అమ్మాయిలూ.. ఈ కింది బ్లాగును చూసిన దగ్గరనుండీ కడుపులో ఒకటే నొప్పి.. ఎందుకో మీకు తెలుసు 😉 Mr. Bean సినిమా మానేసి మరీ “టపా”యిస్తున్నా అంటే అర్ధం చేసుకోండి.
http://maheshwarams.blogspot.com/
చూడ్డమే కానీ.. ఇప్పుడున్న ధరలకి ఏం కొంటాములే అని అంటారు.. పోనీ చూడమైనా అవుతుంది కదా!! నేరుగా మనింటిలోకి.. వస్తున్న లక్ష్మిని కాదనగలమా??
ఇంతటితో టపా ఆపేస్తే.. నేను నేనెందుకు అవుతాను. 😉 సుత్తి లేకుండా సూటిగా చెప్పింది… సుత్తి రావాల్సిన బస్ కొంచెం లేటయ్యింనందుకు..ఇంకో కడుపు నొప్పిని తీసుకు వస్తుంది. అమ్మాయిలు ఇక వస్తారో లేదో.. మీరొచ్చేయ్యండీ..
*************************************************************************
ఒక సాయత్రం పూట.. అప్పుడే ఇంటికి చేరి కూలబడ్డా..
రేపు నువ్వు ఆఫీస్ మానేస్తున్నావు.. (అమ్మ)
“ఏం??”..
బయటకు వెళ్ళాలి.. షాపింగ్..
ఏం షాపింగ్??
బంగారం కొనాలి
నేను రాను పో..నాకు చాలా పనుంది. చెప్తే వినవేంటి.. టీమంతా ఆగాల్సి వస్తుంది నా కోసం.. లీవ్ దొరకదు.. అయినా బంగారం కొనడానికి మంచి రోజేంటి?? వీకెండ్ వెళ్ళకూడదా.. మాట విను.. రేపు కాదు,, ఇంకో మంచి రోజు.. మా.. …. …
సీన్ కట్ చేస్తే.. తెల్లారే లేచి.. “బాస్.. ఎమర్జెన్సీ.. లీవ్!!” ఫోన్ లో టెలిగ్రాముకు మల్లే చెప్పా!!
“ఓ.. క్రికెట్ట్ మాచ్.. సచిన్ ఇస్ ప్లేయింగ్??”
“లేదు.. ఇవ్వాల కూడా ఆడటం లేదు..అసలు తన గాయం ఎలాంటిదంటే..” హే.. ఏం చేస్తున్నా?? అసలందుకు కాదు కదా ఫోన్ చేస్తా..
“నో.. ఇట్స్ ఎ రియల్ ఎమర్జెన్సీ..” (మహా అయితే వారానికి రెండు మూడు రోజులు మాత్రమే మానేసే నా మీద అనుమానమా అన్న అమాయకత్వం ధ్వన్నించేట్టు)
“ఓ.కే.. హావ్ ఫన్..”
And the fun begins..
ఎనిమిదింటి కళ్ళా కొట్టు ముందు కూర్చున్నాము.. అందరికన్నా ముందే లోపలికి వెళ్ళాలి కదా.. లేకపోతే అంతే సంగతులు. ఇరుకు కొట్టు.. నేనూ మా అమ్మా (మా గాంగ్) ఎదురెదురుగా!! తీసి..పెడుతున్న నీలం రంగు, ఎరుపు రంగూ డబ్బాలు.. మా మధ్య రాబోతున్న దూరానికి వారధిలా!! చూపించటం మొదలెట్టగానే ఒకటి నచ్చింది. నచ్చాకా.. మనసూ ఆగదు.. నోరు అంతకన్నా!! “నాకిదే కావాలి” .. నిఖ్ఖచ్చిగా చెప్పేశా!! “అలా కాదమ్మా .. అన్నీ చూడండి” అంటూ అప్యాయంగా ఆ కొట్టతను అంటుంటే.. మధ్యన మా అమ్మ.. “ఆగుతావా??” అని ఆ ఫీలింగ్ ఎంజాయ్ చేయన్నివ్వకుండా!!
ఇంకా చూపిస్తున్నా.. ఇందాకటి దాని మీదే కళ్ళుండడం గమనించి.. “ఇది నీదే రా.. ఎవ్వరికీ ఇవ్వమూ.. ఇక్కడే ఉంచుకో.. కానీ మిగితావి చూడు నాన్న..” అని ఆ డబ్బా నాకిచేశారు షాపులో అందరికన్నా పెద్దాయన. ప్రత్యుపకారంగా పెద్ద బదులే ఇవ్వాల్సి వచ్చింది.. వీరరంగం మొదలు పెట్టారు.. ప్రతీది మెడలో పెడతారు.. చూడమంటారు.. (నన్ను కాదు చూడమనేది.. మా గాంగ్ ని) పెట్టి తీస్తారు.. తీసి పెడతారు. ఆ వేళ మెడ నరాలకి ఇచ్చిన exercise మల్లా ఇప్పటిదాకా దొరకలేదు. ఎంతెలా అంటే.. మరుసటి రోజు వెనుకున్నవి తేలికగా చూడగలిగా .. మొత్తం శరీరాన్నే తిప్పాక!!
అది చాలక మా అమ్మ.. లాంగ్ సైట్.. షోర్ట్ సైట్ లో కూడా పరీక్షించింది బంగారాన్ని తక్కువ.. నా ఓపికను ఎక్కువగా. అంటే.. పాతబస్తీ గల్లీల్లో.. ఇన్నోవా కారుని నడపడం మాట. అయితే మొదటి గేర్.. లేకపోతే రివర్స్!! వెలుతురులో నుంచో.. లైట్ కింద నిలుచో.. ఆ ఆంగిల్.. ఈ ఆంగిల్.. ఒక సారి నవ్వుతూ చూడూ.. మరీ ఇకిలించక. నేను మొడలింగ్ కి కొత్త అర్ధం ఆపాదిస్తుంటే.. కొట్లో ఉన్న మిగితా వారు.. ఆ అమ్మాయి ఇందాక పెట్టుకున్నది బాగుంది కదా.. “ఏది ఆంటీ అది??” అంటూ మా అమ్మను అడగడం.. మా అమ్మ వారి కోరికను నా శిరస్సున.. కాదు మెడను రుద్దటం.. మేమొచ్చింది మురుగుల కోసం.. బాగుందని అడిగాము.. ఇదే తీసుకోండి అని ఓ ఉచిత సలహా.. ఛాస్!!
ఏది నచ్చింది ఇందులో?? అన్న ప్రశ్నతో.. పెట్టుకుని చూపించడానికే రాలేదని నాకు గుర్తొచ్చింది. నేను చెప్పా.. ఆ మొదటి దాని గురించి!! చాలా మల్లగుల్లలు పడ్డాక.. అదే ఖరారు అయ్యింది 🙂
ఇప్పుడిక బేరాలు మొదలు. ఓడిపోవడం నాకలవాటు చేసింది ఈ బేరాలే. వంద రూపాయలన్న వస్తువును పాతికకు అడుగుతా.. వాడు చక్కా సంచిలో వస్తువు వేసి నవ్వుతూ ఇచ్చి పంపిస్తాడు. అంటే అది పాతికకన్నా చాలా చాలా తక్కువని అర్ధం. బేరాలాడడం నేర్పబడే.. కోచింగ్ సెంటర్స్ ఉంటే బాగుణ్ణు. క్రాష్ కోర్సైనా జాయిన్ అవుతా వెంటనే!! చెప్పరూ..
మొత్తానికి వాళ్లేదో డిసైడ్ అయ్యి.. రేటు.. బిల్ సెటిల్ చేస్తుంటే.. వాడిపోయిన నా మొహం చూసి..ఆ సేల్స్ పెర్సన్స్ లో అందరికన్నా చిన్న అబ్బాయి.. “ఇది చూడండి.. ఒక సినిమా హిరోయిన్ పెట్టుకోవాలని ప్రత్యేకంగా చేయించారు” అంటూ ఒకటి చూపించారు. ఏదో లోకంలో ఉన్న నేను Wall hangings అన్నా ఆశగా.. “హీరోయిన్ పెట్టుకోడానికి” అన్నాడు కోపం బయటకు రాకుండా!! “ఏం బాలే” అని చెప్పేసా ఖచ్చితంగా.
మొత్తానికి కావాల్సింది కొని ఇంటికి వచ్చే సరికి.. “కష్టం” అంటే అర్ధమైంది. పంచుకుంటే కష్టం తగ్గుతుందన్న వారిని ఇటు పంపించండి!! తెల్లారి ఆఫీసుకెల్లి అత్యావసరపు “ఉప్పరు మీటింగ్” పెట్టి ఈ నా సొద అంతా చెప్పా.. నన్ను కార్నెర్ చేయటం మాత్రమే తెలిసిన మా వాళ్ళు.. ఏ రేంజ్ లో ఇప్పటికీ విసిగిస్తారో చెప్పాలా??
*******************************************************************
ఎమ్.బి.ఏ లూ.. ఎమ్.ఎస్ లూ చేయని వీళ్ళు.. అంతలా మనుషులని ఎలా ఆకట్టుకుంటారు? నాకిష్టమైనది నాకిచ్చి.. మా అమ్మకి నచ్చేలా అన్నీ చూపించారు. అందులో ఏ ఒక్కటి చేయకపోయినా.. కొనడం అయ్యేది కాదు. విసిగి పోయిన వారికి.. తోచిన విధానంలో ఏదో ఆటవిడుపు ఇవ్వటం. ఇంటిలో వారందరకీ “అడిగామని” చెప్పడాలు.. వద్దన్నా మల్లా అటే వెళ్తాం. కనిపించిన వారందరకీ చెప్తాం.. business books చదివే ఓపిక లేకపోతే ఇలా ఒక షాపింగ్ చేస్తే సరిపోతుందేమో..కదా??
అవునూ.. ఒక సారి క్లాసులో సార్.. “మీరు గ్రీటింగ్ షాపుకి వెళ్ళారనుకోండీ.. అప్పుడు అక్కడున్న వాటిలో ఏది నచ్చితే అది తీసుకుని.. ఏదీ నచ్చక పొతే వట్టిగా వచ్చేస్తారా?? లేక ముందు ఉన్న వాటిలో నచ్చినవి పక్కకు పెట్టి.. మళ్ళీ వాటిలో నచ్చింది తీసుకుంటారా??” అని అడిగారు. ఎవరికి తోచింది వారు చెప్పాం.. కానీ ఈ రెంటిలో తేడా ఏంటని అడగలేదు. If actions speak the mind, can something to be read into these?? ఇది అడగాలనే రెండో కొడుపు నొప్పి!!
హన్నన్నా!! మీరు కూడా అతీతులు కారన్నమాట ! అవునులెండి అంతందంగా ఫోటో తీసి బ్లాగు లో పెడితే ఎవరు మాత్రం చూస్తూ ఉండ గలరు. మీ టపా బావుంది. అనుభవాన్ని మించిన పాఠశాల లేదు కదండీ…ఈ MBA లు అవీ కేవలం ఆ అనుభవాల సారాన్ని గరాటు పెట్టి స్టూడెంట్స్ బుర్రల్లోకి నింపి తద్వారా నేర్చుకోడానికి పట్టే సమయాన్ని కుదించే ప్రయత్నాలు మత్రమే…అందుకే famous business schools లో business leaders తో ఇప్పించే lectures క్లాస్ ల కన్నా ఎక్కువ ఉంటాయ్.
LikeLike
bravo!
LikeLike
చెప్పడం మరిచాను .. ఇది అసలు సిసలైన ఆడ రాత 🙂
LikeLike
వేణూ: “మీరు కూడా” అని నన్ను అన్నప్పుడల్లా ఓ వింత అనుభవం.. ఎదో నేను చాలా డిఫెరెంట్ అన్న ఫీలింగ్ ఇంతకు ముందు మీకిచ్చినట్టు. 🙂
ఏం రాసినా .. “బావుంది” అని ధైర్యం ఇచ్చే మీకు టన్నులకొద్దీ నెనర్లు మీ “హిచ్” తో తీసుకువెళ్ళడానికి ఎప్పుడు వస్తున్నారు??
మరేమోనండీ… కొత్త పాళీ గారండీ.. మీరన్నారు చూడండీ.. Bravo అని, మనసక్కడే ఆగిపోయిందండీ.. అటు పై కూడా మీరేదో అన్నట్టు ఉన్నా.. ఆయ్.. వినపట్టం లేదండీ.. 😉 ఎందుకంటారండీ?? :-))
మీకు అంకెలెంత వరకూ వచ్చో అన్ని ధన్యవాదాలు!!
LikeLike
“వచ్చే ప్రతీ అలా నిన్ను కేరింతలు కొట్టించడానికని
వీచే ప్రతీ గాలీ నీకు గిలిగింతలు పెట్టాలని
కురిసే ప్రతీ చుక్కా నీలో తుళ్ళింత పుట్టించాలని
ప్రతీ వెన్నెల నిన్ను మైమరపించి, అలుపుని దూరం చేసే పాట కాని జోల అని
చేరే…ప్రతి ఘడియా.. నువ్వు పదిమందిని స్పందింపచెసేట్టు చేయ్యడానికని….”
That reminds me of something..
“The truth is, we each of us have an inborn conviction that the whole world, with everybody and everything in it, was created as a sort of necessary appendage to ourselves. Our fellow men and women were made to admire us and to minister to our various requirements.
You and I, dear reader, are each the center of the universe in our respective opinions.”
LikeLike
ranjeeth:
did u meant the comment for this post?? I don’t think so..
If it was for the earlier one.. thanks for the quote. I’m reading abt it through google 🙂
Interesting insight!!
LikeLike
Purnima,
Yes, that was in response to the earlier post. You don’t have to spend a whole lot of time searching for that on google. Its taken from “Idle thoughts of Idle fellow” by Jerome K Jerome. here you go 🙂
http://www.literaturepage.com/read/idlethoughts.html
http://en.wikipedia.org/wiki/Jerome_K._Jerome
Ranjeeth
LikeLike
టెంప్లేటులు మార్చడం సరే .. కొత్త టపాకి వేళైంది!
బైదవే .. కొత్త టెంప్లేటూ బావుంది సీతాకోచిలుక!
LikeLike
కొత్త హంగులూ, రంగులూ బాగున్నాయ్!
టపాలు కూడా త్వరత్వరగా రాసేస్తే, ఆనందిస్తూ అభిప్రాయాలు తెలిపేస్తాం.
LikeLike