అమ్మాయిలూ.. ఈ కింది బ్లాగును చూసిన దగ్గరనుండీ కడుపులో ఒకటే నొప్పి.. ఎందుకో మీకు తెలుసు 😉 Mr. Bean సినిమా మానేసి మరీ "టపా"యిస్తున్నా అంటే అర్ధం చేసుకోండి. http://maheshwarams.blogspot.com/ చూడ్డమే కానీ.. ఇప్పుడున్న ధరలకి ఏం కొంటాములే అని అంటారు.. పోనీ చూడమైనా అవుతుంది కదా!! నేరుగా మనింటిలోకి.. వస్తున్న లక్ష్మిని కాదనగలమా?? ఇంతటితో టపా ఆపేస్తే.. నేను నేనెందుకు అవుతాను. 😉 సుత్తి లేకుండా సూటిగా చెప్పింది... సుత్తి రావాల్సిన బస్ కొంచెం... Continue Reading →
ఎందుకు??….ఇందుకు..
"ఎందుకూ??" వచ్చే ప్రతీ అలా.. సాగరంలోకి తిరిగి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు రావటం ఎందుకు? పాదాన్ని తాకటం ఎందుకు? వీచే ప్రతీ గాలీ.. నన్నుదాటుకుని పోవాలనుకున్నప్పుడు.. వీయటం ఎందుకు? చెక్కిలిగింతలు పెట్టడమెందుకు?? కురిసే ప్రతీ వాన చుక్కా.. నాకు కాకుండా జారిపోవాలకున్నప్పుడు కరుణించటం ఎందుకూ? నన్ను తడపడమెందుకూ?? మురిసే ప్రతీ వెన్నెల రాత్రీ.. నేను నిద్రలో ఉండగా జారుకోవాలనుకున్నప్పుడు కురవడం ఎందుకు? నన్ను మైమరపించడం ఎందుకు?? చేరే ప్రతీ ఘడియా.. కాళ్ళాగని కాలమై"పోతు"న్నప్పుడు నిలవటం ఎందుకు? క్షణికంలోనే జీవితాన్ని నేర్పడం... Continue Reading →
శ్రీవారే బదులిస్తే..
(ఈ టపా చదివేముందు... "శ్రీ వారికి ప్రేమలేఖ" చదివారో లేదో చూడండి. ) ఎటూ నువ్వు లేవు కదా అని చాలా సేపు స్నేహితులతో గడిపి, ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఇళ్ళంతా చీకటిగా ఉంది. ఒక లైట్ వేశాను.. చీకటిగానే ఉంది. అన్నీ లైటులూ వేసాను.. చీకటి పెరుగుతూనే ఉంది. ఇంకా చెప్పాలా, ఈ ఇంటికి, నా కంటికి వెలుగు నువ్వేనని?? I miss you అనీ!! నీలా నవ్వు, పువ్వు అంటూ కవితలు రాయలేను. ఇలా... Continue Reading →
I’m very sorry.. అన్నా వందో సారి….
సరదాగా మన్నించేయ్ ఒక సారి అని బ్లాగ్లోకానికి నా క్షమాపణలు పాట పాడి చెప్పగలను.. కానీ భయంకరంగా జలుబు చేసింది. అసలే అంతంత మాత్రం స్వరం.. ఇక ఈ పరిస్థితుల్లో పాడితే ఇక అంతే సంగతులు. క్రికెట్ట్ సీరీస్ ఓడిపోయాకా మన వాళ్ళు వచ్చి చెప్పే సాకుల్లా చెప్పవచ్చు.. కానీ క్రికెట్ట్ ఇష్టం లేని వారికి తలకెక్కదు. పంచుకుంటే తలనొప్పి తగ్గిపోతుందని నాకెవ్వరూ చెప్పలేదు.. చేజేతులారా ఉన్న సీట్లను అందరికీ పంచేసిన కే.సీ.ఆర్ లా నేనూ రాజీనామా... Continue Reading →
బాబా గారికి, NETIZEN వారికి ధన్యవాదాలు!!
న్యాయంగా ఈ టపాకి సీతారామారావు Vs డోరియన్ గ్రే అని శీర్షిక పెట్టి ఎప్పటిలానే నా సోది మొదలెడితే... ఎవరు చదువుతారో చదవరో గాని, నేను కృతజ్ఞతలు చెప్పాలనుకున్న బాబా గారు, నెటిజెన్ వారు చూడకపోతే ఈ టపా ఇక్కడ రాసి దండగ!! వీరెవరో బ్లాగ్లోకానికి నేను చెప్పనవసరం లేదు. అందుకే సీతారామా రావు, డోరియన్లను పరిచయం చేసుకుందాం. సీతా రామారావు.. త్రిపురనేని గోపిచంద్ రాసిన "అసమర్ధుని జీవయాత్ర" అనే తెలుగు నవలలో కథానాయకుడు. డోరియన్ గ్రే..... Continue Reading →
దశ తప్పిన బ్లాగావతారం
దేవుడున్నాడు.. తేడాలొస్తే శపిస్తాడు అనుకునే వారు.. ఈ టపా చదవకుండా ఇటు నుండి ఇటే టపాకట్టేయ్యండి. దేవుడున్నాడు.. కానీ దయాహృదయుడు అనుకునే వారు.. భారాన్నంతా దేవుడు మీద వేసి చదవటం మొదలు పెట్టండి. దేవుడున్నాడని నమ్మని వారు మీ బాగేజీని నమ్మినవారికి ఇచ్చి ఇటు రండి. ********************************************************************************************************* బ్లాగ్ ప్రపంచంలో ఏదో జరుగుతూనే ఉంటుంది.. కొన్ని మనకు తెలుస్తాయి, మరి కొన్ని అసలు కనపడవు. ఒక టపా నుండి మొదలైన ఆలోచన వేలానువేల కోట్ల అడ్డంకులను అధిగమిస్తూ... Continue Reading →
ప్రేమించే హృదయానికి ప్రణమిల్లవే.. మనసా!!
"నువ్వు అందంగా ఉంటావా?" అని మీలో ఎవరైనా నన్ను అడిగితే, "ఊ" అనే ధ్వని మీ చెవిని చేరుతుంది. "అద్దం ముందు నిలబడి మనల్ని మనం రెప్పపాటు కాలమైనా చూసుకోగలిగితే మనం అందంగా ఉన్నట్టే!!" అన్న అనుభవం నా మనసులో ప్రతిధ్వనిస్తుంది. అందాన్ని నిర్వచించు అనగానే ఓ పది famous quotations మీ ముందు ఉంచగలను. కానీ పైన చెప్పింది మాత్రం నా మనసుకి చాలా దగ్గరైయ్యింది. ఈనాడు ఆదివారంలో వచ్చే ఒకానొక "ఇది కథ కాదు"... Continue Reading →
మనసైన తన కన్నీరు…
తను నా గుండెలపై తలవాల్చుకుంది. నా షర్ట్ కున్న రెండు sleevesని పిడికిల్లలో గట్టిగా పట్టుకుంది. తన అంతర్సంఘర్షణ అంతా భరించలేక నా షర్ట్ తో పాటూ నేనూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను. నా చేతులు తన చూట్టూ ఉన్నాయి, నాకు దగ్గరగానే తను ఉంది.. కానీ మా ఇద్దరి మధ్యా చాలా దూరం ఉన్నట్టు అనిపిస్తుంది. నా మాటగాని, నా స్పర్శగాని ఏదీ తనని అనునయించలేక పోతున్నాయి. ఏమీ చెయ్యలేని నిస్సహాయతలో తనను మరింత దగ్గరకు లాక్కుని,... Continue Reading →
మగవారి హక్కులే.. నా డిమాండ్!!
పాపం అబ్బాయిలు.. వీరికి అడుగడుగునా కష్టాలే!! ఇది అభిప్రాయం కాదు, స్వానుభవం. ఒకసారి బస్సురాక, ఊసుపోక ఉన్నత చదువులు-ఉద్యాగాలు మీద ధీర్ఘంగా చర్చించుకుంటుంటే.. మా సీనియర్ ఒక అబ్బాయి.. "మీకేంటి? చదివినా, చదవక ఇంటి దగ్గర కూర్చున్నా సరే!! మీ నుండి expectations ఉండవు. అదే మేమైతే తప్పక సంపాదించాలి.. లేకపోతే వాల్యూనే లేదు" అని అన్నాడు. సెహ్వాగ్ బంతిని కొట్టేంత గట్టిగా తగిలింది ఆ మాట నా మనసుకి. "ఈ అబ్బాయిలున్నారే.." (నువ్వు-నేను సినిమాలో ఉదయ్... Continue Reading →
చెత్తకుండీ కీ ఓ మనస్సుంటే..
వేసవి సాయత్రం.. సూర్యుడు తన ప్రతాపమంతా చూపించి "మళ్ళొస్తా!!" అంటూ పడమరలో అస్తమిస్తున్నాడు. చల్లని గాలితో పాటు, చంద్రుడూ రాబోతున్నాడు. ఇప్పటిదాకా నిర్మానుష్యంగా ఉన్న వీధి కొత్త సందడి నేర్చుకుంటుంది. ఇళ్లకు చేరే వారితో, ఆటలాడే చిన్నారులతో..వహనాలతో యమా బిజీగా ఉంది. ఈ సందడంతా కాసేపే, ఆ తర్వాత అందరూ నిద్రకు ఉపక్రమిస్తారు.. అప్పుడు మళ్ళీ ఒంటరిగా నేను. ఒంటరితనం జీవితానికి ఒక కొత్త అందాన్ని ఇస్తుంది. ఒక ఆనుభూతినో ఒక ఊహనో కౌగిలించుకుంటే.. ఒంటరితనం కూడా... Continue Reading →
మనసా.. ఇంకా తోడుకోసం ఎదురు చూస్తున్నావా??
మనసా..తోడుకోసం ఎదురు చూస్తున్నావా?? తోడుగా నిలవాలంటే.. నమ్మకం కుదరాలి నమ్మకం కుదరాలంటే.. ప్రేమ వికసించాలి ప్రేమ వికసించాలంటే.. చనువు ఏర్పడాలి చనువు ఏర్పడాలంటే.. సఖ్యత పొందాలి సఖ్యత పొందాలంటే.. పరిచయం కావాలి పరిచయం కావాలంటే.. ఆకర్షింపగలగాలి అందం లేని చోట ఆకర్షణ లేదు.. నీ అందం వరకూ చేరాలంటే నా అందం తొలి మెట్టు!! పిచ్చి మనసా.. ఇంకా తోడుకోసం ఎదురు చూస్తున్నావా??
నువ్వే..
మనసును మీటింది నువ్వు మనసైయ్యింది నువ్వు మనసున మనసై ఆడించింది నువ్వు మనం "మనలేము" అని తేల్చింది నువ్వు అయినా నువ్వే.. నేనంతా నువ్వే
విశాలాంధ్రా క్రాస్-వర్డ్స్
కారణాంతరాల వళ్ళ ఇవ్వలా కోఠీకి వెళ్ళటం జరిగింది. ఏటూ వెళ్ళాము గనుక బాంక్ స్టీట్ లో విశాలాంధ్ర బుక్ షాపులో కొన్ని పుస్తకాలు కొన్నాను. ఈ బ్రాంచికి వెళ్ళటం ఇదే మొదటిసారి. నేను చూసిన తెలుగు పుస్తక కొట్లలో కల్లా ఇదే పెద్దది. చాలా ప్రశాంతంగా ఉంది. వెళ్ళిన ముగ్గురమూ తలో మూలకీ వెళ్ళాము. ఒక క్రమపద్ధతితో వరుసగా ఉన్న పుస్తకాలను చూస్తుంటే.. మెదడుకు ఎక్కడలేని ఆకలీ మొదలైంది. ఎవరికి కావాల్సిన పుస్తకాలు తెచ్చుకుని, కౌంటరు దగ్గరికి... Continue Reading →
సమర్ధతాసమర్ధతలు
"అసమర్ధుని జీవ యాత్ర" గోపిచంద్ రచనలలో ఉత్కృష్ఠమైనది తెలిసికూడా నేను చాలా ఏళ్ళు చదవలేదు.. పుస్తకం అందుబాటులో ఉంచుకుని కూడా. కారణం దాని గురించి చాలా విని ఉండడం. అది ఒక మనోవైజ్ఞానిక నవల అని, అందులో ముఖ్యపాత్ర సైకో అనీ, రెండు భిన్న వ్యవస్థలకు మధ్య అతడు నలిగిపోతాడని.. లాంటివి తెలియడం వల్ల ఇది మన తలకు ఎక్కదని వదిలేసా!! పుస్తకం చదవటం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితిలో దీనిని చదివా. (చదవాల్సి వచ్చింది!!)... Continue Reading →
నాలో నేను
మీకీ తమాషా ఆట తెలిసే ఉంటుంది. ఒక పేరు చెప్పగానే మీకు ఏమనిపిస్తుందో లేక ఎవరు గుర్తువస్తారో చెప్పాలి ఒక్క పదంలో. గబగబగా చెప్పాలి.. అతి తక్కువ సమయంలో!! అలా నన్ను ఎవరైనా గోదావరి అని అడిగితే "రొమాన్స్" అని చెప్తా!! మా అమ్మను అడిగితే "అమ్మో.. వరదా!!" అంటుంది. మా నాన్న అడిగితే "బాల్యం" అని చెప్తారు. మా చెల్లిని అడిగితే "ఎమో" అంటుంది తేలికగా. గోదావరి మీద ఓ 8 గంటలు ప్రయాణించాక గాని... Continue Reading →