కాలమతి, ఫ్రమ్ రష్యా!!

Posted by

చిన్నప్పుడు ఈ కథ వినే ఉంటారు: ఓ కొలనులో మూడు చేపలు ఉంటాయి, సుమతి, కాలమతి, మందమతి. రానున్న ఎండాకాలంలో గడ్దు పరిస్థితులు ఉంటాయని గ్రహించిన సుమతి ఏటికి ఎదురీది సురక్షిత ప్రాంతానికి వెళ్తుంది. కాలమతి, మందమతి బద్దకిస్తాయి. ఎండాకాలంతో పాటు గడ్డుపరిస్థితుల రూపంలో జాలర్లు వస్తారు. మందమతి దొరికి..పోతుంది. కాలమతి చచ్చిన చేపకు మల్లే పడి ఉంటుంది. నిజంగానే చనిపోయిందనుకుని జాలరి చేపను నీటిలో పారేస్తాడు. కథలోని నీతి: ముందుజాగ్రత్త అన్ని విధాలా మంచిది. ఆపాయంలో ఉపాయం రక్షిస్తుంది.

ఇప్పటిక్కిప్పుడు కథా..నీతి ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే.. ఆ కాలమతే కళ్ళ ముందు తెల్ల స్కర్ట్ వేసుకుని టెన్నిస్ ఆడుతున్న ఆరడుగుల అమ్మాయిలా వచ్చిందా అన్నట్టు ఆడింది దినారా సఫీనా!! ఈమె రష్యా దేశస్థురాలు. ఫ్రెంచ్ ఓపెన్ లాంటి గ్రాండ్ స్లాముల్లో ఒక్కరికి మించి ఒకరు ఆడతారు. అందులో అతిశయోక్తి లేదు. కానీ ఈ అమ్మ రూటే..సపరేటు లా ఉంది. ఇంకో పాయింట్ తో అవతలవారు మాచ్ గెలుస్తారనగా.. మొదలు పెడుతుంది తన విజృంభన. ఆ పాయింట్ వారికి రానివ్వదు.. ఈ ప్రయాసలో ఒక గేము, ఇంకో గేము గెలుస్తూపోతూ.. గేముల ఆధిక్యంలోకి తన వచ్చేస్తుంది. అటు పై సెట్ నెగ్గేస్తుంది. చివరి నిర్ణయాత్మకమైన సెట్ లో పూర్తిగా ఆధిపత్యం చూపిస్తుంది. మాచ్ గెలవడానికి ఒక్క పాయింట్ దూరంలో ఉన్న అవతలివారు మాచ్, దానితో పాటు కప్పు వదిలేసుకునేలా ఆడుతుంది. నాలుగో రౌండులో మారియా షరపోవాను, ఇప్పుడు క్వార్టర్ ఫైనల్స్ లో మరొకరిని ఇలానే ఓడించి, సెమీస్ కు చేరింది.

“పాయింట్, గేము, సెట్ట్.. ఇవేవి నాకు తెలీదే.. ఈ అమ్మాయి గురించి మనకనవసరం” అనుకోకండి. ఎవరు గెలుస్తున్నారో, ఎవరు ఓడుతున్నారో తెలియటానికి ఆట నియమాలు తెలియాలి గాని.. ఎవరెంత ప్రయత్నిస్తున్నారో, ఎవరు ఓటమినే ఓడించాలానుకుంటున్నారో చూస్తుంటే.. అదే తెలిసిపోతుంది. ఓ మనిషి విపరీతమైన ప్రయత్నానికి మించి ప్రపంచంలో Strong Inspiration ఉండదేమో!! వీలైతే ఆడాలి..లేకపోతే గమ్మున ఉండాలి, అంతే కాని ఆటలు చూడడం వల్ల ఏమి ఒరగదు అని చాలా మంది హితబోధ చేస్తారు.. వారి కోసం ఇప్పుడు ఈ రష్యన్ కాలమతి కథలో నీతిని చూద్దామా..
ఒకే ఒక్క పాయింట్ తో గేము అయ్యిపోయేది, ఆ ఒక్క పాయింట్ కాపాడుకుంది కాబట్టే.. మాచ్ నిలబెట్టుకోగలిగింది. You take care of the moment, the rest will take care of itself అని ఎప్పుడో విన్నది గుర్తువచ్చిందా?? మనం విన్న సూక్తిని “మానవ ప్రయత్న” రూపేన చూపిన సఫీనాకు కంగ్రాట్స్ చెప్పుద్దామా??

ఇవాల్టి మాచ్ కి సంబందించిన వార్తా ఇక్కడ చదవగలరు.

7 comments

 1. interesting observations and narrative.
  కాకపోతే సుమతి పద్ధతి పాటించి అలనాటి స్టెఫీ గ్రాఫ్ లాగా రంగం లోకి దిగడంతోనే ప్రత్యర్ధి తల ఎత్తుకోలేకుండా ఉతికి పారేస్తే?? 🙂

  Like

 2. మీ విశ్లేషణ కొత్తగా, బాగావుంది. ఇలా ఎవరైనా ఇలా స్పోర్ట్స్ కాలమ్ రాస్తే మాలాంటి ‘born spectators’ కి కూడా గేమ్స్ మీద ఇంట్రెస్ట్ వస్తుందనుకుంటా.

  Like

 3. కొత్త పాళి వారికి నమస్కారాలు.

  నేను వ్యాసంలో మిస్స్ చేసిన పాయింట్ పట్టుకున్నారు. “సుమతి” కాటగిరీలో ఫెడరర్, హెనిన్, సాంప్రాస్ లా చాల మందినే పెట్టవచ్చు. కాని కాలమతులు చాల అరుదు.. అంత విపత్కర పరిస్థితి ఎలా (స్వయంకౄతాపరాదం వల్లనా లేకా కష్ట కాలం వల్లనా) వచ్చయో పక్కకు పెడితే, ఇలాంటి పరిస్థితుల్లో నెగ్గడం ఆటకే కొత్త అర్ధం వస్తుంది.

  స్టెఫీ లా ఉతికి ఆరేస్తే ఆమె ఆటలోని ప్రావీణ్యమే తెలుస్తుంది. అదే ఓడే స్టేజీ నుంచి గెలిస్తే అమే మానసిక నైపుణ్యం కనిపిస్తుంది.

  టపా చదివి, వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు!!

  @రాజీవ్:
  మీ ఒక్క “Awesome” has made my day Awesome.. truly!!

  @ మహేశ్
  మీ అభినందనకు ధన్యవాదాలు!!

  Like

 4. sagar

  Very good one Purnima, Agassi comes under same category in 90’s. Mari match loosing point ani kaadhu, almost similar state nunchi bounce back chesevaadu. I like that never give up approach.

  Really good blog to read. keep it up

  Like

 5. Thanks Sagar!! agassi aata nenu choodaledu kaani, oo 6 years back.. okka abbayi french open finals gelustaadu ee style lo.. am wondered by it till now.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s