Affectionately dedicated to HP Compaq 6720s

లవ్ ఇన్ ది టైమ్ ఆఫ్ కలరా!

(గమనిక: ఈ టపా ముఖ్యోద్దేశ్యం, Gabriel García Márquez రచించిన Love in the Time of Cholera అనే పుస్తకం చదువుతున్నప్పుడు గానీ, చదవడం పూర్తయ్యాకా గానీ నాలో కలిగిన ఆలోచనలు ఇక్కడ పెట్టడం మాత్రమే. దీన్ని సమీక్ష అని నేననుకోవటం లేదు. పైగా ఇవి ఈ క్షణానివి. మున్ముందు ఇవి మారే అవకాశం ఉంది. ఈ పుస్తకాన్ని ఇది వరకే చదువున్న వారు, తమ అభిప్రాయాలని తెలిజేస్తే నా ఆలోచనా పరిధిని విస్తరించుకునే అవకాశం ఉంటుందనే స్వార్ధంతో కూడిన ప్రయత్నం)

కథేంటంటే:
మొదట ఈ రచన గురించి తెలిసినప్పుడు, “ప్రేమకథే కదా!” అని పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. ఇంక్కొంచెం తెలుసుకునే సరికి “ప్రేమ కథే అయినా ప్రయత్నించచ్చు” అనుకున్నా. తీరా యెడా పెడా దీని గురించే వెతికే సరికి “ప్రేమకథే.. కానీ రొటీన్ కి భిన్నమైనది” అని గుర్తించి పుస్తకం మొదలెట్టా! ఒక అబ్బాయి తన టీనేజ్ లో ఒక అందమైన అమ్మాయిని చూసీ చూడగానే మనసు పారేసుకుంటాడు. వెంటపడతాడు, ప్రేమించి పెళ్ళాడమని అర్ధింస్తాడు. ముందు కాదూ కూడదు అన్న అమ్మాయి మెల్లి మెల్లిగా అతడి వైపు మొగ్గు చూపుతుంది. ఇంట్లో ఈ విషయం తెలిస్తే కష్టం కావున రహస్యంగా ఉత్తరాల ద్వారా సంభాషించుకుంటుంటారు. ఇది అమ్మాయి తండ్రికి తెలిసి పోతుంది. అందంలోనూ, ఆస్తిలోనూ, కుటుంబ గౌరవంలోనూ తనకి తగడని తెలిసి అబ్బాయిని బెదిరిస్తాడు. ఫలించక అమ్మాయిని దూర ప్రాంతాన్నికి తీసుకెళ్తాడు. విరహాగ్నిలో మండుతున్న మనసులను టెలిగ్రాములు కలుపుతాయి! నిరీక్షణ ఫలించి ఆమె సొంత ఊరికి వచ్చిందని తెలిసిన హీరో ఆమెను ఆటపట్టించాడానికి చాటుగా ఫాలో అయ్యి, ఆ అమ్మాయిని సర్ ప్రైజ్ చేద్దామనుకుంటాడు. ఆ అమ్మి “నిన్నా నేను ప్రేమించింది? ఛీ పో” అంటుంది. ఇతగాడి హృదయం ముక్కలవుతుంది. కొంత కాలాని పేరున్న డాక్టర్ తో అంతగా ఇష్టం లేకపోయినా ఆ అమ్మి పెళ్ళయ్యిపోతుంది. హీరో పిచ్చివాడై తిరుగుతుంటాడు. ఆమెను మర్చిపోలేకపోతాడు, అయినా ఇతర స్త్రీల నుండి తనకి కావాల్సింది పొందుతూనే ఉంటాడు. హీరోయిన్ వైవాహిక జీవితం కాస్త ఒడుదుడుగలతో, కాస్త ఆనందం, మరి కాస్త అసహనంతో అటూ ఇటూ అయినా, “అన్యోన్య దాంపత్యం” అని అనిపించుకునేలా నిలబడుతుంది. ఈ క్రమంలో యాభై ఏళ్ళు గడిచేసరికి, డాక్టరు గారు మరణిస్తారు. అప్పుడు మన హీరో వెళ్ళి “ఈ రోజు కోసమే ఇంత కాలం వేచి చూశాను, మనం పెళ్ళి చేసుకుంద్దాం” అని అంటాడు. ఆవిడ (డైబ్బై ఏళ్ళ ఆమెను ఇక అమ్మాయి అనలేము కదా!) మళ్ళీ “ఛీ పో” అంటుంది. హీరో మళ్ళీ ఉత్తరాలు రాస్తాడు, ఈ సారి టైపు మెషీన్లో! ఫోన్లో కూడా! మొత్తానికి ఈ సారి తను ఒప్పుకుని వారిరువురూ కలిసి సహజీవనం కొనసాగిస్తారు.

అస్సలూ.. కథేంటంటే:
ఇదే కథ అని తెలుసుంటే నేనీ పుస్తకాన్ని ముట్టుకునే దాన్ని కాదు. తెలిసే సరికి ఆలస్యం అయ్యింది. అప్పటికే నేను పుస్తకంలో మునిగి పోయాను. ఈ రచనని మొదలెట్టడమే మన చేతుల్లో ఉంది. అటు తర్వాత మనల్ని తనకిష్టం వచ్చినట్టు ముందుకీ వెనక్కీ ఓ శతాబ్ద కాలంలో తిప్పుతాడు రచయిత. ఎప్పుడు ఏ విషయమైనా చెప్పేస్తాడు. ఊరించడు, టెన్షన్ పెట్టడు, కానీ ఊపిరి ఆడనివ్వడు. అంతా అయ్యిపోయాకా “ఇదా కథా?” అని బిక్కమొహం పెట్టలేదు, “అసలేంటీ కథా?” అంటే నాకర్ధమయ్యిందేంటంటే It is (just) NOT a love story! If at all love has a story for itself, it is this. Love in all kinds, in all forms and in all disguises. ఇది కేవలం ప్లొరెంటినో, ఫెర్మినా ప్రేమ కథే అనుకున్నా రచయిత శైలి వల్ల బాగుందనిపిస్తుంది, నాకు ఈ వచనం కొత్తగా, హాయిగా అనిపించింది. ఈ ఇరు పాత్రలపై సానుభూతి, సహానుభూతి, జాలి, కరుణ వైగారా లన్నీ పుష్కలంగా పుట్టుకొస్తాయి. ముఖ్యంగా ఫ్లొరెంటినో పిచ్చితనం, మొండితనం గురించి చదువుతున్నంత సేపూ నాకు పిచ్చి ఎక్కింది. అతడి బాధను చూసి (చూపిస్తాడు రచయిత) ఏం చెప్పాలో, ఏం అనాలో తెలీక నిస్సహాయంగా ఉండిపోయాను. (ఇది ఒక నవలలో కాల్పనిక పాత్ర కాబట్టి నా స్పందన కాస్త అతిగా అనిపించచ్చు. కానీ నిజజీవితంలో కూడా ఎప్పుడైనా ఎవరైనా ప్రేమ బారిన పడితే వారిని ఓదార్చలేము, అలా అని వదిలేసి ఊరుకోలేము. అప్పటి వరకూ వాళ్ళ జీవితంలో మనది అతి ముఖ్య పాత్ర అయినా ప్రేమ విషయానికి వచ్చేసరికి కేవలం “ప్రేక్షక పాత్ర” కి పరిమితం అవుతాము. ఆ పరిస్థితిని ఎలా వర్ణించాలో నాకు తెలీటం లేదు.) ఇక వారు జీవిత చరమాకంలో తీసుకున్న నిర్ణయం కాస్త (విశాలంగా) ఆలోచిస్తే సహేతుకమనిపిస్తుంది. పూర్తిగా నమ్మశక్యంకాని పాత్రను కూడా మనస్పూర్తిగా ఒప్పేసుకోవచ్చు. కాకపోతే ఈ రచనలో ఇంకా చాలా విషయం ఉంది.

కథ యొక్క కథ ఏటంటే:
ఇప్పుడు జమ్మూ నుండీ కన్యాకుమారి వరకూ ఒక నాన్-స్టాప్ రైలు ఉందనుకోండి. జమ్మూ లో ఎక్కేసామనుకోండి. మార్గంలో భారత దేశాన్ని చాలా వరకూ చూడచ్చు. ఎన్నో వింతలూ, విశేషాలూ, గట్లు, చెట్లు, పుట్టలు, కొండలు కోనలూ అన్నీ కనిపిస్తుంటాయి. కాసేపు ఆగి చూసుకోవాలనిపిస్తుంది. వీలుంటే దిగి ఫోటోలు తీసుకోవాలనిపిస్తుంది. కానీ రైలు ఆగదు. అది, దానితో పాటు మనం వెళ్తూనే ఉంటాము. మన మనస్సులో వీటన్నింటి స్నాప్ షాట్స్ మాత్రమే మిగులుతాయి. ఈ పుస్తకం ఒక నాన్-స్టాప్ రైలు బండి అనుకుంటే మనం తిరొగొచ్చేది “ప్రేమ“ను మాట. చూపించాల్సినవి చూపిస్తూనే ఎక్కడా ఎక్కువ సేపు నిలిచిపోకుండా రచయిత మనల్ని తీసుకెళ్తుంటాడు.
ఉదాహరణలు: ప్రేమ కోసం చావడాలు, చంపుకోడాలు మనికి కొత్త కాదు. కానీ “చావులోనే నాకు ఆనందం” అన్న ప్రియుణికి దగ్గరనుండి చనిపోడానికి సహకరించే ప్రియురాలు ఉందంటే విస్తుపోయే సమయం ఉండదు. వధూవరులిద్దరూ చిటికెన వేళ్ళు పట్టుకుని వైవాహిక జీవితాన్ని మొదలెడతారు. కొత్త ప్రపంచంలో అమ్మాయికి అన్నింటికీ ఆ అబ్బాయి మార్గదర్శకం. ఎన్నో ఉడుదుడుకులు ఎదుర్కొటున్నా జీవన నౌక మాత్రం సాఫీగా సాగటం వీరి ప్రధమ లక్ష్యం. బాధ్యతలన్నీ తీరి జీవన సంధ్యలో ఉండగా వయస్సు మీద పడి, వృద్ధాప్యంలో మళ్ళీ బాల్యం చూసుకుంటూ అతడిని కాపాడుకోవటం ఇప్పుడామె వంతు. For a husband, wife is the first daughter అని ఎక్కడో చదివాను. ఈ నవల చదివేటప్పుడు And for a wife, husband is the last son అని పొడిగించాలి ఏమో అనిపిస్తూ ఉంది, కానీ ముందుకెళ్ళక తప్పలేదు. ఆమె వంటి పరిమళం తనలో ఇమిడిపోవాలని, ఆ పరిమళానికి దగ్గ్రరగా ఉండే పూరేకుల రసాన్ని తాగి వాంతి చేసుకున్న పద్దెనిమ్మిదేళ్ళ అబ్బిని తిట్టుకోవాలో, జాలిపడాలో తేల్చుకునే లోపు బండి సాగిపోతుంది. ఇక కొన్ని రకాల ప్రేమలు చదువుతున్నప్పుడైతే పుస్తకాన్ని నేలకేసి కొట్టాలి అనేంత విరక్తి కలిగింది. కొట్టేలోపే, వాటిని దాటి పోవాల్సి వచ్చింది. రైలు కదులుతుండగానే ఫొటోలు తీసినట్టు, ఈ రచనలో కొన్ని వర్ణనలను, పంక్తులను మార్కు చేసుకున్నాను. కానీ వాటి వల్ల ఎంత ఉపయోగమో చూడాలి.  విడిగా రాయడానికి ప్రయత్నిస్తే బాగుంటుందనిపించింది.

కథ వెనుక కథేంటి?
“ఇరవయ్యోకటో శతాబ్దంలో ఇరవయ్యో పడిలో ఉన్నవారు ప్రేమ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ప్రేమంటే ఏమిటసలు? మనతో పాటు మన సమాజానికీ నచ్చితే అది ప్రేమ, లేకపోతే ఏదో ఒక అనకూడని పదాలు వాడేసి తప్పించుకుంటున్నామా? మనం ప్రేమను, ఏ ముసుగూ లేకుండా, ఆహ్వాన్నించగలమా? ప్రేమంటే రొమాంటిక్ ఇంకా ఫీల్ గుడ్ మాత్రమేనా?” లాంటి ఆలోచనలతో కాసేపు కొట్టుకుని, నాకెక్కిన పిచ్చి కనపడిన ప్రతీ వారినీ ప్రశ్నిస్తూ వారికి కొంచెం కొంచెం పంచుకుంటూ, కాసేపటికో కొన్నాళ్ళకో పక్కకి పెట్టేయడం మామూలుగా జరగాల్సినవి. కాకపోతే, ఎందుకో తెలీదు కానీ, I want to reverse engineer, this piece of art! రచయిత ఎందుకు అలానే రాశాడు అన్నది నన్ను వేధిస్తున్న ప్రశ్న. రెండు అంగుళాలు కూడా లేని  చిట్టి పాదాలు ఓ పెద్ద మనిషి చెప్పులు వేసుకుని నడవడమల్లే ఉంటుంది నేనీ ప్రయత్నం చేస్తే! అయినా చేస్తా!
నాకయితే ఇందులో ఉన్న ముఖ్య పాత్రలు అమ్మాయి, అబ్బాయి, ఇంకా అమ్మాయి భర్త:  ఆ అబ్బాయి ప్రేమకి పరాకాష్ఠ కాదు, మనుష్యాకారం ప్రేమకి. అందుకే అతని ఆకారం తికమక పెట్టించేలా ఉంటుంది, ఊరూ పేరూ, సమాజ గౌరవం లాంటివేవీ ఉండవు. చీదరించుకున్నా ఎవ్వరూ అతడిని తప్పించుకోలేరు. ఆ అమ్మాయి భర్త పెళ్ళికీ, లేకపోతే మన వ్యవస్థకీ ప్రతీక. అందుకే అన్ని హంగులూ ఉంటాయి అతనికి, డబ్బు, పరపతి, హోదా వగైరా వగైరా! ఒకచోట ఆ ఆమె అనుకుంటుంది, “ఇన్ని ఉన్నా ఇతడు చాలా వీక్” అని, అచ్చు వ్వవస్థలానే! ఇక ఆ అమ్మాయి ఒక సామాన్య మనిషి. ప్రేమకీ వ్యవస్థకీ మధ్య నలిగే ఒక సాధారణ మనిషి. ఈ రచనకి సంబంధించి వ్యాసాలు, రచయిత ఆలోచనలూ చదివితే ఏమైనా తెలుస్తుందేమో! కానీ అందాకా నా ఊహలను ఆపటం కష్టం.
ఇంకో తమాషా ఊహ ఏంటంటే, చిన్ని పిల్లలు చేయద్దు అన్న పనులు చేస్తే తల్లిదండ్రులు తిట్టడమో, కొట్టడమో చేస్తారు. అదే తాతయ్యలూ అమ్మమ్మలూ బుజ్జగిస్తూ కథ చెప్తూ ఆ కథలోనే పిల్లలకి చేరాల్సిన విషయం చేరేలా చూస్తారు. అందులోనే చెంపదబ్బలు ఉంటాయి, కానీ మనకి తగలవు. విశ్వజనీయమైన ప్రేమను వ్యవస్థ బంధనాల్లో ఇరికించే సమాజం / మనుష్యులు / ఆలోచనల మీద ఒక సటైర్ ఈ రచన అని నాకనిపిస్తోంది.

ఈ పుస్తకం చదవాలా?
నా ఆలోచనలతో ఇంకా ఉన్నందుకు ముందుగా ధన్యవాదాలు. ఈ పుస్తకం చదవాలా వద్దా అని ఆలోచిస్తుంటే ఒకటి చెప్పనా? వెన్నెలంటే అందరకీ ఇష్టమే! కాకపోతే there is a darker side of the moon as well. ఆహ్లాదం కలిగించే వెన్నెల నుండీ అమావాస్య తెచ్చే చిమ్మ చీకటని వరకూ  అన్నీ “భరించగలరు” అని అనుకుంటే ఈ పుస్తకాన్ని చదవండి. లేకపోతే లైట్! 😉 ఇంకా ఎంతో రాయాలని ఉంది, ఈ ఆలోచనల తూఫాను తగ్గాక ప్రయత్నిస్తా, I’m not done yet, neither with the book, nor its author!

* This book is so easily available in the pdf format on net, but is not advisable to read it there. 🙂

15 Responses to “లవ్ ఇన్ ది టైమ్ ఆఫ్ కలరా!”

 1. కత్తి మహేష్ కుమార్

  ఇది సెటైరిక రచన కాదు. Existentialism అనే ఒక తాత్విక ప్రక్రియకి సంబంధించిన తరహా రచనగా నాకు అనిపించింది. ఈ పుస్తకం నేను చదవకపోయినా, నువ్వు వివరించిన తీరు చాలా బాగుంది.

  Like

  Reply
 2. ఫణీంద్ర

  That’s a wonderful review Purnima. చాలా బాగా రాశావు.

  “It is (just) NOT a love story! If at all love has a story for itself, it is this. Love in all kinds, in all forms and in all disguises.”

  This is the best sentence to summarize this novel. కానీ ఈ వాక్యానికి మరొకటి కూడా చేర్చాలి: “…without any moral judgements.” ఇందులో ప్రేమని, ప్రపంచాన్ని నైతికానైతికాల ప్రసక్తి లేకుండా చూస్తాడు రచయిత. చదువరిగా నువ్వు కూడా అలా చదవగలిగితేనే ఈ పుస్తకం నీకు నచ్చుతుంది. అలా నువ్వు చదవలేక పోయావు బహుశా; అందుకే కొన్ని భాగాలు నచ్చలేదు. నాకైతే ఇందులో నువ్వన్న “చిమ్మ చీకటి” ఎక్కడా కనపడలేదు, అంతా వెన్నెలే!

  “వెన్నెలంటే అందరకీ ఇష్టమే! కాకపోతే there is a darker side of the moon as well.”

  ఉదాహరణలు అంతా చెడగొడ్తాయని చెప్పాను. ఇదీ అంతే. చంద్రుణ్ణి నిజంగా ప్రేమించేవాడు…. ఎందుకులే మెటాఫోర్ వద్దు, ప్రేమని నిజంగా ప్రేమించేవాడు దాన్ని చీకటి వెలుగుల సహితంగా ప్రేమిస్తాడు.

  ఇంకోటేంటంటే, symbols వెతికే అలవాటు మానుకో. ఈ నవల్లో ఎవరూ ఎవరికీ ప్రతీకలు కారు.

  “…అదే తాతయ్యలూ అమ్మమ్మలూ బుజ్జగిస్తూ కథ చెప్తూ ఆ కథలోనే పిల్లలకి చేరాల్సిన విషయం చేరేలా చూస్తారు. అందులోనే చెంపదబ్బలు ఉంటాయి, కానీ మనకి తగలవు. విశ్వజనీయమైన ప్రేమను వ్యవస్థ బంధనాల్లో ఇరికించే సమాజం / మనుష్యులు / ఆలోచనల మీద ఒక సటైర్ ఈ రచన అని నాకనిపిస్తోంది.”

  జాగ్రత్త పూర్ణిమా! నీక్కూడా విమర్శకుల లక్షణాలు వచ్చేస్తున్నాయి. ఇదంతా వాళ్ళ భాషే. ఆయన ఇక్కడ ఎవరికీ ఎమీ నేర్పటం లేదు. అర్థాలు వెతకడం మానుకోలేవా.

  రచయిత ఎందుకు అలానే రాశాడు అన్నది నన్ను వేధిస్తున్న ప్రశ్న.

  సమాధానం: రచయిత ఎందుకు అలా రాశాడంటే ఆయన ప్రేమను అలా చూశాడు కాబట్టి.

  అలాగే ఇందులో Existential తాత్వికత కూడా ఏమీ లేదు.

  ఫ్లోరెంటినోలు నిజంగా ఉండచ్చంటూ, ప్రేయసి కోసం కొండ తొలిచి మెట్లు కట్టిన చైనా మనిషి గురించి చెప్పాను కదా. ఈ లింక్ చూడు.

  http://www.weirdasianews.com/2007/12/15/man-carves-wife-a-6000-stair-path-in-mountain/

  (మూడో ఫోటోలో ఆ చికిలి కళ్ళలో కూడా ఎంత ప్రేమ కనిపిస్తుందో కదా!)

  Like

  Reply
 3. sujji

  poornima garu… meere vaka pustakam raaseyandi.. chala simple ga , sooti ga, saralam ga, haayiga, untai mee sameekshalu.

  Like

  Reply
 4. ఫణీంద్ర

  Anyway, the most wierd thing about this world is that this love story is thought fit to be published in a Weird News website. May be Florentino’s are rare.

  Like

  Reply
 5. మురారి

  meeru cheyyaboye ‘reverse engineering’ prayatnaaniki naa subhaakaankshalu.

  Like

  Reply
 6. సిరిసిరిమువ్వ

  పూర్ణిమా, ఈ టపా నీదైన తరహాలో చాలా బాగుంది. అసలు కథ కన్నా దాని మీద నీ ఆలోచనలు బాగున్నాయి.

  Like

  Reply
 7. సుజాత

  pdf format లో పుస్తకాలు ఎడా పెడా చదివేసే స్థితికి నేనింకా చేరలేదు. నాకసలు అల్లా ఇష్టం ఉండదు. హాయిగా కూచుని, లేక నిలబడైనా(కిచెన్లో ఒక పక్క వండుతూ) సరే పుస్తకం పుస్తకంగా హస్త భూషణంలా ధరించి చదవడం బాగుంటుంది. సరే, ఏం చేస్తాం, నీ రివ్యూ చదివాక ఎక్కడున్నా ఎలా వున్నా చదవాలనిపిస్తోంది.

  సరే, చదువుదాం!

  Like

  Reply
 8. Purnima

  మహేశ్: మీరు తప్పకుండా ఈ పుస్తకం చదవండి. ఈ రచన చదివిన తర్వాత మీ ఆలోచనలు తెలుసుకోవాలని నాకు చాలా ఆరాటంగా ఉంది. చదవడానికి ప్రయత్నించండి.

  అన్నట్టు, Existentialism అంటే ఏమిటో తేలిక పదాల్లో ఒక టపా రాయగలారా?

  సుజ్జి: నా బ్లాగులు చూసి మా వాళ్ళేమంటారో తెలుసా? పోస్టులు రాయకుండా, పుస్తకాలూ, గ్రంధాలూ రాస్తావే అని ఉడికిస్తారు. ఏవో ఒకటి ఇప్పటికి ఇలా కానిచ్చేద్దామా?

  మురారి: థాంక్స్! అసలు అంతకన్నా ముందు ఈ పుస్తకంలోని కొన్ని సీన్లు, వర్ణనలు, కారెక్టర్స్ గురించి రాస్తాను.

  వరూధిణి గారు: నెనర్లండీ! మీ వ్యాఖ్య చూడగానే పుస్తకం చదివుంటారు అనుకున్నా? చదివారా?

  సుజాత గారు: పి.డి.ఎఫ్ అంటే తప్పనిసరి పరిస్థితుల్లో తప్పించి, మిగితా అప్పుడంతా తప్పించుకోవాలి. ఈ పుస్తకాన్ని చదవండి, మీ స్పందనలకై వేచి చూస్తాను.

  Like

  Reply
 9. Purnima

  ఫణీ:

  "…without any moral judgements." అన్న పొడిగింపు చాలా కరెక్ట్. నైతికానైతికలో, నా ఆలోచనా తీరో, ఏదో నాకు ఇబ్బంది కలిగించింది. అన్నింటినీ "accept" చేయగలమా అన్నది నాకు అనుమానమే! You don't like examples, and I can't talk without them. :-(( However good people/ things / feelings are to us, we expect them to be with certain niceties. To be blunt, we like the packaging, as much or more than the content, at times. There may be exceptions, but not always, not in every case.

  >>ప్రేమని నిజంగా ప్రేమించేవాడు దాన్ని చీకటి వెలుగుల సహితంగా ప్రేమిస్తాడు.

  నీ పాయింట్ నాకర్ధమయ్యింది. కానీ నిజంగా అనేది ఒకటి ఉంటే, నిజం కానిదీ ఉంటుంది కదా? అప్పుడు అలాంటి వారికి చీకటి అనిపించదా? ఇవ్వన్నీ వ్యక్తిగతంగా ఎవరికి వారం చెప్పుకోవాల్సిన సమాధానాలు. అంతా వెన్నెలే అనిపిస్తే సంతోషమే కదా!

  symbols and meanings in the writings – awful stuck with them. ఈ రచనకి వాటిని ఆపాదించటం కూడా దుస్సాహసమే! టపాలోనే ఒప్పుకున్నాను. టపాలో రాయకుండా ఉండచ్చు, కానీ నేను అలా ఆలోచించాను కాసేపైనా, అందుకే నిజాయితీ రాసేసాను. వాటికోసం ఆలోచించే కొద్దీ ఆ ప్రయత్నం ఎంత చెత్తో అర్ధం అవుతోంది. నువ్వు చెప్పినందుకు కాకపోయినా, నాకే నచ్చక ఆ ప్రయత్నాన్ని మానవచ్చు! 🙂

  >>సమాధానం: రచయిత ఎందుకు అలా రాశాడంటే ఆయన ప్రేమను అలా చూశాడు కాబట్టి.

  perfect! అంతేనేమో! అంతకన్నా ఏమీ లేదేమో!

  Boy! I can't be a critic Phani. లేకపోతే ఇది ఇలా ఉండదు. This is not a book review, these are the impressions the book left on me.
  ఈ రచనలో కొన్ని సంఘటనలు కానీ, పాత్రలు కానీ వాటిపై ఇంకో టపాలో రాస్తా. అప్పుడు చర్చకి ఇంకా అవకాశం ఉంటుంది.

  ఫ్లొరెంటినో గురించి ఒక లైన్ ఉంటుంది: he's ugly and sad, but he is all love అని. Yes, he is very much possible!

  Thanks for the link, informative.

  >> May be Florentino's are rare.

  Florentinos are possible, మనం ఒప్పుకోలేమంతే! అందుకే ఆ చైనా జంట గురించి వార్త అక్కడ వచ్చింది.

  Like

  Reply
 10. కొత్త పాళీ

  పూర్ణిమ .. ఈ నవలని ఇప్పుడే మొదలెట్టి ఇంక పదో పేజీలోనే ఉన్నాను. చదవడం అయ్యాకే మీ ఈ సమీక్ష కాని సమీక్ష కి వస్తాను 🙂

  మహేష్ .. ఈ నవల ఇంకా ఇప్పుడే చదువుతూ ఉన్నాను గానీ మార్క్వేజ్ రచనల్లో ఇప్పటి వరకూ నాకెక్కడా ఎగ్జిస్టెన్షియల్ ధోరణి కనబళ్ళేదు

  Like

  Reply
 11. నిషిగంధ

  పూర్ణీ, ఈ పుస్తకంతో నీలో మిగిల్చిన స్నాప్ షాట్స్ గురించి చదువుతుంటే ఈ నిమిషంలో బుక్ సంపాదించేసి, ఓ కిటికీ పక్కకి చేరి, పూర్తయ్యేవరకూ ప్రపంచాన్ని పట్టించుకోకూడదనిపిస్తుంది!!

  Like

  Reply
 12. Ram

  Mee rachanalu chadivanu. Bagunnayi. Mukyanga mee saili chala bagundi. Nijam cheppalante Chlamni gurtuku techharu. Mee alochanalu bagane unnayi kaani avi asampurtiga unnayi. Meeru konni pustakalu chadvite inka baga alochinchagalarani anukutunnanu.
  Rnaganayakammagari pustakalu eppudina chadivara??Avida pustakalu chala baguntayi.Meeku veelunte avida rasina "Sweet Home" & "Janaki Vimukti" chadavandi. Jeevitaniki samabandhinchi enno vishayalanu ee pustakaala dwara telusukovachhu.

  Like

  Reply
 13. దుప్పల రవికుమార్

  పూర్ణిమ గారూ, మీ వ్యాసం చాలా ఆలస్యంగా చదివాను. నిజానికి సమీక్ష కాదంటూనే చాలా చక్కగా సమీక్షించారు. అద్భుతమైన పరిచయం. నేనింకా మార్క్వెజ్ పుస్తకం చదవలేదు. కానీ , మీరు “లవ్ ఇన్ ది టైమ్ ఆఫ్ కలరా “చదవడానికి చక్కని ఎపిటైజర్ ను మాకందించారు. ఇవ్వాళ్టి ఇంజనీర్లు సరదా ఆలోచనపరులు కారని, సీరియస్ గా విషయాలను పరిశీలిస్తున్నారని మరోమారు నిరూపించారు. మీనుంచి మరిన్ని మంచి వ్యాసాల కోసం ఎదురుచూస్తూ…

  Like

  Reply
 14. వేణూ శ్రీకాంత్

  మీ సమీక్షలు / పరిచయాల ద్వారా మంచి పుస్తకాల గురించి తెలుసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషం గా వుంది పూర్ణిమా. Thank you.

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Basic HTML is allowed. Your email address will not be published.

Subscribe to this comment feed via RSS

%d bloggers like this: