Affectionately dedicated to HP Compaq 6720s

Life of Pi

( “అబ్బా మళ్ళీ ఇంకో పుస్తకమా? చదివేయటం.. రాసేయటం! ఇప్పుడు చదవాలా? ఎందుకు చదవటం.. ఎటూ పుస్తకాలు కొని చదివేంత లేదు! అదీకాక ఇలా పనులు కానీ పనులు పెట్టుకుంటే.. అసలైన పనుల పనేంగానూ?” అనుకుంటూ మీరీ టపా చదవకుండా వదిలేస్తే ఒక రకంగా మీరు అదృష్టవంతులు. కానీ ఈ పుస్తకం చదవకపోతే మీరెంతో కొంత మిస్సవుతారని రూఢీగా చెప్పగలను. )

నిద్రపోతున్నప్పుడు కలలు వస్తాయి. (మన ప్రమేయం పెద్దగా లేన్నట్టనిపిస్తుంది!) “అమ్మ పక్కనే కూర్చుని తలనిమురుతుందన్నట్టు” కలొస్తే అమందానందాలు. ” రైలెక్కి ఎవరో వెళ్ళిపోతున్నట్టు” కలొస్తే తీవ్ర దుఃఖం, నిరాశ. “ఎవరో వెంటపడి చంపడానికి వస్తున్నార”నే కలలో అంతులేని భయం, ఆవేశం, ఆయాసం! కల వాస్తవానికి చాలా దూరం, కలలు నిజమయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువ, అయినా కలలు మనల్ని అంతలా కదిలించడానికి కారణం “కలలో మనం కలకంటున్నామని మనకి తెలియక పోవటం!” ఉలిక్కి పడి లేచిన తర్వాత, పట్టిన చమటను తుడుచుకుంటూ, తడారిపోయినా గొంతులో కాసిన్ని నీళ్ళు పోసుకోడానికి పడుతూ లేస్తున్న వేళ గుచ్చుకుంటున్న కళ్ళల్లో నిద్ర కాస్త మాయమయ్యి, తెలివొచ్చి “ఓహ్.. కలే కదా!” అనిపించినా అప్పటి వరకూ పడిన  అనుభవం ఎక్కడికి పోతుంది? నిజం కాకపోయినా, మనం దానిని జీవించేశాము. సాక్ష్యాలుండవు కానీ, కొన్ని అనుభూతులో.. అలాంటివేవో మనతో నిలిచిపోతాయి. నిజం కాకపోయినా, కరిగిపోయేదైనా కలకున్నంత బలం మళ్ళా కలానికే ఉందేమో అన్నట్టుగా ఉందీ పుస్తకం నాకైతే! ఉన్న తెలివిని పక్కకునెట్టేసి రచయిత చేస్తున్న పదాల గారడీని నిజమని నమ్మించే ఒక రచన ఇది.

కథ: “ఓహ్.. ఒక కల గురించిన పుస్తకమా ఇది!” అని నిర్ణయానికి వచ్చేయద్దు. కథకీ కలకీ అసలు సంబంధమే లేదు. ఈ కథని క్లుప్తంగా చెప్పాలంటే – జూ వాతావరణంలో పెరిగిన ఓ కుర్రాడు, తల్లిదండ్రులతో కొన్ని జంతువులని తీసుకుని సముద్రం మీద వెళ్తుండగా, పడవ ప్రమాదానికి గురై అంతా మునిగిపోగా, ఒక పెద్ద పులి, ఒక జీబ్రా, ఒక చింపాజీ లాంటి జంతువు, ఒక కొరనాసిగండు (hyena) తో పాటు ఇతనూ ఒక బోటులో మిగిలిపోతారు. ఆ జంతువుల మధ్య, నడి సముద్రంలో ఈ కుర్రాడు ఎన్నాళ్ళు, ఎలా బతికాడు, అసలు తప్పించుకోగలిగాడా అన్నదే కథాంశం.

ఈ కథ మొదట్లో “దేవుడిపై నమ్మకం కలిగించే కథ” అని ఉంటుంది. “ఓహ్.. పుస్తకం పూర్తయ్యే సరికి నేను మహాభక్తురాలయ్యిపోతాను.. కాసుకో!” అని  కాసేపు మా అమ్మను ఉడికించి మరీ ఈ పుస్తకం చదవటం మొదలెట్టాను. చివరి దాకా చదవేను గానీ, నాకెక్కడా దేవుడి మీదకి దృష్టి పోలేదు. ఈ పుస్తకం గురించి ఒక్కటే ఒక్క మాట చెప్పాలంటే… “Man is a social animal” అని అర్థం అయినా కాకపోయినా  ప్రైమరీ తరగతుల నుండీ “చదువుకున్న”  ఆ ఒక్క వాక్యమూ చెప్తాను. ఈ పుస్తకంలో కథానాయకుడు ఒక పెద్ద పులితో ఉండడానికి ఒప్పుకుంటాడు కానీ ఒంటరిగా ఉండలేనంటాడు. ఇక ఆకలి మించినదేదీ లేదని.. విపరీత పరిస్థితుల్లో మనిషికీ, జంతువుకీ పెద్ద తేడా లేదని తెలుస్తుంది. దేవుడి మీద నమ్మకం అటుంచితే, మానవ మెదడనే పదార్థం ఆలోచించగలిగితే ఎంతటి విపత్కర పరిస్థితుల్లో అయినా బయటపడచ్చు అని తెలుస్తుంది.

రచనా విధానం:
నాకీ కథ చెప్పిన విధానం యమ గందరగోళంగా అనిపించింది. రచయిత చెప్పిన మాటగా ఈ పుస్తకం మొదలవ్వటంతో “పై” అనే వ్యక్తి జీవితంలో జరిగిన యధార్ధ గాధ అనుకున్నాను. తీరా చూస్తే మొదటి భాగంలో అక్కడక్కడా ఏదో చెప్పి మాయమయ్యిపోయి, మరలా చివర్లో వస్తాడు రచయిత. ఈ లోపు “పై”యే తన కథ మనకు చెప్పినట్టుంటుంది కథా శైలి. ఎందుకో అవసరం లేకపోయినా రచయిత కథలో దూరడానికి శతవిధాల ప్రయత్నించాడనిపించింది. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఫిక్షన్‍లో తాను చెప్పాలనుకున్నదంతా సాధ్యాసాధ్యాల ఆలోచనే రానివ్వకుండా తన పదాలవెంటే మనం పరుగులు తీసేలా చేయగలడు రచయిత. పుస్తకం చదివేశాక వెళ్ళి నా కొలీగ్స్ కి కొందరికి కథలో ఏమేం జరుగుతుందో చెప్పాను. వాళ్ళేదో కామెడీ సీను చెప్తున్నట్టు ఒకటే నవ్వు! నిజంగానే ఇది అతి అసాధారణమైన కథనం, నమ్మశక్యంగాని రచన. కానీ రచన చదివేటప్పుడు వీటికి అతీతంగా కేవలం రచయిత మాయలో పడిపోతాం.

ఎన్నో రోజులుగా ఆహారం లేని మనిషి తిండి ఎలా తింటున్నాడు అని చెప్పటం, గత్యంతరం లేక మనిషి వేట ఎలా నేర్చుకునేది, ఎలా చేపల్ని తినటం మొదలెట్టిందీ, అలా కొనసాగించి తనూ ఓ జంతువు తిన్నట్టు ఎలా తింటున్నదీ! ఆనంతమైన సముద్రాన్ని, అనంతాకాశాన్ని, నక్షత్రాలనీ, చేపల్నీ, పడవల్నీ, ప్రకృతినీ, మానవ మనో సంఘర్షణనీ, జంతువుల సహజ వ్యవహారికాన్ని అన్నింటినీ ఈ రచనలో అద్భుతంగా సృష్టించాడు. ఒక చోట ఒక పోలిక చెప్తాడు: “మనం అడవిలోనైనా సరే ఒక జీపులో వెళ్తూ అడవంతా చూసేసామనుకుంటే పొరపాటే. అడవిని పరిశీలించాలంటే కాలినడకనే వెళ్ళాలి. పసిఫిక్ పైనా పడవలో వెళ్తే దాని అసలు జంతు సంపదను చూడలేము. ఇక్కడా కాలినడకల్లే కొనసాగాలి” అని. ఈ పుస్తకం ఎంచుమించు అలానే కొనసాగి మనకి చాలా విషయాలు చెప్తుంది.

  అప్పటిదాకా చీకటిలో మగ్గిపోయున్న అతడు, తెల్లారి వెలుతురులో చూసిన సముద్రాన్ని ఇలా వర్ణిస్తాడు: “The calm sea has opened around me like a great book” అని. నాకైతే ఈ పుస్తకమే ఓ మహాసముద్రంలా నా మనోకాన్వాస్ పై విస్తరించి ఒక “అద్భుతాన్ని” నా కళ్ళముందు సృష్టించింది. అందులో జాలి, కరుణ, భయం, బాధ, చావు, ఆకలి, నమ్మకం, ఆశ, నిరాశ, భక్తి, యుక్తి లాంటివన్నీ ఒక్కోటే నన్ను చుట్టుముట్టి వాటి విశ్వరూపాన్ని చూపెట్టాయి. ఈ పుస్తకం మానసికమైన వత్తిడి కలగజేస్తుంది, ఒక పీడ కలలానే! అంతగా భయపెట్టినందుకు బాధపడాలో, కల మాత్రమేలే అని ఊరట చెందాలో తెలీనివ్వదు. అసలు పుస్తకమంతా చదివేశాక ఏది నిజమో, ఏది కాదో తెలీని అయోమయ స్థితి కూడా ఏర్పడవచ్చు. చదవాలనుకుంటే మాత్రం వీలైనంత సమయం చూసుకుని తీరిగ్గా చదువుకోవాల్సిన పుస్తకం. Like it or not, it would leave an impact on you!

13 Responses to “Life of Pi”

 1. Ψ

  చదవదగిన పుస్తకం! దీనికి 2002 లో Booker prize వచ్చింది కూడా. ఈ పుస్తకం ఆడియోలో కూడా బాగుంటుంది. 2002 లో Booker prize కి short list చేయబడిన పుస్తకం — రోహింటన్ మిస్త్రీ (Rohinton Mistry) రాసిన –Faminly Matters ఇంకా చదవదగ్గది.

  Like

  Reply
 2. DSG

  “ఈ పుస్తకం మానసికమైన వత్తిడి కలగజేస్తుంది, ఒక పీడ కలలానే!”

  aptly put…

  Infact, it gets to you like a slow poison. “Life of Pi” might not be a book which forces you to stop from time to time to appreciate/savor a line or a sequence…some portions of the book might not impact you right away….but, after you’re done with the book, you will be disturbed for sure…a kind of uneasyness thats hard to get out of…

  you hit the nail on the head when you said “Like it or not, it would leave an impact on you!”….

  Thank you for posting a really good review of a book i love…

  – Goutham (thotaramudu.blogspot.com)

  Like

  Reply
 3. Duppala Ravi

  ఇంత మంచి పుస్తకాన్ని ఇంత చక్కగా సమీక్షించిన మొదటి రివ్యూ మీదే. అభినందనలు. పుస్తకంలో లీనమై మీరు రాసిన సమీక్ష పుస్తకాన్ని చదవమని పాఠకులను నిజంగానే రెచ్చగొడుతుంది. చదివితే చదువు, లేకపోతే లేదు అనే రకంగా లేదు ఈ వ్యాసం. మరి నాకూ ఆ పుస్తకాన్ని పంపి, చదివే భాగ్యం కలిగించండి పూర్ణిమ గారూ.

  Like

  Reply
 4. cbrao

  సమీక్షించిన తీరు,శైలి ఆకట్టుకుంది.మామూలు టపాలకు వచ్చినట్లుగా, పుస్తక సమీక్షలకు పాఠకులు పెద్దగా స్పందించరు.పుస్తక సమీక్షలు కాని వాటిని అలవోకగా రాయగలం.సమీక్షలకు మూలవస్తువును పరిశీలనా దృక్పధంతో చూడవలసుంటుంది.పుస్తక సమీక్షకు స్పందన తక్కువయినా,మంచి పుస్తకం చదవటంలో,సమీక్షించటంలో ఎక్కువ తృప్తి కలుగుతుంది.

  Like

  Reply
 5. Purnima

  కొత్తపాళీ గారు: నెనర్లు!

  Ψ : ఈ పుస్తకం ఆడియో ఉందని తెలుసుగానీ పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. చూస్తాను. మీరు చెప్పిన పుస్తకం గురించి కూడా తెలీదు, చూస్తాను.

  గౌతం: First things first, a comment from you is certainly a thrill for me. Thank you so much for caring to leave a comment.

  మధ్యలో ఆగటమూ కుదరదు వడివడిగా ముందుకీ కొనసాగలేను. It’s a tough read, in many ways. It’s a book hard to get out of mind.

  రవి గారు: హిహి.. మరీ అంత రెచ్చగొట్టేశానా మరీ? 😉 మీకు పుస్తకాన్ని పంపే బాధ్యత నాది. త్వరలో వచ్చేలా ప్రయత్నిస్తాను.

  రావు గారు: అభినందనలకు నెనర్లు! చాలా ఇష్టపడి రాయడమే కానీ, అటు తర్వాత వాటి గురించి ఆలోచించే ఓపికుండదు. మెదడులో అటూ ఇటూ పరిగెట్టే ఊహల్ని / ఊసుల్ని ఇలా అక్షరాల్లో క్రమబద్ధీకరించడానికి మించిన ఆనందం ఉండదు మీకు వేరే చెప్పాలా? పుస్తకాలపై నేను రాసేవి review అనే కన్నా personal impressions అంటే సరిపోతుంది. పుస్తకం చదవగానే నాలో కలిగిన స్పందన అంతే!

  ఇక నేనే ఎక్కడైనా సినిమా రివ్యూ కనిపిస్తే చట్టుక్కున స్కిప్ చేస్తాను. ఒక్కొక్కరికీ ఒక్కోటి ఇష్టం! 🙂

  Like

  Reply
 6. Purnima

  గీతాచార్య: What is this book about? Google doesn’t have much info on it! :O More info please!!

  Like

  Reply
 7. గీతాచార్య

  “జమీల్య” విశాలాంధ్రా లో దొరుకుతోంది. నేనిప్పుడే కొన్నాను. యు తూ కెన్ ఎంజాయ్ ది బ్యూటిఫుల్ నోవెల్ ఇఫ్ యు హావ్ టైం. 🙂

  http://thinkquisistor.blogspot.com/2008/10/blog-post_26.html

  Like

  Reply

Leave a Reply to DSG Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Basic HTML is allowed. Your email address will not be published.

Subscribe to this comment feed via RSS

%d bloggers like this: