigaa dooram chesukolemu… okkosaari adi mana balam…

    meeru tarkistu raayadaaniki prayatninchaaru… nenu aa sangharshanalO edurayye bhaavaalani yadaathadhamga raasaanu…

    Like

  6. నేను ఈ కామెంట్ రాయటానికి సరిపోనేమో. కానీ చాలా రోజుల తర్వాత, ఒక అద్భుతమైన ప్రేమ లేఖ చూశా. నాకు చదివిన తర్వాత, ఒక మంచి పుస్తకం చదివిన అనుభూతి కలిగింది. చాలా చాలా బావుంది. మాటలలో వార్ణిచ లేనంత అనుభూతి కలిగింది.

    Like

  7. ప్రేమలేఖ అని చెప్పి జీవితాన్ని వివరించారు.ఆ అమ్మాయిలో మంచి వ్యక్తిత్వం,క్లారిటీ కనిపిస్తుంది.అద్భుతంగా వుందండి.మిరు మంచి రచయిత అవుతారనిపిస్తుంది.

    Like

  8. చాలా బాగుంది. దీపుగారు లేఖలోని ఆత్మను చక్కగా పట్టుకొన్నారు. పోష్టు చదివినతరువాత, దీపుగారి కామెంటు చూసి తిరిగి రెండవసారి చదివాను. బ్యూటిఫుల్ పోష్ట్ అండ్ నైస్ కామెంట్.

    బొల్లోజు బాబా

    Like

  9. @krisj:
    మనసు విషయంలో సరి”పోవడాలు” కానీ, సరితూగడాలు కాని ఉండవు, మనసుకు కొలబద్దలు లేవు. నా టపాని ఓప్పిగా చదివి, నన్ను అభినందించినందుకు చాలా కృతజ్ఞతలు!! మీ వ్యాఖ్య చూసాక నాకెంత ఆనందంగా ఉందో చెప్పలేను.

    రాధికగారు:
    మీ కవితలంటే నాకు ప్రత్యేకమైన అభిమానం, మీరే స్వయాన నాకు అభినందన తెలిపారంటే.. ఇక నేను పండగ చేసుకోవాల్సిందే!! 🙂

    అహ్మద్ గారు:
    నిజం చెప్పారండి. మీరే కాదు నేను కూడా దీపు గారి కమ్మెంట్ చదివాక, నా టపా చూసుకున్నా!! మనసుని చదవటంలో దీపుగారు ఎక్స్ పర్ట్ మల్లే ఉన్నారు!! నా టపాను, తన వ్యాఖ్యను అర్ధం చేసుకుని అభినందించినందుకు ధన్యవాదాలు!!

    Like

  10. పూర్ణిమా..

    మాటల్లేక మూగబోయే సందర్భం అది… దానిని అక్షర రూపంలో ఇంత నిండుగా పెట్టగలగటం అంటే మాతలు కాదు.
    ఇలాంటి situation ని నిజం గా ఎదుర్కుంటే ఎలా ఉంటుందో కళ్ళముందు పెట్టారు. బాగుందని పొగడలేను. కొంచం మనసు భారీగా అనిపించింది. But I appreciate the level of clarity i see.

    దినినే ఆరాధన అంటారేమో.. ఒక రకమైన గాయాన్ని మిగిల్చిన.. తట్టుకునె శక్తిని కూడా అదే ఇస్తుంది.

    Like

  11. ఒక్క మాట మాత్రం చెప్పగలను. అధ్బుతం . ప్రేమించిన మనస్సు కు మాటలు వస్తె బహుశ ఇలాగే మాట్లాడుతుందెమో!

    Like

  12. mmm, lovely write. Echoes my feelings as well.
    Love – you cannot demand it from someone. It happens from one side and if the other side responds for it, it is beautiful, but if the other side ignores it, it still is beautiful. What if the other person loves someone else? What if that other person cares a damn about you? You love the person, which means it is your commitment for the person. It need not necessarily be reciprocated nor should it lead to a bonding. Yes, it is difficult to be in love like that. But then, the very essence of I love you is surrendering your self to that person in a way that no one else can. And once that is done, irrespective of the strength of emotional bonding, it still is splendid.

    And if one thinks that giving up ones love, because, the person you love, loves someone else, is sacrifice, I cannot but pity the person’s thought. Why should you give up love? When loving, we do not make an agreement, with that person that we will give it up, if and when he/she falls in love with someone else, do we? And why should love be ther only for one person? If love means to be able to feel another person in your heart and willing to tag along with that person to the hearth, irrespective of the other person’s feelings, then, why will it be limited to one person? Are we not walking with our friends, promising that we shall be there for them, through thick and thin and that we echo their merry and grief alike?
    But is this great, to love another without expecting? Well, feeling love itself is a great feeling. But if it means, should one feel great to actually love someone without expecting, then I should ask why? Love is only loving a person, why should there be an expectation? I cannot for world understand that concept.

    Like

Leave a comment