Affectionately dedicated to HP Compaq 6720s

ఎందుకు??….ఇందుకు..

“ఎందుకూ??”

వచ్చే ప్రతీ అలా.. సాగరంలోకి తిరిగి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు
రావటం ఎందుకు?
పాదాన్ని తాకటం ఎందుకు?

వీచే ప్రతీ గాలీ.. నన్నుదాటుకుని పోవాలనుకున్నప్పుడు..
వీయటం ఎందుకు?
చెక్కిలిగింతలు పెట్టడమెందుకు??

కురిసే ప్రతీ వాన చుక్కా.. నాకు కాకుండా జారిపోవాలకున్నప్పుడు
కరుణించటం ఎందుకూ?
నన్ను తడపడమెందుకూ??

మురిసే ప్రతీ వెన్నెల రాత్రీ.. నేను నిద్రలో ఉండగా జారుకోవాలనుకున్నప్పుడు
కురవడం ఎందుకు?
నన్ను మైమరపించడం ఎందుకు??

చేరే ప్రతీ ఘడియా.. కాళ్ళాగని కాలమై”పోతు”న్నప్పుడు
నిలవటం ఎందుకు?
క్షణికంలోనే జీవితాన్ని నేర్పడం ఎందుకు??

ప్రతీ కలయికా విడిపోవడం కోసమే అయితే.. అసలది పుట్టడడం ఎందుకు??
వచ్చి ఇచ్చిన ఆనందం.. వెళ్ళేటప్పుడు తీసుకు పోడానికే అయితే.. ఇవ్వడం ఎందుకు??

పిచ్చీ.. రావటం.. పోవటం సహజం..
కలవటం.. విడిపోవటం ప్రకృతి విధానం
వెళ్తేనే కదా తిరిగి వస్తారంటూ..
వద్దు.. నాకేమీ చెప్పద్దు..

నన్ను శాస్వతంగా విడిచి వెళ్ళే నేస్తాన్ని చూడనివ్వకుండా ఇన్ని కన్నీళ్ళు ఎందుకు??

21 Responses to “ఎందుకు??….ఇందుకు..”

 1. ప్రతాప్

  పూర్ణిమా..
  మీరు కవితని కాని, ఇంకేదన్నా కాని మొదలు పెట్టే విధానం సూపరు. కాని మీరు ఫినిషింగ్ టచ్ ఇవ్వడంలో ఇబ్బంది పడుతున్నారని నాకనిపిస్తూ ఉంది (మనలో మన మాట నాకు కుడా ఈ జబ్బు ఉంది లెండి). ఈ కవితలో అది ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. మీరు కావాలని అలారాసుంటే మాత్రం నన్ను క్షమించండి.
  ఒక చిన్న సవరణ, అన్యధా భావించకండి. వెన్నెల కాయడం అన్న పదప్రయోగం కన్నా వెన్నెల కురవడం అన్న పదప్రయోగం బావుంటుందేమో ఒక్కసారి ఆలోచించండి.
  అస్సలు రోజూ ఎలా రాయగలరండి. నేను నెలకి ఒక్కటి రాసేదానికే చాలా కష్టబడిపోతుంటాను. సీక్రెట్ చెప్పరా? plz..

  Like

  Reply
 2. ఏకాంతపు దిలీప్

  అర్ధం కాలేదా?

  వచ్చే ప్రతీ అలా నిన్ను కేరింతలు కొట్టించడానికని
  వీచే ప్రతీ గాలీ నీకు గిలిగింతలు పెట్టాలని
  కురిసే ప్రతీ చుక్కా నీలో తుళ్ళింత పుట్టించాలని
  ప్రతీ వెన్నెల నిన్ను మైమరపించి, అలుపుని దూరం చేసే పాట కాని జోల అని
  చేరే…ప్రతి ఘడియా.. నువ్వు పదిమందిని స్పందింపచెసేట్టు చేయ్యడానికని….

  పిచ్చీ… అవన్నీ విడిపోవడం లేదురా! అవి పుట్టి నిన్ను నీకు పరిచయం చేస్తున్నాయి.శాశ్వతంగా నీలో కలిసిపోతున్నాయి….

  విడిపోవడం ప్రకృతి విధానం కాదురా… మమేకమవ్వడం, నిన్ను తనలో మమేకం చేసుకోవడమే ప్రకృతి విధానం!!

  అవి వెళ్ళిపోవడం లేదు… కేరింతగా, గిలిగింతగా, తుళ్ళింతగా, ప్రశాంతతగా, నువ్వు ఎదుటి వారిలో పుట్టించే స్పందన గా రూపాంతరం చెంది శాశ్వతత్వాన్ని పొందుతున్నాయి…..

  గుర్తించావా??? ఇదంతా ప్రకృతి గూడు పుఠాని కదూ… నిన్ను తనతో మమేకం చేసుకోడానికి పన్నిన అందమైన కుట్ర కదూ… 🙂

  Like

  Reply
 3. Purnima

  కొత్తపాళీ గారు: నెనర్లు!!

  ప్రతాప్: మన జబ్బుకో మందు కనిపెట్టండి మరి. మనసుకి ఏది తోస్తే అది రాయటం తప్పించి.. ఇంక ఏమీ ఆలోచించడం లేదు నేను!! మీ లా నచ్చినా నచ్చకున్నా నన్ను ప్రోత్సహిస్తూ ఉంటే.. రాయకుండా ఉండగలనా.. మీరే చెప్పండి??

  శ్రీ: థాంక్స్ రా!!

  దిలీప్: 🙂 నా మీద ఇంత కుట్ర జరుగుతుందా?? చూద్దాం ఎన్నాళ్ళ దాకానో?? ఇంత అందమైన స్పందన ఇలా మూలపడి ఉండాల్సిందేనా?? మనసుప్పొకోవటం లేదు.

  వంశీ: హ..హ..హ.. నా క్రితం వ్యాఖ్యకి ఎంతెలా భయపడ్డారో.. క్లియర్ గా తెలుస్తుంది. :-)) చాలా చాలా నెనెర్లండి!! పూర్తిగా అర్ధమైందండి!!

  Like

  Reply
 4. ఏకాంతపు దిలీప్

  @ పూర్ణిమ
  ఎంత దాకా అంటే… నువ్వంటే నీకు ఇష్టం ఉన్నంత వరకూ… 🙂
  మరి ఏం చేద్దాము ఆ స్పందన ని? 🙂

  Like

  Reply
 5. వేణూ శ్రీకాంత్

  బావుంది పూర్ణిమ గారు, మరి నా మట్టి బుర్ర కి అర్ధం కాలేదేమో కాని “వద్దు నాకేమి చెప్పొద్దు” తర్వాత కొంచెం confusing గా అనిపించింది. ఓ రెండు సార్లు చదివితే అప్పుడు భావం అర్ధమయ్యింది. ఫార్మాటింగ్ ద్వారా నా లాంటి పామరులకి మొదటి సారే అర్ధం అయ్యేలా చూడచ్చేమో ప్రయత్నించండి. కానీ రోజుకో అందమైన టపా వ్రాస్తున్న మిమ్మల్ని ఇంకా సమయం వెచ్చించమని అడగడం భావ్యం కాదేమో అనిపిస్తుంది.

  Like

  Reply
 6. బొల్లోజు బాబా

  బ్యూటిఫుల్.
  వద్దు.. నాకేమీ చెప్పద్దు.. తరువాత కొంచెం తడబడినట్లు తెలిసిపోతుంది.
  వెన్నెల కాయటం గురించి ప్రతాప్ గారు చెప్పినట్టున్నారు.

  రాత్రి కాయదుగా?
  ఎక్కడో లింక్ కట్ అయినట్లుంది. గమనించండి. లేదా నేనేమైనా పొరపడుతున్నానా?

  ఇక దీపుగారు,
  మొత్తం కవితలోని గమనాన్ని మరోపక్కకు తిప్పేసారు.

  మనం వ్రాసిన కవితను, మరొకరు మరొక కోణం తో చెప్పితె, ఎంత ఆనందం కలుగుతుందో నాకు తెలుసు.
  సొ ఎంజాయ్ ది ఫన్.

  అభినందనలతో
  బొల్లోజు బాబా

  Like

  Reply
 7. Purnima

  @venu:

  Be thankful to your audience..they have “n” no. of things to do. But if they still chose to switch on TV to see you, then shd be thankful. Audience is doing a favor by watching you.. you aren’t by presenting!!

  మొన్నే నేను విన్న హర్షా భోగ్లే ఇంటర్వ్యూ లో తను పై విధంగా అన్నారు. అలానే.. మీరంతా నా రాతలు చదవటం గొప్ప!! నేను రాసి మిమల్ని ఉద్దరించేంత సీను లేనే లేదు. I’m more than surprised to have you guys time and again!! In a way, it thrills.

  భావం చెప్పాలకునేలా చెప్పలేక పోయా.. రాసినప్పుడే తెలుసది. అయినా “ఎందుకు??” కి అందమైన సమాధానం వచ్చాక.. మార్చలేకపోతున్నా!! కానీ ఈ సారి తగినన్ని జాగ్రత్తలు తీసుకోగలను. మీరు పామరులు కానే కాదు.. మీరే అన్నా ఒప్పుకోను. 🙂 It actually reflects my confusion.. and in a way I wanted to.

  ఇంకో టపా రాస్తున్నా.. నచ్చుతుందేమో చూడండి.

  బాబా గారు: నెనర్లు. ఈ సారి మరిన్ని జాగ్రత్తలు తీసుకోగలను. అయినా అభినందించినందుకు ధన్యవాదాలు.

  Like

  Reply
 8. వేణూ శ్రీకాంత్

  పూర్ణిమా:
  హర్ష అన్నదాంట్లో నూటికి నూరుపాళ్ళు నిజముంది కాని తనకి మీకు ఒక తేడా ఉంది. That’s his job he is making living out of it and it’s his responsibility to put more effort to improve and attract audience with out which he is going to lose his job. and also అక్కడ డబ్బులు ఇచ్చేదీ మనమే భరించాల్సిందీ మనమే 🙂 సో మనకా డిమాండ్ చేసే హక్కుంది.

  కాని మీరు అలా కాదు కదా, మీ ఆత్మానందం కోసం మీరు వ్రాసుకుంటున్నారు నా అత్మానందం కోసం నేను చదువుకుంటున్నాను. ఇక్కడ win-win situation for both of us సో ఎవరు ఎవర్నీ ఉద్దరించడాలు లేవు 🙂 అందుకే మిమ్మల్ని మరింత టైం స్పెండ్ చేయమనడం భావ్యం కాదేమో అన్నాను.

  well, money విషయాన్ని పక్కన పెడితే, నేను ఇంప్రూవ్ అవ్వక పోడం వల్ల విజిటర్లు, కామెంట్లు తగ్గితే తద్వారా i lose my interest, so it is also in away kind of losing my job, so you still can demand అని అంటే నేనూ ఏకీభవిస్తాను.

  Like

  Reply
 9. వేణూ శ్రీకాంత్

  పూర్ణిమా, ఒక కామెంటరు గా ఇందాకే నీకంత ఫిలాసఫి చెప్పాను కానీ…కామెంటరు క్యాప్ తీసేయగానే…ఒక బ్లాగరు గా… అది నా కామెంటర్లు చదివితే ఛ! వీడికి కామెంట్ రాయడం అనవసరం అనుకుంటారేమో అని అనుమానం వచ్చింది, అందుకే ఇది. వ్యాఖ్యలు వ్రాసే వారిపై నాకు చిన్న చూపు లేదని మనవి. నా వరకు నాకు మొదట్లో అంటే కామెంట్ల రుచి తెలియక ముందు…”నచ్చక పోతే వెళ్ళి వేరే బ్లాగులు చదువుకో” అని నిర్మొహమాటంగా చెప్పేసాను కాని ఈ మధ్య నాలుగు కామెంట్లు చూసాక అవి టానిక్కుల్లా పని చేయడం మొదలెట్టాయి… అప్పట్నుండీ టపా వ్రాసేసి రిజల్ట్స్ కోసం ఎదురు చూసే స్కూల్ పిల్లాడి లా కామెంట్ల కోసం ఎదురు చూడటం మొదలు పెట్టేసాను….సో అతిధి దేవోభవ !! …కామెంటర్లూ వర్ధిల్లాలి !!…

  Like

  Reply
 10. meenakshi.a

  hi purnima ji….
  nijangane pratap garu annttu ela rayagalugutunnaru..
  ee post lanni..
  naaku telisi meeru job…chestu ivanni ela rastaro vintaga undi..
  naku holidays….ippudu..ayina kuda..meela rojuki 1 or 2..rayadama ammoooooo .meela tapalu rayalante…
  em cheyali….gurudevini….malli meeru konni blog laki comments kuda rastaaru…annattu deepu gari spandana chaala baundi…tvaralo nenu mee meeda oka kavita..or shaayari raastaanu…
  idi maatram nijam…
  …………………..
  ur choooo..chweeeeeeeeeeeettt…
  byeee….meenu..

  Like

  Reply
 11. Purnima

  మీనూ:
  నువ్వలా డిసైడ్ అయ్యిపోతే కష్టం కదూ?? కుదరదు గిదరదు అంటే మాత్రం.. నీ భాషలో ఉన్న నవ్వులన్నీ నాకోసం వెచ్చించు. నా టపాలన్నీ నాకు మరీ డైలీ సీరియల్ ఏడుపు హీరోయిన్ ఇమేజ్ ని ఆపాదిస్తున్నాయి. నువ్వే దాన్ని revamp చేసి పుణ్యం కట్టుకో మరి??

  Even before all this, add me as ur buddy here..
  purnima.tammireddy@gmail.com

  Like

  Reply
 12. ఏకాంతపు దిలీప్

  పూర్ణిమా… ఇది చూసి ఎలా స్పందించాలో నాకు అర్ధం కావడంలేదు!

  Like

  Reply
 13. Purnima

  అయ్యో.. ఎలా ఇప్పుడు?? ఓ కవితను ఆపేశానా?? ;-(

  బాబాగారనట్టు… let’s just enjoy it!!It’s rare. 🙂

  Like

  Reply
 14. రాధిక

  ఇది సగం చదివి ఓకే ఇలా చెపుదాం అమ్మాయికి అనుకున్నాను.మిగిలింది చదివాకా అన్నీ అమ్మడే చెప్పేసుకుంది ఇప్పుడు ఏమి చెప్పి కళ్ళు తెరిపించాలి[:)] అనుకుంటూ ఉండగా దిలీప్ గారి కామెంటు కంటపడింది.నేనెవరి కళ్ళో తెరిపించాలని చూస్తుంటే ఈయనెవరో నాకళ్ళే తెరిపించారు అనుకున్నాను.నిజమే అవన్నీ అలాగే శాశ్వతత్వం పొందుతున్నాయి.చూడు ఇలా నీ భావాలరూపంలో,అక్షరాల రూపంలో సజీవమవ్వట్లేదు.కలుసుకునేది విడిపోవడానికే,విడిపోయేది కలుసుకోడానికే.కానీ ఈ సంధికాలంలో నీకెన్ని అనుభవాలు ఇచ్చిపోతుందని,ఎన్ని భావాలు పరిచయం చేస్తుందని.

  Like

  Reply
 15. Shiv

  ప్రశ్నలు-సమాధానాలు బాగున్నాయి.నేను కవితలు సాధారణంగా చదవను. మీ కవిత సరళంగా ఉండి బావం అర్దం అయ్యింది. మీరు ఇలా వ్రాస్తూనే ఉండండి…..
  Shiva-speaks

  Like

  Reply
 16. కత్తి మహేష్ కుమార్

  నీ ప్రశ్నలూ, దిలీప్ పూరణ అన్నీ బాగునాయ్. కానీ నాకేమిటో ఇంకా అసంతృప్తిగానే ఉంది. కవితలు చాలావరకూ దాన్నే మిగులుస్తాయేమో!

  Like

  Reply
 17. ఏకాంతపు దిలీప్

  @పూర్ణిమ
  సరె 🙂 నా స్పందనకి శాశ్వతత్వాన్ని కలిగించావనుకుంటాను 🙂 కానీ నువ్వు రాసుకున్న కవితని మార్చేసావు… మార్చకుండా ఉండాల్సింది… ఒకవేళ మార్చితే బాగుంది అనుకున్నప్పుడు ఆ పాత కవితని కూడా కిందో పక్కనో జత చేసి ఉండాల్సిందేమో… అక్కడ మొదటి అంకంలో నుండి రెండో అంకంలోకి సాఫీగా వెళ్ళలేదేమో అని అనిపించినా, రెండో అంకం కూడా బాగుండింది…

  Like

  Reply
 18. ప్రతాప్

  పూర్ణిమ గారికి,
  నేను చెప్పిన సూచన స్వీకరించినందుకు ధన్యవాదములు. కవితకి ప్ర్రాస ప్రాణం అని నేను భావించేవాడిని. కాని అది తప్పని మీరు నిరూపించారు. అస్సలు ఈ కవితకే highlite అయింది దిలీప్ గారి కామెంట్. మొత్తానికి దీని వల్ల కవితకే పరిపూర్ణత వచ్చినట్లు నాకనిపిస్తూ ఉంది.
  నేను మీకు మందు కనిపెట్టడమా? మీలా స్పందించేవారికి, స్పందించి ఆ భావాలని అందరికి పంచే వారికి నాలాంటి అతిసామాన్యుడు మందు కనిపెట్టడమా? నేనేదో రాయడంలో చివర, విమర్శలు చెయ్యడంలో ముందర ఉంటాను కాబట్టి ఆ మందేదో మీరే కనిబెట్టి నాకు చేరవెయ్యగలరని ఆశిస్తున్నాను.

  Like

  Reply

Leave a Reply to Purnima Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Basic HTML is allowed. Your email address will not be published.

Subscribe to this comment feed via RSS

%d bloggers like this: