నాలో నేను

Posted by
మీకీ తమాషా ఆట తెలిసే ఉంటుంది. ఒక పేరు చెప్పగానే మీకు ఏమనిపిస్తుందో లేక ఎవరు గుర్తువస్తారో చెప్పాలి ఒక్క పదంలో. గబగబగా చెప్పాలి.. అతి తక్కువ సమయంలో!! అలా నన్ను ఎవరైనా గోదావరి అని అడిగితే “రొమాన్స్” అని చెప్తా!! మా అమ్మను అడిగితే “అమ్మో.. వరదా!!” అంటుంది. మా నాన్న అడిగితే “బాల్యం” అని చెప్తారు. మా చెల్లిని అడిగితే “ఎమో” అంటుంది తేలికగా. గోదావరి మీద ఓ 8 గంటలు ప్రయాణించాక గాని గోదావరి ఏమిటో తెలియలేదు. అలాగే భానుమతిగారి గురించి పరిపరి విధాల ఆ నోట ఈ నోట వినినప్పుడు కలిగిన అభిప్రాయంతో పాటు.. ఆవిడ వ్రాసిన “నాలో నేను” చదివిన తర్వాత ఒక కొత్త అనుభూతి మిగిలింది.

నాకు ఆత్మకథలంటే చాలా ఇష్టం.. ముందు నుండీ. “పబ్లిక్ ఫిగర్” గా వెలుగొందేవారి గురించి మంచో, చెడో మనం చాలానే వింటాం. ఎంత ఎ’దిగి’నా వారు ఎమిటో వారికే బాగా తెలుసు.. అందుకే వారి సత్యాలు అక్షరరూపాలుగా ఆస్వాదించటం నాకెంతో ఇష్టం. ఇక ఈ పుస్తకంలో నాకు నచ్చిన విషయాలు:

*త్వరగా కోపం వస్తుందనీనూ, ఊరికే గయ్య్..గయ్య్ మంటాననీనూ నన్ను చాలా “భానుమతి” అని పిలుస్తారు. ప్రపంచమంతా “అమ్మో.. భానుమతి” అనే వ్యక్తి సహజంగా బిడియస్తురాలు అని పుస్తకం చదివాకే తెలిసింది. కాలంతో పాటు, పరిస్థితులకనుగుణంగా తన వ్యక్తిత్వాన్ని మలుచుకుంటూ పోయారు. నాకు భలే నచ్చారు.

* తన గొంతు సకలాంధ్ర ప్రేక్షకులు వినాలన్న ఒక్క కోరికే ఆవిడను సినిమా వైపుకు నడిపించింది. తప్పని సరియై వృత్తిని స్వీకరించినా, కార్య నిర్వహణలో మాత్రం అకుంఠిత దీక్ష కనబరచడం నన్ను అబ్బురపరిచింది. మేకప్ అంటే ఆవిడకు మహా చిరాకు కావటం కొసమెరుపు.* నచ్చిన వ్యక్తికి “నచ్చావు” అని చెప్పలేక.. అలా అని అతనిని రెప్పపాటు కాలం కూడా చూడకుండా ఉండలేక, ఆవిడ పడిన మూగవేదన హృదయానికి హత్తుకునేలా వివరించారు. ప్రేమనిండిన మనసు భాధతో ఉప్పోంగినా అందంగా ఉంటుందనిపించింది.

* వయసు పెరిగేకొద్దీ మనం హుందాగా వ్యవహరించాలి అనుకుంటాం. అదే చేస్తాం కూడా. కానీ మనలోని చిలిపితనం, అమాయకత్వం, పిచ్చితనం ఒకే ఒక్క మనిషి దగ్గర ప్రదర్శించాలనిపిస్తుంది. భానుమతిగారు, రామకృష్ణగారి గురించి రాసింది చదివినప్పుడల్లా ఖడ్గం సినిమాలో “నువ్వూ, నువ్వూ” పాటలో ఈ లైన్ పదే పదే గుర్తు వచ్చింది “బయటపడాలనిపించే పిచ్చితనం నువ్వూ..”

* భానుమతిగారి పెళ్ళి అచ్చు సినిమా స్టైల్లో జరిగింది తెలుసా? అని అనను. సినిమా ను తిరగేస్తే “మానిసి”, మనిషికి విక్రుతి. మనిషి జీవనక్రమంలో జరిగే సంఘటనలే సినిమాలకు మూలం. Truth is stronger than Fiction అన్నది నమ్మక తప్పని నిజం. ఈవిడ పెళ్ళి విషయంలో మరీనూ!!

* “నేను, నా” నుండి “మనం” వరకు ప్రయాణం భలే తమషాగా ఉంటుంది. ఆవిడ మాటల్లోనే చెప్పాలంటే “మావారూ నేను ఒకే విషయాన్ని ఒకరికి తెలియకుండా ఒకరం ఆలోచిస్తుంటాం. అదేమిటో తమాషా!”

* భానుమతిగారికి మిస్సమ్మ సినిమా మిస్స్ అవ్వటానికి “వరలక్ష్మీ వ్రతం” కారణమని తెలిసి ముక్కున వేలేసుకున్నాను.

* సంసారం సాగకుండా సినిమా అడ్డునిలిస్తుందేమో అని భయపడి, చాలా వరకు విరమించుకున్నా.. మేకప్ బరువును ఎత్తుతూనే సంసార భాధ్యత సక్రమమంగా నిర్వర్తించిన ఆవిడ జీవితం నుండి ఎన్నో విషయాలు ఆకలింపచేసుకోవచ్చు.

* బాగా మాట్లాడితే వాగుడుకాయి అంటారు, మాట్లాడకపోతే సిగ్గరి అంటారు. డబ్బులు ఖర్చుపెడితే “దుబారా మనిషి” అంటారు, పెట్టకపోతే “పీనాసి” అంటారు. నువ్వు ఏమి చేసినా లోకం ఎత్తిపొడుస్తూనే ఉంటుంది.. అందుకే నీకు నచ్చింది నువ్వు చేస్తూపో అన్న సూక్తిని ఆవిడ జీవితం ప్రతిబింబిస్తుంది.

* అత్మాభిమానం కలిగి ఎవరికీ తలవంచని తను, Philosiphical bent of mind గల మనిషి అంటే విస్మయం చెందాను

* “ఉద్యోగం చేయడానికి చదువుకోవటం ఒక రకం, విజ్ఞానం కోసం చదవటం ఇంకో రకం, ఒక లక్ష్యంకోసం చదవటం మరో రకం. ” అన్న ఆమె సుభాషితం శిరోధార్యం.

“సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు”, “నిండు పున్నమి నెలకొకసారి వస్తుంది”, “శిశిరంలో ఆకులు రాలిపోతాయి” లాంటి నిత్యసత్యాల్లానే, మనం చాలా సార్లు మనుషులను కూడా ఒక నిర్దిష్ట నిర్వచనం ఇచ్చి “ఆ మనిషి ఇంతే!!” అనుకుంటాము. కానీ మనిషి ఓ నిరాటంక ప్రవాహం లాంటివాడని, ఎదురువచ్చే వాటిని అధిగమిస్తూ ఎంతో కొంత రూపాంతరం చెందుతాడని “నాలో నేను” విశీదీకరించింది. తప్పక చదవాల్సిన పుస్తకమని చెప్పను గాని, చదివితే మాత్రం ఓ మంచి అనుభూతి మీ సొంతమవుతుంది.

14 comments

  1. the way u presented this book is simply superb. I really want to read this book. Thanks for introducing such a good book.

    Like

  2. @Purnima
    I love the way you presented her book. If at all, I write anything,I may be tempted to ask you to write foreword for that 🙂
    And, please continue writing. Striking a chord comes to you naturally.

    Like

  3. నాకైతే “నాలో నేను” ప్రతి మహిళా(మగాళ్ళు కూడా) తప్పక చదవాల్సిన పుస్తకమనిపిస్తుంది.భానుమతిగారు తన సహజ శైలిలో సొంత కథ చెప్పడమే అదృష్టం.ఇక దాన్ని చదవడం ఒక సువర్ణావకాశమే కదా!

    సినిమాలు వొద్దనే స్థాయినుండీ,పెళ్ళితరువాత అసలొద్దనే నిర్ణయం నుండీ, ప్రధమ మహిళా దర్శకనిర్మాతగా ఎదిగిన ఈ ‘మహామహిళ’ కథ చదవకపోటే ఎట్టా?
    http://www.parnashaala.blogspot.com

    Like

  4. సిగ్గరి.. నిసిగ్గరిగా రూపాంతం చెందటానికి ఎంత శ్రమిస్తాడో, భానుమతి గారు చెప్పిన విషయాన్ని మీరు చాలా అందంగా చెప్పారు. మంచి ప్రయత్నం. పుస్తకం దొరికితే చదవటం కొందరి అలవాటు. కొని చదవటం మరి కొందరి అలవాటు. ఈ పుస్తకాన్ని తప్పక కొని మరీ చదువుతాను.

    Like

  5. పూర్నిమ చాలా బాగా వ్రాశారు.. నాకు ఈ పుస్తకం బాగా నచ్చింది.. అసలు నా బ్లాగ్ కి ఈ పేరు పెట్టడానికి కూడా అదే కారణం..

    Like

  6. Purnima, thanks for this. I Liked your simple and superb write-up on ‘naalo nenu’. Im looking fwd to read this book.

    Like

  7. @srividya:

    Thanks so much 🙂

    @ dileep:

    And I loved the way you commented on the post. Looking forward for your writings and thanks for the kind words.

    mahesh gaariki:
    bhale cheppaaru. aavidaa gurinchi aavida raasindi chadavatam nijamgaa adrushtam.

    @ kotha paali:
    i did read your review sometime back. Should say a good one.

    @pratap:
    chadavandi.. disappoint avvarane aasistunna!!

    @sujaata:
    Thanks 🙂

    @naani:
    Thanks:-)

    Like

  8. చాలా కాలం క్రితం మావూరికి సమీపంలో సినిమా షూటింగు జరుగుతుంటే (పెళ్లిపీటలు అనుకుంటా), భానుమతి గారిని చూడటానికని వెళ్లాము. సెట్లో ఆవిడ అందరితో చాలా కలివిడిగా, సరదాగా జోకులువేస్తూ కనిపించారు.

    ఆవిడ వ్రాసిన అత్తగారి కధలు చాలా అనలిటికల్ గా ఉంటాయి.
    మీ పోష్టుద్వారా ఆవిడపై ఉన్న గౌరవం మరింత పెరిగింది. ఆవిడ మార్గం అనితర సాధ్యం అనిపిస్తుంది ఒక్కోసారి.

    బొల్లోజు బాబా

    Like

  9. నాకు భానుమతిగారంటే చాలా అభిమానం.మరలా ఈ రోజు ఆవిడని తలచుకునేలా చేసినందుకు థాంక్స్.ఈ పుస్తకం ఆన్లైన్లో ఎక్కడన్నా ఉచితంగా గానీ,డబ్బులకు గానీ దొరుకుతుందా?

    Like

  10. raadhika gaaru:

    ee kindi links choodandi. free gaa unde question ledu gaani, dabbulu katti konvacchu online lo. meeru adigaarani ippudu google lo pattukunna veetini. tappaka pampistaaro ledo teliyadu.

    http://www.telupu.com/books.html

    inka http:// avkf.org lo kooda choodandi

    Like

Leave a reply to bolloju ahmad ali baba Cancel reply