Affectionately dedicated to HP Compaq 6720s

ప్లాట్‍ఫాం

ఆ ప్లాట్‍ఫాం పై లేని శబ్దమంటూ ఏమీ లేదు. ఓ వయ్యారి వేసుకున్న హైహీల్స్ చేసే టక్..ఠఖ్, ఇంపోర్టెడ్ షూస్ నుండి వెలువడే సన్నని “కిచ్..కిచ్” శబ్దం, అరిగిపోయిన జోళ్ళల్లోని మేకులు నేల రాపిడికి చేస్తున్న “కర్రర్” అనే శబ్ధం – ఇవ్వన్నీ బరువుతో పాటు కాళ్ళీడుస్తున్న పాదాలకింద నలిగిన శబ్దమల్లే  అణిగిపోయాయి. అప్పుడే బుడిబుడి అడుగులేసుకుంటున్న చిన్నారి “క్విఈక్..క్విఈక్” మాత్రం ప్రస్ఫుటంగా వినిపిస్తుంది. ఆ చిన్నారిని పట్టుకోడానికి మందీ మార్బలం చేసే ప్రయత్నాల హోరు – వెంట పరుగులు, నవ్వులు, అలిగినట్టు నటనలు, అబద్ధపు బెదిరింపులు, అట్టహాసాలూ – మాటల సునామీలో మనిషి కొట్టుకుపోవచ్చు. “అదో.. టివీలో ఆంటీ చూడు” అని చేతచిక్కిన వాడి ధ్యాస మరల్చే వరకూ అక్కడో టివీ, ఉన్న గొంతంతా వేసుకుని అరుస్తోందని తెలీదు. ఆ గుసగుసల బాతాఖానీని చెవులు నిక్కపొడుచుకుని వింటున్న వారి దగ్గర “ఆఅ.. ఛాయ్.. కాఫీ.. ఆ.. ఛాయ్” అని కేకేస్తున్నోడినే కాదు, “ఆఆ.. నేనూఊ.. స్టేషన్‍లో ఉన్నా.. ఆఆ.. ఏంటీ? సరిగ్గా వినిపడ్డం లేదూ? గట్టిగా చెప్పరా!” అని గావుకేక పెడుతున్నవాడూ బతికేస్తాడు. కాస్త దూరంలో ఉన్న కాంటీనులో గిన్నెల హడావిడి, పక్కనే ఉన్న టీకొట్టులో ఉన్న రేడియోని డామినేట్ చేస్తుంటే, పుస్తకాలు మాత్రం మూగబోయే ఉంటాయి.

ఉన్నట్టుండి కలకలం.. ఇప్పటివరకూ చెవులే శ్రమపడ్డాయి. ఒక్కసారిగే ఎగసే ఉద్వేగాలూ: కలిసిన చేతులు విడిపోతున్నాయనే బాధ, కులుస్తున్నామని హర్షాతిరేకాలు, తప్పించుకుంటున్నామనే ఆనందం, తప్పనిసరై వెళ్తున్నందుకు దుఃఖం, తప్పైపోయిందన్నా వెనక్కి తీసుకోలేని నిర్ణయాలు, తప్పేది కాదులే అనే నిర్వేదం, తప్పులేకపోయినా పడిన శిక్షలూ, పాత గూటికి చేరేడానికి కిలకిలమంటున్న పక్షులూ, కొత్తగా రెక్కలు చాచుకుంటున్న రెక్కల్లో లేలేత భయాలు! నాన్న చేతిని వదిలించుకుని (!) అతడి చిటికెను వేలే ఆధారంగా అడుగులేసే కొత్త పెళ్ళికూతురిలా ఆ ఉద్విగ్న క్షణాలని అనుభవిస్తున్న మనసు, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడాలనుకున్నా, ప్రస్తుతమనే కన్నీటితో మసకబారిన చూపు చేసేదేమీ లేక ముందుకే అడుగేస్తుంది. తప్పదు మరి, ఈ క్షణం చేజారిపోతే మళ్ళీ రాదు. ఈ ప్లాట్‍ఫాం పైకి రావడమే కానీ, వచ్చిన దారినే తిరిగి పోవటం సాధ్యపడదు!  అపరిచితులతో కొత్త పరిచయాల జోరులో పాత పరిచయాలు అపరిచితులుగా మౌనమైపోతున్నా – అడుగులని వెనక్కి మరలలేవు.

అంతే కాదు, ” అక్కడ నుండి ఇక్కడికి వెళ్ళే ఫలనా నెంబరు బండి కొద్ది సేపట్లో ప్లాట్‍ఫాం నెంబర్ ఫలానా నుండి బయలుదేరడానికి సిద్ధముగానున్నది” అనే అనౌన్సుమెంట్లు/హెచ్చరికలూ/బెదిరింపులూ  లేకుండా, ఏ క్షణానైనా   ప్రణయాణికో, మరే ప్రళయానికో ఉరుకులపరుగులతో ప్రయాణం కట్టించేసి ఆనందాతిశయాలూ, ఆవేదనావేశాలూ కలిగించే ఈ ప్లాట్‍ఫార్మ్ పేరు – జీవితం!

Amidst all the chaos, life still continues to be a beautiful platform! 

30 Responses to “ప్లాట్‍ఫాం”

 1. సుజాత

  అవును, నిజం! ఆ ప్లాట్ ఫాం కీ, ఈ ప్లాట్ ఫాం కీ ఎంత దగ్గర పోలికో!

  Like

  Reply
 2. ravi

  పూర్ణిమా, ఇంతవరకు, మీ టపాల్లో నాకు నచ్చిన టపా ఇది. దీనికంటే మంచి టపాలు ఉండవచ్చుగాక, నాకు నచ్చింది మాత్రం ఇదే! మొదటి పేరా చదివినట్టు లేదు,ప్లాట్ ఫారం మీద నిలబడినప్పుడు ఎలా ఉందో అలా ఉంది!

  ఆఖరు వ్స్స్క్య్స్మ్ సత్యజిత్ రే స్టయిల్ లో ఉంది!

  హాట్స్ ఆఫ్!!!

  Like

  Reply
 3. నెటిజన్

  అది “నాటక రంగం” కాదన్నమాట!
  బాగుంది!

  Like

  Reply
 4. మేధ

  >>ప్రస్తుతమనే కన్నీటితో మసకబారిన చూపు చేసేదేమీ లేక ముందుకే అడుగేస్తుంది
  నిజమే… Life shd move on…

  Like

  Reply
 5. ప్రతాప్

  నాన్న చేతిని విదిలించుకోవడమా? నో నెవ్వర్. నాన్న చేతిని కాస్సేపు అలా వదిలేస్తామంతే. ఏమో అప్పుడు నాన్నే మన చేతిని వదిలి వేరే నమ్మకమయిన చేతికి అందిస్తాడేమో.
  ఏమిటి నేను, నా బ్లాగు చేసుకున్న దురదృష్టం? లేక ఏదైనా తప్పు చేసామా? నా బ్లాగుని అస్సలు దర్శించడం లేదు?

  Like

  Reply
 6. కత్తి మహేష్ కుమార్

  బాగుంది. కానీ, ఎక్కడో కొంత disconnect. ఆలోచించాలి. మళ్ళీచదవాలి.

  Like

  Reply
 7. aswin budaraju

  >>>>ఉన్నట్టుండి కలకలం.. ఇప్పటివరకూ చెవులే శ్రమపడ్డాయి. ఒక్కసారిగే ఎగసే ఉద్వేగాలూ: కలిసిన చేతులు విడిపోతున్నాయనే బాధ, కులుస్తున్నామని హర్షాతిరేకాలు, తప్పించుకుంటున్నామనే ఆనందం, తప్పనిసరై వెళ్తున్నందుకు దుఃఖం, తప్పైపోయిందన్నా వెనక్కి తీసుకోలేని నిర్ణయాలు, తప్పేది కాదులే అనే నిర్వేదం, తప్పులేకపోయినా పడిన శిక్షలూ, పాత గూటికి చేరేడానికి కిలకిలమంటున్న పక్షులూ, కొత్తగా రెక్కలు చాచుకుంటున్న రెక్కల్లో లేలేత భయాలు!

  >>> చాలా మంఛి టపా, పదాలు చాలా బావున్నాయి.

  Like

  Reply
 8. నిశాంత్

  ప్రస్తుతమనే కన్నీటితో మసకబారిన చూపు చేసేదేమీ లేక ముందుకే అడుగేస్తుంది….

  Like

  Reply
 9. నిశాంత్

  జీవితాన్ని ఆ Shakespear స్టేజ్ తో పోలిస్తే మీరు ప్లాట్‌ఫాం తో పొల్చారా…!! 🙂
  బాగుంది.. ఈ వాక్యం ఇంకా బాగుంది..”నాన్న చేతిని వదిలించుకుని (!) అతడి చిటికెను వేలే ఆధారంగా అడుగులేసే కొత్త పెళ్ళికూతురిలా ఆ ఉద్విగ్న క్షణాలని అనుభవిస్తున్న మనసు, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడాలనుకున్నా, ప్రస్తుతమనే కన్నీటితో మసకబారిన చూపు చేసేదేమీ లేక ముందుకే అడుగేస్తుంది.” ఆ క్షణాన కన్నీటిని అల్ప ప్రాణిలా పోల్చారు … బాగుంది..

  Like

  Reply
 10. నిశాంత్

  thanks…still three exams to go…pch… count down never downs… 😉

  Like

  Reply
 11. Pappu

  ఈ జీవితమొక రైలు ప్రయాణం
  వత్తురు, దిగిపోదుర్ కొత్త ప్రయణీకుల్ ప్రతి మజిలీకి,
  ఇక్కట్టుల పాలగు టిక్కెట్టు లేనివాడు అన్నట్టు…
  బాగా చెప్పావు పూర్ణిమా…

  Like

  Reply
 12. నిశాంత్

  congratulations….(mee visitors count ki)
  hope you’ll beat master blaster’s record soon…. 🙂

  Like

  Reply
 13. కొత్త పాళీ

  fantastic.
  నాకు ఊహ తెలిసినప్పణ్ణించీ నాకు రైల్వేస్టేషనంటే మహా మోజు. అందులోనూ మా విజయవాడ స్టేషన్లో ఐదో నెంబరు ప్లాట్ఫామంటే మరీనూ. మనం రైలెక్కి వెళ్తున్నా, ఇంకోళ్ళని సాగనంపుతున్నా, ప్లాట్ఫాం అంటే అదే!

  Like

  Reply
 14. ramya

  ఫ్లాట్ ఫాం ఏదైనా రిజర్వ్ చేయించిన టికెట్టు చేతపట్టుకునే ఉన్నాం.

  Like

  Reply
 15. Musings of a wanderer

  Nice post ! Yes amidst the chaos life is a beautiful platform. Is it beautiful due to a pattern or total randomness?

  Also thanks for visiting my blog and leaving some warm comments.

  Like

  Reply
 16. బొల్లోజు బాబా

  life is a walking platform. isn’t it.
  (Shakespeare moved in his grave)

  bollojubaba

  Like

  Reply
 17. athmakatha

  Hmm… You dont have to prove you have a way with words time and again:D….

  >>>Amidst all the chaos, life still continues to be a beautiful platform!

  Perhaps its not life….its world…:)

  –Vamsi

  Like

  Reply
 18. శ్రీవిద్య

  చాలా బావుంది పూర్ణిమా.జీవితంలో ఎదురయ్యే ప్రతీదాన్ని మళ్ళీ జీవితానికే అన్వయించే నీ శైలి నీకే సొంతం..! 🙂

  Like

  Reply
 19. వేణూ శ్రీకాంత్

  నాన్న చేతిని వదిలించుకుని అనేది తప్ప మిగతా అంతా బాగుంది పూర్ణిమా… నాన్న చేతిని వదిలి అని అంటే ఇంకా బాగుండేదేమో… మరి నీ ఊహలో ప్రేమ పెళ్ళికోసం ఎంత ఇష్టం ఉన్నా నాన్న చేతిని వదిలించుకోక తప్పని పరిస్తితిలో ఉన్న అమ్మాయి ఉందేమో మరి నాకు తెలీదు…

  Like

  Reply
 20. Purnima

  వేణూ శ్రీకాంత్: నాన్న చేయి విదిలించుకుంటే గానీ అడుగుముందుకు వెయ్యలేమనిపిస్తుంది నాకైతే! వివాహం ఎవరి ఇష్టం మీద జరిగినదనేది అప్రస్తుతం.. నాన్న మాత్రం ఎప్పటికీ చేయి విడిచిపెట్టరు, పెట్టాలని లేకపోయినా, దుఃఖం తనుకొస్తున్నా వెళ్ళాలి కాబట్టి మనమే “వదిలించుకోవాలేమో” అనిపించింది.

  నాన్న-కూతురే కాదు, వీడిపోవటం ఇష్టంలేకపోయినా ఒకరు వెళ్ళాల్సి వచ్చిన ప్రతి క్షణంలో మన చేతిని ఇలానే లాగేసుకుంటామేమో! అమ్మ మీద కోపముండదు, తన బాధ అర్థమవుతుంటూంది, అయినా హత్తుకున్న ఆమె ఏదో క్షణాన దూరంగా జరిపి మనం ముందుకు పోతామా లేదా?! అది అమ్మను అర్థం చేసుకుని కూడా వెళ్ళిపోవటం.

  ఇది సమర్థించుకోవటం కాదు సుమా.. నాకేమి తోచి ఆ పదం రాసేనో చెప్పటం మాత్రమే!!

  ఎడబాటు తప్పనిసరై వీడ్కోలు చెప్పే ప్రతి సందర్భంలో మనకు తెలీకుండా చేసే “వదిలించుకోడాలు” ఎన్నో కదా! వారికి దూరంగా జరగటానికి ఆ క్షణాన బీజం పడుతుంది.

  ఇక ప్రేమ పెళ్ళిళ్ల గూర్చి నా ఊహల్ని ఎక్కడికో తీసుకెళ్ళారు. హమ్మ్.. మళ్ళా టపా రాస్తే నేరం నాదే అంటారు అంతా! 😉

  Like

  Reply
 21. మోహన

  @వేణూ గారూ..
  మన ప్రాణాణికి ప్రాణమైన వారు ఎవరైనా చనిపోయినప్పుడు.. వాళ్ళ చేతిలో మన చెయ్యి ఉండిపోతే ?? వదిలించుకోకుండా ఉండగలమా??

  బంధాలు మనిషికి ముందుకు సాగటానికి ఒక ఊతం. Everything has to 'End'.. just to have a 'New Beginning'. And Life moves on…!!

  @Purnima..
  >>"వదిలించుకోడాలు" ఎన్నో కదా!
  Yes, it happens many times.

  Like

  Reply
 22. నిషిగంధ

  Awesome interpretation!!!
  ‘నాన్న చేతిని వదిలించికుని’ కాక ‘వదలలేక వదిలించుకుని’ అంటే ఎలా ఉంటుంది? వెళ్ళక తప్పని అసహాయిత కనబదుతుంది కదా..

  Like

  Reply
 23. రమణి

  కలిసిన చేతులు విడిపోతున్నాయనే బాధ, కులుస్తున్నామని హర్షాతిరేకాలు, తప్పించుకుంటున్నామనే ఆనందం, తప్పనిసరై వెళ్తున్నందుకు దుఃఖం, తప్పైపోయిందన్నా వెనక్కి తీసుకోలేని నిర్ణయాలు, తప్పేది కాదులే అనే నిర్వేదం….
  చాలా అద్భుతంగా ఉంది పూర్ణిమా. నిజ జీవితానికి, ఫ్లాట్ ఫాం కి ముడిపెట్టిన విధానం చాలా అంటే చాలా బాగుంది.

  Like

  Reply
 24. రాధిక

  పూర్ణిమా చాలా కాలం కితం ఇదే శీర్షికతో దాదాపు ఇవే ఆలోచనలతో నేను రెండు లైన్లు రాసుకున్నాను.ఎలా పూర్తిచెయ్యాలో తెలీక అలానే వదిలేసాను.
  కేరింతలు ఒకపక్క
  చెమరింతలు ఒకపక్క
  సమూహంలో ఏకాంతం వెతుకూ కొంతమంది
  ఒంటరితనాన్ని ఏమారుస్తూ ఊహల్లో మరికొంతమంది….ఇలా ఇంకా ఏవో రాసుకున్నాను.నా ఆలోచనలు మీ టపాలో చూడడం చాలా బాగుంది.

  Like

  Reply
 25. వేణూ శ్రీకాంత్

  ఓపికగా వివరించినందుకు నెనర్లు పూర్ణిమా…మీరు చెప్పిన అర్ధం లో బాగానే ఉంది కాని ఎందుకో నేను వదిలించుకుని అని అనగానే ఇష్టం లేనిది వదిలించుకోడం గురించి మాత్రమే ఆలోచించాను… నాకెందుకో ఆ పదం మరీ పరుషం గా అనిపించింది. ప్రేమ తో వదలలేని నాన్న చేతి నుండి మన చేతిని విడిపించుకోడానికి… నాన్న చేతిని వదిలించుకోడనికి తేడా ఉంది అనిపించింది…. ఏదేమైనా మీ భావం అర్ధమైంది కదా సో nice 🙂

  Like

  Reply
 26. జాన్‌హైడ్ కనుమూరి

  మీ టపా చదవగానే ఉద్వేగమైన వ్యాక్య రాయాలనుకుంటాను. ఏవో అవాంతరాలో, కారణాలవల్ల రాయలేకపోతా.

  Like

  Reply

Leave a Reply to ramya Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Basic HTML is allowed. Your email address will not be published.

Subscribe to this comment feed via RSS

%d bloggers like this: