The Last Lecture నోట్స్ కావాలా? :-)

Posted by

“వీకెండ్ ఏం చేశావు?” అని అడుగుతుంటే ఒక పుస్తకం చదివాను అని చెప్పాలి అసలైతే, కానీ “క్లాసు లో ఉన్నా ఇంత సేపూ” అని అనాలి అనిపించేంతగా ఉంది ఈ పుస్తకం. మరి క్లాసు అటెండ్ అయితే నోట్స్ ఉంటుంది కదా? అదే ఈ టపా! ఒక్కప్పుడైతే మన నోట్స్ కి తెగ ఫాన్ ఫాలోయింగ్ ఉండేది, అన్ని చోట్ల. ఇప్పుడు పూర్తిగా అలవాటు తప్పిపోయింది.

క్లాస్: The Last Lecture book
లెక్చరర్: Randy Pausch

* Somehow, with the passage of time, and the deadlines that life imposes, surrendering became the right thing to do – రాండీతో పరిచయం ఈ వాక్యంతోటే. చదవగానే “అబ్బా.. మరీ నిర్వేదం. ఎందుకు లొంగిపోవడం? ఎదురు తిరగాలి గాని? ఏం బాలేదు” అని అనుకుంటూనే అసలు అన్నవారి గురించి తెలుసుకుందామని గూగుల్లో వెతికితే, Randy Pausch ఒక అమెరికన్ కంప్యూటర్ ప్రొఫెసర్ అనీ, చిన్న వయస్సులోనే పాంక్రియాటిక్ కాన్సర్ బారిన పడి. జూలై 25, 2008 న మరణించారు అనీ. తాను మరణించబోతున్నారు అని తెలుసుకుని, కడసారిగా తన యూనివర్సిటీలో ఇప్పటిదాకా తన ప్రయాణాన్ని పునశ్చరణ చేసుకునేలా “Really Achieving Your Childhood Dreams” అన్న లెక్చర్ ని ఇచ్చారనీ, (వీడియో ఇక్కడ లభ్యం) అటు తర్వాత The Last Lecture అనే పుస్తకాన్ని రాశారనీ అని తెలిసింది.

* తరగతి గదిలో మహరాజులు/ మహరాణుల్లా కూర్చుని, మన ముందు నిలుచున్న వ్యక్తి వైపు తదేకంగా చూస్తూ పాఠాలు వింటున్నప్పుడు “క్లాసు రూం లో తపస్సు చేయిట వేస్టురా గురూ” అని అనిపిస్తుంది. బయటున్న ప్రపంచంలోకి వచ్చేసరికి మహారాజులం కాస్త సామాన్య ప్రజానీకం అయ్యిపోతాం. ఇప్పుడు మనల్ని ఆడించడం జీవితం వంతు. చాలానే నేర్పిస్తుంది జీవితం కూడా, కాకపోతే వీలైనన్ని తిప్పలు పెట్టి మరీ. అందుకే ఒక్కోసారి మళ్ళీ క్లాసుల్లోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకు. నాకు అర్ధమయ్యే స్థాయికి దిగి వచ్చి, నాకర్ధమయ్యే వరకూ ఓపిగ్గా చెప్పేవారుండడం కూడా అదృష్టం కదా?

* రాండీ అనగానే ఇక పై నాకు గుర్తు వచ్చేది కాన్సర్ కాదు. Imagineer (Imagination+Engineer) అన్న ఆంగ్ల పదం. రాండీకి చిన్నప్పటి నుండి వాల్ట్ డిస్నీలో పని చేయాలని కోరిక ఉండేది. అక్కడ పని చేసే వారిని ఇమాజనీర్స్ అని అంటారు. అబ్బుర పరిచింది ఆ పదం నన్ను. Engineering is not about perfect solutions; it’s about the best you can do with limited resources. ఉన్న పరిమితులని పడగొట్టటంలో ఊహలకున్నంత బలం అంతా ఇంతా కాదు. ఈ రెంటినీ సమపాళ్ళల్లో కలిపితే ఎన్ని అందాలను ఆవిష్కరించవచ్చు కదా! రాండీ ఎంచక్కా తనని తాను “ఇమాజనీర్” అనేసుకుంటారు, డిస్నీతో పని చేశారు కావున. నేను డిస్నీతో పని చేసే అవకాశం ఒక్కటే లేదు! ఉన్న ఇంజనీరింగ్ డిగ్రీ, నా ఊహలూ సరిపోతే బాగుణ్ణు ఆ పేరు పెట్టేసుకోవడానికి అని అనిపిస్తుంది. ప్చ్! 😦 (మరీ మనసును ఊరించేస్తుంది ఆ పేరు :-(( )

*ఇప్పుడో ఫుట్ బాల్ ఆటలో ఓ అబ్బి కాలి దగ్గర బాల్ ఉంటే, అతడు తల ఎటు వైపుకి తిరిగి ఉంటే అటే కొట్టేస్తాడేమో అని అనుకుంటాము కదా? కానీ అలా కాకుండా అతడి నడుము భాగాన్ని చూస్తే, ఖచ్చితంగా ఏ వైపుకి కొడతాడో చెప్పవచ్చునట. దీన్నే Head Fake అంటారు. ఈ పదాన్ని రాండీ “ఒకటి నేర్చుకుంటున్నాము అనుకుని దాన్ని అభ్యసిస్తున్నప్పుడు, మనం వేరేవి బాగా నేర్చుసుకుంటాము” అనే ప్రక్రియకి కూడా ఉపయోగిస్తారు. (indirect learning) మనం ఒక ఆట ఆడుతుంటే, మనం ఆ ఆటనే నేర్చుకుంటున్నాము అనుకుంటుంటాము, కానీ  అసలు నేర్చుకునేది శ్రమకోర్చడం, టీం వర్క్, పట్టుదల, కష్టాలను అధిగమించడం లాంటివి. ఇప్పుడూ నేను తెలుగు బ్లాగులు రాయడంలో కూడా “భాషా, భావ వ్యక్తీకరణ” మెరుగుపడాలి అని అనిపించినా, టైం మానేజ్ మెంట్, నచ్చని అభిప్రాయాలతో వినమ్రంగా విభేదించటం, నా అనుభవంలోకి రాని జీవితాన్ని చదివి ఆకళింపు చేసుకోవడం, ముఖపరిచయం కూడా లేని వాళ్ళతో ఆప్తులుగా కలిసిపోగలగడం లాంటివి తెలుగు బ్లాగుల వల్ల నేను నేర్చుకున్న(కుంటున్న) అసలైన జీవితం. హైడ్ ఫేక్ అంటే అర్ధం అయ్యిందిగా? మీ అనుభవాలు చెప్పండి మరి?

* “నువ్వింకో మూడు నెలల్లో చనిపోతావు, ఇక మేము చేసేది కూడా ఏమీ లేదు” అని ఒక డాక్టర్ ఓ మనిషితో చెప్తే నేల కింద భూమి కంపించినట్టు, ఓ పెద్ద అల వచ్చి శిలని కొట్టినట్టు అని నేను వర్ణించకపోయినా ఆ బాధ మీకు తెలుసు. బాధ, భయం, ఆశ, ఆవేశం, నిస్పృహ, అసహనం అన్నీ కలిసి ఒక్కసారిగా చుట్టుముట్టేస్తాయి. మెదడు పని చేయటం మానేస్తుందేమో అని అనిపిస్తుంది. కానీ రాండీ బుర్ర చకచకా పని చేస్తుంది ఇలాంటి సమయాల్లోనూ. ఇక లాభం లేదన్న మాట వినగానే కుప్పకూలిన భార్యని ఓదారుస్తున్న డాక్టర్ మాటల్లో “మందు”ని రాండీ ఇలా చెప్తాడు.
“..he isn’t putting his arm around her shoulder, I understand why. That would be too presumptuous. But he’s leaning in, his hand on her knee. Boy, he’s good at this.”
మాటల్లో ఎంత శక్తి కదా? ఒక అందమైన అనుభవాన్ని, అంతులేని అగాధాన్ని ఒక మాటతో సృష్టించవచ్చు. “నాకు మాటలంటే భయం” అని జనాలెందుకు దూరంగా పరిగెడతారో ఇప్పుడు అర్ధం అవుతోంది.

* “ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు/ప్రియుడు అంత కఠినం” అని బాధపడుతున్న అబ్బాయిలకీ, అమ్మాయిలకీ ప్రేమ క్షీర సాగరాన్ని మధించిన రాండీ ఓ బహు చక్కని ఉపదేశం ఇస్తున్నాడు. 🙂
“..the most inpenetrable bricks walls are made of human flesh. And the brick walls are there to stop the people who don’t want it badly enough. They are there to stop the other people.”
ఏ మనిషిలోనైనా మంచి అనేది ఉంటుందనీ, అది చూసే ఓపిక, సహనం లేకే మనం మనుష్యులని దూరం చేసేసుకుంటామని అని రాండీ అభిప్రాయం.

* ఇక ఈ తరం ఉద్యోగాలు చేస్తున్న అమ్మాయిలకు మరో గొప్ప మంత్రం. (తన కూతురికి ఈ విషయం చెప్పాలని రాండీ కోరిక. పాపకింకా నాలుగేళ్ళే!)
When it comes to men who are romantically interested in you, it’s really simple. Just ignore everything they say and only pay attention to what they do.

* Insurances ఎందుకో మనకి తెలుసు. మన తదనంతరం కూడా మన వాళ్ళకి ఆర్ధక ఇబ్బందులు లేకుండా చూడడం కోసం. రాండీ ఇంకో అడుగు ముందుకేసి, emotional insurance గురించి చెప్తారు. మనం పోతాం సరే, తర్వాత మనవాళ్ళు ఎలా బ్రతుకుతారు, మనం లేకుండా? మనిషిగా మిగలకపోయినా, మిగితా అన్ని రూపాల్లో మనం వారి దగ్గరుండేలా జాగ్రత్త పడాలి, ఫోటోల్లో, వీడియోల్లో, ఉత్తరాల్లో, వీలైనన్ని జ్ఞాపకాలని వదిలి వెళ్ళాలి అంటారు.

* తాను బ్రతికుండగా భార్య ఆఖరి పుట్టినరోజుకి ఒక పార్టీ ఏర్పాటు చేస్తారు రాండి. ఆవిడ ( పేరు జే) స్టేజీ మీదకు వచ్చీ రాగానే భర్తను గట్టిగా పట్టుకుని ఏడుస్తూ “please don’t die” అని అంటుంది. మన రాండీకి ఏదో హాలివుడ్ డైలాగు గుర్తు వస్తుంది. కానీ ఆమె అన్నది అవే పదాలు. మనకి తెలియకుండానే కొన్ని పదాలు ఎడా పెడా వాడేసి, వాటి విలువ తగ్గించేస్తామేమో అని అనిపించింది. “నిన్నే ప్రేమిస్తున్నాను”, “నువ్వు లేక నేను లేను”, “నీ కోసం”, “నిన్ను చూడకుండా ఉండలేను” లాంటివన్నీ ఇప్పుడు సినిమా టైటిల్లేనా? ఏమో!

* తనకే ఆక్సిడెంటో అయ్యి లేక గుండె పోటో వచ్చి ఉంటే, చివరి నెలల్లో జీవితాన్ని ఆనందించేవాడిని కాదని, తన వాళ్ళకోసం అంతా సంసిద్ధం చేయలేకపోయే వాడిననీ, ఒక రకంగా చూస్తే కాన్సర్ కూడా అదృష్టమే అని అంటారు. ఇది అక్షరాల నిజం అని ఒప్పుకుంటాము. ఎందుకంటే పుస్తకం మొదలెట్టినప్పుడు ఎంత భయంకరమైన మూడ్ లో మొదలెట్టానో, రాండీ కథ చదువుతుండగా, మనం ఊరెళ్ళాలి అంటే ఎంత హడావిడి ఉంటుంది: ఒక పక్క అన్నీ సర్దుకోవాలి, ఏదీ మర్చిపోకూడదు, మన బాధ్యతలని వేరే వారికి అప్పగించాలి, మనం వెళ్తున్నామని అమ్మ ఏడుపు మొదలెడితే ఊరుకోబెట్టాలి.. రాండీ ఈ లోకం నుండి ఇంకో లోకానికి వెళ్ళడానికి అలానే సిద్ధమయ్యారు. నాకు తెలీకుండానే నేను ఆ పనుల్లో మునిగిపోయాను.
రాండీకి కనీసం ఇన్నాళ్ళని టైం అన్నా ఉంది, మనకి అదీ లేదు. ఏ క్షణాన్న ఏ విపరీతానికి బలి అవుతామో తెలీదు. అంటే మనమెంత రెడీగా, preparedగా ఉండాలి అన్న ఆలోచన నన్ను తొలిచేస్తుంది.

అసలు క్లాసు అటెండ్ అవ్వాల్సిందే ఇందుకు. మనకి చెప్పే సబ్జెక్ట్ తో పాటు లెక్చరర్లు తన జీవితపు విశేషాలను చెప్తుంటే మనం వారి అనుభవాలనుండి నేర్చుకోవటం. నేను చెప్పినవి కాక, ఈ పుస్తకంలో ఇంకా చాలా విషయాలున్నాయి, ఎన్నో సూక్తులు, ఆదర్శాలు, మంచి మాటలు, ప్రేమలూ, అప్యాయతలూ, ఆలోచనలూ. కలలు నిజం చేసుకోవటమల్లే అనిపించినా కానీ రాండీ నేర్పించే అతి పెద్ద పాఠం.. “ఈ క్షణాన్ని ఆస్వాదిద్దాం”! Live in the moment! Time is all you have. And you may find one day that you have less than you think. పుస్తకాలు ఇందుకే చదవాలి, మనకి తెలియనవి తెలుసుకోవటం కాదు, తెలిసీ మర్చిపోయినవి గుర్తుచేస్తాయి అందుకు!

33 comments

  1. Hey, I’ve saw this video a few months back , but didn’t take it very seriously.

    Your posts painfully remind me that I let these kind of things pass over my mind so obliviously 😦

    Like

  2. ఎప్పుడో చదివిన ఒక చిన్న కథ గుర్తుకొస్తోంది. ఆయనని స్నేహితులు అడిగారంట – డబ్బులు ఉన్నాయా అని. ఉన్నాయి అంటూ ఒక ఐదు రూపాయలు తీసి చూపించాడంట. అవేమి సరిపోతాయి – ఇదిగో ఉంచండి అంటూ వెయ్యి రూపాయలు అంటూ ఇవ్వబోయారు.అవి అవసరమయ్యేంత వరకు నేను బతికి ఉంటానని మీరు నాకు హామీ ఇవ్వండి, నేను వాటిని తీసుకుంటాను అని అన్నాడుట.
    మంచి ఆలోచనాపూరితమైన, స్ఫూర్తిదాయకమైన టపా. పూర్ణిమగారూ, అభినందనలు, ధన్యవాదాలు.

    Like

  3. నచ్చని అభిప్రాయాలతో వినమ్రంగా విభేదించటం, నా అనుభవంలోకి రాని జీవితాన్ని చదివి ఆకళింపు చేసుకోవడం, ముఖపరిచయం కూడా లేని వాళ్ళతో ఆప్తులుగా కలిసిపోగలగడం లాంటివి

    తన వాళ్ళకోసం అంతా సంసిద్ధం చేయలేకపోయే వాడిననీ, ఒక రకంగా చూస్తే కాన్సర్ కూడా అదృష్టమే అని అంటారు

    200% agreed.

    సినిమా పేర్లయిన పాపానికి ఆ పదాల విలువ కొత్తగా తగ్గింది లేదు. ఎందుకంటే జీవితం లో గొప్ప అనుభూతులు, భావాలు, భాదలు, రోదనలు అన్నీ భాషకి అందనివే. కొన్ని సార్లు అత్మీయ స్పర్శ, ఆలింగనం,నుదిటి పైన చుంభనం, ఆసరాగ భుజం ఇవి ఇచ్చే అనుభూతి లేదా ధైర్యం మాటలు ఇవ్వలేవు.మనిషి భాష కనుగొని తప్పుచేసాడు. ఎందుకంటే కొన్ని యుగాలుగా కొన్ని కోట్లమంది జీవితంలో అపురూపమైన ఎన్నో సంధర్భాల్లో గొప్ప expressions మిస్సయుంటారు, బదులుగా కొన్ని మామూలు మాటలు చెప్పుకొని ఉంటారు కదా.. ఇప్పుడిప్పుడే expression కి విలువ పెరిగింది. ఎంతలా అంటే కొన్ని కోట్లరూపాయల వ్యాపారాలు కేవలం way of expressions మీద నడుస్తున్నాయి.

    Like

  4. నాకు నీ టపాలలొ నచ్చేది అసలు కన్నా నీ విశ్లేషణ. నీ ప్రతి టపా చదవటం మొదలుపెట్టేటప్పుడు దానిపై నీ విశ్లేషణ ఎలా ఉండవచ్చు అని ఓసారి ఊహిస్తా–అబ్బే ఎప్పుడూ నా అంచనాలకి అందవు.
    పుస్తకాలు ఇందుకే చదవాలి, మనకి తెలియనవి తెలుసుకోవటం కాదు, తెలిసీ మర్చిపోయినవి గుర్తుచేస్తాయి అందుకు–చాలా నిజం.

    Like

  5. >>>పుస్తకాలు ఇందుకే చదవాలి, మనకి తెలియనవి తెలుసుకోవటం కాదు, తెలిసీ మర్చిపోయినవి గుర్తుచేస్తాయి అందుకు!

    Well said!!!!!!

    Like

  6. ఎందుకు, ఎప్పుడు, ఎలా.. మొదలయ్యిందో తెలీదు కానీ, ప్రతి రోజూ ఇదే నా అఖరి రోజు అనుకుని జీవించటం నాకు అలవాటయిపోయింది… ముఖ్యంగా ఏదైనా ఊరికి ప్రయాణం అయ్యేప్పుడూ. నా బధ్యతలు అన్నీ ఎవరో ఒకరికి అప్పగించెయ్యటం, చెప్పాలనుకున్న విషయాలన్నీ చెప్పెయ్యటం.. అందుకేనేమో నాకు ఏదైనా చెప్పాలనిపిస్తే ఆట్టే సమయం కోసం వెయిట్ చెయ్యను.. తరువాత ఆ సమయం రాకపోతే ? నష్టం ఏమీ లేకపోవచ్చు.. కానీ అయ్యో చెప్పలేకపోయాననిపిస్తుంది.. ఇలా అన్నిటినీ విడిపించుకుని.. చేసే ప్రయాణం ఆఖరి ప్రయాణం అయినా బాధ.. బెంగ ఉండవు.. పైగా చాలా తేలికగా ఉంటుంది. I can imagine.. how Randy felt..!

    Like

  7. మంచి ఆర్టికల్. ఇప్పడికి మీ నోట్స్ కు గిరాకి తగ్గలెదండొయ్

    Like

  8. బాగుంది మీ వివరణ. రాండీ చనిపోయిన రోజే గూగుల్లో ఓ లింక్ ఆ వీడియోకి ఇచ్చారు. నాకుమటుకు చాలా బాగా నచ్చింది ఆ చివరి ఉపన్యాసం. తనకి మరణం తథ్యం అని తెలిసిన తరువాత ఏడుస్తూ కూర్చోకుండా ఇతరులకి తన ఆశయాలు, వాటిని సాధించుకున్న తీరు, సాధించుకోలేకపోయిన వాటిని గురించిన హాస్యాత్మక వ్యాఖ్యలు బాగా నచ్చాయి. ఉపన్యాసంలో కొంత అక్కడక్కడా వేదాంతంగా అనిపించినా, దాన్ని వ్యక్తిత్వ వికాసం తాలూకు భావనలని కూడా అనుకోవచ్చు. నాకు అసలు ఆయనెవరో తెలియదు, పోయిన రోజు వరకు. గూగుల్ పుణ్యమా అని (పూర్వాశ్రమంలో బహుశా ఇద్దరు సారధుల గురువు గారయిఉంటాడు) అదే రోజు ఆయన గూర్చి తెలుసుకునే అవకాశం కలిగింది.

    Like

  9. ఎప్పటిలాగే..పుస్తకం, వీడియోలకన్నా నువ్వు నీ భావాల్ని పంచుకున్న శైలి నన్ను impress చేసింది.కానీ, నిన్ను ఇంతగా ప్రేరేపించిన రాండీ జీవితాన్ని చదవాలనే కోరికమాత్రం చాలా బలంగా కలిగింది.ధన్యవాదాలు…నా అభినందనలు.

    నిజానికి సమీక్షకుల దగ్గరుండే standard tools కన్నా, ఒక అభిమానించే పాఠకుడి/రాలి స్పందన ఆ పుస్తకానికి మరింత వన్నెతెస్తుందనే భావన నీ సమీక్ష చదివిన ప్రతిసారీ కలుగుతుంది.

    Like

  10. The inliners in ur post are quite interesting. Makes me want to read the book, which I have been pushing for quite sometime.

    “Somehow, with the passage of time, and the deadlines that life imposes, surrendering became the right thing to do” – the introduction is rather powerful and summarizes the life of the author in a fabulous way.

    Like

  11. Hey Purnima,

    This is Alpesh from Linq.in.and I thought I would let you know that your blog has been ranked as the Best Blog of week on 2008-09-14

    Check it out here Award

    Linq tracks posts from Indian blogs and lists them in order of recent interest.
    We offer syndication opportunities and many tools for bloggers to use in there
    web sites such as the widget below:

    Blogger Tools

    Please reply with your Name and Location to get a special gift from Linq.

    Alpesh
    alpesh@linq.in
    http://www.linq.in

    Like

  12. నన్ను ఆ వీడియో ఎంతగానో కదిలించింది. మళ్ళా మీ టపా కూడా!!

    Like

  13. @falling angel: sorry that it pains, but happy that it reminds. Can’t say which feeling is stronger. Thanks!

    కృష్ణమోహన్ గారు: ఓ రెండు వాక్యాలలో ఎంత “నిజం” ని చెప్పేశారండి. ధన్యవాదాలు.

    మురళి: మాటల అవసరం మనకెప్పుడూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అనవసరం అనిపించచ్చు, కానీ అవి లేకపోతే మన మనుగడ కష్టం. మీరిదే అభిప్రాయాన్ని వెలిబుచ్చితే నెనర్లు. కాకపోతే, కాస్త వివరిస్తారా?

    వరూధుణి గారు: మీ వ్యాఖ్య చూసి బోలెడంత సంతోషం వేసేసింది. నెనర్లు!

    అశ్విన్: ఏమయ్యింది? అర్ధం కాలేదా? అయినా వ్యాఖ్య బాగుంది. 🙂

    ఫణీ: ఊ.. అంతేనా? 🙂

    వంశీ: నెనర్లు.

    Like

  14. మొహన: బాగా చెప్పావు.

    భాస్కర్ గారు: నిజమే! 🙂

    వికటకవి గారు: మొన్నేదో మాటల మధ్యలో రాండీ విషయమై మొదలయ్యి, అలా అలా పుస్తకం వరకూ వెళ్ళిపోయాను. మనుషులతోనైనా, పుస్తకాలతోనైనా పరిచయాలు భలే ఏర్పడతాయి కదా?

    మహేశ్ గారు: నేను సమీక్ష కాదు మొర్రో అని గోల చేసేది, మీరన్న స్టాండర్డ్స్ వల్లే! స్పందించే మనసుంది, అది ఏది చెపితే అదే ఈ బ్లాగులో ఉంటుంది. మీ వ్యాఖ్య ఓ కొత్త ధైర్యాన్ని ఇచ్చింది.

    మహి: must read for you.

    alpesh: All I can at this point of time, is thanks! It certainly makes me feel good, though not sure of how genuine it is.

    Like

  15. చాలా బాగుంది పూర్ణిమా, పుస్తకాలు ఇందుకే చదవాలి అంటూ భలే చెప్పావు. Randy Quote “Somehow, with the passage of time, and the deadlines that life imposes, surrendering became the right thing to do” నిర్వేదం లా అనిపించినా తరచి చూస్తే ఏ కొద్ది మంది విషయం లోనో తప్ప చాలా మంది జీవితాలలో ఈ Surrendering to life అనేది inevitable అనిపిస్తుంది. మొత్తం మీద నీ టపా బోలెడు ఆలోచనలని, ఈ పుస్తకం చదవాలి అన్న ఆసక్తిని రేకెత్తించింది. Thanks.

    Like

  16. Good to know that there are people who care about Randy Pausch and his message.

    Here is another inspiring talk from Randy.

    http://in.youtube.com/watch?v=RcYv5x6gZTA

    “Its not the things that we do in life that we regret, it is the things we do not. ….. You will need to find your passion, don’t give up on finding it. Find your passion and follow it. You will not find that passion in things, you will not find it in money. The passion must come from the things that you feel from inside. Honors and rewards are nice things but only to the extent that you regard the real respect from your peers and to be thought well of by people who you think more highly of is a tremendous honor. “

    I wonder why there is not a single Randy in India!!

    Like

  17. @Ranjeeth: Thanks so much for the link. I just loved it!

    Interesting question tht you have put, “Why they aren’t Randys over here?” Hmm..

    @Venu: Shd be good read. Lemme know your thoughts when you complete the book.:-)

    @Bharath: Thanks!

    Like

  18. Purnima,

    The answer to that interesting question is, universities, colleges schools and education in US are geared towards empowering people (comparatively) while we in India read the class books designed buy the British for producing a Rs 30/month clerk job. (I am probably exaggerating, but not beyond truth)

    The whole aim of our education is to get a software job, or become a doctor, get married and better dowry! Our education system makes us incapable of *thinking*

    If you want detailed information, checkout the following links. I strongly suggest that you take a printout and read them all 🙂

    http://www.deeshaa.org/category/education/the-dismal-failure-of-our-education-system/

    http://www.deeshaa.org/who-actually-paid-for-my-education/

    http://www.deeshaa.org/2008/05/05/indias-desperate-talent-search/

    Like

  19. చదివినపుస్తకంలోనో, విన్న ఉపన్యాసంలోనో ఏముందో ఎవరైనా చెప్పగలరు. చదివేటప్పుడు లేదా వినేటప్పుడు మీకేమనిపించిందో చెబుతూ/రాస్తూ వుంటే వినడానికి/చదవడానికి ఆసక్తికరంగా వుంటుంది – ఈ టపాలో మీరు చేసినట్టుగా. బ్లాగుల్లోని ఆకర్షణ ఇదేననుకుంటా.

    Like

  20. చాలా బాగా రాసారు. పుస్తకం చదవాలి అనిపించేలా ఉంది. చక్కని నోట్సు (సమీక్ష అనలేను 🙂 )

    Like

  21. Ranjeeth: Comments are mostly heartening, but something like yours is enriching. I had a wonderful time reading those articles and enhancing my understanding about my own country.

    Here are the heartfelt thanks for taking time to browse thru my blog and sharing these links with me. THANK YOU, SO VERY MUCH!

    (Well, I owe another thanks as well, for the Idle thoughts of an Idle Fellow. That was a nice read! )

    రానారె గారికి: ధన్యవాదాలండీ!

    బ్రహ్మీ గారు: చదివేయండి మరి! నావి పుస్తక సమీక్షలు కావండి. Impressions the book has left on me, అంతే!

    Like

  22. Hmm! I was closely following randy pausch from may be year and had been constantly reading and watching about him. However the article presented here has nicely wrapped in most of the details of his life and book…. kaakapothe I was concerned with one of the comments that why we dont have randy pausch here…. unfortunately there are many of them and just that we dont recognise…. For example srinivasa ramanujan…

    When Ramanujan was dying of tuberculosis in a hospital, G. H. Hardy would frequently visit him. It was on one of these visits that the following occurred according to C. P. Snow.

    “Hardy used to visit him, as he lay dying in hospital at Putney. It was on one of those visits that there happened the incident of the taxicab number. Hardy had gone out to Putney by taxi, as usual his chosen method of conveyance. He went into the room where Ramanujan was lying. Hardy, always inept about introducing a conversation, said, probably without a greeting, and certainly as his first remark: ‘I thought the number of my taxicab was 1729. It seemed to me rather a dull number.’ To which Ramanujan replied: ‘No, Hardy! No, Hardy! It is a very interesting number. It is the smallest number expressible as the sum of two cubes in two different ways.’”
    for complete reading refer http://www.durangobill.com/Ramanujan.html

    and above all we will never find a randy if we search outside.. search with in and everyone shall find a randy in themselves its just the courage to live ones passion live ones dream that is required. may be randy also wanted every one to discover the randy in them….

    Like

  23. @Kishore

    Oh well.. Ramanujan belongs to a different league altogether. A genius. Randy delivered a lecture when he learned that his pancreatic cancer was terminal. Ramanujan was at his best even on the death bed. While one may view it as a similarity, drawing comparisons between them and arriving at conclusions is not scientific.

    When I asked the question why there isn’t a single Randy in India, I didn’t imply that there are nobody in India who are courageous, witty and sane in the face of death, for I know there were, like that proverbial Indian soldier in 1857 after taking a stab in his heart told his ebnemy “tatvam asi”!

    I will tell you what I meant, If you have closely followed his talks and writings, Randy insists on making mistakes and learning from them. He says

    “ts not the things that we do in life that we regret, it is the things we do not. ….. You will need to find your passion, don’t give up on finding it. Find your passion and follow it. You will not find that passion in things, you will not find it in money. The passion must come from the things that you feel from inside.”

    Now that inspires me. If you quote this to a 16 year old, it would inspire him/her too. But, in India, do we let our kids choose their passion? We don’t, as if we can’t afford to. Ever since they finish their 10th class, the race begins. Race to get a good rank in EAMCET, get into some IIT/IIM/ISB. Become an engineer/doctor, get out of the country, never to return again.

    It is true that there are men of exceptional merit here too, but there are few and far between. US constantly produces men of Randy’s quality. In US, you are encouraged to be innovative, In India you are penalized if you are innovative.

    @purnima

    Sorry for a rather long comment. There was a question begging to be answered, and I did. You may choose not to publish this comment, which is fine with me 🙂

    Cheers
    Ranjeeth

    Like

  24. బాగుంది ఫూర్ణిమా!
    నాకు కలిగిన భావాలన్నీ పై అభిప్రాయాలలో కవర్ అయ్యాయి. అందుకే మళ్ళీ వ్రాయడం లేదు.

    పుస్తక సమీక్షలు పుస్తకాలని పరిచయం చేస్తాయి.
    కానీ మీ టపాలు పుస్తకం ప్రభావాన్నీ, పుస్తకం చదవడం లోని ఆనందాన్నీ పరిచయం చేస్తాయి.

    Like

Leave a comment