స్వాతి చినుకు

Posted by

పెదవిపై మాట రానివ్వక, మనసుతో పలకరించావు
కాఫీలోని చేదు తెలియనివ్వక కమ్మని ఊసులు కలిపావు

అద్భుతం, అత్యాద్బుతం అన్న విశేషణాలను మరిపించావు
సిన్ని సిన్ని పదాలలో సిత్రాలెన్నో చూపావు

జగతినే గోరు గోరుగా ముద్దలు చేసి తినిపించావు
చిలకలా విన్నదే పలికితే “మహా గట్టి బుర్ర నీది” అని మురిసావు

నేను మాట్లాడితే కర్ణ ఘోష అని ఉడికించావు
నా మౌనాన్ని క్షణకాలంలో తిరస్కరించావు

అలిగానని బుజ్జగించడానికి “థ్రిల్లర్” కథ చెప్పావు
కోపాన్ని మర్చిపోయేంతగా నన్ను భయపెట్టావు

నేను కింద పడితే “నేలకేమయ్యిందా??” అని ఆత్రుత పడ్డావు
నాకూ తగిలింది అని తెలియగానే తల నిమిరావు

నా ప్రతీ విజయాన్ని నువ్వు గర్వించావు
నీ ప్రతీ సాధనలో నా “ఉడతాభక్తి”ని స్వీకరించావు

ప్రపంచానికి నువ్వు హాయిగా గలగలమంటూ పారే సెలయేరుగా కనిపించావు
మరి నాకో?? ఎంతో అలజడిని దాచుకున్న సముద్రంలా అనిపించావు

స్నేహపు జడిలో తడిచి ముద్దై మురిసిపోతున్న వేళ నువ్వు తారసపడ్డావు
మిత్రునివా?? ఆప్తునివా?? ఆరాధ్యునివా?? అంటే ఏమి చెప్పగలను??
జాలువారింది “స్వాతి చినుకు” అని……..తనువుపై కాక దాన్ని గొంతు గుండెల్లో దాచుకోవాలనే ఆరాటం తప్ప !!

*****************************************************
జీవితంలో కొన్ని పరిచయాలను వర్గీకరించలేము. అవి పంచే అనుభూతులు, అందించే అనుభవాలు ఏ ఒక్క బంధానికో సంభందించినవి కావు. ఆగని కాలపు అలలో సైతం నిలిచిపోయే మైత్రీ గుర్తులు నా సొంతమైనందుకు మహదానందం!!

7 comments

 1. “కాఫీలోని చేదు తెలియనివ్వక కమ్మని ఊసులు కలిపావు”
  ఈ లైన్ అద్భుతం . కలిసి పంచుకొనే నేస్తం ఉన్నప్పుడే చేదు కాఫీ అమృతం అవుతుంది.

  ఉదయాన్నే సూర్యోదయాన్ని చూస్తు కాఫీ తాగుతూ ఉన్నట్టుంది మీ బ్లాగు చదువుటుంటే.

  ఊహలన్నీ ఊసులై – మంచి కాఫి లాంటి బ్లాగు.

  Like

 2. hmmm interesting expressions. నిజమే జీవితంలో కొన్ని బంధాలను,సాధారణ కొలమానాలుగల సంభంధాల కోవలోకి చేర్చలేం. అందుకేనేమో ఆంగ్లం లో ‘platonic relationships’ అనే పదముంది. తెలుగులో ‘ఆత్మబంధువు’ కంటే సమానాంతరమైన మంచిపదం దీనికి లేదనుకుంటా!

  Like

 3. @ అన్నమయ్య పలుకుబడులు:
  Thanks!!

  అయ్యబాబొయ్ ప్రకాశ్ గారు, మరీ అంత మాట అనేసారు.
  మీ Compliment చదివాకా గాలిలో తేలినట్టు ఉందంటే నమ్మండి. Jogging on Cloud 9 😉

  @ మహేశ్:

  మంచి పదం introduce చేసిందుకు Thanks!!

  Like

 4. I disagree.
  కాఫీలోని చేదు బావుంటుంది. రుచి కరమైన చేదు! 🙂

  Like

 5. Poornima garu..na bhavalanu enno sandharbhallo.. chinnaga vyakta parachina.. vaatini oka chota pogu chese praytnam lo eppudu phalinchaledu.

  mee ee post chadivaka naaku aa lotu teerindi. mukhyam ga ‘nenu kinda padite..’ daggarnunchi..

  “ప్రపంచానికి నువ్వు హాయిగా గలగలమంటూ పారే సెలయేరుగా కనిపించావు
  మరి నాకో?? ఎంతో అలజడిని దాచుకున్న సముద్రంలా అనిపించావు”
  ee maata chadivaka naa gontu anandam, aascharyam to poodukupoyindi… 🙂

  Like

 6. కొత్త పాళీ గారు:

  అయితే మీకో సారి మా ఆఫీసులో దొరికే చేదు(ఇది కమ్మదనానికి ఆమడ దూరం)కాపీ తాగించేయ్యాలసిందే!! 😉
  లేక పొతే కపీ అంత మాట నేనగలనా, చెప్పంది?? 🙂

  మోహనా,

  ఇప్పుడే మీ బ్లాగు చూస్తున్నాను!! మీ భవాలు వాటి వ్యక్తీకరణ భలే ఉన్నాయి. ఇంకా ఫలించలేదు అంటారేమిటి??

  ఇక నా టపా విషయానికి వస్తే.. నా అనుభవం మీ స్వానుభవంలా అనిపించటం అతిశయోక్తి కాదు. స్పందించే హృదయం ఉన్నవారికే ప్రతీదానిలో ఒక అందం కనిపిస్తుంది.

  నా బ్లాగుకి విచ్చేసి, నా మనసుని పంచుకున్నందుకు ధన్యవాదాలు!!మరల మరల వస్తారని ఆశిస్తూ..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s