అన్ని ప్రమదావనాలు ఒక్కలా ఉండవు ;-)

Posted by

06.09.2008 నాడు జరిగిన ప్రమదావనం మీటింగు రిపోర్ట్ /మినిట్స్ !

అతిధులు: సాలభంజికల నాగరాజు గారు, చదువరి గారు, నెటిజన్ గారు

ముందుగా జ్యోతిగారు, సుజ్జిగారు మీటింగ్ కి వచ్చారు. కాసేపటికి నేను, నెటిజన్ గారు, జ్ఞానప్రసూన గారు వచ్చాము. సుజ్జిగారి బ్లాగు లంకె ఇవ్వగా, ఆ బ్లాగును చూశారు, ఇది వరకూ తెలియని వారు.

ఇంతలో జ్యోతిగారు, ఈ కింది ప్రశ్న అడిగారు:
జ్యోతి: నెటిజన్, poornima, సిబిరావుగారు అన్నట్టు మహిళా బ్లాగులలో అంతా సోది రాస్తారా?

దానికి వచ్చిన అభిప్రాయాలు:
నెటిజన్: లేదు, అలా అనిపించలేదు ఎప్పుడు.
sujji :  పూర్ణిమ గారి బ్లాగు చూస్తే ఎవరూ అలా అనరు. అలా అంటే మేల్ బ్లాగర్ల నుండే ఎక్కువ సోది చదువుతాము.
నెటిజన్ :  జ్యోతి, పూర్ణిమ గారి గురించి సీ బా రావు గారి చక్కటి పరిచయం వ్రాసారు, అందులో సోది ఐతే రాయకపోదురేమో
poornima :  నన్నడిగితే మన అభిరుచులను బట్టి, అబిప్రాయాలను బట్టి మనకి నచ్చినవి, నచ్చనవి అని చెప్తాం. నచ్చని వాటిని సోదనో, చెత్తనో అనకోవచ్చు.. అది వారి స్వంత అభిప్రాయమే కానీ, మనం ఏమీ చెప్పలేము
నెటిజన్: sujji, మీకు ఏ మగవారి బ్లాగులో సోది కనపడింది?
sujji : అలా చెప్పటం బాగుండదు ఏమో! పైగా, నా టేస్ట్ ని బట్టి, నాకు సోది అనిపించవచ్చు.

“మాటలు కదలడం లేదో” అని అప్పటికే జ్ఞానప్రసూన గారు అంటూ ఉన్నారు, ఇంతలో మాలతి గారు వచ్చారు. వెనువెంటనే సాలభంజికల నాగరాజు గారు కూడాను. చదువరి గారి కోసం ఎదురు చూపులతోనే కుశల ప్రశ్నలు, పరిచయాలు జరిగాయి.

జ్యోతి : సాలభంజికలు, మీ గురించి కాస్త చెప్పండి
సాలభంజికలు :   జ్యోతి – చెప్పడం కంటే, చెప్పుడు మాటలే బావుంటాయి 🙂
poornima : సాలభంజికలు, చెప్పుడు మాటలు ఎక్కువగా వినిపించాలి అంటే, మనం , మన బ్లాగూ ఆక్టివ్ గా ఉండాలి ఏమో!
జ్యోతి : మీ బ్లాగు ఎందుకు మూసేసారో చెప్పండి .
నెటిజన్ : సాలభంజికలు, రాగానే మొదలెట్టారు, సీ బీ రావు గారు స్త్రీ లా బ్లాగులలో సోది ఉంటుంది అని అంటున్నారు అని 🙂
poornima : సాలభంజికలు, ఇప్పుడూ కొత్త వారికి మీరు మీరుగానే పరిచయం అవ్వాలి కదా!
జ్యోతి :   రాయకపోతే మూసేయడమే..
నెటిజన్  : poornima, మీరు చెప్పేది నిజం
సాలభంజికలు :   ఓ — అదంతా ఓ దీనగాధ, గొప్ప మహిళా చిత్రం. ఇప్పుడదంతా చెప్తే పాపం మీరంతా కొంగులతోనో, చున్నీలతోనో కళ్ళొత్తుకొని – త్యాగశీలివయ్యా, బాబూ అంటూ కోరస్ ఎత్తు కుంటారేమో..

మేమంతా సినిమాకి రెడీ అవుతుంటే, మాలతి గారి నెట్ ఫట్ మని, ఆవిడ నిష్క్రమించారు. అటు తర్వాత సాలభంజికల కథ విని కాసేపు తల్లడిల్లిపోయాను. వ్యక్తిగత కారణాల వల్ల వారు ప్రస్తుతానికి బ్లాగు మూసేసినా, త్వరలోనే తిరిగి ప్రారంభిస్తారని, ఈ లోపు మనతో పాటు ఇలానే కొనసాగుతారని ఆశిద్దాం. ఆ ఆశకి చిన్న ఆశ పుట్టేలా ఉన్నాయి ఈ మాటలు:
నెటిజన్ :  సాలభంజికలు – కాని మీరు ఆ ౧౨౩, ఎన్ ఎస్ జీ తరువాయి భాగం కూడ ముగిస్తే బాగుండేది.
సాలభంజికలు :  నెటిజన్ – చూస్తానండీ, వీలుంటే రాసి పొద్దుకి పంపుతా. ఆ వ్యాసం ఎలాగూ చాలా వరకూ పూర్తి చేసాను. కాస్త తుది మెరుగులు దిద్దాలి.

అప్పుడే చదువరి గారు ఎంట్రీ ఇచ్చారు. ప్రమదావనానికి దారి తెలీక, కూడలి కబుర్రుల్లో ఉంటే ఎవరైనా వచ్చి తీసుకెళ్తారేమో అని ఎదురు చూశారట. ఇక ప్రశ్నల పరంపర కొనసాగాయి. వాటిలో కొన్ని కారాలు, చమత్కారాలు.

చదువరి :   సాలభంజికలు, ఎలా ఉన్నారు?
సాలభంజికలు :   చదువరి – ఏదో మీ దయ.
చదువరి  :  నా దయా? ఇక్కడికొచ్చాక నా దయా మీ దయా చెల్లదయా!

జ్యోతి : సాలభంజికలు, మీరు నెట్ లో తెలుగు ఎలా రాయడం మొదలుపెట్టారు.
జ్యోతి:  బ్లాగు ఎందుకు మొదలెట్టారు
సాలభంజికలు:   జ్యోతి – చేత్తోనే.
జ్యోతి:  సాలభంజికలు అని పేరు పెట్టడానికి కారణం ఏంటి
జ్యోతి : మేము చేసేది అదే

నెటిజన్: సాలభంజికలు: మీకు ఇబ్బంది లేక పోతేనే సుమా!
సాలభంజికలు :  ఇబ్బందా – అబ్బే, అలాటిదేం లేదు.
జ్యోతి: ఇబ్బందిగా ఉన్న ప్రశ్నలకు పాస్ అంటే సరి
సాలభంజికలు :  ఇబ్బందిగా ఉన్న ప్రశ్నలకి పకడ్బందీ సమాధానాలుంటాయిగా 🙂
poornima : సాలభంజికలు, అంటే.. ఇబ్బంది పెట్టమంటారు, పెద్దగా ఇబ్బంది పడకుండా.. అంతేనా?

ఇంతలో జ్ఞానప్రసూన గారు సెలవు తీసుకున్నారు.
gnanaprasuna :  మరి నే వెడుతున్నా! అందరికీ సెలవు, మళ్ళీ సొంతూరొచ్చి మాట్లాడుకుందాము.

అడిగిన ప్రశ్నల్నీ కలిపి జవాబు ఇద్దామని సాలభంజికలు గారు చదువరి గారికి ప్రతిపాదించారు. కుదరదని జ్యోతిగారన్నారు. ఒప్పించటానికి నాగరాజు గారు ప్రయత్నిస్తుండగా, ఆ ప్రశ్నలపై సర్వ హక్కులూ నాగరాజు గారివే అని, తనకే సంబంధం లేదనీ చదువరి చెప్పటంతో..

poornima: సాలభంజికలు, ఈ బ్లాగు ప్రపంచానికి మీరేమి ఇచ్చారు? ఏమి తీసుకున్నారు?
చదువరి  :  poornima, భలే ప్రశ్న!
చదువరి  : సాలభంజికలు, నాక్కూడా సమాధానం తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది.
(కానీ ఈ ప్రశ్న తర్వాత మాటల్లో పూర్తిగా మిస్స్ అయ్యిపోయింది :-(( )

కాసేపు చదువరి గారిని బిజీ చేద్దామని,

poornima :  చదువరి, వరూధిణి గారు బ్లాగు మొదలెట్టడం లో మీ పాత్ర ఎంత?
poornima :  నాకు తెలిసిన వాళ్ళని బ్లాగులు మొదలెట్టమని పోరు పెడుతున్నా.. నా మాట వినటం లేదు. 😦
చదువరి:  poornima, , తను మొదలుపెట్టింతరవాత గానీ నాకు తెలీలేదండి.
poornima: చదువరి, మీ ఇంట్లో బ్లాగు చర్చలు జరుగుతాయా? ఇక్కడున్నంత వేడిగా వాడిగా కాకపోయినా?
సాలభంజికలు:  పూర్ణిమ – చదువరి పాత్ర, వరూధిని పదార్థం. 🙂
poornima:  మంచి సినిమా చూసి నచ్చిందీ, నచ్చనిదీ మాట్లాడుకున్నట్టు.. బ్లాగుల గురించి మాట్లాడుకుంటారా అని?
poornima : సాలభంజికలు, కొంచెం గట్టిగా నవ్వవచ్చునా?
చదువరి:  అంటే.. టెం’ప్లేట్ల’ పని నాది కంటెంటు పని ఆవిడదని
చదువరి:  poornima, మాట్లాడుకుంటాం
సాలభంజికలు:  చదువరి – అదిరింది. వేసుకోండి వీరతాళ్ళు. మీకు కొటేషన్లని సనాయి నొక్కుల్లా వాడటం బాగా తెలుసు.
నెటిజన్ : చదువరి, చెంబులు తపేళాలు మనవినూ, వంట గింటా వారిదనా?
చదువరి : నెటిజన్, ఔనౌను! 🙂

ఇంతలో జ్యోతిగారి నెట్ ఫట్ట్ అన్న సమాచారం తెలిసి, దిక్కు తోచని పరిస్థితుల్లో మెదడు ఏదంటే అది వినేసి,


poornima: ఒక సీరియస్ ప్రశ్న అడిగేదా, అందరనీ?
సాలభంజికలు:  ప్రొసీడైపోండి మరి.
poornima : ఓ రెండేళ్ళ కిందట, తెలుగు చాలా దయనీయ స్థితిలో ఉందంటే.. అవునూ అంటే నేనూ మూలిగేదాన్ని, తెలుగు బ్లాగులు చదువుతున్న దగ్గర నుండీ.. తెలుగుకి వచ్చిన నష్టం ఏమీ లేదనిపిస్తోంది. తెలుగు బ్లాగుల వల్ల తెలుగెంత మేలు జరుగుతుందీ అని నా ప్రశ్న!

ఆ ప్రశ్న ఒక సీరియస్ చర్చకి దారి తీసింది. దానిని యధావిధిగా ఇక్కడ పొందుపరుస్తున్నాను. చర్చ జరుగుతున్నప్పుడే రాధిక గారూ వచ్చారు.

చదువరి: సాలభంజికలు, నెటిజెన్ – మీరు చెప్పండి, చివరగా నేను.
సాలభంజికలు: నాకైతే – ఇది (బ్లాగుల వల్ల భాష పరిరక్షించబట్టం, తెలుగుకి “మేలు” చెయ్యటంలాటివి) – ఏరొగన్స్ అనిపిస్తుంది. ఇది కేవలం అభిప్రాయం.
నెటిజన్ : తెలుగులో చాలా విషయ సామగ్రి, వికి ద్వారా తెలుగు మాత్రమే తెలిసిన వారి కి అందుబాటులోకి వచ్చింది.
నెటిజన్: కొంత మేరకి సాలభంజికలు గారితో ఏకిభవిస్తాను.
సాలభంజికలు:  ఏదైనా మనకి తెలియనంత కాలం – మనకి తెలియదుకాబట్టి,  అది ప్రమాదంలో ఉందనో, దానినెవ్వరూ ఉద్దరించటంలేదనో మనం అనేసుకొంటుంటాం. ఒకసారి – తెలుగు చదవటం మొదలెడితే – ఎందరో దానిలో కృషి చేస్తున్నారానీ, అది ఎప్పుడూ సజీవంగానే ఉందని అనిపిస్తుంది – ఇది చాలా విషయాలలో నా స్వానుభవం. ఇంకోటి – తెలుగు వాళ్ళు ఉన్నంత కాలం తెలుగు ఉంటుంది. అది మనకి నచ్చినట్టు ఉంటుందా, లేదా అన్నది వేరే ప్రశ్న.     ఇహపోతే – ఇప్పుడు వికీలు, బ్లాగులు, తెలుగులో తిరిగి కొత్త సాహిత్య సృష్టి గురించి… ఎకనామిక్స్ లో మార్కెట్ గురించి ఒక చిత్రమైన వివరణ ఉంటుంది.
మార్కెట్టంటే – 1. the ability of the people to innovate and create new products and services.
                     2. the capacity and willingness of the people to purchase.
ఈ రెండు కండిషన్లు ఉంటేనే అది మార్కెట్టవుతుంది. ప్రస్తుతానికి, ఒక సాంస్కృతిక విప్లవానికి ఈ రెండు కండిషన్లు ఉన్నట్టున్నాయి. ఎందుకంటే – ఇంతకు ముందులా, తెలుగులో రాయటం అనేది కవులకీ, తెలుగు పండితులకీ, జర్నలిస్టులకీ ఇప్పుడు పరిమితం కాలేదు. నవతరంగంలో సీరియస్ హాబీయిస్టులు రాస్తున్న సినిమా వ్యాసాలు, గట్రా..
చదువరి: సాలభంజికలు, ఆ రెండో పరిస్థితి ఆశాజనకంగా ఉందంటారా? ఆదరించేవారు!
సాలభంజికలు:  చదువరి –  ఆదరించేవారు ఎప్పుడూ ఉంటారు కదా? వారి పరిధిని పెంచటం అనేది ఈ ఇంటర్నెట్ మాధ్యమంలో ఆర్థిక, సామాజిక సమస్య కాదు కదా – అది కేవలం సాంకేతిక సమస్య మాత్రమే.
చదువరి : సరిగ్గా ఇక్కడే నా సమాధానం మొదలెడతాను, నెటిజెన్ గారు చెప్పేసాక!
నెటిజన్ : సాలభంజికలు, చదువరి గారి చెబుతున్నది నిజం. థామస్ ఫ్రీడ్‌మాన్ ఒక The world is flat అని ఒక పుస్తకం రాసాడు. అందులో అంటాడు;  జాలం  ఏర్పడిన తరువాత సాంకేతిక విజ్ఞానం ఎల్లలు చెరిపేసి అందరికి అందుబాటులోకి వచ్చిందని. అందులో భాగమే, బ్లాగింగ్. ఇంతకు మునుపు సాలభంజికలు అన్నట్టు, తెలుగులో వ్రాయడం ఏ కొద్దిమందికో పరిమితమయ్యింది.  ఇప్పుడు అందరికి అందుబాటులోకి వచ్చింది. సాలభంజికలు ఉదహరించిన నవతరంగం అందులో ఒక భాగం
poornima:  నెటిజన్, అది నిజమండీ.. తెలుగు బ్లాగుల్లో ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇక్కడ కొత్తగా రాసేవారికి దొరికే ప్రోత్సాహం
నెటిజన్:  అవును, ఆ ప్రోత్సహమే, వారి ఆలోచనలకు పదును పెడుతుంది. ఔత్సాహికులను ప్రోత్సాహించలనుకున్నప్పుడు, ఒకొక్కసారి, కొన్ని పొరబాట్లు గూడ జరుగుతున్నవి. చదువరి గారు మీ అభిప్రాయం?
చదువరి: నెటిజన్, సాంకేతిక విజ్ఞానం తెలుగును ప్రజలకు మరింత చేరువ చేసింది; సందేహం లేదు. కానీ.. అసలు తెలుగు రాని వారికి అదేమి ఉపయోగం!!? లక్షల్లో ఉంటారు రోజూ కనీసం రెండు మూడు గంటలపాటు జాలంలో గడిపేవాళ్ళు. కూడలికి వచ్చే వాళ్ళు కొన్ని వందలు -మహా అయితే వెయ్యి! ఎందుకంటే తెలుగు చదవగలిగి, రాయగలిగే వాళ్ళు ఉండేకొద్దీ తగ్గిపోతున్నారు..
నెటిజన్ :  ఐతే..
చదువరి : రాబీయే రోజుల్లో తెలుగు చదవగలొఇగే వాళ్ళు ఇంకా తగ్గిపోతారు, ప్రభుత్వం పనుల మూలంగా. అప్పుడు సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా ప్రయోజనం ఏంటి? బ్లాగుల వలన (మరీ ముఖ్యంగా జాలంలో తెలుగు వలన) మేలు జరిగింది.. అది నిర్విదావమైన అంశం.
సాలభంజికలు:  చదువరి – మీరన్న దాంట్లో వాస్తవం ఉందేమో గాని, పూర్తిగా ఒప్పుకోలేను. 15% of India’s GDP comes from Cultural Products.
చదువరి :   ..కానీ తెలుగు చదవగలిగే వాళ్ళు, ఆసక్తి ఉన్నవాళ్ళు మాత్రమే దాన్ని అందిపుచుకున్నారు, మనలాగా!
సాలభంజికలు:  Language is THE vehicle for culture. if there is an economic support structure – then it would grow, develop, metamorph, transform and ultimately will prevail. As an example of what i was referring to earlier – i was invited to give a presentation on the Indian Language Learning and Reference Market to one of the largest publishers of Language Refernce Content in the world. They wouldn’t have thought about it such a move even ten years ago.

radhika :  ఖశ్చితం గా బ్లాగుల వల్ల తెలుగుకు మేలు జరుగుతుంది అనుకుంటున్నాను.

సాలభంజికలు:  however, i understand you point. I was talking about this topic (language computing, language related products and services and technologies) with one of my fellow researchers yesterday. And, he made an interesting comment. he said that the Possibility is a function of Potential, Problems and Politics.
అంటే ఆయన ఉద్దేశం – మీరన్నట్టుగా – ఎంతమందికి తెలుగు చేరువ అవగలదు అనే “పాసబిలిటీ’ సమస్యలు, రాజకీయాలు, మొత్తం సామర్ధ్యం అనే మూడు అంశాల వల్ల ప్రభావితం అవుతుంది అని. సమస్యలు, రాజకీయాలు – పాసబిలిటీ శాతాన్ని తగ్గించగలవే గాని, తుడిచెయ్యలేవు – అదీ నేను చెప్పదలచుకొన్నది.

చదువరి: తెలుగు నేర్పే దగ్గర శ్రద్ధ వహించాలి అని న ఉద్దేశ్యం. అప్పుడు సాంకేతిక పరిజ్ఞానం అక్కరకొస్తుంది. మనకు తెలుగు రాకపోతే బ్లాగులు రాయగలిగే వాళ్ళమా, చదవగలిగే వాళ్లమా?
నెటిజన: సాలభంజికలు అన్నట్టు..commercials need not necessarily influence language..always.
చదువరి: నా పేసంగం కూడా అయిపోయింది. ఇక రాధిక గారు
radhika: చదువరి, అదే అనిపిస్తూ వుంటుంది నాకు.మన తరం వరకు తెలుగు ఓకే.తరువాతి తరం వాళ్ళు తెలుగు మాట్లాడగలరేమో గానీ రాయలేరని నా అభిప్రాయం. ఏదేమయినా ప్రాధమిక పాఠశాలల్లో తెలుగుని తప్పనిసరి చేస్తే అంతో ,ఇంతో బాధపడో,కష్టపడో నేర్చుకుంటారు.

ప్రస్తుత బ్లాగు పరిస్థితులపై రాధిక తన ఆవేశాన్ని, ఇలా తెలియజేసారు.
radhika:  ఇంతకు ముందు తెలుగు పీపుల్ వంటి సైట్లలో తెలుగువారితో ముచ్చటిస్తూ వుండేవాల్లు చాలా మంది.అక్కడి వాగ్వివాదాలు,గొడవలు,వ్యక్తి దూషణ వంటివి ఎక్కువయిపోవడం వల్ల జనానికి విసుగొచ్చి ఆ సైఉకి దూరం గా వుండడం మొదలు పెట్టారు.ఇప్పుడు బ్లాగుల్లో కూడా అది మొదలవుతూ వుంది.శైశవ దశలోనే వుంది కానీ జాగ్రత్త పడకపోతే బ్లాగులకు కూడా అదే గతి పడుతుంది

దీని పై చర్చ మొదలెట్టడానికి నిదానంగా ఉన్న కూడలి చాట్ రూం సహకరించలేదు. చచ్చేంత నెమ్మదిగా ఉన్న కూడలి చాట్ రూమ్ లో కూడా, ఓపిక, ఉత్సాహం నశించిపోతున్నా ఈ చర్చ కొనసాగింది. మెర్సీ కిల్లింగ్ కి అన్ని విధాల అర్హత ఉన్నా, చాట్ నుండి వైదొగలకుండా చదువరి, నాగరాజు, నెటిజన్ చాలా ఓపిగ్గా చర్చించారు.

radhika :  అవును ఎవరూ లేరేమిటి ఈ రోజు? ఒక్క క్షణం నాకు అర్ధం కాలేదు కూడలి కబుర్లలో వున్ననో, ప్రమదావనం లో వున్నానో తెలియలేదు. ఇదేనా స్పెషల్.నాగరాజు గారు,నెటిజన్ గారూ,చదువరి గారూ…పెద్దలనదరూ వచ్చారు.మరి మనవాళ్ళేరి?

రాధిక అలా అడిగిన తీవ్రతో, మరేదో వెంటవెంటనే జ్యోతిగారు, తెరిసా, పద్మ, రమణి అంతా వచ్చారు. ఇంత మందిని చూసిన ఆనందంలో చాట్ రూం కూడా కొంత ఉత్సాహం గా మారింది. కానీ అప్పటికే ఎనిమిది గంటలు కావటం వల్ల అతిధులు వెళ్ళడానికే నిశ్చయించుకున్నారు. పోదాం అంటే పోదాం అని వారనుకుంటుంటే, “కాసేపు ఉండకూడదూ” అని అతివలు, “ఇది దారుణం. మేము రాగానే వెళ్ళిపోతున్నారు” అని ఒకరంటే, ఏది దారుణం, మమ్మలని పిలిచి, గుమ్మంలో మూడు గంటలు నిలబట్టడమా? లాంటి మాటలు నిత్య తెలుగు వాకిళ్ళల్లో జరిగే సంభాషణలా ఉన్నాయి. సాలభంకిలు మూతపడ్డానికి గల “ఇన్-సైడ్ స్టోరీ” తెలుసుకోవాలన్న అందరి ఆత్రుత, అలాగే మిగిలిపోయింది.

వెళ్తూ, వెళ్తూ నెటిజన్ గారు, poornima: you are bubbly and energetic, without your company this would have such a bore అని అన్నారు. రమణిగారు నేనేదో బరువు మోసాసాను ఒక్కదాన్నే అని కంగారు పడ్డారు. “నేను మోయలేదు..” అని చెప్పాను. ఈ పాటికి అర్ధమయ్యే ఉంటుంది, నేను మోయలేదని. తెరిస్సా  “నాక్కిక్కడ ఏం జరిగిందో తెలియాలంటే తెలియాలి. వీలైనంత త్వరగా సమగ్రంగా నివేదిక ద్వారా తెలియజేయమన్నారు. అంతగా సహకరించని పరిస్థుతుల్లో నాకు తోచిన విధంగా రాశాను. “స్పెషల్ ప్రమదావనం” స్పెషల్ అనిపించిందే అనుకుంటున్నాను.

పూర్తిగా చదివినందుకు ధన్యవాదాలు.

పూర్ణిమ

24 comments

  1. పూర్ణిమ ,
    మాకందరికి సమస్యగా ఉన్నా , నువ్వు ఒక్కదానికి అతిథులకు చక్కని మర్యాదలు చేసావు. నివేదిక కూడా బావుంది. కీఫిటప్..

    Like

  2. poornima garu.. ekkada net problem vallo mari denivallo teledu sariga partisipate cheyyaleka poyya.. anyways, im happy to join pramadavanam first time. i will surely join in further chats .

    with all regards
    sujji

    Like

  3. రాధిక మాటే నా మాట. ఇది కూడలా లేక ప్రమదావనమా అన్న సందేహం ఎవరికైనా రాగలదు. ముగ్గురు అతిధులు గంభీరమైన విషయాలు చెప్పి, అందరి బుర్ర వేడెక్కించేసి ఉంటారు. ఎందుకు మొగవారిని పిలుస్తున్నారు, ఈ సమావేశాలకు? నివేదిక present చేసిన విధానం, శైలి నచ్చింది.

    Like

  4. నివేదిక రాసిన విధానం శైలి బాగుంది పూర్ణిమా! ప్చ్! నేను మిస్ అయ్యాను కదా అనిపిస్తోంది.

    @ సి.బి. రావుగారు: ఆడవాళ్ళెలాగు సోదే రాస్తారు/చెప్తారు అని నొక్కి వక్కాణించేసారుగా మీ బ్లాగులో, కనీసం ప్రమదావనంలోనైనా కాస్త మీలాంటి ప్రముఖుల ద్వారా మంచి విషయాలు తెలుసుకొనే ఆవశ్యకత ఉంటుందనే ఉద్దేశ్యంతో ఆహ్వానం పలుకుతోంది ప్రమదావనం.

    Like

  5. రావుగారు,
    అవును మరి ప్రముఖ బ్లాగర్లను ఒకేచోట చూస్తే కబుర్లా?, ప్రమదావనమా? అన్న సందేహం రాకమానదు. ఆడవారినైతే మాలో కలుపుకుని నెచ్చెలులను చేసుకుంటాము. మగవారైతే అతిథులుగా పిలుస్తాము. ఎవరిని? ఎందుకు? అంటే మహిళలంటే గౌరవించే, ప్రోత్సహించే, వెకిలి మాటలు మాట్లడని మగవాళ్లను పిలుస్తున్నాము. వారు బ్లాగర్లైనా కాకున్నా. మొన్న వచ్చిన హేమాహేమీలైన అతిథులు (మేమైతే అలాగే అనుకున్నాము) మా మీద గౌరవంతో వచ్చారు. చివరి వరకు ఉన్నారు. ముందు ముందు ఇలాంటి ప్రత్యేకమైన సమావేశాలెన్నో నిర్వహించాలని ప్రయత్నిస్తున్నాము. బ్లాగామా, కామెంటామా అన్నట్టు కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి చర్చలు మంచిది అని నా అభిప్రాయం.

    అవునూ: మీరు చెప్పారని సునీత అనే ఆవిడ నాకు కాల్ చేసి ప్రమాదవనం వివరాలు తీసుకుని ఒక్కసారి మాత్రమే హాజరయ్యారు. అసలు ఆవిడ నిజంగా మాలో ఒకరుగా ఉండటానికి వచ్చారా? లేక మీరే ప్రమదావనం చిరునామా, ఎంట్రీ పాసు తెలుసుకుందామని పంపించారా? సునీతగారు మళ్ళీ కనపడలేదు.

    Like

  6. @Jyoti: Sunita is working in Hi-Tech city in a reputed software firm and at present having some health problem and stopped writing blogs temporarily.She is my niece by relation.She blogs at ముక్త లేఖ.

    For entry into Pramadavanam I can always rely on you, if I find time.

    Like

  7. రావు గారు, నా బ్లాగు, మరి కొందరు స్త్రీ బ్లాగర్ల(రావు గారి బ్లాగు చూడండి) పోస్టులను ఉదహరిస్తూ, “ఆడాళ్ళ బ్లాగుల్లో సోది” విషయాలుంటాయని ‘స్టేట్ మెంట్ ” ఇచ్చినా అది నేను స్టేట్ మెంట్ గా స్వీకరించక, ఆయన వ్యక్తిగత అభిప్రాయం గానే తీసుకున్నాను. అందువల్లా దాన్ని ఇష్యూ చేయకుండా,ఆడవాళ్ల బ్లాగుల్లో సోది ఉంటుందనే విషయాన్ని మాత్రం ఒప్పుకోనని చిన్న సమాధానం ఇచ్చి సరిపెట్టాను. పైగా దానిమీద అనవసర చర్చ జరిగి వివాదాస్పదం కావడం ఇష్టం లేకపోయింది.(ఉన్న వివాదాలు చాలకనా?)

    ఒకరికి సోది అనిపించింది ఇంకొకరికి ఆసక్తి కరంగా ఉండొచ్చు, అది చూసే వారి దృష్టిని బట్టి ఉంటుందని నేను నమ్ముతాను. ఇతరుల బ్లాగుల్లో చాలా మందికి “ఎందుకొచ్చిన చర్చ” అని అందరూ భావించిన విషయాలు నాకు కొన్ని సార్లు చాలా ఆసక్తి కరంగా అనిపించాయి. మరి కొందరు అద్భుతంగా ఉందని మెచ్చుకున్న పోస్టులు విసుగు తెప్పించాయి. దృష్టిలో తేడా అంటే ఇదేనేమో!

    కాకపోతే “నేను” అంటూ ప్రథమ పురుష లో సాగే పోస్టులన్నింటినీ బ్లాగర్ల వ్యక్తిగత అనుభవాలు గా తీసుకుని ఎంజాయ్ చేయడం, బ్లాగర్ల రూపాలు ఊహించుకోవడం అనేది పాఠకుల కు వదిలేస్తున్నాను.ప్రతి అనుభవమూ మన సొంతది కాకపోవచ్చు ,first person లో రసినంత మాత్రాన!

    స్త్రీల బ్లాగుల్లో సోది ఉంటుందనేది యూనివర్సల్ అభిప్రాయమైతే ఆయా బ్లాగులకు వీక్షకులే ఉండరు. ఎన్నాళ్లని సోది భరిస్తారు? ఇది అందరూ గుర్తించవలసిన విషయం!

    Like

  8. BTW పూర్ణిమా,
    మినిట్స్ బాగా రాశావోయ్!చెప్పడం మర్చిపోయాను! అదిగో అప్పుడే ఖోపంగా చూడకు !మర్చిపోయానన్నాగా!

    Like

  9. @సుజాత గారు: ఎందుకు మగవారిని పిలుస్తున్నారు అన్న రావు గారి ప్రశ్నకి సమాధానమే తప్ప, దీన్ని స్వతహాగ వివాదం చెయ్యడం నాకు ఇష్టం లేదు. నిన్న ప్రమదావనం లో కూడా మొదట రావుగారు అన్నమాట(ఆడవారు సోది) మీద చర్చ జరగడం, ఇప్పుడు మగవారెందుకు? అన్న ప్రశ్న నా చేత అలా జవాబు చెప్పించాయి. రావు గారు సోది అంటూ ఉదహరించిన బ్లాగులు ఎవరివో అర్ధం చేసుకోలేనంత అమాయకులు కాదేమో ఈ మహిళా బ్లాగర్లు . సమయం దొరికినప్పుడల్లా సమాధానం దానంతట అదే వస్తుంది కాని వాదనల కోసమో వివాదస్పదం కోసమో మాత్రం కాదు .

    Like

  10. రమణి గారు, నాకూ దీన్ని పొడిగించాలని లేదండి!
    నిన్న ప్రమదావనం కి నేను వచ్చి వుంటే పైన నేను రాసిన కామెంట్ అక్కడే చెప్పి ఉండే దాన్ని! సోది విషయం చర్చకు వచ్చింది కాబట్టి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉందనిపించి ఇక్కడ రాశాను. వివాదాస్పదం చెయ్యదల్చుకుంటే రావు గారి బ్లాగులో చూసినపుడే చేసి ఉండే వాళ్లం కదా! సోది ఎవరిదో మహిళా బ్లాగర్లే కాదు,అందరు బ్లాగర్లూ అర్థం చేసుకుంటారు.

    Like

  11. సుజాత / రమణి:

    అనిపించుకున్నప్పుడే మనం ఎందుకు అడిగేయలేదో మీరిద్దరూ చెప్పేశారు, వివాదాలు అనవసరం కావున, We KNOW our business over here, కావున.

    ఇక ప్రమదావనంలో చర్చ ఎందుకంటే, మన మాటలకి అర్ధాలు వేరు అన్న భ్రమలో ఉన్నట్టే, మన మౌనానికి “అవును, నిజం! మీరన్నది నిజం, నిజం!” అన్న భాష్యాన్ని ఆపాదించకూడదనే!

    మీరిద్దరూ ఇదే విషయాన్ని నొక్కి వక్కాణించారు కావున, నేను చెప్పటానికి ఏమీ మిగలలేదు. థాంక్స్!

    జ్యోతి, శ్రీ విద్య, తెరిస్సా, సుజ్జి, రమణి, సుజాత:
    ఈ టపా చదివి అయ్యో, మిస్స్ అయ్యామే అన్న ఫీలింగ్ మీకు కలిగిందో లేదో కానీ, I missed you all! 😦

    ఓపిగ్గా చదివి కమ్మెంటినందుకు నెనర్లు!

    Like

  12. రావు గారూ: మీరడిగిన ప్రశ్నకి ఇవ్వాల్సిన జవాబు ఇచ్చేశాము. ఆట ఎప్పుడో, పాట ఎప్పుడో, పని ఎప్పుడో మాకన్నా బాగా ఎవరు నిర్ణయించగలరు? ఒక్కసారి ఏం కావాలో ఏం నిర్ణయించుకున్నాక, ఎలా సంపాదించుకోవాలో మాకు తెలుసనని, మీకు తెలియదా?

    నా శైలి నచ్చినందుకు నెనర్లు!

    మహేశ్: అన్న మాట కాదు, ఉన్న మాటే! అవునూ అంత సీరియస్స్ విషయం మీద, కనీసం ఒక్క టపా కూడా రాయరూ? 😦

    కొత్త పాళీ గారు: నెనర్లు!

    Like

  13. సుజాత: మీ మీద చాలా ఖోపంగా ఉంది నాకు. 😦
    ఎందుకు బాగుందన్నారు? నాకు నచ్చని ఒక్కే ఒక్క పొగడ్త, “Nice job, you capture meeting minutes well” అన్నది. ఆఫీసులో నా తిప్పలు నాకు పెడతారు తెలుసా జనాలు. పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే, నాకు “తలనొప్పి వస్తుంది, ఎవరో ఒకరు మీటింగ్ మినిట్స్ రాయండి” అంటే కాఫీలూ, టీలూ, తలనొప్పి మాత్రలూ, అన్నీ హాజరవుతాయి. కానీ అన్నీ నోటు చేసుకుని మేల్ కొట్టాల్సింది నేనే! :-(( అందుకే కొన్ని సార్లు పొగిడించుకోకపోతేనే మంచిది. ఏమంటారు? మీకు మళ్ళా పొగడాలీ అమ్మిని అని గుర్తు వచ్చినందుకు ఈ ఖోపం మాట. (ఖోపం నటిస్తున్నాను, అసలైతే హిందీ డైలీ సీరియల్ హీరోయిన్ లా డీప్ లుక్స్ తో బాక్ గ్రౌండ్ విషాద గీతాలతో రోదిస్తున్నాను ;-))

    ఆఖరికి ఈ మధ్య కాఫీకని వెళ్ళి నలుగురం కూర్చుని ఏదైనా మాట్లాడుకుంటే డిస్పర్స్ అయ్యే లోపూ, ఒక్కరైనా, “దీని గురించి బ్లాగులో రాయి” అంటారు. అప్పుడూ.. నేనూ.. హు!

    (ఏదో మీతో పంచేసుకోవాలనిపించింది, నా సినిమా కష్టాలు. బైదవే, ఇంకా ఇంటరెస్టింగా రాయచ్చు, కాకపోతే “పూర్ణిమ, ఇది మీ ఊహా? మెరుపు కలా? అభిలాషా?” అని ఎవరైనా అడిగితే అంతా ఫట్ అని, చాలా అఫిషీయల్ గా రాశా! 😉

    All smiles,
    Purnima

    Like

  14. పూర్ణిమ, హిందీ సీరియల్ హీరోయిన్లా ఊహించుకోవాలంటే డీప్ లుక్స్ ఒక్కటే సరిపోవు, భయంకరమైన వర్క్ చీర, పాపిట పొడూ….గ్గా సిందూరం, ఓవర్ మేకప్పూ, మిస్చీవస్ చూపులూ ఇవన్నీ కలిపి ఊహించుకోవాలి, నిన్నలా ఊహించుకోలేను, ఇంకో మాట చెప్పు!

    అవునింతకీ, పాపం ఆఫీసులో మీటింగ్ మినిట్సు కూడా నీవేనా! అయితే ప్రమదావనానికి నిన్ను పర్మినెంట్ చేసుకుంటే పోలా మినిట్స్ రాయడానికి,experienced కేటగిరీలో!

    Like

  15. హ హ హ
    పూర్ణిమా నెనర్లు. ఇహ ఆఫీసులో మినిట్స్ విషయంలో నాకు మీ అనుభవమే. అందుకే నవ్వొచ్చింది. ఏదన్నా ఓ సమస్యో , సరదా విషయమో మాట్లాడుకొంటున్నప్పుడు “అవునూ ఈ విషయం మీ బ్లాగులో ఎందుకు రాయకూడదూ ” అని అందరూ అనడం పరిపాటి అయిపోయింది.

    Like

  16. సుజాత గారు: ఆఫీసులో మినిట్స్ ఒక్కటే అయితే పెద్ద ప్రాబ్లం ఉండదండీ. ఆ తరువాత Resolutions ప్రిపేర్ చెయ్యడమే పెద్ద తలనొప్పి వ్యవహారం. ఇందులో బాగా అనుభవమే నాకు.

    Like

  17. నివేదిక ఆసక్తికరంగా వుంది. కృతజ్ఞతలు. ఇటువంటి మంచి విషయాల్ని కూడా కామెంట్లతో వివాదాస్పదం చేయడం మంచిది కాదేమో!

    Like

  18. అయ్యా విజయకుమార్ వింజమూరి గారు,ఎన్నాళ్ళు సార్ ఈ శెలవులు,త్వరగా రండి మీ రచనలతో

    Like

Leave a reply to కత్తి మహేష్ కుమార్ Cancel reply