I’m very sorry.. అన్నా వందో సారి….

Posted by

సరదాగా మన్నించేయ్ ఒక సారి అని బ్లాగ్లోకానికి నా క్షమాపణలు పాట పాడి చెప్పగలను.. కానీ భయంకరంగా జలుబు చేసింది. అసలే అంతంత మాత్రం స్వరం.. ఇక ఈ పరిస్థితుల్లో పాడితే ఇక అంతే సంగతులు.

క్రికెట్ట్ సీరీస్ ఓడిపోయాకా మన వాళ్ళు వచ్చి చెప్పే సాకుల్లా చెప్పవచ్చు.. కానీ క్రికెట్ట్ ఇష్టం లేని వారికి తలకెక్కదు. పంచుకుంటే తలనొప్పి తగ్గిపోతుందని నాకెవ్వరూ చెప్పలేదు..

చేజేతులారా ఉన్న సీట్లను అందరికీ పంచేసిన కే.సీ.ఆర్ లా నేనూ రాజీనామా చేస్తున్నానంటూ బెదిరించవచ్చు.. కానీ నన్నెవరూ ఆపకపోతే.. “పోతే .. ఫో” అనేస్తా.. అమ్మో.. నేను ఈ లోకాన్ని వదలేను.

“పెంచాల్సినవన్నీ పెంచేసి” మన్మోహన్ సింగ్ లా ఆపద్ధ్రర్మం అని ప్రెస్ మీట్ పెట్టచ్చు.. కానీ రాజకీయనేతల్లా నేనూ వోట్ల కోసం.. అదే వ్యాఖ్యల కోసం చేస్తున్నానని అనుకుంటే మరీ కష్టం.

అందుకే ఎప్పటిలాగానే నా సోది మొదలుపెట్టేస్తాను..

ఇవాళ పొద్దున్న నాకొచ్చిన వ్యాఖ్యలకు సమాధానం ఇస్తూ.. నేనసలు చదివిన పుస్తకాల గురించి నాకు నచ్చినవి రాస్తున్నానే కానీ.. ఆ పుస్తకాన్నిలో తప్పొప్పులు రాయటం లేదు.. రాయాలనీ లేదు. అందుకనీ ఆ టపాలకు తోకలు అనగా “లేబెల్స్” మారుద్దామని ప్రత్నించా. అప్పటికే ఉన్నవాటిని ఎలా మార్చాలో తెలియకపోవడంతో కొత్తవాటిని రాసి అతికించా. బానే అత్తుకున్నాయ్ తోకలు.. కానీ “కొత్తగా తోకలొచ్చెనే” అని పాడుకుంటూ నా టపాలన్నీ కూడలిలో పునఃప్రత్యక్షమైనాయి. చూసి మనసు చివ్వుకుమ్మంది. నాకే కష్టం గా ఉంటే ఇక చూసేవారికి.. ఎలా ఉంటుందో??!! అందుకే ఈ టపా.. మన్నించండి.. ఉద్ధేశ్య పూర్వకంగా జరిగింది కాదు. ఇలా జరుగుతుందని తెలిస్తే.. రోజుకో టపాను మారుస్తాను..నేనూ బంగారు బాతు కథ విని నీతిని అర్ధం చేసుకున్నాను. 😉

On a serious note, my sincere apologies to one and all!!

4 comments

  1. పాత labels delete చెయ్యవచ్చు. మార్చ వచ్చు. కొత్త తోకలు తగిలించి, publish కాకుండా, save చేసే సదుపాయం WordPress లో వుంది. బ్లాగ్‌స్పాట్ లో ఐతే, feed disable చేసి, publish చేసి, ఒక రోజు తరువాత (తేదీ మారాక, కనీసం మూడు గంటలు తరువాత) rss feed enable చేస్తే, మరలా కూడలి లో రాకుండా నివారించ వచ్చనిపిస్తోంది.

    Like

  2. నేనూ నిన్న కూడలి లో వరసాగ్గా ఉన్నా మీ పాత టపాలను చూసి అదే అనుకున్నాను, అన్నీ చదివినవే కదా అని! మీది పొరపాటు అనుకోండి, కానీ చాలా మంది ఇంతకు ముందు చదివిన పోస్టుల్నే మళ్ళీ మళ్ళీ కూడలి మొదటి పేజీలో పెట్టేస్తున్నారు, ఎందుకంటారు? ఇంకా మరికొంత మంది చదవి ఉండకపోతే చదవాలనా, లేక మరి కొన్ని కామెంట్స్ కోసమా , ఏంటి సంగతసలు?

    Like

  3. ఏమో సుజాత గారు.. అంతా ఇందుకే చేస్తున్నారని సామూహికంగా చెప్పలేను గాని.. అడపాదడపా కొన్ని పాత టపాలు ముందుకొస్తే లాభమే కానీ నష్టమేమీ లేదనిపిస్తుంది నాకు. చదివినదే అయ్యితే ఒక క్లిక్ నష్టం… చదివకపోతే ఓ మహదావకాశం. పైగా వచ్చిన వ్యాఖ్యలను బట్టి టపాలను సరిచేసే అలవాటున్న నాలాంటి వారికి ఇది ఉపయోగపడుతుంది అని నమ్మకం.

    ఇక వ్యాఖ్యలంటారా?? అవి మనం రావాలనుకుంటే రావు.. అవతలి వారు స్పందించగలిగితేనే వస్తుంది. నా టపాలన్నింటిలోనూ నేను ఇష్టపడిన వాటికి తక్కువగా వ్యాఖ్యలొచ్చాయి. మరి కొన్నింటికి ఊహాతీతం గా వచ్చాయి.. వాటిని చూసి.. ఏం రాసానబ్బా అనుకుంటూ ఉంటా!! Blog is just a personal expression.. as long as you are happy with the expression, nothing else should bother you అన్నది నా నమ్మకం.

    Like

  4. రెండు మూడు సార్లు నా విషయంలోనూ ఇలాగే జరిగింది. అప్పుడప్పుడూ తరువాత గమనించిన అచ్చుతప్పుల్ని సర్జేసి, publish చేస్తే అవి మళ్ళీ కూడలి లో కనపడేవి.అది సహజమైన programming పంధానే అని సరిపెట్టుకున్నా.

    మీకు లాగే నాకూ ఈ అపోహల సమస్య వచ్చేట్టుంది. వీవెన్ గారు నా బ్లాగును “సినిమా” కేటగరీలో చేర్చారట. ఇప్పుడు నేను వివిధ విషయాల గురించి రాస్తున్నాను, అవి కాస్తా సినిమాల కేటగరీలో కనిపించి confusion అవుతున్నాయని ’లేబుల్స్’ మార్చమన్నారు. బహుశా ఈ వారాంతరంలో ఆపని చేస్తానేమో!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s