విశాలాంధ్రా క్రాస్-వర్డ్స్

Posted by

కారణాంతరాల వళ్ళ ఇవ్వలా కోఠీకి వెళ్ళటం జరిగింది. ఏటూ వెళ్ళాము గనుక బాంక్ స్టీట్ లో విశాలాంధ్ర బుక్ షాపులో కొన్ని పుస్తకాలు కొన్నాను. ఈ బ్రాంచికి వెళ్ళటం ఇదే మొదటిసారి. నేను చూసిన తెలుగు పుస్తక కొట్లలో కల్లా ఇదే పెద్దది. చాలా ప్రశాంతంగా ఉంది. వెళ్ళిన ముగ్గురమూ తలో మూలకీ వెళ్ళాము. ఒక క్రమపద్ధతితో వరుసగా ఉన్న పుస్తకాలను చూస్తుంటే.. మెదడుకు ఎక్కడలేని ఆకలీ మొదలైంది. ఎవరికి కావాల్సిన పుస్తకాలు తెచ్చుకుని, కౌంటరు దగ్గరికి వచ్చాము. మేము తీసుకున్న పుస్తకాలను బట్టి మా అభిరుచులను అంచనా వేసి అందుకు అనుగుణంగా మరిన్ని పుస్తకాలు తెప్పించారు. వాటిని చూడమన్నారు. ఎదో ఒక పుస్తకం అని వెళ్ళిన వారం అధనంగా ఇంకొన్ని తీసుకున్నాము. మాటల మధ్యలో తెలుగు గురించి, తెలుగు గ్రంధాలయాలు లేకపోవటం గురించీ, తెలుగు రచన గురించీ చర్చలు, వాదాలు ప్రతివాదాలు. అంతా చేసి బయలుదేరే సమయానికి “వెళ్ళిరండి” అంటూ అచ్చతెలుగు అప్పగింతలూ. పుస్తకాల కొట్టనే కాదు.. కొఠీలో షాప్పింగ్ చేస్తేనే అంత.. బేరం కుదిరే వరకూ గిల్లికజ్జాలు ఉన్నా.. మంచి గిరాకికి ఎప్పుడూ.. సలాంలూ, స్పెషల్ డిస్కౌంట్లూ.. “మాది కూడా కొంచెం ఆలోచించండి” అంటూ విన్నపాలు. ఆ పలకరింతలు త్వరగా మర్చిపోలేము.

కడుపులో తిరుగుతున్న ఎలుకలకు సిటీ సెంటర్ లో ట్రీట్ ఇద్దామకుని.. బంజారా హిల్స్ కి చేరుకున్నాము. తినిన తర్వాత.. మనసు క్రాస్-వర్డ్స్ మీదకు లాగుతుంటే.. సరే అని వెళ్ళాము. “You don’t open a book, you open a mind”..అంటూ స్వాగతం పలికింది క్రాస్-వర్డ్స్!! అసలు నేనీ షాపుకు రెగులర్ కస్ట్ మర్ అయ్యింది ఈ quotes కి పడిపోయే!! లోపలికి వెళ్ళగానే మహా గజిబిజిగా ఉంది.. చాలా జనం ఉన్నారు. ఎవరికి తోచిన చోట వారు కూర్చుండి పోయారు. చదువుతున్నారే గాని.. ఆదరాబాదరాగా. పేజీలు శబ్దం, అటు ఇటు తిరిగుతూ అడుగుల శబ్దం, గట్టి గట్టిగా మాట్లాడుకుంటున్న వారి మాటల శబ్దం.. చాలా Restless గా ఉంది. నాక్కావాలిసిన ఒక పుస్తకం త్వ్రరగా దొరికింది. ఇంకోటి ఎంత చూసినా కనిపించలేదు. అక్కడ పనిచేసే అబ్బయిని అడిగాను. నాకు తెలియదంటూ అతడు చేతులెత్తేశాడు. సరేలే అనుకుని ఇంకో అబ్బాయిని “చె గొరవా” పుస్తకాలు ఉన్నాయా అని అడిగా.. “బైకింగ్ రిలేటెడ్” అన్నాడు. కాదులే అనుకుని, ఓ థాంక్స్ చెప్పి, బిల్ల్ కట్టి చక్కా వచ్చేశా!! ఈ మాల్స్ లో షాప్పింగే అంతా.. అన్నీ మనమే వెతుక్కోవాలి!! నచ్చిందా..నచ్చలేదా అని కూడా అడగరు. వచ్చావా.. Select చేసుకున్నావా.. చెప్పినంత డబ్బు కట్టావా.. తీసుకుపోయావా.. అదీ పద్ధతి ఇక్కడ. పలకరింపులు, సూచనలు లాంటివి తక్కువ.

మొన్నో స్నేహితుడు ఫోన్ చేసాడు.. అతడు గత కొద్ది కాలంగా హైదరాబాద్ కి దూరంగా ఉంటున్నాడు. మాటల మధ్యలో హైదరాబాదు గురించి చర్చ వచ్చింది. “ఏంటీ హైదరాబాద్ అంతలా మారిపోయింది. పోయినసారి వచ్చినప్పుడు పిచ్చి ఎక్కింది” అన్నాడు. నిజమే.. మారింది.. మంచికో చెడుకో నాకు తెలియదు కానీ చాలా మారిపోయింది అన్నాను. “అసలు మన సిటీలా లేదు.. అంత గజిబిజిగా.. ఎంతో హడావిడిగా, చాలా restless గా, It’s changing for bad” అని తేల్చేసాడు. ఆ మార్పుకు నేను ప్రత్యక్ష సాక్షిని అంటూ నా మనసు మూలిగింది. ఆ మూలుగుడికి ఇవ్వాల ఓ సాక్షంలా నా ఈ “విశాలాంధ్రా క్రాస్-వర్డ్స్” అనుభవం నిలుస్తుంది. Or at least అలానే అన్వయించుకోవాలని నా మనసు నిర్ణయించుకుంది.

10 comments

  1. పుస్తకాల గురించి తెలిసిన అమ్మకందారుతో సంభాషణలు చాలా ఆసక్తికరంగా ఉండి, మంచు పుస్తకాల ఎంపికలొ ఉపయోగకరమౌతాయి.

    నేను మైసూర్ లో చదువుతుండగా ‘సరస్వతీ పురం’దగ్గర ఓక సెకండ్ హ్యాండ్ పుస్తకాల షాపు ముసలాయనొకరుండేవారు. ఇతను రెకమెండ్ చేసి కొనిపించిన వాటితోనే నేను ఆంగ్ల సాహిత్య పరీక్షలు గట్టెక్కి,కొంత జ్ఞానసమపార్జన చెయ్యగలిగాను.

    Like

  2. అది ఒక్క విశాలాంధ్రకి మాత్రమే పరిమితం కాదు. మీ వీధి చివరనున్న బడ్డికీ , సిటి సెంటర్లో ఉన్న మాల్‌కి తేడా అది!
    పల్లేటూర్ కి, పట్టణానికి, మహా నగరానికి ఉన్న తేడా అది.
    You got mail సినిమా చూసారా? చూడండి!

    Like

  3. పూర్ణిమ..

    ”పుస్తకాల కొట్లలో’ – కొట్టు – అన్న మాట విని చాలా కాలం అయింది. ‘షాపు’, ‘పుస్తకాల షాపు’, ‘పాన్ షాపు’ (కిళ్లీ కొట్టు అని చిన్నపుడు అనే వాళ్లు అందరూ..) అనే వినిపిస్తాయి ఇప్పుడు. కాబట్టి, ఆ పదానికి ఒక జై.

    విశాలాంధ్ర.. వాళ్ల ట్రీట్మెంట్, అక్షరాలా నిజం. ఈ షాపు లో పని చేసే వాళ్లు, ఆ షాపు లో అన్ని పుస్తకాలూ చదువుతారేమో – వాళ్ళకు అన్నిటి మీదా అవగాహన ఉంటుంది. మీ టపా దీనికి మంచి ఉదాహరణ. మంచి విషయం సింపుల్ గా రాసేరు కాబట్టి, మీకు ఇంకో జై. 😀

    Like

  4. మహేశ్ గారికి:
    నిజమే 🙂

    నెటిజెన్ గారికి:
    అవును.. చిన్న పట్టణం నుండీ మహానగరం వరకూ ప్రస్థానంలో ఇవ్వన్నీ చూసీచూడనట్టు ఉండాలేమో!! మీరు చెప్పిన సినిమా చూడలేదు.. త్వరలో చూస్తాను.

    సుజాత గారికి:
    మీరు చెప్పినట్టు రెందు శభాష్ లు నా ఖాతాలో జమ చేసుకున్నను!! ధన్యవాదాలు. 🙂

    Like

  5. ‘చే గువేరా’ కదా? ఆయన గురించి కొన్నేళ్ల క్రితం ఒక మంచి సినిమా వచ్చింది చూడండి – ‘మోటర్ సైకిల్ డైరీస్’ అని, స్పానిష్ భాషలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఉంటుంది. ఈ మధ్యనొచ్చిన తెలుగు సినిమా ‘గమ్యం’ కి ఆ సినిమా స్ఫూర్తి అనుకుంటా.

    Like

  6. నెటిజన్ గారు అన్నట్టు మీ టపా చదవగానే నాకూ “You’ve got mail” సినిమానే గుర్తుకొచ్చింది.

    అచ్చంగా ఈ విషయం మీదే ఆ సినిమా…

    చక్కని చర్చలు కానిస్తూ పుస్తకాలు కొనడం కంటే ఆనందమేముంది ?

    Like

  7. If you’re going to buy regularly, you can take their membership card – forget how much the membership was .. You get 10% discount. If you ever go to Vijayawada or Guntur, pay a visit to Navodaya there (Hyd Navodaya is different). You will meet one of the Atluri brothers. Their knowledge of Telugu literature is phenomenal. You can meet Navodaya Ramamohana Rao here 🙂
    http://kottapali.blogspot.com/2007/07/1.html

    Like

  8. @kottha paali gaaru:

    I did get a discount from Visaalandhra, costed about Rs 25 for the membership.

    Thanks for your recommendation about Navodaya. It may be difficult to visit Guntur or Vijayawada any soon :-(, but this would be on my mind.

    Thanks again for helping me in finding good books. I read ur blog just now!!

    Purnima

    Like

  9. I read all your blogs now. Pretty good combination of style and substance.

    Speaking of ‘Che guevara’..I noticed that his picture was used as background for a good part of Jalsa movie. I personally hate him though..but I digress.

    Whenever I visit India, I make sure that I go to Vishalandhra that you mentioned…. My big problem is then to carry those many books all the way back.

    I didn’t know about this Cross-Words..must be a new thing..

    Thanks for all your blogs. I just read them now. This is my first posting and will try to learn to post in Telugu Lipi, pretty soon..

    Like

  10. Hi independent,

    Thanks for the comment. chaala opika undaali naa posts anni chadavaali ante. Thanks again!!

    Che Guerava.. fascinates me as of now. Should read him, to decide if I like or not!!

    I’m not sure which part of the world you are right now. If you are in US, getting telugu books isn’t a big deal i guess. There are enough ppl around to help about telugu books.

    Crosswords is just another English bookshop in one of the malls. All it allows is let you browse books very leisurely.

    Looking forward to your posts as well. Hope to see you soon.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s