నిరంతర మాటల స్రవంతి..

Posted by

స్థలం: ఎఫ్.ఎం స్టూడియో
సమయం: సాయంత్రం ఐదు గంటలు


హల్లో.. ఆదాబ్.. నమస్కారం.. గుడ్ ఈవెనింగ్..
వచ్చేశాను.. వచ్చేశాను.. నేనొచ్చేశాను, సాయంత్రం అయిదవ్వగానే ఎవరు వస్తారు?
వాన దేవుడు రానా వద్దా అని ఓ తెగ మొహమాటపడుతున్నాడు
మనద్దగ్గర అలాంటి మొహమాటాలేం లేవు
అందుకే మీరు వెంటనే ఎస్.ఎం.ఎస్ చేసి, మీకు నచ్చిన పాటను రిక్వెస్ట్ అడగండి. నంబర్లు గర్తున్నాయి కదా? ఏదీ నాతో పాటు చెప్పండి.. బి.ఎస్.ఎన్.ఎల్ సబ్‍స్క్రైబర్స్ 8765 కి, ఏర్టెల్ హచ్ వాళ్ళు, 7765 కి, రిలయన్స్-4362 కి ఎస్.ఎం.ఎస్ పంపించండి.
వాహ్..వాహ్!
బయట చల్ల చల్లగా ఉంది కాబట్టి వెచ్చ వెచ్చగా మీకోసం ఈ పాట
“మీ కోసం” మాత్రమే మీ ఆర్.జె స్రవంతి, ది స్మార్ట్ స్రావ్స్ వేస్తున్న పాట
వినండి.. వినండి.. ఆడుతూ పాడుతూ.. ఓన్లీ ఆన్ 96.3 ఎక్స్ ఎఫ్.ఎం!!

డోలె..డోలె యె జరజర..

నువ్వెందుకమ్మాయి మధ్యలో అంటారా? అంతే, అంతే నాలోని గాయకురాలిని ఈ పాపిష్టి లోకం ఇలానే చంపేసింది. మరీ ఎక్కువయ్యిందా? సరే..సరే.. పాట వినండి..

హాట్, హాట్ సాంగ్ విన్నారు కదా! గబగబా మీరు పంపిన మెసేజెస్ చూసేద్దాం.

“హాయ్ స్రావ్స్.. యు రాక్! నాకు నచ్చిన పాట గజినిలో గుజారిష్.. అదే టాప్ సాంగ్‍గా వేయి ప్లీజ్” అని రమేష్ పంపించారు. రమేష్.. థాంక్యూ సో మచ్!

“your show is like sun for me, which comes at the time of sunset. It brings light and joy to me. Please play song from…” మెసేజ్ పూర్తిగా రాలేదు కాబట్టి ఏం పాటో నేను చెప్పలేను. మీ పేరు కూడా తెలీలేదు. మీరు మళ్ళీ ఎస్.ఎం.ఎస్ చేయండి.

“స్రావ్స్ అంటే నాకిష్టం, స్రావ్స్ లేకపోతే అంతా చీకటి నాకు. నీ వాయిస్ చాలా బాగుంటుంది. ప్లీజ్ మాట్లాడుతూనే ఉండవూ”  అని ఎవరో పంపించారు. దీనికి కూడా పేరు లేదు. ఇలా మాట్లాడూ, మాట్లాడూ అంటూ ఆ తర్వాత, అమ్మాయెప్పుడూ మాట్లాడుతూనే ఉంటారనడానికేం! అన్నీ తెలుసులే.. మీ గేములు.

ఇప్పుడీ పాట వినండీ.. వినండీ.. ఆడుతూ, పాడుతూ..

                                                 **************************

స్థలం: ఒహ్రీస్ బంజారా
సమయం: రాత్రి ఎనిమిది

రాజ్: ఏంటంత మూడీగా ఉన్నావ్?
స్రవంతి: బా టైర్డ్ గా ఉన్నాను. ఓపిక లేదు.
రాజ్: షోలో గొంతు చించుకుంటావ్ కదా?
స్రవంతి: చెప్తున్నా కదా రాజ్, వంట్లో బాలేదని.. ఇవ్వాళ షో అలానే చేశాను. తప్పదు కదా?
రాజ్: ఐ డోంన్ట్ నో.. నీకందరి దగ్గరా ఓపికుంటుంది. అందరికీ టైం ఇస్తావ్.. కానీ నా దగ్గర వచ్చేసరికి ఏవో చెప్తుంటావు.
స్రవంతి: ప్లీజ్ రాజ్, అర్థం చేసుకో.. ఓవర్ లోడవుతున్నా.. చాలా పనుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో షో చేయ్యాలి. గాయత్రి రాలేదు కదా!
రాజ్: అదే అంటున్నా, నీకు అందరూ కావాలి. అందరి ప్రాబ్లెమ్స్ అర్థమవుతాయి. కానీ..
స్రవంతి: ….
రాజ్: చూడు, నా దగ్గరున్నప్పుడే నువ్వేం మాట్లాడవు. ఇంత సైలెంటుగా మూగదానిలా బొమ్మలా కూర్చుంటావు. I’m missing you, అంటే అర్థం కాదేం నీకు? అందరిలానే నేనూ నీ ప్రొగ్రాముల్లో నీ మాటలు వినాల్సిందేనా?
స్రవంతి: రాజ్.. ఐ కాన్ అండర్‍స్టాండ్ కానీ…
రాజ్: నాకు నీ explanations అక్కరలేదు..
స్రవంతి: …
రాజ్: …..
స్రవంతి: నేనిక వెళ్తాను.
రాజ్: ఆగు.. డ్రాప్ చేస్తాను.
స్రవంతి: వద్దు.. బై!
                                           ***************************

స్థలం: ఎఫ్.ఎం స్టూడియో
సమయం: రాత్రి పదకొండు

ఇయర్ ఫోన్స్ పెట్టుకుని నిద్రలోకి జోగుతున్న వారికి, లేట్ నైట్ షిఫ్ట్స్  చేస్తూ నిద్రను తరిమేయడానికి ప్రయత్నిస్తున్న వారికీ – అందరికీ “లవ్ డాక్టర్” ప్రోగ్రాంకి స్వాగతం. కమ్మని పాటల మధ్యలో మనం బోలెడన్ని మాట్లాడుకోవడానికి, మీ ప్రాబ్లెమ్స్ నాతో షేర్ చేసుకడానికి మీరు కాల్ చేయవలిసిన నెంబర్స్- 66887342, 28901234
 

ఇప్పుడు మన ఫస్ట్ కాలర్‍ని చూద్దామా!

“హలో..”
“హలో.. స్రవంతి గారు, నేను అరుణ్ “
“చెప్పండి.. అరుణ్.. ఎక్కడనుండి?”
“అమీర్ పేట నుండి.. నేను మీ ప్రోగ్రాం రోజూ చూస్తానండి”
“హహ.. నాకూ ఆ మంత్రం నేర్పించండి. ఎలా చూస్తారు? వింటారా మరి? “
“అదీ..అదీ.. మొదటి సారి లైన్ కలిసింది. కాస్త నర్వెస్ గా ఉంటే..”
“నర్వెస్ దేనికి. జస్ట్ ఒక ఫ్రెండ్‍తో మాట్లాడినట్టే మాట్లాడండి.. “
“నేనెక్కువ మాట్లాడనండీ.. ఎందుకో భయం! అందుకే నాకెక్కువ ఫ్రెండ్స్ కూడా లేరు. మీలా నవ్వుతూ, తుల్లుతూ మాట్లాడాలని ఉంటుంది. కానీ.. ఏమో.. నేనలా ఉండలేను. మీ చుట్టూ ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులండీ..”
“….. “
“మీరు వట్టి స్రవంతి కాదు, నిరంతర మాటల స్రవంతి..”
“మీరూ మాట్లాడచ్చు కదా అందరితో?”
“చెయ్యాలనిపించకపోతే నేనేం చెయ్యను అంతే”
“ఇంకేం మరి! మీకు నచ్చినవే చేస్తూ, జీవితాన్ని ఆనందించేయండి. మాట్లాడటం ఒక్కటే అన్నీ కాదు. మిమల్ని అర్థం చేసుకునే వారు మీతో ఎప్పుడూ ఉంటారు. ఇంతకీ మీకేం పాట కావాలి?”
“గోదావరి సినిమాలో “మనసా..వాచా” పాట వేయగలరా?”
“ఎందుకా పాట?”
“చాలా ఇష్టం..”
“సరే.. మీకోసం ఆ పాట.. వేస్తున్నాను.. థాంక్స్ ఫర్ కాలింగ్!”

                                                        *****************

As they say, the show must go on! Kudos to all those people, who let the show ON!
(ఇది పూర్తిగా ఊహాత్మక ప్రయత్నం. Any resemblance of whatever kind and to whomsoever is a pure co-incidence.)
 

25 comments

  1. నీ ఊహలు ఎంతదాకా వెళతాయి?నీ ఊసులు ఇంతమంది గుండెలను ఎలా తడతాయి?అంత బాగా ఎలా రాయగలుగుతావు?

    Like

  2. ఏం చెప్పమంటావ్ పూర్ణిమా… ఆర్ జే లేదా టీవీ లైవ్ షో నిర్వాహకులు అనగానే ఓ వాగుడుకాయని మాత్రమే గుర్తు చేసుకుంటాం. నువ్వు వాళ్ళూ కార్పొరేట్ చేతుల్లో కీలు బొమ్మలే వాళ్ళు చేస్తున్నది వృత్తిధర్మం మాత్రమే కదా అని భలే గుర్తు చేసావ్… Ya you are correct show must go on….

    Like

  3. బాగుందండి…
    నాకు ఆ షో మస్ట్ గో ఆన్ అంటే.. సూర్య సన్నాఫ్ క్రిష్ణన్ లో డైలాగ్ గుర్తొచ్చింది..లైఫ్ మస్ట్ గో ఆన్ అని…
    ఫీల్ బాగుంది కాని ఎక్కడో అసంపూర్ణ భావన ఉన్నట్టుంది..!

    hmm i think this is the thing that seems in a Balachandar movie… (title justification..!!)

    ఆ పదాలు భలే వాడారు..ఎస్.ఎఫ్ఎం..కదా…హహ 🙂

    Like

  4. నాకు తెలిసి మీరు యసెఫెం లో పార్ట్ టైమ్ చేస్తునట్టున్నారు 🙂

    Like

  5. రాధిక గారి కామెంట్ ఇంకోసారి చదువుకోగలరు 🙂

    Like

  6. బాగుంది. కానీ ఈ శైలి కొంచెం క్లిష్టమైనది. కాబట్టి అక్కడక్కడా పఠనాప్రవాహం తెగుతోంది.

    ఏంచెయ్యాలో తెలీదుగానీ, శైలిని కొంచెం సరళతరం చెయ్యాలనిమాత్రం అనిపిస్తోంది నాకు.

    Like

  7. నిజమే పూర్ణిమ.. అది వాళ్ల ఉద్యోగ ధర్మం. మనసులో ఎంత బాధ ఉన్నా స్వరంలో చిలిపిదనం తప్పదు..

    Like

  8. Yes, the show must go on and on… just because the ocean’s rumble is beautiful doesn’t mean it does not hide a valcano… bayata kinipinchey antha prasaantham gaa manasu vunda galigithey – daanantha adrustam verey untundaa? oka R.J katha tho chaalaa adbhutamaina nijaanni cheppavu. Loved it… 🙂

    Like

  9. Hi Purnima…
    Chaala baagundi… touch chesaaru.. kaani niranthara sravanthi ardhantharangaa mugisinattu anipinchindi… deeniki sequel vrayamani vinnavinchukuntooo

    Like

  10. పూర్ణిమా, This comment need not be published.
    ఈ చిట్టి కథ చాలా realistic గా ఉంది. Just curious- ‘పంచుకున్న ఆనందం’ కి పెట్టని Disclaimer దీనికెందు కు పెట్టారు? అవసరం లేదనుకుంటా.

    Like

  11. yeah.. నిజమే…
    అయితే ఎక్కడో ఏదో మిస్స్ అయినట్లనిపించింది..

    Like

  12. ఆర్ జే స్నేహితులు వున్నట్టున్నారు. చదువుతున్నప్పుడు చాలా వాస్తవంగా అనిపించింది. చాలా సరళమైన భాష వాడినందునా నాకైతే మీ పోస్ట్ పండగే. మీ పోస్ట్లు కొన్ని తెలుగు భాష మీద పట్టు వుండేవాల్లకు మాత్రమే అర్ధం అయ్యేటట్టు వుంటాయి. కానీ ఈ పోస్ట్ అలా కాదు. అందరికీ రీచ్ అవుతుందని నా అభిప్రాయం. అప్పుడప్పుడైనా ఇలాంటివి రాస్తుంటారని ఆశిస్తున్నాను.

    Last but not the least,Post is very good.

    Like

  13. తెరిసా గారు,

    “పబ్లిష్ చేయనవసరం లేదం”టూ మొదలెట్టిన కమ్మెంట్‍ని నేనూ లైట్ తీసుకున్నాను ముందు. ఇప్పుడు దానికి జవాబివ్వడానికి కారణం మీకే తెలుస్తుంది.

    ఆగస్టు చివరాఖరులో అనుకుంటా, నాకు వంట్లో బాలేక ఆఫీసుకి వెళ్ళలేదు. కొద్ది సేపటికే కొలీగ్ ఫోన్ చేసింది. “హలో” అని అన్నానంతే.. “oh. are you not feeling well? Take rest..would call you sometime later” అంటూ ఫోన్ పెట్టేసింది. మర్నాడు తనని చూడగానే నా మొదటి ప్రశ్న.. “నాకు బాలేదని నీకెలా తెల్సింది?” అని. నా గొంతులో తేడా ఇట్టే కనిపెట్టేయచ్చని అమె దృడాభిప్రాయం. ఇది జరిగిన ఓ నాలుగు రోజులకే, మా ఆఫీసులో ఏదో ప్రోగ్రాంకి ఇద్దరు ఆర్.జెలు వచ్చారు. రోజూ వినే గొంతులు వారివి. For a moment, I flirted with the thought, what if I’m RJ and the next moment, I knew I would be terrible failure at it. That allowed me to spare a thought on what it takes to be RJ or any job that requires interaction with people. ఓ సారి లంచ్ కి ఓ పేద్ద హోటెల్‍కి వెళ్తే, మనల్ని చాలా సేపు వేయిట్ చేయించారు, ఐదు నిమిషాల్లో టేబెల్ ఇస్తామని చెప్పి. ఆకలి మీదున్న మా మీద కోపం కూర్చీ వేసుకుని కూర్చుంది. అయినా మాతో మాట్లాడే అమ్మాయి అంతే ఓపిగ్గా సమాధానాలిస్తుంది. అంత కోపం, ఆకలీలోనూ ఆ పిల్లను చూస్తూనే ఉన్నాను. ఈ ఆలోచనలే ఈ టపాకి ప్రేరణ.

    ఇక మీ అసలు ప్రశ్న.. దీనికి డిస్‍క్లేమర్ అవసరమా? Yes, is my answer..
    1) ఎవరూ వచ్చి ఒక ఆర్.జె కి ఇలా జరిగింది అని చెప్పలేదు నాతో! అందుకే ఇది పూర్తిగా ఊహాత్మకం.
    2) ఎస్ ఎఫ్.ఎం ని తలపించేట్టు రాసినప్పుడు ఒక డిస్‍క్లేమర్ ఉంటే సేఫ్ సైడ్ అనుకున్నాను. Blogs are getting attention from every corner, may be I should start learning how to claim and disclaim my attempts.

    ఇక “పంచుకున్న ఆనందానికి” డిస్‍క్లేమర్ ఆలోచనే రాలేదు.. కారణం, అందులో ఏ specifics లేవు కాబట్టి. ఎవరూ అది “నేనూ” అని క్లేం చేసుకోలేరు కాబట్టి. చేసుకున్నా నవ్వి ఊరుకుంటాను కాబట్టి.

    ఇక ఇంత భారతం ఎందుకు రాశానూ అంటే.. I had fun tracking back thoughts of 3 months old. Amazed by myself. నా రాతల్లో, నా భాషలో, నా భావ వ్యక్తీకరణలో ineffiencies ఉన్నాయి, ఉంటాయి కూడా! కానీ రాసే ప్రతీ పోస్ట్ వెనుకా ఆలోచన లేకుండా ఉండదు. This blog is more an experiments with my thoughts than with my writing skills. Had I been serious about improving writing ability, this particular idea should have been a full fledged story. అప్పుడు.. “ఏదో మిస్స్ అయ్యినట్టుందే” అని అనిపించదు ఎవ్వరికీ..

    Yours is truly one of those comments, which seeks my attention devotedly. A chance to ponder back on how something shaped up. I truly loved it and thank you for triggering it. Thought my blog is the best place to share how it happens! THANK YOU!

    Yours sincerely,
    Purnima

    Like

  14. రాధిక:

    >>నీ ఊహలు ఎంతదాకా వెళతాయి?
    As long as I can resonate with someone else's feelings!

    >>నీ ఊసులు ఇంతమంది గుండెలను ఎలా తడతాయి?
    ఎలా సంగతి నాకు తెలీదు. ఎందుకు అన్నది మాత్రం అంతుపట్టదు.

    >>అంత బాగా ఎలా రాయగలుగుతావు?
    C'mon.. let's be honest 😛

    వేణూ: నేనే పాయింట్ బేస్ చేసుకుని రాసానో..అదే మీరూ పట్టుకున్నారు. చాలా సంతోషం.

    నిశాంత్: చాలా సినిమా పేర్లు వాడారు, అందుకే మీ వ్యాఖ్య అర్థమయ్యీ కానట్టుంది. ష్.. ఎస్ ఎఫ్.ఎం కాదు! 😉

    అశ్విన్: తెరిసా గారికిచ్చిన సమాధానం చూడండోసారి!

    మురారి: థాంక్స్

    చైతన్య: నా సమాధనం, రాధిక గారి కోసం.. చదువుకోండీ మరి!

    Like

  15. మహేష్: ఎఫ్.ఎం అలవాటు లేకపోతే..it’s difficult to relate to it. అదే ప్రాబ్లెం అనుకుంటా.

    జ్యోతి, mahi: కదా? That amazes me.

    కిశోర్: సీక్వెల్‍కి నేనెందుకూ.. ఆ షో అయ్యేసరికి ఆ అబ్బాయి బయట వేయిట్ చేస్తున్నట్టు, ఇద్దరూ కలిసి అర్థరాత్రి ఐస్‍క్రీం తిన్నట్టూ.. మీ ఇష్టం.. 😉

    మేధ: మిస్స్ అవ్వడానికి కారణం నా expressions లో లోపం.

    శేఖర్: Where did that come from? నాదే అంతంత మాత్రం తెలుగండీ బాబూ! టపాలకైతే చచ్చినట్టు తెలుగు పదాలు ఆలోచిస్తానంతే! అవీ
    అరకొర పదాలు, భావాలకి సరితూగనివి.
    ఇలాంటివి మరి కొన్ని? నేనేం చెప్పలేను.. ఏది రాయాలనిపిస్తే అదే! థాంక్స్!

    Like

  16. పూర్ణిమ గారూ..
    చాలా చాలా బావుంది. ఎప్పుడూ RJ ల మాటలు వింటూ ఉంటాం గానీ.. ఈ కోణంలో ఎప్పుడూ అనుకోము కదా..! భలే రాసారు… 🙂
    ఇవ్వాళే ‘పొద్దు’ లో రెండు రెళ్ళ ఆరు గురించి మీరు రాసిన రివ్యూ కూడా చదివాను.
    చాలా చాలా చాలా బాగా రాసారోచ్చ్ 🙂

    Like

  17. చాలా మందికి అనిపించినట్టుగానే నాకు కొంచెం అసంపూర్తిగా అనిపించింది. అక్కడితో ఆగకుండా ఆలొచనలని రేకెత్తించింది. తర్వతా ఏమయితే బావుంటుందా అన్న ఊహల్ని వెల్లువెత్తించింది. Very nice post post purnimaa..! I really liked it 🙂

    Like

  18. Interesting take.
    I too am fascinated by voices. In the middle of all the turmoil in the world, it feels so reassuring to hear it from the sober voice of Robert Siegel of NPR.
    On the other hand is the “grace under fire” attitude needed for some jobs, esply those in customer service positions. I am repeatedly amazed by the composure displayed by gate agents of airlines.
    On the whole, good show, Purnima.

    Like

  19. మీ భావ వ్యక్తీకరణ చాలా బాగుంది!! అసంపూర్తిగా ఉన్నా దానికి గల కారణం కూడా స్పష్టంగా తెలుస్తుంది. చాలా మంది జీవితాలలాగా అన్నీ పరిపూర్ణంగా ఉండవు అని నాకు అనిపించింది.
    మరిన్ని టపాలకోసం ఎదురుచూస్తున్నాం 🙂

    Like

  20. కాల శిధిలాల మధ్య ఒక విషాద స్వరం
    గూడుకట్టుకొని ఉంది.
    నేను నిన్ను ప్రేమిస్తున్నానంటూ – అది
    రాత్రివేళల పాడుతూంటుంది.
    టాగోర్ స్ట్రే బర్డ్స్

    మీ పోస్టు చదివిన తరువాత ఈ పద్యం గుర్తుకు వచ్చింది ఎందుకో మరి.

    Like

  21. Really Superub… I had three of my friends who are working as RJ's in different stations, andaru naaku call cheyatam dwaraney parichayam ayyaru, chala sarlu parties kuda vellam, I like the JOB, me comparission chala chala bojundhi.

    Thanks & Regards,
    Ur's – DeepU.

    Like

Leave a reply to Purnima Cancel reply