చూడడం పాపమైతే … వినడం తప్పు కాదా??

Posted by

“తినగ తినగ వేప తియ్యగుండు”. ఈ మధ్య సినిమా పాటలు వింటుంటే.. ఇలానే అనిపిస్తుంది. ఆడియో రిలీజు ఫంక్షన్ లో అట్టహాసంగా, ఆర్బాటంగా, అనవసరపు హోరుల మధ్య , అవసరానికి మించిన పొగడ్తతతో పాటలు విడుదల కావటం, అవి చెవికి అంత ఇంపుగా అనిపించకపోవటం; అటు తర్వాత టీవీ చానళ్ళలో చూసి “అబ్బే.. బాగా లేవు” అనుకోవటం… రోజూ ఆఫీసుకు వెళ్తూ వస్తూ ఎఫ్. ఎమ్ లో అవే అవే పాటలు వినీ వినీ.. ఎక్కడడంటే అక్కడ ఖూనీ (కూని రాగాలు కావు నావి) రాగాలు తీయడం పరిపాటి అయ్యిపోయింది.

ఇప్పుడు అలా మాటమాటకి అందుకుంటున్న పాటలు “జల్సా”లోవి. “ఫుల్లు బాటిల్లెత్తి దించకుండా తాగినట్టు ఉంది” అని పాడిన వెంటనే.. పక్కన ఎవరైనా ఉన్నారేమో అని ఉల్లికిపడతాను. తెలుగువారికి బాగా అర్దమైయ్యే వర్గీకరణలో నన్ను “క్లాసు” అనాలి. అలాంటిది నేను ఇలాంటి పాట ఎత్తుకుంటే, నా ఇమేజ్ దారుణంగా దెబ్బ తింటుంది. అది పక్కకు పెడితే.. ఆ వాక్యం ఎందుకో నా మెదడులో తిష్ఠ వేసింది. చెప్పాపెట్టకుండా మెదడులో ప్రవేశించినా, నా చిట్టి బుర్రకో సందేహం ఇప్పుడు..

“అధ్యక్షా.. సినిమాల్లో సిగిరెట్టు, మత్తు పానీయానల సేవనం చూపించటం తప్పు అయ్యినప్పుడు.. అందమైన ప్రేమ “ఫుల్లు బాటిల్లును ఖాళీ చెయ్యటం” వంటి అనుభవం లాంటిదన్న భావన కలిగించడం ఎంత వరకూ సమంజసం అని ప్రశ్నిస్తున్నాను.” అని రాజకీయ రంగు పులమకుండా నేరుగానే అడుగుతున్నా.. చెడు చూడడం వల్ల పర్యవసనాలు చెడు అయ్యినప్పుడు.. మరి వినడం వల్లనో?? ఇది సెన్సర్ కట్ కిందకు రావాలి అన్నది నా డిమాండ్ కాదు. (ఏంటిది?? రాజకీయపు మళ్ళీ వాసన వస్తుంది!! రోజంతా వార్తలు చూశా) ఇంకా మెరుగైన సాహిత్యం ఆనందించలేమా అన్నదే నా ఆలోచన. యువత దగ్గరకు చేరడానికి యువతను తప్పు దారి పట్టించనవసరం లేదు. అందాన్ని అభివర్ణించడానికి హానికరమైన ఉపమానాలు ఆశ్రయించడం ఎంతవరకు ఆరోగ్యకరమో మనమే నిర్ణయించుకోవాలి. అన్నింటికీ బెత్తం తీసుకుని ఎవరో వెనుక ఉండాలని కాకుండా, మన నైతిక బలాలు చూపించచ్చు.

7 comments

  1. Hi poornima,

    you are correct. choodatam tappu inappudu vinatam kooda tappe.

    ite ikkada oka maata meeru prastutinchina paata vishayaaniki vaste aa paata paadedi aa cinema loni oka character. aa character ki aanandam, anubhooti vaatilo maatrame dorukutaayi ani anukune oka paatra. atuvanti paatra ki paata raayaalsi vachchinappudu ituvanti upamaanaalu tappuledanedi naa opinion.

    Inaa sensor cheyatam annadi correct gaa jarigite bahusaa manam ee rojullo vachce e cinema kuda choodalememo..bahusaa vinalememo kuda…

    inaa mee blog baavundi… keep it up.

    naa peru Satyendra.

    Like

  2. పూర్ణిమ గారు,

    మీ బ్లాగ్ బావుంది. ఇక ఈ “చూడటం పాపమయితే వినటం తప్పు కాదా?” అన్నబ్లాగ్ విషయానికి వస్తే, నిజమే చూడటం పాపమయినప్పుడు వినడటం కూడా పాపమే. ఐతే మీరు ప్రస్తుతించిన పాట విషయం లో నేను మీతో కొంచెం విభేదిస్తాను. ఎందుకంటే “జల్సా” సినిమా లోని ఆ పాట పాడేది పవన్ కళ్యాణ్ పాత్ర. ఆ సినిమా లో ఆ పాత్రకి అంతకు మించిన గొప్ప అనుభూతులు ఆనందాలు తెలిసే అవకాశం లేవు. ఎందుకంటే మీరు ఆ పాత్రని కొంచెం గమనిస్తే మీకు కూడా ఈ విషయం అర్థం అవుతుంది. కాబట్టి ఆ పాత్ర అలా పాడుకోవటం తప్పు కాదు అనేది నా అభిప్రాయం. పైగా మీరు ఆ పాట రాసిన వాళ్ల నైతికతను ప్రశ్నించినట్టుగా నాకు అనిపించింది. అది రాసింది “సీతారామ శాస్త్రి” గారు. ఆయన రాసారు కాబట్టి ఏమి రాసినాచెల్లిపోతుంది అని నేను అనటం లేదు. మీరు ఆయన సినిమా సాహిత్యాన్నీ ఒక్కసారి గమనిస్తే మీకే ఈ విషయం బోధపడుతుంది. అలా అని మీ పోస్ట్ ని తప్పు పట్టటం లేదు. అది పూర్తిగా సత్యం. కాకపొతేమీరు ఇచ్చిన ఉదాహరణకి మాత్రమె నా అభ్యంతరం. దానికి కూడా ఒక కారణం ఉంది లెండి. నేను సీతారామశాస్త్రి కి వీరాభిమానిని.

    Like

  3. సత్య గారు:

    సీతారామ శాస్త్రిగారు రాశారని మీరు నాకో పెద్ద షాకు ఇచ్చారు మీరు. మీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను కానీ ఏకీభవించలేను. కథలో ఆ పాత్రను ఆ పాత్రకున్న అలవాటులను సరిగ్గా justify చెయ్యలేదని న అభిప్రాయం. అవును మీరు చెప్పినట్టు.. ఇంతకన్నా భీకరమైన పాటలు వింటూనే ఉన్నాం. అయినా ఈ పాటనే ఎందుకు ఎంచుకున్నాను అంటే.. ఇదిలో అంతా హాయిగా ఉంటుంది.. ఆ ఒక్క వాక్యం తప్పించి. అందుకే మింగుడుపడలేదు.

    నైతిక విలువలు కేవలం గేయకర్తపైనే కాదు.. అందరి మీదా ఉంది. ఎలా అయినా జనాల్లోకి తీసుకువెళ్ళాలనే ప్రయత్నమే కానీ.. అక్కడే నిలిచిపోవాలన్న తపన కనిపించటం లేదు నేటి సినిమాల్లో.. అదీ నా ఆవేదన.

    టపా చదివి, ఆలోచించి అభిప్రాయం వెలిబుచ్చినందుకు ధన్యవాదాలు.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s