మగవారి హక్కులే.. నా డిమాండ్!!

Posted by

పాపం అబ్బాయిలు.. వీరికి అడుగడుగునా కష్టాలే!! ఇది అభిప్రాయం కాదు, స్వానుభవం. ఒకసారి బస్సురాక, ఊసుపోక ఉన్నత చదువులు-ఉద్యాగాలు మీద ధీర్ఘంగా చర్చించుకుంటుంటే.. మా సీనియర్ ఒక అబ్బాయి.. “మీకేంటి? చదివినా, చదవక ఇంటి దగ్గర కూర్చున్నా సరే!! మీ నుండి expectations ఉండవు. అదే మేమైతే తప్పక సంపాదించాలి.. లేకపోతే వాల్యూనే లేదు” అని అన్నాడు. సెహ్వాగ్ బంతిని కొట్టేంత గట్టిగా తగిలింది ఆ మాట నా మనసుకి. “ఈ అబ్బాయిలున్నారే..” (నువ్వు-నేను సినిమాలో ఉదయ్ కిరణ్.. “ఈ పెద్దోళ్ళూ ఉన్నారే”.. అంటునట్టుగా) అంటూ ఇంటికి వెళ్ళగానే మొదలెట్టా!! “అవును మరి.. అమ్మాయి పనిచేయటం లేదు అనేది చాలా మంది లెక్కలోనే రాదు. అదే అబ్బాయికి “సరైన” ఉద్యోగం లేకపోతే.. పెళ్ళి మాట తలవను కూడా తలవరు”. అన్నారు నాన్న సీరియస్ గా!! మొదట సారిగా మగవారి బరువు (భాధ్యత) నాకు అర్ధమైంది. (జల్సా సినిమాలో మహేశ్ బాబుకి తెలుస్తుందే పవణ్ గురించి.. అలా అన్న మాట)

కాలేజీలో నా స్నేహితురాలికి ఒక సెమ్ లో మార్కులు మన tailenders స్కోర్స్ లా వచ్చాయి. మంచిగా చదివే అమ్మాయే.. కానీ టాప్ బాట్స్ మెన్ ఉండి కూడా చతికిలబడే ఇండియా బాట్టింగ్ లా, బాగా రాసినా ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని జె.ఎన్.టి.యు వాల్యువేషన్. మార్కు లిస్ట్ పట్టుకుని భోరున ఏడవడం మొదలెట్టింది. సానుభూతితో అంతా ఆ పిల్ల చూట్టూ గుంపు కట్టి ఆ అమ్మాయి ఏడవడానికి కావల్సిన అనుకూల వాతావరణం కలిగిస్తుంటే.. ఒకడు వచ్చి “ఎందుకు ఏడవడం.. అసహ్యంగా!! బోడి మార్కుల కోసం కూడా ఇలా గోలచెయ్యాలా??” అని అరచినంత పని చేశాడు. “ఈ అబ్బాయిలున్నారే..” అంటూ మొదలెట్టేలోగా.. పక్కనుండి లోతుగా వస్తున్న మగగొంతు.. “మీకు కనీసం ఏడిచే ఛాన్స్ అయినా ఉంది. బాధ ఉన్నా మేము ఏడవలేము.” దీనంగా వినిపించింది. అప్పుడు నేను మగవారి లోతు తెలుసుకున్నాను.

ఎదో ఆదివారం పూట.. వేయి కళ్ళతో.. కోటి ఆశలు పెట్టుకున్న కీలకమైన క్రికెట్ట్ మాచ్ లో మనవాళ్ళు మెలితిరుగుతున్న బంతితో వేగలేక.. ఆడలేక, తెలుగు సినీ ఇండస్ట్ర్రీ కి వచ్చీ రాగానే వెళ్ళిపోతున్న హీరోయిన్స్ లా అందరూ పెవిలియన్ దారిపడుతుంటే.. గతిలేక, మతి చెడినందుకు చిహ్నంగా ఛాన్నెళ్ళు తిప్పుతూండగా.. “చూడు వీడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో.. నీ కోసం చావడానికి సిద్ధపడ్డాడు. అదే వాడు నిన్ను మోసం చేసుంటే.. వాణ్ణి తన్నటానికి గూండాలు, రౌడీలు, పోలీసు కంప్లేట్స్, మహిళా హక్కులు, నిరసనలు, ర్యాలీలు, చట్టాలు, కోర్టులు.. ఆఖరకు అసెంబ్లీ, పార్లమెంట్ దాకా చర్చలు. అదే మీరు మమల్ని మోసం చేస్తే కనీసం ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పుకోలేని దుఃస్ఠితి” అంటూ తరుణ్ ఏదో సినిమాలో, “ఈ అబ్బాయిలు ఉన్నారే..” అనే ఛాన్స్ లేకుండా యువ్ రాజ్ కొట్టే భారీ సిక్సర్ లా కొట్టాడు. ఇకప్పటినుండీ కరుణానిధికి తమిళంలా, థాకరేకు ముంబై లా, బీజేపీకి రామునిలా, ప్రధానికి సోనియాలా, ధోనికి “యూత్”లా, తెలుగుసినిమాకి మాస్ లా .. నాకూ మగవారిపై “గురి” కుదిరింది. ఎంతగా అంటే.. నా ఒకానొక టపాకి వ్యాఖ్యలో నన్ను ఫెమినిస్ట్ అంటే.. సైమెండ్స్ ని “మంకీ” అన్నప్పుడు కూడా ఫీల్ అయ్యుండడు నేనయినంత!!

అప్పుడే నిశ్చయించేసుకున్నా.. ఎప్పటికైనా ఓ “Men’s Rights Commision” పెట్టాలని. అప్పటికే ఉంటే.. నేనే సంఘ అధ్యక్షురాలిని అవ్వాలని. అప్పుడు గానీ నా ఈ భక్తి భావనలు వెలుగులోకి రావని. సివిల్స్ ఇంటర్వ్యూలో .. “పదవి రాగానే మొట్టమొదట నువ్వు ఏమి చేస్తావ్??” అని ప్రశ్న విరివిగా అడుగుతారట. మీరూ ఆ ప్రశ్న నన్నడగండి.. సర్వకాల సర్వావస్థలలోనూ మన టీవీ వాళ్ళు అడిగే “ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు” కి బదులుగా. అప్పుడు నా సమాధానం…

“సమావేశమైన మీ అందరికీ నమస్కారాలు. ఇది నాకు ఆషామాషీ పదవి కాదు.. నేను రేయింబగళ్ళు కన్న కల. అసలు మగవారికి జరిగే అన్యాయం అంతా ఇంతా కాదు. చిన్నప్పటినుండీ వారిని వేరుగా చూస్తారు. ఒక అమ్మాయి కన్నా ఆటపాటల్లో, చదువుసంధ్యల్లో తక్కువగా ఉంటే.. చూసి నేర్చుకో అంటారు. అదే భేషుగ్గా చేస్తే.. “ఆడపిల్లతో పోటీ ఏంటిరా?” అంటారు. పెళ్ళి కాక ముందు అమ్మ emotional blackmails తో, పెళ్ళయ్యాక వట్టి blackmails తో జీవితం సరిపోతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో ఎన్నెన్నో!! అన్నింటిలో ఆడవాళ్ళ గొప్పలే.. ఏదో వాళ్ళే కష్టపడుతున్నట్టు. అసలు చెయ్యాలేగాని మగవాళ్ళ ముందు ఆడవాళ్ళు ఏ పనిలో సరిపోరు. ఆడవాళ్ళంతా విస్సుకుని, నస్సుకుని చేసే వంట.. మగవాళ్ళెంత సునాయాసంగా చేస్తారు. హోటెలుకి వెళ్తున్నాము అంటే.. దాదాపు ఓ మగాడి చేతి వంట తింటున్నట్టే. అంతెందుకు “నలభీమపాకం” అంటారే గాని, సీత , ద్రౌపది లాంటివారి వంట గురించి ఉందా అసలు?? అందుకే..మగవారి పై సమాజిక వొత్తిడి తగ్గించే తొలి మెట్టుగా నేను తీసుకునే మహత్తర నిర్ణయం.. ఈవాల్టి నుండీ మగవారిదే వంటిళ్ళు.. ఆడవారికి అందులో ప్రవేశం నిషేదిస్తున్నాము. ఇన్నాళ్ళు మీ ఈ కళను కుటుంబమంతా ఆనందిచకుండా అడ్డుపడిన ఆడవారికి ఇదే గుణపాఠం. పాకశాస్త్ర ప్రావీణ్యం తోటే.. ఈ జైత్రయాత్ర మొదలవుతుంది. ఇంట, వంటింట గెలిచినాకా.. రెచ్చను గెలవడం.. ఓ..రచ్చల్.. రచ్చలంతే!!” అని చెప్పాలని నా ప్లాను. ఎప్పటికి తీరుతుందో ఈ కల, ఆశయం, అభిలాష !!

********************************************************************************************************************************************************
ఇప్పటికిప్పుడు నాచేత ఈ టపా రాయించిన సుజాతగారికి ఓ థాంక్స్!! వంట చేయడంని ఒక కళగానే కాక, నిత్యావసరంగా గుర్తించకపోగా… శ్రమించి చేసేవాళ్ళను ఎగతాళి చేసే వారి గురించి ఆలోచనానూ, “జోర్ కా జట్కా భీ ధీరేసె లగ్నా చాహియే” (భీకరమైన షాకును కూడా.. నిదానంగా ఇవ్వాలి) అన్న కొత్త మానేజ్ మెంట్ సూత్రము వెరసి ఈ టపా.

34 comments

  1. ఆహా..ఇన్ని రోజులకి మగ వాళ్ళ కష్టాలని కూడా అర్దం చేసుకునే ఓ మనసు కనిపించింది కదా అని చదివుతుంటే, చివరాఖరికి భలే జట్కా ఇచ్చారు కదండీ…హన్నా !!..ఇక మీ ప్రశ్న విషయానికి వస్తే అలా జనరలైజ్ చేయలేం అండి. ఆడవారిలో కఠిన హృదయులున్నట్లే అబ్బాయిల్లోను సున్నిత మనస్కులుంటారు. So Broad-Mindedness లో కూడా అంతే, పుర్రెకో బుద్ది అని పెద్దలు ఊరికే అనలేదు కదా…

    Like

  2. మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ says:

    క్రికెట్ లో ఆస్ట్రేలియా ప్రపంచకప్పు గెలిస్తే అది వార్త కాదు. ఇండియా గెలిస్తే అదీ వార్త. (ఆస్ట్రేలియా స్థానంలో ఆడవారిని, ఇండియా స్థానంలో మగవారిని, క్రికెట్ స్థానంలో వంటని పెట్టుకోండి)

    నాకు కొన్ని ధర్మ సందేహాలు,
    స్వయంగా శ్రీ కృష్ణుని ఆకలి తీర్చిన (దుర్వాసుడు వచ్చినప్పుడు) సోదరి ఎవరు? ద్రౌపదే కదా?
    మరి కండలు పెంచడంలో దిట్టయిన భీముడు వంటలెందుకు వండాడు. సుకుమారి అయిన తన భార్య అంతఃపురానికి వంటలు వండి కష్టపడకూడదనే కదా!

    పది మందికీ అన్నం పెట్టగల మహా రాజు పాకశాస్త్ర ప్రావీణ్యుడిగా వంటింటిలో ఎందుకు దాక్కున్నాడు? సౌందర్యవతి అయిన దమయంతి మనసు క్షోభిస్తుందనే కదా!

    సీతా మహాసాధ్వికి వంట చేసే పనే ఇవ్వలేదు వారి అత్తగారైన కైక. పెళ్ళి కాగానే అడవులకు సాగనంపి పళ్ళు, పచ్చి కూరలు తినమంది. వాటికి ఎలాగు వంట చేయనవసరం లేదు. ఇంక సీత పాక శాస్త్ర ప్రావీణ్యం ఎలా తెలుస్తుంది.

    త్రిమూర్తులను చిన్నపిల్లలను చేసి తన అమ్రుతతుల్యమైన వంటను తిని పించినది ఎవరు? (నాకు ఆ సాధ్వి పేరు గుర్తు రావడం లేదు)

    అయితే మగవారు వంట చెయ్యకూడదని కాదు నా ఉద్దేశం. ఇద్దరూ ఒకరికి ఒకరు తోడుగా ఉండి సాయం చేసుకోవాల్సిందే. ఇది చెప్పినంత సులభం కాదు, కానీ దీన్ని ఖచ్చితంగా పాటిస్తూ ఆనందంగా ఉంటున్న కుటుంబాలు చాలానే ఉన్నాయి.

    మగ వాళ్ళు చాలా broad minded అంటూ జల్సా లో ఇలియానా లా బానే ప్రయత్నించారు.

    మీరు రాసింది సరదాకే అని తెలుసు కానీ నాకు తెలిసిన విషయాలు చెప్పడానికే ఇంత పెద్ద వాఖ్య.

    Like

  3. హమ్మో! మగాళ్ళు చెప్పుకోలేని కొన్ని బాధల్ని అర్థం చేసేసుకుని, వాటినీ కామెడీగా చెప్పెయ్యడమే…!బాగా కామ్రేడరీ ప్రకటించారు. నెనర్లు.

    Like

  4. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా అన్ని రకాలు వుంటారు. అమ్మాయిల కన్నా అబ్బాయిలు కొంచెం కూల్ గా ఆలోచిస్తారు, లైటుగా తీసుకుంటారు.కానీ చాలా మంది అబ్బాయిల్లో వుండె ఒక చెత్త అలవాటు ఏంటంటే అమ్మాయిలంటే చులకన. ఈ మాట ఊరికే అనటం లేదు. చాలా మంది అమ్మాయిల్ని వీళ్ళెకెందుకురా ఉద్యోగం అని హేళన చెయ్యడం నేను చూసాను.వాళ్ళ దృష్టిలో అమ్మాయిలంటే బుర్ర లేని దద్దమ్మలు.వాళ్ళు బట్టలు, చెప్పులు, వంటలు, పిల్ల జెల్లా అంటూ సోది కబుర్లు చెప్పుకుంటారు. కానీ నాకో సందేహం అమ్మాయి అందంగా కనిపించాలి.వంట అద్బుతంగా చెయ్యాలి. మొగుడుని, పిల్లల్ని అపురూపంగా చూసుకోవాలి. అలాంటపుడు అవి మాట్లాడుకుంటే ఎందుకంత వెటకారం.? మళ్ళీ ఎమైనా అంటే వాళ్ళని, వీళ్ళని చూసి నేర్చుకో అంటారు.

    Like

  5. @ ఫూర్ణిమ

    మీరు నన్ను ఇలా మోసం చేస్తారనుకోలేదు. 😦 సుజాత గారు అలా అన్నారంటే వాళ్ళ తరం వేరు…. మన తరం వేరు. 🙂 ఇప్పట్లో నాకు చుట్టూ తెలిసినంతలో అమ్మాయిల కన్న ముందే అబ్బాయిలు వంట మొదలుపెడుతున్నారు. ఈ తరం మగ జనం ఆ జైత్ర యాత్ర ఎప్పుడొ మొదలుపెట్టేసారు.

    ముందు ముందు అది మాకు మీ అవసరం లేకుండా చేసి, భాగస్వామ్యంలో మీ ఉనికిని ప్రశ్నార్ధకం చేసి మీరే మరలా వంట గదిలోకొచ్చేట్టు చేస్తుందని, అప్పుడు కించిత్ విజయ గర్వంతో మీకు వంట గదిలో సహృదయంతో స్థానం ఇస్తామని….

    అహో… ఆ క్షణాలు తలుచుకుంటుంటే ఇప్పుడే వెంట్రుకలు నిక్కబోడుచుకుంటున్నాయి.. 🙂

    Like

  6. వామ్మో ఏం ట్విస్టిచ్చారండీ…అసాధ్యులే.
    మీ టపాలు చాలా బాగున్నాయి.

    Like

  7. ఏకాంతపు దిలీపా .. మీకొచ్చిన మధురోహ తల్చుకుని నాకూ ఒళ్ళు పులకరించింది 🙂 ఐనా ఇట్టా వాళ్ళ తరం మన తరం అంటూ అంతరాలు గియ్య్డం ఏం బాలేదు. ఇక్కడ అందరూ యువతరమే 🙂
    @పూర్ణిమ .. నాకు క్రికెట్ అంటే పడదు. ప్రతి పేరాలో సుదీర్ఘమైన క్రికెట్ పోలికలు ఉండటంతో భరించలేక చాలా వరకు దాటేశాను. చివరి ట్విస్టుమాత్రం భలే

    Like

  8. @కొత్త పాళీ గారు

    నా ఉద్దేశం అంతరాలు గియ్యడం కాదు.. మార్పుని తెలియచెయ్యడం మాత్రమే.. 🙂 మా ఆరుగురు సన్నిహిత మగ మిత్ర బృందంలో ఐదుగురం నిరభ్యంతరంగా వంట చేసేస్తుంటాము. మాకు భార్యతో కలిసి పనులు పంచుకోవడంలో ఎటువంటి అభ్యంతరం లేదు. మేము మా స్నేహితురాళ్ళకి కొన్ని కొన్ని వంటలు ఎలా చెయ్యాలో వివరించిన సంధర్భాలూ ఉన్నాయి సగర్వంగా.. 🙂

    మీకూ ఒళ్ళు పులకరించింది కాబట్టి మిమ్మల్నీ మా తరంలో కలిపేస్తున్నా.. 😉

    Like

  9. ఆ కమీషన్ ఏదో తొరగా పెట్తండి బాబూ, దానిముందు చెప్పుకోవల్సిన విషయాలు చాలా ఉన్నాయి. (మా ఆవిడకు తెలియ కూడదు సుమా). సరదాగా.
    మీ పోష్టు బాగుంది.

    బొల్లోజు బాబా

    Like

  10. @వేణు, మహేశ్:
    చెప్పింది చెప్పినట్టు అర్ధం చేసుకునే మీలాంటి వారుంటే.. రాయడంలోని శ్రమని ఇట్టే మర్చిపోతాము. ధన్యవాదాలు!!

    ఫణి:
    మీరు ధర్మసందేహాలు అడిగారో తీర్చారో నాకర్దం కాలేదు. నేను రాసింది (ముఖ్యంగా చివరి పేరాలో) వితండవాదంలా అనిపిస్తే.. అలాంటి వాదనలు నేను విన్న సంధర్భాలు కోకొల్లలు. అందుకే ప్రస్తావించా. ఈ సారి ఎవరైన అలా మాట్లాడితే మీ వ్యాఖ్య చూసితే సరి!!

    శ్రీవిద్య:
    నేనూ మీతో ఏకీభవిస్తున్నాను!! కాకపోతే అది అబ్బయిలకు మాత్రమే సరిపోదు..అమ్మయిలూ ఉంటారు అలా. అబ్బాయిలంటే ఇలానే ఉండాలి, ఇదే చెయ్యాలి లాంటివి. Chauvinism అబ్బయిలోకన్న అమ్మయిలో ఉంటేనే డేంజెర్.

    దిలీప్:
    “మోసం” అనే పదంతో సరిపెట్టినందుకు థాంక్స్. మా వాల్లకు మల్లె “తడి గుడ్డ తో గొంతు కోయడాం” లాంటి వాడనందుకు మరో థాంక్స్!! 🙂
    మీరనట్టు నేను ఈ తరం అమ్మయినే.. అబ్బాయిలను సమ-ఉజ్జీలుగా భావించి, పోటీ నుండాల్సిన చోట పోటీ.. స్నేహం ఉండాల్సిన చోట స్నేహం, హద్దు మీరే అవకశం కాదు కదా.. ఆలోచణ కూడా రానివ్వని అమ్మయినే. మీరట్టున్న మగవారికి “సాక్షి” ని నేను. కేవలం వంట విషయమే కాదు.. భార్య కెరీర్ తనదే అన్నట్టుగా ఉండే భర్తలను కూడా చూశాను. ఆనందించాను. అలాంటి వారిని గౌరవిస్తాను. కానీ అందరూ అలా ఉండరు కదండీ.. మన కోవకి రాని వారి కోసమే ఈ టపా!!

    వ్యాఖ్య పెద్దది అవుతున్నా.. ఇక్కడ మీకో విషయం చెప్పాలి: ఎంత కాదనుకున్నా మనది male dominated society. ఒక సారి క్లాసులో టీచర్, “honey bees” గురించి పాఠం చెప్తూ, bees అన్నింటికీ queen bee అధికారిణి. అలాగే మనషులకి కూడా ఉంటే బాగుంటుందా అని అడిగారు. అందరూ బాగుంటుంది అన్నారు. నాకు నచ్చలేదు. ఇద్దరమూ సరి సమానములనుకోవాలి గాని.. I rule over you అన్న ఫీల్ రానివ్వ కూడదు.. given power, women may as well exploit men అని చెప్పా!! సహజీవనమే నేనూ కోరుకునేది, ఇది ఒక సరదా టపా మాత్రమే. తొమ్మిదో తరగతి విషయాన్ని గుర్తుచేసారు మీ వ్యాఖ్యతో.

    Like

  11. ప్రవీణ్:
    🙂 Thanks!!

    కొత్త పాళీ వారికి:
    ట్విస్ట్ తలకెక్కినంతవరకూ నేను చెప్పదలచుకున్నది చెప్పాను అన్న తృప్తి నాది. ఇక క్రికెట్ట్ పోలికలంటారు.. మనలో చాలా మందికి ఆ ఆట మక్కువ ఎక్కువ కావున.. అందులో మగవారికి మరీను.. అందుకే ఉపయోగించా!!

    రానారే:
    ఇవాళ నాకు తగిలిన అతి పెద్ద రాయి మీదేనండి. కొట్టకుండానే కొట్టారు. 😉 ఈ feminism, chauvinism లాంటివేమీ నాకు అర్ధాలు కూడా తెలియవు. ఐతే మానితే humanism నేర్చుకోవాలని తాపత్రయం.

    బాబా:
    దిలీపుగారు అప్పుడే జైత్రయాత్ర మొదలయ్యిందన్నారు. వారినే సంప్రదించండి. 😉

    Like

  12. @ పూర్ణిమ

    నేనూ సరదాగానే రాసాను. 🙂 ఈ టపాలో వ్యాఖ్యలు ఈ టపాకి మాత్రమే. నేను సమాలోచన చేసే సహజీవనాన్నే కోరుకుంటాను. నా వ్యాఖ్యలు దాన్నే ధృవీకరిస్తాయి. మీ టపాని మీ ధృక్పథానికి నిదర్శనంగా నేను నమ్మకపోయినా, సోదాహరణంగా తెలియచేసే సమయం తీసుకున్నందుకు ముచ్చట కలిగింది.

    @బాబా గారు
    మనలో మన మాట. ఎప్పుడు కలుద్దాము? 🙂 ఎన్ని త్యాగాలు చేసినా ఏముందిలే మన పెళ్ళం కోసమే, మన కుటుంబం కోసమే కదా అని సరిపెట్టుకుంటే మనల్ని వీళ్ళు మరీ పట్టించుకోకపోవడమే కాదు కదా, జీవిత చరమాంకంలో మనం వెనక్కి తిరిగి చూసుకుంటే నాది… నాది మాత్రమే అనేది మనకి కనపడకుండా పోతుంది. 🙂 అందరు మన ఫుర్ణిమలాగ ఉండరు కాబట్టి మనం దీని గురించి తీవ్రంగా ఆలోచించాలని సభాముఖంగా తెలియ చేస్తున్నాను.

    Like

  13. Chaala baagundi…

    “సెహ్వాగ్ బంతిని కొట్టేంత గట్టిగా తగిలింది ఆ మాట నా మనసుకి”

    Like

  14. పూర్ణిమా,
    మీ టపా నిన్ననే చదివాను. లేఖిని డౌన్ అవడంతో కామెంట్ రాయలేదు. చివర్లో ఇచ్చిన ట్విస్ట్ కి పాపం జనాలు కకావికలై పోయారులా ఉందిగా! ఇంత మంచి టపా చదువుతూ ఉంటే మధ్యలో ఉదయ్ కిరణ్ పేడి డైలాగులేంటండి బాబూ?

    హాయ్ దిలీప్,
    నన్ను మీ అమ్మగారి తరంలో కలిపారా తీసుకెళ్ళి? కొంచెం ఇవతలికి తీసుకొచ్చి ఎట్ లీస్టు, మీ అక్కల పక్కనన్న కూచోనివ్వండి ప్లీజ్! మీరు ముప్ఫై కి చేరువలో ఉంటే మీ తరంలోనే కూచుంటా మరి!కాదనకూడదేం?

    Like

  15. ఆ తరమైనా, ఈ తరమైనా,ఏ తరమైనా, మగాళ్ల తీరు మారునా? (కొంతమంది మంచి బాలురు ఉన్నారులేండి)…

    బావుంది పూర్ణిమ. సూటిగా సుత్తిలేకుండా బుర్ర వాచిపోయేలా చెప్పారు. అదీ క్రికెట్ బంతితో…

    Like

  16. చివర్లో మంచి ఝలక్ ఇచ్చారు :).
    మీ మానేజ్‌మెంటు సూత్రము బాగుంది.

    Like

  17. @dileep: Thanks for understanding.

    @shankar: 🙂

    సుజాత గారు:
    మీరు చదవలేదేమో అని బెంగ పడ్డా.. 🙂 చదివారన్న మాట. ఇక ఉదయ్ కిరణ్ అంటారా.. నచ్చని వారు కూడా ఇంత ఇలా మెదడులో తిష్ట వేస్తారని ఉదయ్ వల్లే తెలిసింది. వద్దు మోర్రో అన్న మా వాళ్ళు ఆ సినిమా కి తీసుకెల్లి నరకం చూపించారు. అందుకే మర్చిపోలేను.

    జ్యోతి గారు:
    నిజం గానే సుత్తి అనిపించలేదా.. చాలా మంది బోరయ్యినట్టు ఉన్నారు. మెచ్చుకున్నందుకు ధన్యవాదాలు.

    @సిరిసిరి మువ్వ:
    🙂 నా మానేజ్ మెంట్ సూత్రం గురించి మాట్లాడింది మీరే మోదటగా!! థాంక్స్!!

    Like

  18. @పూర్ణిమ
    🙂
    @సుజాత గారు
    నా కన్నా ఒక అరతరం ముందున్నారు కాబట్టి మీరు అంతలా అడుగుతున్నారు కాబట్టి ఆలోచించి చెప్తానని చెప్పకుండా ఉండలేకపోతున్నాను 😉

    Like

  19. Dilip – ara taram ante emiti ? Sujata garu.. current taram lone unnaru.

    Purnima.. manchi paayintu teesaaru. MTech loo, MS loo chesi intlo koorchotaaniki prefer chese aada vaallanu choostanu. Kopam vastundi. pelli chesukuni family modalu petti, house wife gaa undaalani anukune vaalu asalu enduku aa courselu cheyyali? aa sthanam lo oka abbayi chaduvukune vaadu kada. ee Ladies ki Reservation vaste, maga pillala avakaasaaloo, seetloo kottese ammayilalo sagam mandi, pillalni kani, intlo koorchuntaaru. Idi oka chedu nijam. Asalu chaduvukunna vaallu tappakunda edo okati cheyyali. Pillalni penchadam manchi vishayame. Kani.. naku idi badha kaligistundi. Housewife gaa avvalanukunte, alanti manchi course lu enduku chadavatam?

    Purnima.. vantalu maga vaallu baaga chestaru anedi nijam. miru ee madhya bhale comedy gaa rastunnaru. ilane rayandi. Serious stuff ante visugu. (Nenu serious gaa tappa rayalenu…enta try chesina..) Sujata gariki kooda oka ‘Kudos’!

    Like

  20. @sujata,
    చదువు విషయంలో మీతో నేను ఏకీభవించనండి.చదువన్నది ఉద్యోగం కోసమే కాదు అని నా అభిప్రాయం.
    అసలు ఇప్పటి చదువులికి చేస్తున్న ఉద్యోగాలకి ఏమన్నా సంబంధం ఉంటుందా??అబ్బాయిలు మాత్రం ఎంతమంది M.S., M.Tech., M.B.A చదివి వ్యాపారాలలోకి వెళ్ళటంలేదు.అడ అయినా మగ అయినా ప్రతి వాళ్ళకి చదువు కావాలి.
    అయినా ఇప్పటి రోజులలో బాగా చదువుకుని ఇంట్లో కూర్చుంటున్న ఆడవాళ్ళు బాగా తక్కువేలేండి.

    @పూర్ణిమ,కామెంట్సుకి word verification అవసరమా!!తీసెయ్యి తల్లి.

    Like

  21. @ ఇంకో సుజాత గారు

    1980 నుండీ ప్రతీ పదేళ్ళకీ ఒక తరం అన్నట్టు మార్పులు వస్తున్నాయి. అందుకే సుజాత గారిని నాకన్న అర తరం ముందున్నారు అన్నది. 🙂

    Like

  22. ఇంకో సుజాత గారు,

    మీతో నేను ఏకీభవించట్లెదండి.చదువులు ఉద్యొగం కొసమే అన్న భ్రమ లొ వుండబట్టి మనం చదువుకున్న చదువులకు, ఏమాత్రం సంభందం లేని ఉద్యొగాలు చేస్తున్నాము. మీరు చెప్పిన చేదు నిజం లొ నాకు భాగం వుంది. నేను కుడ ఒక మంచి university లొ చదివి ఇప్పుడు ఇంట్లొ వుంటున్నాను. సుజాత గారు, ఆడదానికి ఆడదే శత్రువు అని ఎందుకండి మన పని మనం చెసుకొకుండ వేరె వాల్ల choice గురించి comment చేయడం. మీకు నచ్చక పోతే మీరు చెయకండి వేరె వాల్లు చేస్తున్నారు నాకు నచ్చదం లేదు అనడం బాగ లేదు. It is my choice to work or not to work. Please live and let us live with our choices.

    Like

  23. @sujata:

    మీ వ్యాఖ్య నాకు, నేను రాయబోయే “విషయాల గని” గా అనిపిస్తుంది. దిలీప్ “అరతరం” ఒక ఇంటెరెస్టింగ్ ప్రయోగం. ఇక అమ్మాయిలు ఉద్యోగం చెయ్యాలా వద్దా అన్నది పూర్తిగా వ్యక్తిగతం. ఓ మహిళ ఇంటికి దూరమై సమాజాన్ని ఉద్ధరించే కన్నా.. ఇంట ఉండి కుటుంబ సంరక్షణను తీసుకోవడం ద్వారా చాలా మంచిది, సమాజానికి. మరో విషయం, డిగ్రీలు జీవనోపాధి -ఇది ఆలోచించాల్సిన విషయమే. చదువన్నది ఆడా మగా తేడా లేకుండా ప్రతీ మనిషికీ అత్యవరసమైనది. Reservations ఇంకా పెద్దది. మీరు లేవదీసి పాయింట్ (aa sthanam lo oka abbayi chaduvukune vaadu kada.) ఇది ఒక మహిళా రిసెర్వేషణ్ ప్రాబ్లం కాదు. అన్నింటికీ వర్తిస్తుంది. I personally feel that Housewife is the most difficult role to fulfill. “నేనేమీ చేయను” అంటూ చాలా మంది తమను తాము పరిచయం చేసుకుంటారు. ఇక్కడ ఏమైనా చేయటం.. ఇంత ఇంకమ్ అని చూపించటం. అందుకే మీకు అలా అనిపిస్తుందేమో.. anyways, we’ll take up this topic elsewhere.

    ఈ టపా ముఖ్యోద్దేశ్యం మగవారి వంట ప్రావీణ్యం గురించి కాదండి, మారే సమాజిక మానిసిక అవసరాలనుగుణంగా మనల్ని మల్చుకోలేకపోతే కష్టం అని చెప్పడమే!! నా రచనలలో హాస్యం కన్నా వ్యంగ్యం ఎక్కువ. వారి మీద నాకు చాలా నమ్మకం అంటూ నమ్మించి, వారికంతగా మింగుడుపడని పని అప్పగించటం. మీరు సీరియస్ గా తప్ప రాయలేరేమో.. నేను కనీసం కామేడీ గా చెప్పలేను కూడా.. రాయటం అటునుంచి. సో.. నా మీద అలాంటి ఆశలు పెట్టుకోవద్దనే అభ్యర్ధన.

    నా టపా చదివి, ఒప్పిగ్గా ఇంత కమ్మెంట్ చేసినందుకు నెనర్లు.

    సిరిసిరిమువ్వ:
    తీసెయ్యమంటారా?? సరే.. తీసి చూస్తా!!

    స్నేహా:
    మీరు కేవలం సుజాత గారికే కమ్మెంట్ చేసినా .. నా టపాలో కాబట్టి ఓ విషయం చెప్పనా?
    నాకు సచిన్ టెండూల్కర్ అంటే చాలా ఇష్టం.. తనని ఎవరైనా ఎమైనా అంటే.. పిచ్చ కోపం వచ్చేది. ఒక సారి క్రికెట్ట్ లో మరో దిగ్గజం.. “సచిన్ భారత్ లో తప్పించి ఇంక ఎక్కడా బాగా ఆడడు” అని అన్నాడు. నాకు ఉక్క్రోషంతో పాటు ఏడుపు వచ్చినంత పని అయ్యింది.. సచిన్ అలా ఎలా అనగలరని. మర్నాడు సచిన్ ని ఇంటర్వ్యూ చేస్తూ ఎవరో దీని గురించి ప్రశ్నిస్తే.. “ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. వాటిని గౌరవించడమే నా పని. వారికా అభిప్రాయాలు ఎందుకు ఏర్పడ్డాయి, అవి సరైనవా, కావా ఇవ్వన్నీ ఆలోచించను”. అన్నాడు. అప్పటినుండీ నేనూ అదే సూత్రాన్ని పాటిస్తున్నాను.

    Everyone is entitled for an opinion. Know this and you’ll not allow someone else to “let u live with ur choices”. You make your choices and someone’s liking / disliking shdn’t bother you the least.

    Hope you’d take this postively.

    Like

  24. ఎట్లా… మగజనోధ్ధరణ వంటింటినుంచి మొదలుపెడతారా ఇదేదో కుట్రలో భాగంలావుంది. ఈ వివక్ష గురించి చెప్పాలంటే చాలావుంది ముఖ్యంగా Software companies లో dress code వుంటుందా అది కేవలం మగ వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. అమ్మాయిలు మాత్రం సీతాకోక చిలుకల్లా తయారై వస్తే అబ్బాయిలు మాత్రం నున్నగా దువ్వుకొని వీలైతే ఆముదం రాసుకొని అన్నమయ్య గెటప్ లో రావాలి అన్నట్లుంటాయి HR rules. దీనిమీద కూడా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా వుంది.

    చాలా బాగా రాశారు nice post.

    Like

  25. రెండు రోజుల్లో ఇరవై అయిదు కామెంట్స్–పూర్ణిమ గారు, మీ మీద నిజంగా నాకు యీర్షగా ఉంది 🙂

    వ్యంగ్యంగా రాసిన మీరు చెప్పినవి అక్షర సత్యాలండి. చివరికి వంట విషయం ప్రస్తావన తెచ్చి విషయాన్ని dilute చేసారు అనిపించింది. కాకపొతే మీరు అన్నట్టు వ్యంగ్యం కాబట్టి సరిపోయింది.

    ఉపమానాలు చాలా బావున్నాయి. “ఎదో ఆదివారం పూట……..” అక్కడ మాత్రం కొంచం బలవంతం చేసి cricket ఉపమానం ప్రయోగం చేసారు అనిపించింది-మిగితా వాటిలా natural flow కనపడలేదు.

    (చివరి మెలిక తప్పితే కథ మొత్తం నచ్చిందండీ—మొగ వాణ్ని కదా అందుకే మెలిక నచ్చలా 🙂 కథా పరంగా మాత్రం చిన్ని మెలిక పెట్టి కథ అదరకొట్టారు.)

    కథ ఆలోచనను ప్రేరేపించటానికి అనే అనుకుంటున్నాను. చదివి తమ అభిప్రాయాలు తెలియ చేసిన సహా పాఠకులు ఆలోచన చేసే వారే అని నా నమ్మకం. అటువంటి ఆలోచించే వారికి నా మిగితా వ్యాఖ్య. ముఖ్యంగా ఆలోచించే ప్రాక్టికల్ ఆడవారికి.

    చాలా మంది స్త్రీ పురుష సమానత్వం గురించి రాసారు. నా గురించి ఏమన్నా అనుకోండి—ఇక్కడ కొన్ని ప్రశ్నలు అడగదలిచాను.

    1. ఆడవారు తమ స్థాయి వారినే ఎందుకు చేసుకోరు? తమ కన్నా పై స్థాయి వారినే ఎందుకు చేసుకుంటారు? డబ్బులో కాని, చదువులో కాని, వయసులో కాని, సామాజిక స్థాయిలో కాని?

    ౨. తమ స్థాయి వారినే చేసుకున్న ఆడవారు ఎంత మంది నిజంగా ఈ “చిన్న-పెద్ద” అన్న బాధలు పడుతున్నారు?

    ౩. చాలా తక్కువగా ఉండే జంటలు కొన్ని ఉన్నాయి–అమ్మాయి పై స్థాయిలో ఉండి, అబ్బాయి తక్కువ స్థాయి లో ఉండేవి ఆ జంటలు–అలాంటి జంటలో అమ్మాయిలు తమ భర్తలను ఎంత గౌరవంగా చూస్తున్నారో అందరు మనస్సాక్షిగా చెప్పండి.

    ౪. సరే కుటుంబములో ఇద్దరు సమానమే అనుకుందాము-అటువంటప్పుడు ఇద్దరు ఒప్పుకోని, రాజి కుదరదని అనుకున్న సందర్భాలలో ఏమి చేయాలి?

    ౫. ఇంటికి/సంసారానికి ఒక “పెద్ద/decision making person ఉండాలా వద్దా”? ఇప్పటికీ తమ కన్నా పై స్థాయిలో ఉండే వారినే చేసుకొనే అమ్మాయిలు ఉన్న ఇప్పటి పరిస్థితులలో మరి ఆ భాద్యత అమ్మాయిలకు ఎలా ఇస్తారు అబ్బాయిలు?

    అమ్మ, అయ్య, సామాజిక పరిస్థితులు, తన కోరికలు, భార్య కోరికలు ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని సంసారం నడపాల్సిన పరిస్థితులలో ఉన్నాడు నేటి భర్త. its quite difficult to do this balancing act. అది నేటి భార్యలు గుర్తు పెట్టుకోవాలి.

    భర్త కూడా ఒక మామూలు మనిషే. ఒక మనిషిగా తన కంటే తక్కువ స్థాయిలో (చదువు etc etc) ఉన్న భార్యకు పూర్తి సమానత్వం ఇవ్వటం practical గా కుదరని పని. అందుకని నిజంగా సమానత్వం కావాలంటారా “అన్ని విషయాలలోనూ తమ స్థాయి వారిని/లేదా కొంచం కింద స్థాయి వాడిని చేసుకోవటం మంచిది అప్పుడు తప్పక ఆశించవచ్చు సమానత్వం “

    నేను చాల పెద్ద వ్యాఖ్యనే రాసాను. సంసారం మొదలెట్టి మూడు వసంతాలైనా నాకు తీరని అనుమానాలు కొన్ని. మిగితా వారి అభిప్రాయం తెలుసుకోటానికి అనువైన సందర్భంగా తోచి ఇక్కడ రాస్తున్నాను.

    Like

  26. @indianminerva:

    అయ్యయ్యో.. ఒక మంచి సమస్యను మిస్స్ అయ్యిపోయానే నా వ్యాసంలో.. ఇది తట్టనే లేదు. ఎలాగయితే.. దీని మీద కూడా యుద్ధం ప్రకటిద్దురు.. ముందు వంట గెలవండి 😉

    Thanks for reading and posting such a lovely comment.

    అయ్యా భావకుడన్ గారు:

    పాతిక కమ్మెంట్లు వచ్చినా (మొట్టమొదటి సారి అండోయ్), మీకోసమే ఎదురుచూపు.. ఇంకా వ్యాఖ్యాన్నించలేదే అని. అప్పుడే ఈర్షలు దాకా వద్దులేండీ.. అందుకు నేనింకా చాలా మెట్లు ఎక్కాలి.

    అసలు ఇది ఎలా రాసానో చెప్పక తప్పట్లేదు.. నేను బాలికల పాఠశాలలో చదువుకున్నాను. చుట్టాలందరూ చాలా దూరంలో ఉన్నారు. రాకపోకలు అంతగా లేవు. మా చుట్టు పక్కల నా వయస్సు అబ్బాయిలు ఎవరూ లేరూ.. అయితే మరీ పెద్ద, లేకపోతే మరీ చిన్న. అందుకే నాకు అబ్బాయిల గురించి అంతగా తెలియదు పదోతరగతి వరకూ. స్కూల్ నుండి బయటకు వచ్చాక అబ్బాయిలను తెలుసుకోవటం ప్రారంభించాను. వారిని గురించిన ప్రతీ విషయం నాకు ఆశ్చర్యం కలిగించేవి. పరిచయమైన వారినుండి జీవితాన్ని నేర్చుకున్నాను. కొందరు స్నేహితులైతే, మరికొందరు ఆప్తులుగా మిగిలారు.

    వ్యాసంలో ఇచ్చిన మూడు ఉదాహరణలు నిజంగా జరిగినవే.. అలా అనిపించకపోతే.. నాకు రాయటం చేతకాలేదనే అర్ధం. ఒకసారి మా ఇంటికి వచ్చిన అన్నయ్య (పెద్దనాన్నగారి అబ్బాయి) “మగవారు-వంట” అన్న విషయమై అనర్గళంగా ఉపన్యసిస్తుంటే.. ఇక్కడ ఇచ్చిన జెర్క్ అక్కడ ఇచ్చా. వెంటనే టాపిక్ divert అయ్యింది. వ్యాసం మొత్తంలో కాల్పనికం ఏదైనా ఉంటే అది నేను పెడతానన్న సంస్థ మాత్రమే.

    మారుతున్న కాలం ప్రకారం మారక, ఇది ఇంతే అని మొండిగా ప్రవర్తించే వారికే ఇందులోని వ్యంగ్యమైనా, జెర్కులైనా.. దీన్ని కథ అని అనలేను కాని, ఆలోచింపచేయటానికే..రాసాను. నా మిడిమిడి జ్ఞానంతో కొద్దీ మీ ప్రశ్నలకు జవాబులు:

    ౧. అది అందరకీ వర్తించదు. కనీసం నేనలా ఆలోచించను. అలా ఆలోచించే మగవారిని మాత్రం చూసానని చెప్పగలను.
    ౨. అలా బాధపడే వారి సంఖ్య తగ్గుతున్నా.. ఇంకా చాలానే మంది, పురుషాధిక్యతకు గురవుతున్నారు.
    ౩. ఈ విషయంలో మీతో ఏకీభవిస్తున్నాను. కానీ అందిరినీ కలపలేము. “అభిమాన్” సినిమా చూసారా, అమితాబ్, జయ బచ్చన్ లది??
    ౪. ఎమో.. ఆలోచిస్తున్నా..
    ౫ మంచి ప్రశ్న.. దీనికి వెత్తుక్కోవాలి నేను.

    మీరన్న భార్య కథే నేను రాసానేమో .. ఒక సారి చదవండి నా కొత్త టపా. మీ ప్రశ్నలకి experienced ఎలా స్పందిస్తారో ఎదురుచూద్దాం.

    Thanks a ton for such a long comment. That’s surely got to trouble all the visitors.

    పూర్ణిమ.

    Like

  27. @ bhaavakuDaN:

    By the way, I admire your honesty..

    చివరి మెలిక తప్పితే కథ మొత్తం నచ్చిందండీ—మొగ వాణ్ని కదా అందుకే మెలిక నచ్చలా

    Like

  28. @పూర్ణిమ:
    అన్యాయమండి.టపా అంతా చదువుతూ మబ్బుల్లో తేలిపోతున్న నాకు చివరి పేరాతో ఎవరో జెల్ల కొట్టి కిందకి దించినట్టైంది. కానీ మీరన్నది కరక్టే. అబ్బాయిల నుంచి ఉద్యోగం ఎలా expect చేస్తారో అమ్మాయిల నుంచి వంట కూడా అలాగే expect చేస్తారు.
    విచిత్రం ఏమిటంటే నేను వంట చేస్తానంటే మా అమ్మ గారు కూడా గుండెలు బాదుకుంటారు.
    @indianminerva:
    మంచి పాయింటు చెప్పారు. గడ్డం గీసుకుని,టక్ చేసుకుని, షూస్ వేస్కుని మళ్ళీ స్కూల్ కి వెళ్ళినట్టు అబ్బాయిలు వెళుతుంటే, అమ్మాయిలు మాత్రం… తలుచుకుంటే ఉక్రోషం వచ్చేస్తోంది. నా తరువాత టపా ఈ టాపిక్ మీదే!
    @భావుకుడన్:
    మంచి ప్రశ్నలు లేవనెత్తారండీ. అసలు మగాడి వయసు, హోదా ఎక్కు వగా ఉండటమే అతడి అజమాయిషీ కి కారణమేమో!

    Like

  29. సందీప్:

    మీరంతా ఒక్కొక్కరే వచ్చి మోసం చెశావు, ఇంత అన్యాయమా? అంటుంటే.. మనసు చివ్వుక్కుమంటుంది. 😦 కష్టపెడుతున్నానే అన్న ఫీలింగ్ ఎక్కువవుతుంది. వంట రాని, వంట చేయని మగవారు కూడా మంచివారే. ఎట్టొచ్చీ వంటని అండినవారిని హేళన చేసేవారి మీదే ఈ సటైరు.

    వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు.

    Like

  30. వంట చెయ్యటం నిత్యజీవితావసరం.తర్వాత ఎవరు చేస్తున్నారు అన్నది.ఎన్ని అభ్యుదయభావాలు ఒలకబోసే ఇళ్ళలోనైనా సాధారణంగా వంట ఆడవారిదే.కొన్ని మినహాయింపులుండొచ్చు గాక.
    వంట చెయ్యటం ఒక కళగా,కుటుంబం లోని వారి ఆరోగ్యానికి,సరిపడ్డట్టు వండి వార్చటం అభ్యాసం యధాలాపంగా చేసుకున్నవారందరూ మహిళలే,అందులో అందులో అధికభాగం అమ్మలే.
    కమ్మగా అమ్మలు,అక్కలు,భార్యవండి పెట్టింది కడుపునిండా తినటం అత్యంతగొప్పభాగ్యం నాదృష్టిలో.అలాంటి వంట అన్నలూ,నాన్నలూ కూడా చేస్తె మరీఘనం కాదా.కానీ చెయ్యరు,ఎవరో ఎందుకు ఇంట్లొ ఆడవాళ్ళు చెయ్యనివ్వరు.కొన్ని కొంపల్లో కొందరు దరిద్రులుంటారు.వీళ్ళ వరస ఎలాఉంటుందంటే వీళ్లు శుభ్రంగా తినిచావరు,ఎవరన్నా చక్కగా తిన్నా ఈమందకు కడుపునొప్పి వచ్చిచచ్చినంత పనౌతుంది.ఇక ఆయింటికి వచ్చిన కొత్తకోడలు వంట బాగా చేసినా,కొత్త అల్లుడు రెండు ముద్దలు ఎక్కువ తిన్నా..ఎలక మీదా పిల్లి మీదా పెట్టి ఒకటే సాధింపులు,వీలుంటే కొత్తకోడలని చూడక కాస్త చెయ్యివిదిలింపులూ ఉంటాయి,దానికి తోడు మా యిల్లు గుండం చేస్తుందన్నశోకాలు ఎటూ తప్పవు.
    నావరకు వస్తే,ఎవరు పెట్టినా కడుపునిండా తింటా,నాతిండి చూసి పెళ్ళైన కొత్తలో తనకు వంట బాగా వచ్చనే అనుకుంది(ఈమాటమాత్రం ఎవరితో అనకండి).నచ్చితే ధారాళం గా పొగుడుతా,నచ్చకపోతే,మీరు ఈసారి ఫలానా వంటకం చెసేటప్పుడు నన్ను పిలవండి,ఇంకాస్త బాగా ఔట్ పుట్ వచ్చేట్టు చేద్దామనిచెప్తా.చిన్నప్పుడు మాఇంట్లో వంటకు సాయం చేసాను,ఇప్పుడు సాయమే కాక వీలున్నప్పుడల్లా వంట కూడా నేనే చేస్తా,
    ఒక మనవి వంట మెచ్చుకునే ఒక్క విషయం మీద ఆధారపడి సదరు వ్యక్తులను అంచనా కట్టటం అంత సబబు కాదని నా అభిప్రాయం.

    Like

  31. మగవాళ్ళేం అన్యాయం చేసారండీ మరీ ఇంతలా తీసి పారేసారు. రాసిన శైలిని మెచ్చుకోకుండా ఉండలేను, భావాన్ని అంగీకరించలేను. ఏం చెయ్యమంటారు?
    http://muralidharnamala.wordpress.com/

    Like

  32. Guys generally feel that tears are a sign of weakness. How can it be considered a sign of weakness? Even Vivekananda was not lame to tears and if these guys think they are a match to that great persona, wow, man! I wish I can find one like that! Yeah, the example you portrayed was a little too simple, but then, girls generally are overtly sensitive to a lot of issues. For, it is girls who have to move in the society of girls and for girls, the dress they wear, the nail polish they wear, the lipstick they wear, the accessories they use, their stature, all these matter. And it is usual for girls to feel the pressure of someone else’s looks. There are only two ways to survive this and one way is to care a damn about all those people and the other way is to follow the crowd. Unfortunately, majority choose to follow the pack. But guys, they move in circles, where relations are less complex. Where a hi, means a hi… not, hi – Wow, look at you. Don’t you look stunning. Oh, is he your fiancée or your hubby or your boyfriend, wow, he looks stunning. Could I borrow him for a second, so I can know him better? After all, we are good friends, and if we see each other as much as we have seen each other thus far, it is only understandable that I need to know him! Phew! Let a guy handle that! And yeah, if we cannot withstand these societal pressures that demand us to be on nerves, we cry at times.

    We go to hotels to get a break from our routine. And yes, we eat the food made by a guy. Will the chef go home and prepare a luncheon for his better half? Let me take a wild guess, NO! Not in a million years. He would be so tired of cooking that he dreads to enter the kitchen in his own house. And nine out of ten, those guys don’t even know where sugar is in the house. That is a fact. And why we name Nala/Bhima, is because that was a time where girls stuck to the house and not roam around in public, advertising their ability to make a feast for thousands of people. They preferred the satisfaction of their husbands and the relatives who come to their house. And probably because, a guy entering the kingdom of a female was considered a “macho” enough feat for them to advertise, who knows?

    Assuming that guys are Ok with illiterate or semi literate girls, which would be a grave assumption, I wonder how they would survive the life span of a relation that is intellectually challenging. I do not intend to say that the people who are not literate cannot be intellectual, but seven out of ten cases, they will have little or no knowledge of their counterparts fields and thereby can be challenging. Yes, we might not want to walk back home and discuss the dreaded office work, but sometimes, when we move in the spheres of people with LIKE knowledge, we would appreciate if our counterparts were able to contribute to the discussions, not being mute spectators. And as girls, we might be OK with it. But, guys, with their egos, cannot! As simple as that. So, the next time someone says, girls are just a shadow of their parents or better halves and need not work for their respect, wonder if they would think for a moment and comment on that. They want an educated, literate wife, so that she can look after their kids, tutor them. She can do his household things, like going to the bank, transacting on the internet, knowing what messages to leave on the phone, etc. She can be his loving trophy, that can be advertised as a macho pride among his peers. And she is an object to of jealousy among his successors.

    But, yes, with the challenges that the female counterparts are throwing at their guys, may be they would require a rights association. But that is still a long way to go! With the society now moving to a common balance, where they are willing to think a little openly about issues, I think we are safe for now from the guys cry for help ;). Guys have moved to a common base of assisting their counter parts in day-to-day chores, albeit slowly. But the gender discrimination in offices, wonder when there will be an end to it. :O…

    Interesting post and fundamentally feminist post ;). Good job! Why I say that it is a feminist speech is that, I kind of feel a little sarcasm underlying the so called chauvinist society. Like a question hovering over their macho-power.

    Like

  33. Mahi: Name me, Tag me or Label me! I’m still what I’m 🙂 And I know what I want to get and how to get. Can’t help it. 😉

    Like

Leave a comment