దీనర్థమేమిటో .. ??!!

Posted by

ఇవ్వాల ఊసుపోక ఏదో గూగిల్లి మరేదో చదువుతుంటే, ఈ కింది వాక్యం తగిలింది. “ఆహా!” అనేసుకుని జీటాక్ స్టేటస్ మెసేజ్ గా అయితే పెట్టుకున్నాను గానీ, ఆహా కాస్త “అవునా?” కి పయనిస్తూనే ఉంది. కాసేపు ఆలోచించి, ఇంకాస్సేపు చర్చించి, ఇక లాభం లేదని, మీ అందరి సహాయార్థం ఇక్కడ పెడుతున్నాను.

We all know that Art is not truth. Art is a lie that makes us realize the truth, at least the truth that is given to us to understand.
Pablo Picasso 

పికాసో ఎందుకన్నారో, ఏ సందర్భంలో అన్నారో ఎంత వెతికినా దొరకటం లేదు. ఈ వాక్యంలో అర్థాన్ని, నా చిట్టి బుర్రకి అర్థం అయ్యేలా చెప్పగలరా, దయచేసి! కనీసం, మీ మీ అభిప్రాయాలను పంచుకుంటే, అవగాహన పెరిగే అవకాశం ఉంది. 

నెనర్లు! 
 పూర్ణిమ

17 comments

 1. Picaso’s initial striking impact on the Western Art scene was not through his works produced in isolation, but through a strategic partnership with another artist, Georges Braque. They ‘invented’ an art form “Analystical Cubism”.

  Read wikipedia article on cubism

  “In cubist artworks, objects are broken up, analyzed, and re-assembled in an abstracted form—instead of depicting objects from one viewpoint, the artist depicts the subject from a multitude of viewpoints to represent the subject in a greater context. Often the surfaces intersect at seemingly random angles, removing a coherent sense of depth. The background and object planes interpenetrate one another to create the shallow ambiguous space, one of cubism’s distinct characteristics”

  Some critics interpreted analytical cubism as a kind of counterpart to Einstein’s theory of relativity.The world is not as it appears to the common eye. Its all relative etc., So In effect, Einstein’s theory of relativity is giving some sort of a better or ‘truer’ explanation.

  Plato rejected this ‘scientific’ interpretation of his works and said the following:

  “We all know that art is not truth. Art is a lie that makes us realize truth. At least the truth that is given us to understand”

  Like

 2. పికాసో బొమ్మలు చూసి ఆనందించడమే తప్ప ఆయన గురించి నాకె తెలీదు. ఈ వాక్యాలు ఎందుకు, ఏ సందర్భంలో అన్నారో అసలే తెలీదు.

  పాశ్చాత్య దృకపథంలో అర్ట్ అనేది అబద్ధానికి ప్రతీక అనేది ఆ మాట మూలాల్లోకి వెళ్తే తెలుస్తుంది. artifice, artificial, artfulnessఇత్యాది మాటలూ ఉన్నాయి అదే మూలం నించి. గులాబి పువ్వు గురించి ఒక కవి పద్యం రాస్తే, ఒక పెయింటరు బొమ్మ గీస్తే, ఒక శిల్పి పోత బోస్తే .. ఆ వచ్చేది నిజం గులాబి పువ్వు కాదు గదా. గులాబి పువ్వుని మనకి ఆహ్లాదజనకం చేసే లక్షణాలు ఏవీ ఈ సృజనల్లో ఉండవు గదా. ఐనా ఆ కళా రూపాల్ని అనుభవించినప్పుడు మనం ఒక్క గులాబి పువ్వుని అనుభవించిన దానికంటే తీవ్రమైన, విశాలమైన అనుభూతిని ఒకదాన్ని పొందుతున్నాం. అదే సత్యం (truth). చూసి అనుభవిస్తున్న మనకే ఇలా ఉంటే, దాన్ని తనలో ప్రత్యక్షం చేసుకుని, దర్శించి ఆ దర్శనానుభవాన్నించి సృష్టి చేసిన ఆ కళాకారుడిది ఎంత సాంద్రమైన, తీక్ష్ణమైన అనుభూతో గదా! అది అసలైన సత్యం. కళాకారుడు సృష్టించిన ఆర్ట్ ద్వారా మన దాకా చేరి మనం జీర్ణించుకున్నది మళ్ళీ ఆ సత్యంలో ఒక ముక్క మాత్రమే!
  పిల్లంటే మార్జాలం అన్నట్టుందా?

  Like

 3. పికాసో అన్న కళ నిజం కాదన్న మాట తన కళకు మాత్రమే వర్తిస్తుంది. మన దేశ కళాకారులు బుద్ధుడి జాతక కథలను అద్భుతంగా చిత్రించారు,శిల్పాలపై చెక్కారు.ఇందులో బుద్ధుడి జనన వృత్తాంతం వగైరా ఎన్నో వాస్తవ కథలుంటాయి. పికాసో బొమ్మలలోని క్యూబిజం లో మనకు గోచరించేవి అపరిచిత రూపాలే. అవి పికాసో ఊహలోంచి వచ్చినవే. అవి వాస్తవ జగత్తులో ఎక్కడా గోచరించవు.కాబట్టి పికాసో కళా రూపాలు, వాస్తవానికి దూరంగా ఉంటాయన్న మాటలు సత్య దూరం కాదు.కానీ, కళా జగత్తులో పికాసో చిత్రాలు వెలకట్టలేనివి.

  -cbrao
  Atlanta,Georgia,USA.

  Like

 4. పికాసో గారు ఏ సందర్భంలో అన్నారో తెలియదు కానీ కొత్తపాళీ గారి వివరణ అదిరింది. నేనూ దాదాపు అదే భావాలను కామెంటదాం అనుకుంటుండగా, వీరు ఆల్రెడీ ఇంకా స్పష్టంగా, విపులంగా వ్రాసారు.

  బొల్లోజు బాబా

  Like

 5. WE ALL KNOW that Art is not truth.Art is a lie that makes us realize truth, at least the
  truth that is given us to understand.The artist must know the manner whereby to
  convince others of the truthfulness of his lies.—Picasso to De Zayas, 1923
  – this is the total context infact there is a series of quotes and it has a beautiful meaning when you go through all of them…. I have sent the info by mail as it was too long…

  Like

 6. ART IS SELECTIVE RECREATION OF REALITY ACCORDING TO AN ARTIST’S METAPHYSICAL VALUE JUDGEMENTS.

  అక్కడ selective అన్న మాట ముఖ్యం. తనకు నచ్చిన దానిని, లేదా తన మానసిక భావాలలో కొంత భాగాన్ని తీసుకుని కొంత రొమాంటిసైజ్ చేసి సృష్టించినదే కళ. Partial truth may be treated a lie. But Pablo Picasso’s statement is some thing above the apparent meaning.

  ఒక కళాకారుడు తన మానసిక భావాలకు ఒక రూపం ఇవ్వటానికి చేస్తూ ఒక రకమైన ఊహాలోకం లో విహరిస్తుంటాడు. ఆ ఊహల్లో వాస్తవం ఉండక పోవచ్చు. కానీ ఒక సత్యం గోచరిస్తుంది. అదే ఆతని METAPHYSICAL VALUE JUDGEMENTS.

  తెలిసినదేదో చెప్పాను. Quotation కూడా నాది కాదు.

  Like

 7. వ్యాఖ్యాన్నించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు! ఈ విషయాన్ని ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోడానికి మీ అభిప్రాయాలు, సూచనలు చాలా సహాయపడ్డాయి.

  రంజీత్: మీరు చెప్పిన క్యూబిజమ్ పైన ఇంకా చదవాలి నేను! Your comment was indeed helpful!

  కొ.పా గారు: నేను ఆ కోట్ చదవగానే మీరిచ్చిన వివరణే అనుకున్నాను. బాగా అనిపించింది. చిత్రలేఖనం, పుస్తక రచన, నాట్యం ఇత్యాదులపై ఆ వివరణని ప్రయోగించాను. కానీ “సంగీతం”లో ఏది నిజమో, అభద్దమో తెలీక తికమక పడ్డాను. మీ వివరణ కాస్త ఊరటన్నిచ్చింది.

  రావు గారు: మీరన్న మన కళాఖండాల గురించి నాకు తెలీదు గాని, పికాసో చిత్రాలను మాత్రం “రియాల్టీ”కి దగ్గరగా ఉన్న వాటితో పోల్చలేము. ఆ ఆకారాలకి మనకి తెలిసిన పదం ఇవ్వలేము. “సర్రియలిజం” అంటారట, దీని పై మరింత తెలుసుకోవాలి.

  బాబా గారు: నెనర్లు!

  కిశోర్: ప్రత్యేక ధన్యవాదాలు! ఆ పిడి ఎఫ్ లు చదవాక మళ్ళీ మాట్లాడుకుందాం

  గీతాచార్య: మీ అభిప్రాయం కూడా బాగుంది. నిజమే.. ఊహల్లో వాస్తవికత ఉండనవసరం లేదు. ఆలోచించాలి!

  Like

 8. పూర్ణిమ గారు, నాకు అర్థం తెలీదు. అయితే, నాకు తోచిన ముక్క రాస్తున్నాను. ఆబ్జెక్టివ్ ఆర్ట్ (లేదా సాహిత్యం) అంటే, అర్థం మనం అన్వయించుకునే విధంగా ఉన్నది. ఓ చిన్న ఉదా : పూర్ణమదః పూర్ణమిదం …అన్న శ్లోకం విని ఉంటారు (ఈశావాస్యోపనిషత్). ఈ వాక్యమూ అలాంటిదే అని ఊహ.

  Like

 9. @కొ.పా గారు : Hmm..నా ఉద్దేశ్యం ప్రకారం objective art అంటే, 100 మంది చదివితే (ఆస్వాదిస్తే), 100 రకాలుగా అర్థం అవడం అని అనుకుంటున్నాను. ఇది కరెక్టేనా? కాస్త వివరించగలరు.

  పైని వ్యాఖ్య అదే ఉద్దేశ్యం (అర్థం) లో రాసాను. articulation difficulties :-)..

  Like

 10. Picasso’s quote is in no way comparable to “పూర్ణమదః పూర్ణమిదం”. Picasso is a subjective artist. His paintings are expressions of his thoughts, feelings and probably ideas. You look at them, and try to make sense of it, you get nothing.

  As I said in earlier comment, there was a reason behind that quote. Picasso made it clear to the over enthusiastic critics that ‘scientific interpretation’ of his works and deducing facts there of is useless.

  Regarding objective art, a beautiful Japanese Haiku comes to my mind.

  “An ancient pond
  A frog jumps in
  The sound of water”

  Read the above silently, visualise it and see how you feel.

  That is objective art

  Cheers
  RK

  Like

 11. Purnima, I don’t know about the above quote; but if you want to know the meaning of art, search no further, this is the closest one can get to the essential meaning of art. Everything stems from here:

  The artist’s responsibility is to confront the appearance of nature, deduce its essence and retell or explain that essence in the work of art. — Marcel Proust

  పైన గీతాచార్య చెప్పిన కోట్ అయాన్ రాండ్‌ది. అది కూడా ఇంచుమించు ఇదే అర్థాన్నిస్తుంది. కాని రాండ్ కళాకారుని వాల్యూ జడ్జ్‌మెంట్స్‌కి (విలువల నిర్ణయానికి) ప్రాధాన్యత ఇస్తుంది; కాని ప్రౌస్ట్, ఫ్లేబర్ మొదలైన వాళ్ళు కళాకారుడు అసలు విలువలు నిర్ణయించకూడదని, కళాకారుడు తన కళ నుండి పూర్తిగా అదృశ్యమైపోవాలని అంటారు. ఇవి రెండు వర్గాల్లాంటివి అనుకో. వీటిలో ఏది కళకు విస్తృతమైన అర్థాన్నిస్తుందన్న చర్చ మొదలెడితే అది ఎంతకీ తెగదు. ఎవరికి సరైనదని తోచింది వారు అనుసరించాలి. నేను రెండో వర్గాన్ని సమర్థిస్తాను. పైన కొత్తపాళీ గారి వివరణ కూడా బాగుంది.

  Like

 12. @RK: any online source for haiku’s ?? please! Any suggestions on books about these?

  @Phani: Thanks, that’s a beautiful quote of Proust.

  @Ravi, kottapaalee: Thanks for ur inputs!

  Like

 13. There is a book of Haikus with Osho's interpretation, the name of which doesn't come to my mind now, and I am too lazy to google now 🙂 I, for one, prefer to read Haikus without any sort of third party interpretation.

  There are some books on Amazon:
  http://www.amazon.com/Basho-Complete-Haiku-Matsuo/dp/4770030630/ref=sr_1_4?ie=UTF8&s=books&qid=1224007793&sr=1-4

  http://www.amazon.com/Sound-Water-Shambhala-Centaur-Editions/dp/1570620199/ref=sr_1_1?ie=UTF8&s=books&qid=1224007793&sr=1-1

  Here is a nice collection:
  http://www.ahapoetry.com/aadoh/h_dictionary.htm

  few more on these sites:

  http://www.ahapoetry.com/haiku.htm
  http://www.toyomasu.com/haiku/#anonymous
  http://www.haibuntoday.com/
  http://www.wonderhaikuworlds.com/

  I vaguely recollect a couple of Haikus from Ravuri Bharadwaja posted on some telugu weekly, but I am not quite sure whether he is into Haikus and all.

  Vishalandhra once Published a book called Narasa Reddy's Haikus, but I have not read it, so I dont recommend it to you. Its just FYI. In your next 'Visalandhra invasion', you can probably ask them about it and let us know if its worth it.

  Cheers
  RK

  Like

 14. @RK : I donno much about Picasso.But a nice explanation. OshO explained some Haikus of Basho, but he “explained it away” :-). Interpretations do spoil the beauty of haikus.

  Like

 15. పూర్ణిమా.. నే రాసేది నీ సందేహాన్ని తీర్చటంలో ఏ రకంగానూ ఉపయోగపడకపోవచ్చు!! ఐనా ధైర్యం చేసి నా సొంత పైత్యం కక్కేస్తున్నా.. 😉

  What is Truth ? 🙂 నా నిజం నీదయ్యేనా? నీ నిజం నేనొప్పుకుంటానా?? అన్ని రూపాలున్నది ఎప్పటికయినా నిజమయ్యేనా? అయినప్పటికీ అది ఇప్పటికి ‘నా’ నిజం కాకుండా పోవునా..?!

  To me, Art is a way to express ones own [might not be universally acceptable!] Truth. The beauty of it is…. Clarity in a thought creates a piece of Art. In turn, Expressing through Art brings more clarity to the thought and so to the Art itself.

  ప్రతి ఒక్కరికీ చాలా విషయాలు తెలిసే ఉంటాయి. కానీ మనకి ఏదైనా సందర్భం వచ్చినప్పుడే ఆ స్పృహ కలుగుతుంది. మనం చూసిన/విన్న/చదివిన విషయాన్ని మన బుర్రంతా వాడేసి మనకి నచ్చినట్టు, మనకు అర్థమయిన విధంగా అన్వయించుకుంటాం. “ఒక కళాకృతిని అనలైజ్ చెయ్యటం అంటే మనలో మనకి తెలియని ఒక సరికొత్త కోణాన్ని కనుక్కోవటమే..” అని నా అభిప్రాయం.

  ఇక్కడ, పికాసో “Art is a lie that makes us realize the truth, at least the truth that is given to us to understand.” అనటం వెనుక ఆర్ట్ ని ఊతంగా చేసుకుని, మనకి మనం [truth that is given to us to understand] అర్థం చేసుకోవటం అని నాకనిపిస్తుంది.

  PS: ఇది పూర్తిగా నా విశ్లేషణ. అర్థం లేదనుకుంటే లైట్ తీసుకో..

  Like

 16. We all know that Art is not truth. Art is a lie that makes us realize the truth, at least the truth that is given to us to understand.

  I kind of find the statement contradicting … art is a lie – it helps us understand the truth – the truth that it wants to convey. but then, I do not have the audacity to challenge the linguistic authority of a person who can conceive and present a thought as beautifully as Picasso, so let me just say that I humbly accept the statement at the face value and not read much into it. :D..

  But, that is one master quote!

  Like

Leave a Reply to కొత్త పాళీ Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s