అమ్మా! బొమ్మ కొనిస్తా, నాతో ఉంటావా?


మృదుల సోఫాలో రెండు కాళ్ళు పైకి పెట్టి కూర్చుని, రెండు చేతులతో మోకాళ్ళని చుట్టి, తలను దాచేసుకుని ఏడుస్తోంది. శరత్ రెండడుగుల దూరంలో అసహనంగా, ఆయాసంగా కదులుతున్నాడు. ఆమె కన్నీరాగడం లేదు, అతని కాళ్ళాడడం లేదు. ఓ రెండు మూడు నిముషాలు అలాగే తిరిగాక, ఇక లాభం లేదనకుని, ఆమె ఎదురుగా నేల మీద కూర్చున్నాడు ఆమె తలను నిమురుతూ. తన బాధ అతడిని నిలువనివ్వటం లేదని గుర్తించి, పొంగి వస్తున్న దుఃఖానికి ఎలాగోలా ఆనకట్ట వేయాలని... Continue Reading →

The Last Lecture నోట్స్ కావాలా? :-)


"వీకెండ్ ఏం చేశావు?" అని అడుగుతుంటే ఒక పుస్తకం చదివాను అని చెప్పాలి అసలైతే, కానీ "క్లాసు లో ఉన్నా ఇంత సేపూ" అని అనాలి అనిపించేంతగా ఉంది ఈ పుస్తకం. మరి క్లాసు అటెండ్ అయితే నోట్స్ ఉంటుంది కదా? అదే ఈ టపా! ఒక్కప్పుడైతే మన నోట్స్ కి తెగ ఫాన్ ఫాలోయింగ్ ఉండేది, అన్ని చోట్ల. ఇప్పుడు పూర్తిగా అలవాటు తప్పిపోయింది. క్లాస్: The Last Lecture book లెక్చరర్: Randy Pausch... Continue Reading →

అన్ని ప్రమదావనాలు ఒక్కలా ఉండవు ;-)


06.09.2008 నాడు జరిగిన ప్రమదావనం మీటింగు రిపోర్ట్ /మినిట్స్ ! అతిధులు: సాలభంజికల నాగరాజు గారు, చదువరి గారు, నెటిజన్ గారు ముందుగా జ్యోతిగారు, సుజ్జిగారు మీటింగ్ కి వచ్చారు. కాసేపటికి నేను, నెటిజన్ గారు, జ్ఞానప్రసూన గారు వచ్చాము. సుజ్జిగారి బ్లాగు లంకె ఇవ్వగా, ఆ బ్లాగును చూశారు, ఇది వరకూ తెలియని వారు. ఇంతలో జ్యోతిగారు, ఈ కింది ప్రశ్న అడిగారు: జ్యోతి: నెటిజన్, poornima, సిబిరావుగారు అన్నట్టు మహిళా బ్లాగులలో అంతా సోది... Continue Reading →

లవ్ ఇన్ ది టైమ్ ఆఫ్ కలరా!


(గమనిక: ఈ టపా ముఖ్యోద్దేశ్యం, Gabriel García Márquez రచించిన Love in the Time of Cholera అనే పుస్తకం చదువుతున్నప్పుడు గానీ, చదవడం పూర్తయ్యాకా గానీ నాలో కలిగిన ఆలోచనలు ఇక్కడ పెట్టడం మాత్రమే. దీన్ని సమీక్ష అని నేననుకోవటం లేదు. పైగా ఇవి ఈ క్షణానివి. మున్ముందు ఇవి మారే అవకాశం ఉంది. ఈ పుస్తకాన్ని ఇది వరకే చదువున్న వారు, తమ అభిప్రాయాలని తెలిజేస్తే నా ఆలోచనా పరిధిని విస్తరించుకునే అవకాశం... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑

<span>%d</span> bloggers like this: