బ్లాగు ప్రయాణం లో నేను: పూర్ణిమ

Posted by

నా ఉద్యోగానుభవాన్ని ఓ రెండు ముక్కల్లో చెప్పమంటే “Extended College” అని చెప్తా. ఇంకో రెండు ముక్కలు జత చేసుకోవచ్చు అంటే “Extended College minus Internals” అని ముగిస్తా.:-))
నా బ్లాగానుభవాన్నీ అలానే చెపచ్చు, “Back to the School” అని! బడిలో ఏం చేస్తామో తెలియనిదెవ్వరికీ? పాఠాలు (తెలుగు నేర్చుకుంద్దాం అనుకున్నా, జీవితం కూడా తెలుస్తోంది కొంచెం కొంచెం గా) కాక ఆటలూ-పాటలూ (ఇక్కడ fun కీ, pun కీ ఏం కొదవని?), పాట్లూ ( నొప్పింపక తానొవ్వక నడవటం … బాబోయ్!) అంతా మళ్ళీ చెప్పకరలేదు కదా! కాకపోతే చిన్ని twist ఎంటి అంటే ఇక్కడ అన్నీ కంప్యూటర్ మీద కనిపించేకొన్ని అక్షరాలా ద్వారానే సాధ్యమవుతున్నయీ. మాటల్లో బోలెడు పవర్ ఉందని నమ్మే నాకే హాశ్చర్యం కలిగించేంత!

Thanks to one and all, who came my way as part of this journey! ఊహలన్నీ ఊసులుగా మార్చే ఈ ప్రయత్నాన్ని అభినందించీ, ప్రోత్సహిస్తున్న ప్రతీ ఒక్కరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు!

పూర్ణిమ

28 comments

  1. నువ్వు నువ్వే! ఒక్కపదంలో కొన్ని పేజీల అనుభవాన్ని తమంతటతాముగా తెలుసుకునేలా చేసావ్.

    ఇక నువ్వు నేర్చుకోవాలనుకున్న తెలుగు భాషగురించంటావా..భావాలు ఇంత భిన్నంగా,వైవిధ్యంగా,ఒరిజినల్ గా ఉంటే ఏ భాషైనా వెతుక్కునొచ్చి పదాలివ్వదూ! నీదే అయిన తెలుగెక్కడికిపోతుంది.

    జీవితం గురించి నువ్వు నేర్చుకోవడమేమోగానీ, నీ బ్లాగుచదివే అందరికీ ఒక విన్నూత్న జీవనధృక్పధాన్ని పరిచయం చేసావని నీకు తెలీదనుకుంటా!

    మాటల్లో బోలడంత పవరు ఖచ్చితంగా ఉంది. కాకపోతే, అది రెండువైపులా పదునైనకత్తిలాంటిది. నాలాంటివాళ్ళు రెండువైపుల్నీవాడితే, నీలాంటివారు కేవలం సరైనవైపేవాడుతారు.ఆ పదాల్లోని పవర్ను పాజటివ్ ఎనర్జీగా మార్చే నీకు నా అభినందనలు.

    Like

  2. ప్రయాణం బావుంది. టపా టైటిలు సరిదిద్దాలేమో (ప్రయాణం)…

    Like

  3. ఎన్నో ఊసులు చెబుతారు అనుకుంటే ఇంతేనా…?! కొన్ని చెప్పకుండా ఫీల్ అయితేనే బావుంటాయేమో…!

    Like

  4. నిజం చెప్పాలంటే నేను మీ ఈ బ్లాగులో టపాలు అన్నీ చూసా,కానీ చాలా తక్కువగా చదివా.నాలాంటి సాధారణబ్లాగరు/పాఠకుడికి కాస్త ఎడంగాఉండే ఇంటెలెక్చువల్ టపాల మాదిరి అనిపించటం కారణం.అలాగని చూడటం మాత్రం ఆపను,కానీ ఒకరోజు అన్నీ చదివేస్తానన్నమాట.
    ఇంతకీ మీది బ్లాగుప్రయాణం, ప్రయానం కాదు.
    ఆల్ ది బెస్ట్.

    Like

  5. నీ ఊహలు ఎప్పుడూ ఊసులుగా మారుతూనే ఉండాలని, అందరినీ అలరించాలని కోరుకుంటున్నాను. Wish you a long long and happy happy way. ప్రయానంలో తడబడ్డావు; “ప్రయాణం”గా మార్చు 🙂

    Like

  6. cool, yeah, blogging is an experience that has taught u many things and brought u closer to all sorts of people. But, it is fun and ur blog is awesome :).

    Like

  7. చాలా బాగా చెప్పారు ఊహ గారు సారీ సారీ పూర్ణిమ గారు. మీ అసలు పేరు మర్చిపోయే ప్రమాదం ఉంది మా ఈ ప్రయాణంలో. ఊహాలోకంలో విహరించేలా చేస్తారు మమ్మల్ని.

    Like

  8. ఊహల్ని ఊసులుగా మార్చే శక్తి మీ చేతిలోనే ఉందిగా.. సాగించండి నిరంతర ప్రయాణం. 🙂

    Like

  9. ఏంటండీ ఇదీ, మరీ కట్టే కొట్టే,తెచ్చే అంటే ఎలా
    నాలంటి కొత్తవారికోసమైనా ఇంకాస్త చెప్పచ్చుగా?

    Like

  10. రెండు ముక్కల్లో భలే చెప్పేసావు పూర్ణిమా!!నీ రాతల్లో కూడా బోలెడంత పవర్ ఉంది. Keep it up.

    Like

  11. p – ప్రతీ దాన్నీ

    u – understand చేసుకుని

    r – rare style తో

    n – no compramise అంటూ

    m – మాకు

    a – అర్ధమయ్యేలా చెపుతారే… అదే మీరు.

    I wonder how you write! Keep going. 🙂

    Like

  12. Well. Kalhaara’s not running. Wimbledonweekly’s running cool. What next to me? I just saw your post today. Something is touching my heart.

    I like sports and poetry. But you are writing heart poetry.

    Thank you,

    Dhanaraj.

    Like

  13. ఇంతే చెప్పిందేమిటా అని అనుకున్నాను కానీ కామెంటడానికి ఆలోచిస్తుంటే చాలా చెప్పావు అనిపించింది.ఎందుకో బ్లాగర్లలో నిషీ తరువాత నువ్వంటే నాకు చాలా ఇష్టం.

    Like

  14. శ్రీసత్య గారు, రవి గారు, ఫణీ, కొత్తపాళీ గారు, మహి, రంజీత్, వరూధిణి గారు, నిషీ: నెనర్లు! మీ అభినందనలకి కృతజ్ఞతలు!

    మహేశ్: నేనా రెండో వైపు కూడా బాగా వాడగలను! The best of men can stumble, I mean it 🙂

    మేధ: నాకు చాలా ఇష్టమైనవ్వనీ మాటల్లో చూసుకోవటం భలే ఇష్టం నాకు! చెప్పీ చెప్పకుండా ఉంటే ఏదో ఆనందం అని అంతా అంటే, ఓ సారి రాయేసి చూద్దాం అని ఇలా, అంతకు మించి ఏమీ లేదు.

    రమణి గారు: ఏంటండీ, ఇష్టమో, కష్టమో నా ఈ పేరునలా ఉండనివ్వండి, ఊహలెంత నచ్చినా అక్కడే ఉండిపోలేను కదా! 🙂

    తెరిస్సా గారు: అంత తేలికయ్యితే బాగుణ్ణు 😦

    లలిత: రాయడానికి బోలెడుందిలెండీ, కానీ నేను రాస్తే ఆగను! కనీసం ఇదైనా చదవాలీ అని ప్రస్తుతానికింతే! త్వరలో చెప్తానేమో, చూడాలి.

    Like

  15. రాజేంద్ర కుమార్ గారు: మరీ “ఇంటలెక్చువల్” పదం వాడేశారేంటండీ బాబు! సరే, చదువుతా అన్నారు కదా, కాస్త ప్రాణం కుదుటపడింది, వేచి చూస్తుంటాను. నెనర్లు!

    గీతాచార్య: ఏమిటో కానీ, బానే ఉంది! థాంక్స్!

    వర్మ: థాంక్స్

    ధన్ రాజ్: హమ్మ్, కల్హారా మళ్ళీ కొనసాగాలని ఆశిద్దాం, I do miss it a lot! 😦 Anyway, thanks for your interest in the blog.

    రాధిక: “గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే!” – ఏం చెప్పాను? :-))

    Like

  16. ఆహా పూర్ణిమ బ్లాగు ప్రయాణం గురించి చెబుతుందంటే కనీసం ఒక పది పేజీలైనా వ్రాసేసుంటుంది లే అని వస్తే ఒక చిన్ని పేరా తో స్వాగతం పలికావు, ఇదెంటి అనిపించింది కానీ చదివాక చాలా బాగ చెప్పావ్ అనిపించింది. పోకిరి స్టైల్లో “ఎంత చెప్పాం అన్నది ముఖ్యం కాదన్నయ్యా ఏం చెప్పాం అన్నది పాయింటు…” అనిపించావ్ మొత్తానికి 🙂

    Like

  17. ఎప్పుడు ఎంత చెప్పాలో తెలియడం కూడా మంచి రచయిత్రుల లక్షణమే. మీరు మంచి రచయిత్రి కాగలరు.

    Like

  18. may be i am late

    ఎక్కడో కొండేపూది నిర్మల మాట్లాడుతూ
    నేటి యువతకు నేటి సాహిత్యం అందుతుందా అని ప్రశ్న లేవనెత్తారు.

    మీ రచనలు, రాతలు చదవాక నేను కొందరికి పరిచయంచేసాను.

    అభినందనలు

    Like

  19. Nice one.. some times words are not suffice to share feeling, but at the same time we want to speak a heart-full of words(feelings). I think this is from your heart. 🙂
    I wanted to write a loooong comment to share my views also..hmm what to do..? Exams’ tension.. 😦
    Anyways the few words “nice one” is from my heart.. just feel it, that’s all. 🙂

    Like

Leave a comment