శ్రీవారే బదులిస్తే..

Posted by

(ఈ టపా చదివేముందు… “శ్రీ వారికి ప్రేమలేఖ” చదివారో లేదో చూడండి. )

ఎటూ నువ్వు లేవు కదా అని చాలా సేపు స్నేహితులతో గడిపి, ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఇళ్ళంతా చీకటిగా ఉంది. ఒక లైట్ వేశాను.. చీకటిగానే ఉంది. అన్నీ లైటులూ వేసాను.. చీకటి పెరుగుతూనే ఉంది. ఇంకా చెప్పాలా, ఈ ఇంటికి, నా కంటికి వెలుగు నువ్వేనని?? I miss you అనీ!!

నీలా నవ్వు, పువ్వు అంటూ కవితలు రాయలేను. ఇలా లైట్ల సాయంతో నా పాట్లు చెప్పుకోవడమే తప్ప!! నీతో గలగలా మాట్లాడే ఆ మనీ ప్లాంట్ నాకన్నా వాడిపోయిన మొహం వేసుకుని కూర్చుంది. దానికోసమైనా తిరిగి వచ్చేయ్!! కాండిల్ వెలుగులో నువ్వు రాసిన ఉత్తరాన్ని మళ్ళీ చదువుతున్నాను.. ఇప్పటికి ఎన్ని సార్లు చదివాననీ.. నిజం చెప్పు.. నీ మనసుని ఈ అక్షరాలుగా disguise చేయడానికి ఏదో మంత్రం వేశావు కదూ?? మానవమాత్రులు ఇలా రాయలేరు కదూ??

మేము business mailsకి in-line replies పంపిస్తూ ఉంటాంరా… అవతలి వారు రాసినదాన్ని భాగాలుగా చేసి వాటి మధ్యనే మేము చెప్పదలచుకున్నది రాస్తాము. చదివే వారికి ఇరువురి అభిప్రాయాలు ఒక్కదగ్గరే ఉంటాయి. అలా నీ ఉత్తరంలోని ప్రతీ లైన్ కి నా మనసు స్పందించిన విధానం రాసి, దానినో ప్రేమ ప్రబంధ కావ్యం గా మార్చాలనిపిస్తుంది. కానీ నాకంత భాషా పరిజ్ఞానం లేదు. 😦 ఒక వేళ ఉన్నా రాయనేమో.. నా ప్రతీ ఊహనీ నాకన్నా ముందే చదివేసే నువ్వుండగా.. ఇలా కలం కాగితంతో తిప్పలు నాకెందుకు??

“అబ్బా.. చెప్పొచ్చారులే.. ఓ నాలుగు ముక్కలు రాయాలంటేనే బద్ధకం మీకు..” అని దెప్పుతావా?? నీ ఇష్టం.. నువ్వేదన్నా నాకిష్టం. తిలక్ కీ తిక్కన్నకీ తేడా తెలియదని నువ్వు నన్ను ఉడికించినట్టే.. Super genius, Vishwanathan Anand ని కూడా వాళ్ళావిడ “మొద్దూ..” అంటుందట.. సాల్సా నేర్చుకునేటప్పుడు అడుగులు తడబడితే!! మీకేం??.. పాదాలతోనైనా.. పదాలతోనైనా.. నాట్యం చేస్తారు, చేయిస్తారు. మాకది రాదే!! :-(( ఒక సారి నన్నూ “మొద్దూ” అని ముద్దుగా పిలవకూడదూ.. కారణం కావాలా??.. ఈ లేఖ మొదట్లో నిన్ను సంభోదించలేదని గేళి చేయి.. అప్పుడు నేనూ చెప్తాను.. నీ పేరుతో ఉత్తరం మొదలెట్టాల్సి వస్తే.. చివరి దాకా నీ పేరే ఉంటుందని, మధ్యన ఇంకో పదానికి ఆస్కారం ఇవ్వదు నా మనసని.

ఏంటీ?? నేనేనా రాస్తుంది?? స్ఫోర్ట్స్ కాలమ్స్ లో కూడా ప్రేమే కనిపిస్తుంది. నన్ను అంతగా మార్చేసావు నువ్వు. నన్ను నాకే కొత్తగా పరిచయం చేస్తావు ప్రతీ సారి.. నీ చెలం, నీ గీతాంజలి, నీ నాయుడు బావ వీళ్ళెవరినీ నేనెరుగను.. కానీ నాకు తెలిసిన Ayn Rand ఏమంటుందో చెప్పనా?? To say “I love you” one must first be able to say the “I” అని. “I” ని నీ వల్లే తెలుసుకున్నాను.. ఇక Love you……….. అని చెప్పకుండా ఉండగలనా??

ఇక నా practicality గురించి.. హమ్మ్.. నిజమే.. నేను చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తాను. ప్రతీ సమస్యకూ ఒక రియలిస్టిక్ సమాధానం ఉందని నమ్ముతాను. అందుకే తొలి నాళ్ళల్లో మన మధ్య దూరాన్ని ఒక ప్రాక్టికల్ ప్రశ్నతోనే దూరం చేశాను.. ఇంకెవరినైనా పెళ్ళి చేసుకుంటావా అని?? నాతో నువ్వు సంతోషంగా లేనప్పుడు నేనెంత ప్రేమించినా లాభం లేదు కదా?? నువ్వు చుర..చురా చూసినా.. అమితానందం.. నన్ను కోరుకుంటునావని భోధపడ్డాక!! ఈ జన్మే కాదు రా.. నేను కోరుకుంటున్నట్టు ఏడు జన్మల వరకూ నువ్వే నాక్కావాలి. ఆ “రాజేష్” కి నీకిష్టమైన రాజేష్ ఖన్నాసినిమా సీడీలివ్వు.. ఇప్పటినుండే అలవాటు పడతాడు జీవితం ఇంతే అని!!

నవ్వకు.. నేనే వాడి పేరు చెప్పాక.. నువ్వు నవ్వితే నాకస్సలు నచ్చదు. నిజం చెప్పనా.. నువ్వు లేకపోతే నాకు భయం!! అంత ఆశ్చర్యంగా చూస్తావే.. మాకూ భయాలుంటాయి.. చెప్పమంతే!! చిన్నప్పుడు స్కూల్లోనూ, కాలేజీలోనూ అంతా మాథ్స్ కి భయపడుతుంటే.. పిచ్చి వాళ్ళు అనుకునే వాణ్ణి. లెక్కలంటే నాకు భయం లేదు కానీ అమ్మ పెట్టే మెలికల ముగ్గు అంటే భయం నాకు. అమ్మ పెట్టేటప్పుడు శ్రద్ధగా చూసేవాణ్ణి.. అది నాకు జీవితంలా అనిపిస్తుంది. ఎక్కడ మొదలువుతుందో అక్కడికే వచ్చి చేరాలి. మధ్యలో ఎన్నెన్నో మలుపులు… కొన్ని ఊహించినవీ, కొన్ని నమ్మలేనివీ!! తీరాన్ని వదిలేసి.. జీవన సముద్రంపై ప్రయాణం సాగించి మళ్ళా అదే తీరానికి రావాలి. ఏమాత్రం అటూ ఇటూ అయినా.. ఇక గమ్యం చేరే ప్రశక్తే లేదు. ఎవరికీ తెలియకుండా ఓ కాగితం మీద ప్రాక్టీసు చేసేవాణ్ణి.. వచ్చేది కాదు. ఓడిపోతున్నానని బాధ. అమ్మ మాత్రం చక చకా వేసేసేది. అమ్మ ఉంది కదా అని ధీమా, నన్ను నడిపిస్తుందని.

నువ్వు నా చిటికెన వేలు పట్టుకుని, చాలదనట్టు ఇంకో చేతితో నా అదే చేయి పట్టుకుని నా భుజం పై తల వాల్చి నడుస్తుంటే.. ఆ మెలికల ముగ్గును, జీవితాన్ని జయిస్తాననే ధైర్యం వస్తుంది. ఏడడుగుల మీదే కాదు ఏడు జన్మలపైనా నమ్మకం కుదురుతుంది.

ఇన్నాళ్ళూ నువ్వలా నన్ను పట్టుకునేది నీ భయం పోగొట్టుకోడానికి కదూ.. అలా పట్టుకుని నా భయం పోగుడుతున్నావని నీకు తెలియదు కదూ.. కవులు “మనసున మనసై” అంటారే.. అది ఇదే!!

ఇంకో విషయం.. నేను వచ్చే వారం ఎక్కడికీ వెళ్ళడం లేదు. ఆ వేరే ప్రాంతంలో ఉన్నవాడికి ట్రేనింగ్ ఇవ్వాలి కదా.. దానికి ఒక అప్లికేషన్ ఉపయోగిస్తాము… అప్పుడు వాడు నేను నా పి.సి.లో ఏమి చేస్తున్నానో పూర్తిగా చూడగలడు. అలా చూపిస్తూ ఫోన్ లోనే ట్రేనింగ్ కానిచ్చేస్తా అని బాస్ ని ఒప్పించా!!

ఆగాగు…నిదానంగా గమనిస్తే మన ఉత్తరాల రాయబారం కూడా ఆ ఆప్లికేషన్ లా ఉంది కదూ. నువ్వుక్కిడ లేకపోయినా నువ్వున్నట్టు ఊహించుకుని రాయడం.. నాలోనే ఉన్నావన్న నమ్మకాన్ని గెలిపిస్తుంది. ఉత్తరంలో ఉన్నది ఒక మనసే అయ్యినా.. full conversation లా ఎందుకనిపిస్తుంది?? ఏమో?? నీకు తెలుసా??

ఇప్పటికే గెడ్డం పెరిగి, అది మాసి.. గీతాంజలిలో నాగార్జునలా ఉన్నాను. నువ్వింకా ఆలస్యం చేస్తే.. ఆఫీసువాళ్ళు firing letter తో పాటు ఓ షాలు, బాటిలూ ఇస్తారు. ఏ రంగు తీసుకోనో చెప్పడానికైనా త్వరాగా వచ్చేయ్!! రాస్తూ ఉంటే ఆగేటట్టు లేదు.. ఇక ఆగక తప్పదు..

నీ,
ముద్దోచ్చే.. మొద్దబ్బాయి

******************************************************************************************************

“నువ్వు అడిగింది ఏనాడైనా కాదన్నానా.. నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా” అంటూ పాటలు పాడి మరీ నా చుట్టూ sincere తిరిగే నా మనసు.. నిషీ ప్రేమలేఖ చదివిన దగ్గరనుండీ ఓ full u turn కొట్టి “ఛాస్.. ఈ పిల్లెవరో చిత్తగొట్టేసింది. నాకే ఈ ప్రేమలేఖ వచ్చి ఉంటే..” అని తెగ మెలికలు తిరిగిపోతుంది. దాని నస భరించలేక.. లీవైస్ లో కొన్న పాంటూ చొక్కా దానికి తొడిగి, రీబాక్ షూస్ తగిలించి.. ఇక నీ ఇష్టం అని వదిలేస్తే.. ఇదో ఈ టపా అయ్యి కూర్చుంది.

పుస్తకాలనీ, సినిమాలనీ, విజయాలనీ అంకితం ఇస్తారే.. అలా అనుభూతుల్ని కూడా అంకితమంటూ ఇవ్వగలిగితే.. అది ఇద్దరికి ఇవ్వాలి.. ఒకరు నిషీ.. మరొకరు ప్రవీణ్. ఒకరు ఇంత అందాన్ని ఆవిష్కరిస్తే.. మరొకరు ఆ అందాన్ని అందరికీ అందేలా చేసారు. తెలుగు బ్లాగు పుస్తకం చదవకపోయుంటే.. ఇంత అందమైన అనుభవం పూర్తిగా కోల్పోయేదాన్ని!!

37 comments

 1. మీరూ చితక్కొట్టేసారు.మావారు నాకు ఈ ప్రేమ లేఖ రాసుంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది.చుక్కల ముగ్గుతో జీవితాన్ని నిర్వచించేసారు.సూపర్బ్.

  Like

 2. Mee post chudakapothe bahusha nenu meeru baduluga rasina adbhuthamaina post ni miss ayyedanni.Anubhutulanu padaluga,vakyaluga entho andamga malicharu….anubhuthi entha andamga vuntundo anthaga bagundi mee Shrivare Badulisthe…

  Like

 3. hi purnima garu.meeru ruturagalu song kavali annaru kada.andulo konni lines matrame gurtunnavi rasanu…meeku pampiddamanukune sariki srikanth gari blog chusanu.andulo tanu e song rasaru.so manamiddaram lucky.pata dorikindi.meeku pampistunnanu.
  ……………………..
  సంగీతం : బంటి, రమేష్
  సాహిత్యం : బలపద్ర పాత్రుని మధు
  గానం : సునీత, బంటి.

  వాసంత సమీరం లా
  నునువెచ్చని గ్రీష్మం లా
  సారంగ సరాగం లా
  అరవిచ్చిన లాస్యం లా

  ఒక శ్రావణ మేఘం లా
  ఒక శ్రావణ మేఘం లా
  శరత్చంద్రికల కల లా..

  హేమంత తుషారం లా
  నవ శిశిర తరంగం లా
  కాలం.. జాలం.. లయలొ కలల అలల సవ్వడి లొ
  కాలం.. జాలం.. లయలొ కలల అలల సవ్వడి లో
  సాగే జీవన గానం అణువణువున ఋతురాగం
  సాగే జీవన గానం అణువణువున ఋతురాగం

  వాసంత సమీరం లా
  నునువెచ్చని గ్రీష్మం లా
  సారంగ సరాగం లా
  అరవిచ్చిన లాస్యం లా.

  Like

 4. బావుంది మీ బదులు.మీ మనసెప్పుడూ భావుకత్వంతో పొంగి పొరలతూ వుంటుందనుకుంటా.. 🙂

  Like

 5. చిన్నప్పుడు బొమ్మరిల్లులో చమత్కార శ్లోక కథ అని వచ్చేది, భోజరాజూ కాళిదాసూ ప్రధాన పాత్రలుగా. ఒక దానిలో కాళిదాసు ఆడకవిత్వం మొగకవిత్వం అన్నాడు. భోజుడు అలాగ ఏం లేదు అన్నాడు. రాజుతో గొడవెందుకని ఈయన మెదలకుండా ఉన్నాడు. ఒక రోజున రాజు గారి మందిరంలో ఇద్దరూ భోజనం చేస్తుంటే రాజు ఏదో వంటకాన్ని చూసి అరే ఇదేవిటి ఇలా ఉందే అని ఒక శ్లోక పాదంలో అమరేలా చెప్పాడు. వడ్డిస్తున్న పరిచారిక రాజుగారి ఆశ్చర్యార్ధకానికి నప్పేలా ఆ శ్లోకాన్ని పూరించింది. కాళిదాసు నవ్వి, కచ్చితంగా ఇది మగకవిత్వమే, ఆమె సొంతంగా చెప్పింది కాదు అన్నాడు. రాజు కోపంగా .. హన్నా, నా అంతఃపురంలోకి ఇంకో మగవాడొచ్చాడంటావా? అన్నాడు. అలాగెంఊకంటానూ, ఆమెకి ఈ శ్లోకం నేర్పింది తమరే కదా! అని నవ్వాడు.

  ఇంతకీ కంలూషనేంటంటే .. గడ్డం మాసిన మొగాడెవ్వడూ ఇలాంటి లేఖ .. అందులోనూ కట్టుకున్న పెళ్ళానికి .. రాయడు. ఇది కచ్చితంగా ఆడ సాహిత్యం! 🙂

  Like

 6. రాధిక గారు: థాంక్స్ అండీ!! లేఖలలో రాయలేనంత ప్రేమ మీకు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

  కష్యప్ గారు: మీ ప్రశంసలో పడి మునకలేస్తున్నా.. ఎప్పటికి లెగుస్తానో ఏమో!! 😉

  మీనా:
  (ఈ పిలుపు అభ్యంతరమైతే చెప్పు… లేకపోతే.. మీనూ బాగుంటుందా ఆలోచించు.. నువ్వు నన్ను ఏకవచనంలో పిలు.. మనం క్లాస్ మేట్స్ ఆ ప్రేమ యునివర్శిటీ లో నేనూ ఉన్నా ;-))

  ఇక పాట విషయానికి వస్తే.. నేనడిగింది ఇది కాదు రా!! 😦 ఇది యూ ట్యూబ్ లో కూడా ఉంది. “ప్రేమించే హృదయానికి ప్రణమిల్లవే మనసా” అనే సాంగ్ సీన్ల మధ్యలో బాక్ గ్రౌండ్ లో వచ్చేది. అలానే ఇంకోటి.. “బంధమా.. అనుబంధమా” అనే పాట. ఇవి చక్రవాకం లో కూడా వాడారని నా నమ్మకం.
  బంటీ మ్యూసిక్ ఆల్బమ్స్ ఎక్కడున్నాయో పట్టుకోవాలి. చూద్దాంలే.. ఓపిగ్గా వెతికి పట్టుకుని నాకు వెంటనే చెప్పినందుకు బోలెడు థాంక్స్!!
  ఇప్పుడే ఆ పాటను నా డైరీలోకి ఎక్కిస్తున్నా..

  శ్రీవిద్య: 🙂

  Like

 7. purnima garu…..
  meena,meenu edyna pilavanDi….
  meerannadi ade patemo anukunna.ayina parledu..mee kosam aa patalu tappakunda kanukkovadaniki try chesta…
  ………………
  ika pote meeru adi kadu ra annaru kada..
  aa RA vadda na manasu irukkupoyindi….
  mee aatmeeyataku thanks.

  Like

 8. పూర్ణిమ గారు ఇలా శ్రీవారి మనసు తో ఆలోచించి వ్రాయడం బావుందండీ. నిషిగంధ గారికి ధీటు గా కాకపోయినా చాలా వరకు సఫలీకృతులయ్యారు జవాబివ్వడం లో.

  ఋతురాగాలు పాట విషయానికి వస్తే ETV అంతరంగాలు కేసెట్ ని inspiration గా తీసుకుని అప్పట్లో కొన్ని సీరియల్స్ పాటల కేసెట్ రిలిజ్ చేసారు. మీరు హైదరాబాద్ లో వుంటే ఏవైన పెద్ద music shops లో ఒకసారి చూడండి మీకు దొరకచ్చు.

  Like

 9. meena: thanks!!

  venoo: I know it would never be right up there!! But wanted to try. 🙂

  Even I was thinking of the same. Let me try in music shops!!

  Like

 10. “నీ, ముద్దోచ్చే.. మొద్దబ్బాయి” అంటే ఎందుకనో రంగనాయకమ్మ బుచ్చిబాబు గుర్తుకొచ్చాడు, స్వీట్ హోం తో సహా. రంగనాయకమ్మ రాసిన కృష్ణవేణి కూడా గుర్తుకొస్తుంది. ఆ నవల మొత్తం ఉత్తర ప్రత్యురాలతో మొదలయి వాటితోనే కథ ముగిస్తుంది. ఈ రెండు పుస్తకాలు ” ఆడ సాహిత్యం” ఏమో కాని, కొన్ని సార్లు పురుషులు, ఇలాంటి భావుకతతో ప్రేమించిన స్త్రీలకు రాయటం కద్దు. ప్రేమ జగత్తులో ఊహలు ఇలా మమైకమవుతాయేమో?

  Like

 11. ఎందుకనో అంతగా మనసుకి హత్తుకోలేదు…
  మీ టపాల నుంచి ఎక్స్పెక్టేషన్ ఎక్కువయిందేమో 🙂

  బ్లాగు పుస్తకం నుంచి మీకు ఒక మంచి టపా పరిచయం అయినందుకు ఎంతో ఆనందంగా ఉంది.

  Like

 12. రావుగారు: రంగనాయకమ్మ పేరు వినడమే గాని నేను చదవలేదు.. ఈ లేఖలో ఉపయోగించిన అనుభవాలు మాత్రం నేను గమనించినవే!!

  praveen: w.r.t expectations.. may be, may be not 🙂 But this is the one I just wanted to write.. thought, better to mess than to miss it completely.

  ఇది రాయడమే దుస్సాహసం.. కానీ అందులోనూ “సాహసమే” నాకు ప్రేరణగా నిలిచింది. Unfortunately 😉

  Like

 13. @ పూర్ణిమ
  నీకు గ్రహాలు బాగా అనుకూలిస్తున్నట్టు ఉన్నాయి. లేకపోతే ఇలా ఎలా రాస్తావు నువ్వు?!!!
  ఇక పోతే ఈ టపా నాకు చాలా నచ్చేసింది. భయం గురించి చెప్పావు చూడు నా వరకు అది నిజం. ఇంక అమ్మాయి గురించి రాసేప్పుడు, అమ్మని కూడా consistentga జత చేస్తావు చూడు అది నన్ను హత్తుకుంటుంది.

  Like

 14. ఇంత భావుకత్వం ఒక మగాడిలో…కష్టమే! కానీ ఆలోచన ఆద్భుతం. నిజంగా ఇంత భావావేశం ఉన్నోడు దొరికితే అదృష్టమే.

  “నీ పేరుతో ఉత్తరం మొదలెట్టాల్సి వస్తే.. చివరి దాకా నీ పేరే ఉంటుందని, మధ్యన ఇంకో పదానికి ఆస్కారం ఇవ్వదు నా మనసని”… ఈ రేంజి ఆవేశం మొద్దుబారిన మగకుంకలకు రాదుగానీ, నీ స్పందనకే నా జోహార్లు.

  Like

 15. endukO mee manasaina tana kanniru antaga palikinchalekapoyaru bavalni.tappuga anukokandi naaku koncham direct ga matladatam istam alane vere vallu cheppina istame.don’t feel bad.

  Like

 16. పాపం ఇక్కడందరూ మగాళ్ళకి భావుకత్వం ఉండదని తెగ స్టేట్‍మెంట్లు ఇచ్చేస్తున్నారు. పూర్ణిమగారు, మీరు చాలా బాగా రాస్తున్నారు. కానీ ఇక్కడ మగవాళ్ళ భావుకత గురించి మాట్లాడిన వాళ్లకి ఓ ప్రశ్న.

  మీకు ఎంతమంది కవయిత్రుల పేర్లు తెలుసో చెప్పండి?
  ఒకవేళ తెలిస్తే వారి భావుకత్వం ఉట్టిపడే కవితలేమైన మీకు గుర్తున్నాయేమో చెప్పండి.

  Like

 17. ఎక్కడో చదివాను ఆడవాళ్ళు సెక్యూరిటీ కోసం ఇష్టపడటం మొదలుపెట్టి తర్వాత మనస్సులతో మమేకం అవుతారంట. అదే మగవాళ్ళు dependency వల్ల ఎప్పుడూ ఇష్టపడుతూనే ఉంటారని. కాకపొతే ఈ ఇష్టం ప్రేమో కాదో నాకు తెలీదు.
  మీ ఈ లేఖలో నాకు మొత్తం అలాంటి dependency యే కనిపించింది. మీ ఉద్దేశ్యం ఇదే ఐతే మీరు చాలా వరకు సక్సెస్ అయ్యారు. జీవితాన్ని ముగ్గుతో చాలా బాగా పోల్చారు. కాకపొతే ముగ్గుకి అమ్మాయిలకి అవినాభావసంభంధం ఉంది. ముగ్గు అన్న దాన్ని వాడటం వల్ల కాస్త అబ్బాయిల ఫీలింగ్స్ కి దూరం అయ్యారు. మొత్తానికి మంచి ప్రయోగం.

  Like

 18. పూర్ణిమా, అసలు ఇలాంటి ఉత్తరం నిజ్జంగా మావారు రాస్తేనా, జీవితాంతం పువ్వుల్లో పెట్టి చూసుకునేదాన్ని.. ఆయన్ని కాదు, ఉత్తరాన్ని 🙂

  ప్రింట్ చేసి పెట్టుకున్నా, నాకిష్టమైన ఆర్టికల్స్ ఫోల్డర్ లో పెట్టుకునేందుకు..

  నాకైతే ‘నీ ముద్దొచ్చే.. మొద్దబ్బాయ్ ‘ తప్ప మొత్తమంతా నచ్చింది.. ఇక ముగ్గుతో జీవితాన్ని నిర్వచించడం కూడా బావుంది.. చాలామంది అబ్బాయిలు మీసాలు రాకముందు వరకూ అమ్మల వెనకాలే తిరుగుతూ వాళ్ళు వేశే ముగ్గుల్నీ, చేశే పిండి వంటల్నీ చూసినవాళ్ళే! అయినా మన ఆరాధ్యదైవాలు తిలక్, కృష్ణశాస్త్రి, యండమూరి తదితరులు పేజీలకు పేజీలు భావుకత్వాన్ని గుమ్మరించినవాళ్ళే కదా 🙂

  అసలు అబ్బాయిలతో పోలిస్తే భావుకత్వం రాయగలిగే అమ్మాయిలు చాలా తక్కువ, చదివి ఆనందించే వాళ్ళు ఎక్కువ!

  Like

 19. @ఋణవంతుడు, ఇక్కడ మగవాళ్ళ భావుకత్వం గురించి రాసింది నేనే గనక, భుజాలు తడుముకోకుండా సూటిగా జవాబులోకి వచ్చేస్తాను.

  సాధారణంగా ఇలాంటివి మగవారు అస్సలు రాయరు.ఇలాంటి భావుకత ఉన్న కవితలు రాసినా అవి ప్రియురాళ్ళకో, పెళ్ళాలకో అయితే అస్సలు రాయరు. కాకపోతే ఆడవారెప్పుడూ ఇలాంటి భావుకతని కోరుకుంటారు. ఆ భావననే పూర్ణిమ అక్షరబద్ధం చేసింది. ఈ “projection” ని అవలీలగా పండించిన.

  తనని పొగడడానికి నేను వాడిన పద్దతిని ‘తులనాత్మక ప్రశంస’ అంటారు. అంతేకానీ మగవాళ్ళని ‘తూలనాడటం’ కాదని గ్రహించగలరు.నేనూ మగాడినే,ఆ మాట మీకు తెలుసనుకుంటా!.

  Like

 20. దిలీప్: బొత్తిగ్గా అనుకూలించని పరిస్థితులలో రాసా అనుకున్నా.. తోచింది తోచినట్టు వాగేయడమే అలవాటైన నా మనసుకి ఈ గ్రహాలు పై నమ్మకం కుదిరితే బాగుణ్ణు. ఆ భయంకి ధైర్యంగా relate అయ్యే వారిలో మీరుంటారని తెలుసు.
  ఇంక అమ్మాయి గురించి రాసేప్పుడు, అమ్మని కూడా consistentga జత చేస్తావు చూడు అది నన్ను హత్తుకుంటుంది. – This isn’t a deliberate attempt.. అయినా పండగ చేసేసుకోనా?? 😉

  మహేశ్: లేఖలో అబ్బాయిని కాక నా మనసుని చూసారే.. అందుకు నెనర్లు!!

  బాబా గారు: నెనర్లు!!

  వంశీ: మీ దగ్గరకు మళ్ళా వస్తా.. కాసేపాగండి.

  నాని: నా ప్రతీ రచనా ఒకేలా ఉండదు.. నా ప్రతీ ఆలోచనా ఒకలా ఉండదు కనుక. ఆ టపా రాసింది disturb అయ్యి.. ఈ టపా నా మనసు ecstasy!! రెండూ విరుద్ధ భావాలు. చదివి నిర్మొహమాటంగా వ్యాఖ్యాన్నించినందుకు ధన్యవాదాలు!!

  ఋణవంతుడు గారు: నెనర్లు!!

  ప్రతాప్: Where did I miss a point అన్న దానికి మీ వ్యాఖ్య జవాబుగా నిలిచింది. మీరన్న ముగ్గే spoilsport అవ్వచ్చు.. కానీ వేరే కారణం వల్ల.. వేరే వ్యాఖ్య గా చెప్తా!!

  నిషీ: నచ్చిందనందుకు థాంక్స్!! ఓ మంచి పాయింట్ కాచ్ చేశారు.. మళ్ళా వస్తా అక్కడికే!!

  Like

 21. మహేష్‌గారు, సూటిగా విషయంలోకి వస్తే నేను ఆ వ్యాఖ్య కొత్తపాళీగారిని ఉద్దేశించి చేశాను. ఆయన ఇంతకుముందుకూడా ఇలాగే మగవాళ్ళగురించి Derogative గా మాట్లాడటం నేను గమనించాను.

  ఇక మీకు నా సమాధానం, ఇలాంటివి ఆడవాళ్ళు కోరుకోవచ్చుగాక, కానీ రాసేది ఖచ్చితంగా మగవాళ్ళే, నిషిగంధగారు చెప్పినట్టు, మనం ఆరాధించే తిలక్, కృష్ణశాస్త్రి, ఆమాటకొస్తే యండమూరి వీళ్ళందరూ భావుకత ఒలికించినవాళ్ళే. ఆ స్ధాయిలో రాసిన ఒక రచయిత్రి పేరు కూడా నాకు జ్ఞాపకం లేదు.

  Like

 22. వంశీ: kaani alochanalaku adugulu ravadam ledu enduko… ఎందుకో చెప్పనా?? నేను చెప్తున్న దానిలో మిమల్ని మీరు ఊహించుకోలేకపోతున్నారు.. అందుకేనేమో!! ఆలోచనలు ఎప్పుడూ ఆగిపోకూడదు.. మనసుకి మంచిది కాదది.. అందుకే నా ఆలోచనల వేలు పట్టుకుని కాసేపు నడవండి.

  ఈ టపాకి “అమ్మాయే శ్రీవారైతే” అన్న శీర్షిక ఉంటే.. role reversal మాట. She’s trying to be man, yet she is so feminine. Through sports, through work.. she sees the romance of life, which a man wouldn’t look for. His sources are different.

  ఇలా ఆలోచించి చూడండి.. it shouldn’t be that hard. ఇక ఇప్పుడూ ఆలోచనలు నడవకపోతే.. కట్ చేసి మూవ్ అవ్వండి.. “alochanalaku adugulu ravadam ledu” అన్నది ఒక భయంకరమైన అనుభవం నా మట్టుకు నాకు. I don’t want you to stay there long!!

  Like

 23. @పూర్ణిమ
  నేను గ్రహాలు అనుకూలిస్తున్నాయన్నది… టపా మీద టపా రోజుకోటి ఎలా రాస్తున్నావో అర్ధం కాక… నాకూ రాయాలని ఉంటుంది? కానీ రోజూ అంత తాజాగ రాయగలిగేంత energy, సమయం దొరకదు! ఎలా రాస్తున్నావబ్బా? ఏం తాగుతున్నావు? 🙂 మాకూ చెప్పొచ్చుగా…

  అవును నాకా ధైర్యం ఉంది 🙂

  Like

 24. dileep:

  నా సీక్రెట్ట్… భయం.. మరలా ఇప్పుడప్పుడే బ్లాగ్ చేసే సమయం దొరకదన్న భయం. అందుకే ఉన్నంత సమయంలో రాసేస్తున్నాను. ఇక ఈ నెలకి ఇదే నా ఆఖరి టపా అనుకుంటూ ప్రతీదీ రాస్తున్న.. కుదిరినంత కాలం ఇలా..

  నా ఫ్రెండ్స్ నా పేరు ఇంకేమైనా “పూర్ణిమా” అనే పిలుస్తారేమో ఎందుకో తెలుసా.. “పున్నమి నెలకొకసారే వస్తుంది. వచ్చి వెళ్ళాక.. మరలా రావడానికి మళ్ళీ ఓ నెల!!” ఒక్కసారి వెళ్ళిపోయాక మళ్ళీ గుర్తురామా మేము?? అంటూ నిలదీస్తారు.. గుర్తు రారని కాదు.. రాలేని అశక్తత నాది 😦 ఇంతకు మునుపు నేనంతగా తెలియదు గనుక.. ఈ సారి తెలుస్తుందిలే.. ఈ పూర్ణిమ గురించి!! 😉

  Like

 25. @ఋణవంతుడుగారూ, గురి నామీద కాదుకాబట్టి అందులో పేచీ లేదు.

  ఇక భావుకత మీదంటారా, నిజమే ! మీరూ,నిషిగంధ గారు చెప్పినవాళ్ళూ భావుతక వ్యక్తపరచడంలో దిట్టలే. ఈ మాట, కాస్త సాహిత్యంతో పరిచయమున్న అందరూ అంగీకరిస్తారు. ఇక్కడ నేను చెప్పింది ఒక్కటే, మగాళ్ళు తమ పెళ్ళాలకు ఇలాంటి లేఖ రాయరు అని.పెళ్ళికి ముందు ఊహాసుందరికీ, పెళ్ళితరువాత స్వప్నసుందరికీ మాత్రమే సాధారణంగా ఇలాంటి లేఖలు రాస్తారు. మగాడికున్న బలహీనతల్లొ అదొకటి.

  అందుకే పూర్ణిమ భర్త స్థానంతీసుకుని రాసిన ఈ లేఖని ఆవిధంగా ప్రశంశించడం జరిగింది. ఇదొక కోణం మాత్రమే, universal truth కాకపోవచ్చు.

  Like

 26. భావుకతకి లింగవివక్ష లేదు. చెలం, కృష్ణశాస్త్రీ, తిలక్‌ల దాకా ఎందుకు, ఎంతో భావుకతతో నిండి నాకు నచ్చిన ఈ కథ చదవి చూడండి.

  http://www.eemaata.com/em/issues/200207/561.html

  Like

 27. హృద్యాంబుధి ఋణవంతా .. నా మాటలు అపార్ధం చేసుకున్నారు. నేనన్నది .. రాతల్లో మగ రాతలూ, ఆడ రాతలూ ఉంటాయనీనూ, ఇక్కడ పూర్ణిమ గారు రాసినది ఆడ రాతే తప్ప మగరాత కాదనీనూ.
  మగవారి భావుకతా లేమి గురించి నేను ఒక్క మాట కూడా రాయలేదిక్కడ.
  నేను ఇంకెక్కడ మగవారి మీద “Derogative” (sic) గా రాశాను స్వామీ? చెప్పి, నా కళ్ళు తెరిపించి పుణ్యం కట్టుకోండి.

  Like

 28. haha
  poornimagaaru,

  nenu naa abhiprayanni hurt cheyyakunda(Oka vela meeru negativega thesukunte) convey cheddamani try chesa(euphemism)…kaani chala ghoramga vipalamayyinatlu vunna..

  Naa vuddesyam emanagaa ‘konni pieces of art work choosinapudu, manaki theliyakundaane manam oka nirvachinchaleni anandaaniki guravuthaam. simplega cheppali ante ‘feel good’ factor. kaani andulo entha practical enti ani kolavadam modaledithe akshaaralu akshaaralugaane migilipothaayi.

  anduku vudaharanagaa mana sirivennala raasani oka chinna line

  “choosenduku achamgaa mana bhaashE anipistunnaa aksharamO ardham kaani ee vidhi raata”

  idhi vinnapudu/chadivinappudu prathisaari naake theliyani goppa feeling….ade asalu vidhi aneedi vunda ane questiontho modalupeduthoo alochinchaanu anukondi ika sirivennala srama kanchiki…manam lankaki….

  intha sodini avoid cheddamanakunna…kaani tappa ledu… kaani ii comment choosi chala mandi kathhulu thesi yuddaniki ready avatharemo…

  Like

 29. ఒకసారెందుకో పట్టాభి రామన్ గారి ప్రోగ్రాం చూశా.. ఓ కాగితం మీద వరుసుగా నాలుగు బొమ్మలు గీసి ఉంటాయి. వాటిని చూడమన్నాక.. పక్కన ఇంకో కాగితం మీద పెట్టి.. ఆ బొమ్మ పేరు చెప్పమంటారు. మనం ఎలుక అని చెప్తాం. మళ్ళీ ఇంకో నాలుగు బొమ్మలు పెట్టి చూసాక.. మళ్ళీ ఐదో బొమ్మ పెట్టి.. ఏంటని అడిగితే.. నవ్వే చిన్నారి అంటాం. నిజానికి రెంటిలోనూ ఉపయోగించిన ఐదో బొమ్మ ఒకటే.. కానీ ముందు చూసిన బొమ్మలు మనల్ని అలా influence చేస్తాయి. Probably I was in that state of mind. Anyother day.. I’d been in love with the comment.

  “నాలో ఊహలకు.. నాలో ఊసులకు అడుగులు నేర్పావూ” అంటూ సాంగేసుకుంటారని అనుకుంటే.. నాకే భలే పాఠం చెప్పారు. I’m amazed by every bit of the explanation.. and I now realize the beauty of “ఆలోచనలకు నడకలెందుకు రావటం లేదో..” !!

  Like

 30. Thank you thank you…
  one more request…
  Kudirithe mee voohalaanni oosulaku, alochanalu kooda vemdincha galavemo try cheyyandi…

  — Vamsi

  Like

 31. This blog touched me and put me into a whirlwind of thoughts and emotions…you know what? After I read this, I decided never to read your blog again :(… why? because, then I will have to find a guy who can be this exceptional in expressing himself, but then, that would be none…

  there is so much of love in that mail, that I wonder if it is actually possible in life…

  but ur experiment with the thoughts have been fantastic … and I will keep reading the blog, can’t stop myself after reading such fantastic way of expressing… may be, atleast through this blog, I can amuse myself or dream about a love capable of binding me with words… :)…

  Words might not always convey a right meaning… sometimes a touch conveys as much emotion as ur blog has portrayed, but that happens in a whim… :)…

  Loved it…

  Like

 32. hey mahi..

  Seems like I was succesfull in taking u all to the heights of imaginative romance, but god.. the landing seems so terribly awkward. 😦 If it has given you such a setback.. I know this is my writing!! 😉

  When you write such a comment, you know how much it means to me.

  So at least to bring you back, time and again here.. I’ll have to play with my thoughts!!

  Keep commenting please..

  Purnima

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s