Affectionately dedicated to HP Compaq 6720s

ఎడబాటు

శీతాకాలం సాయంత్రం; చలీ-చీకటీ పాత స్నేహితులైయ్యినట్టు చేతిలో చేయి వేసుకుని వచ్చాయి. “బై..టేక్ కేర్” అని చెప్పేక కూడా ఇంకా ఏవైనా మాటలు పుట్టుకొస్తాయేమో అని కట్ చేయకుండా ఇద్దరం వేచి చూసిన ఆ క్షణాల్లోని నిశ్శబ్ధంలోనే ఉన్నానింకా, ఫోన్ డిస్‍కనెక్ట్ చేసి ఐదు నిముషాలవుతున్నా! నా పరధ్యానాన్ని ఆసరా చేసుకుని కొంటె గాలి చుట్టూ చేరి నన్నల్లుకుపోయ్యింది. ఒక్కసారి ఉల్లిక్కిపడిన భుజాలకి చేతులను ఆసరా ఉండమని పురమాయిస్తే. అవి కాస్తా మృదువైన చున్నీ తగిలేసరికి కాసింత గతి తప్పాయి. స్పర్శ  కలిగించే తన్మయత్వంలో అప్రయత్నపు స్పందనలా చున్నీ ఒక్కసారి అలా గాల్లోకి తేలి, తనలో కలిగిన గిలిగింతలతో నిన్ను ఉక్కిరిబిక్కిరి చేయ్యాలని ఉబలాటపడి, నీ జాడకై కాసేపు రెపరెపలాడి మళ్ళీ భుజాల మీద నిరసంగా జారిపోయింది.  నీ గొంతులోని కొంటెతనం నాలో కలిగించిన భావావేశాన్ని మాటల్లో తర్జుమా చేసి నీదాకా చేర్చలేక నీరసించిపోయిన నాలా ఉంది నా చున్నీ ఇప్పుడు.

మన సమక్షంలో విరిసిన క్షణాలీపాటికి కాలాగమనంలో అంతర్థానమయ్యినా, వాటి తాలూకూ సువాసనలింకా నాకు ఊపిరి అవుతూనే ఉన్నాయి. అందుకేనేమో ఈ ఉలికిపాటు, ఉబలాటం, అర్థంలేని ఆశ, అర్థమవుతున్నా అర్థం చేసుకోనని మొండిపట్టు. గంటల తరబడి ఫోన్లూ, ఎడతెరిపి లేని ఛాటింగులూ కూడా పూరించలేని ఈ ఎడబాటులోని  ప్రతి చర్యా  నాలో ఉన్న “నిన్ను”ని రేపుతోంది. 

I miss you, not because of your absence here, but because I lose my presence when not with you! 

******************************************************************************

ఈ ఊహకి ముఖ్య ప్రేరణ, ఈ కింది కవిత:

Your absence has gone through me
Like thread through a needle.
Everything I do is stitched with its color.

— W.S. Merwin

నాకు అనువాదాలు చేతకావు, నాకే భాష మీదా పట్టులేదు. భావావేశంలో మాత్రం అప్పుడప్పుడూ స్పందనలని పట్టుకోవాలని ప్రయత్నిస్తాను, సీతాకోక చిలుక కోసం తాపత్రయపడే చిన్నారిలా! పర్యవసానం అందరికీ తెలిసిందే! 

ఈ ఆంగ్ల కవితకి భైరవభట్లగారు ప్రయత్నించిన అనువాదం, ఇక్కడ మీ అందరి కోసం:

వెలితి
—–
నీ వెలితి
సూదిలో దారంలా నాలోంచి దూసుకుపోయింది.
ఇక నా ప్రతీ చేష్టలో
ఆ రంగే అల్లుకుంటుంది

Any more takers? 😉

20 Responses to “ఎడబాటు”

 1. డా.ఇస్మాయిల్

  “నీవు లేని సమయం…
  విశ్వంలో నుంచి లాగిన కాలపు దారం!

  నీవు వదిలి వెళ్లిన నవ్వులు…
  ఈ నిశీధిలో నేను లెక్కేసుకొంటున్న నక్షత్రాలు!!

  నా మనస్సులో మెదిలే నీ జ్ఞాపకాలు…
  పాలపుంతలతో రంగులద్దిన మనోజ్ఞ రసరమ్య చిత్రాలు!!!”

  మీరు ఇచ్చిన కవితకు మక్కీకిమక్కీ అనువాదంలా కాకుండా ఏదో నాకు తోచిన విధంగా స్పందించాను. విశ్వరూపానికి బుడగల సిద్ధాంతం http://lolakam.blogspot.com/2008/12/blog-post_21.html
  చదివిన తర్వాత మీ బ్లాగు చదివితే పర్యవసానం ఇలానే ఉంటుంది:-)

  ఏదేమైనా ఓసారి నా ఊహలను ఎక్కడికో తీసుకెళ్లారు:-) నెనెర్లు. ఇక మీ ఊహలను వర్ణించడానికి మాటలు చాలవు!

  Like

  Reply
 2. కత్తి మహేష్ కుమార్

  ప్రయత్నిస్తాను…

  “సూదిలో దారంలా…
  నాలో దూసుకెళ్ళిన నీ శూన్యం
  నా ప్రతిచర్యా ప్రస్తుతం
  ఆ దారపు రంగుల్లో జీవితాన్ని నింపుతున్న వైనం
  అనుభవానికేగానీ అనువదించడానికి కుదిరేనా!”

  Like

  Reply
 3. ఏకాంతపు దిలీప్

  పూర్ణిమా,
  పూర్తిగా ఆస్వాదించాను… ప్రతీ పదాన్నీ! బహుసా ఇదే నీ రచనల్లో మొదటిదనుకుంట, ఊపిరాడకుండా ప్రతీ పదం నన్ను కట్టిపడేయగలిగింది…

  Like

  Reply
 4. ఏకాంతపు దిలీప్

  ఇస్మాయిల్ గారు,
  అద్భుతం! 🙂

  Like

  Reply
 5. జాన్‌హైడ్ కనుమూరి

  నీవు లేని క్షణం
  సూదిలో దారందూరినట్లు
  నాలోచి వెళుతోంది
  ఊహలతొవేసుకున్న కుట్లు
  రంగుల ఊసులై మిగుల్తున్నాయి
  .. ఇది నా ప్రయత్నం
  అభినందనలు
  జాన్ హైడ్ కనుమూరి

  Like

  Reply
 6. వేణూ శ్రీకాంత్

  పూర్ణిమా ఆ చిన్ని కవిత కదిల్చిన నీ ఊహల ఊసులు, వాటిలోని భావావేశం బాగున్నాయ్…
  దాని ప్రేరణతో ఇస్మాయిల్ గారు రాసిన కవిత కూడా బాగుంది.

  Like

  Reply
 7. నిషిగంధ

  Good one ఫుర్ణిమా!
  ఇస్మాయిల్ గారి కవిత బావుంది..
  🙂

  Like

  Reply
 8. Musings of a wanderer

  “Puvvu lanti Gundelona dAramalle dAgutAvu ” ani veturi gaaru varnicharu similar metaphor use chesi.

  Like

  Reply
 9. బొల్లోజు బాబా

  భైరవభట్లగారి అనువాదం పెర్ ఫెట్ గా సింక్ అయ్యింది. అది ఇక అల్టిమేట్.
  ఇస్మాయిల్ గారు కొత్త అందాలను చూపించారు.
  మహేష్ గారు బాగా వ్రాసారు.
  జాన్ హైడ్ గారు పద్యానికి మంచి మానవత్వాన్ని జోడించారు.

  ఇక నా ప్రయత్నం
  భైరవభట్లగారు వాడిన చెప్పేసిన తరువాత ఇంకచెప్పటానికేమీ ఉండదనే భయంతో అనువాదం జోలికి పోకుండా, అను సృజన (ఇదో రకం ఎస్కేప్ to save face కదండీ) చేస్తున్నాను.

  1.నీవియోగం నన్ను చీల్చుకొంటో పోయింది.
  పూమాలలోంచి దారంలా
  నా హృదయం నిండా నీజ్ఞాపకాల పరిమళాలే.

  2. నీవు లేని ఆ క్షణం ఒక దారమై
  నా మనసనే సూది గుండా దూసుకుపోయి
  నా ప్రతి ఆలోచనకూ నీవర్ణాన్నే అద్దుతోంది.

  3.దారానికి సూది వేలాడినట్లుగా
  నీ వియోగానికి నా హృదయం వేలాడుతోంది.
  ఎంత ప్రయాణించినా నీ వృత్తంలోనే నడకలు.

  మంచి పోస్టు.
  ధన్యవాదములు

  Like

  Reply
 10. భైరవభట్ల కామేశ్వర రావు

  పూర్ణిమగారూ,
  ఇది చాలా అన్యాయం సుమండీ! పున్నమి నాటి వెన్నెల్లో మినుకు మినుకుమనే తార గతి పట్టించారు నా అనువాదానికి 🙂
  భాషతో నే పట్టుకుందామనుకున్న భావాన్ని మీరు హృదయంతో పట్టుకున్నారు.

  Like

  Reply
 11. Sailu

  I just saw it..got a thought..here u go …..poola hrudayalanu chilchvesi daram la…nuvvu lenitanm na hrudayyani chilustundi… gayapadina na hrudayam rangu na prati charya lonu kanipistundi….

  Like

  Reply
 12. యోగి

  మాతృక ఎంత అందంగా అందంగా ఉందో భైరవభట్లగారి అనువాదమూ అంతే మనోజ్ఞంగా ఉంది.

  “సీతాకోక చిలుక కోసం తాపత్రయపడే చిన్నారిలా” చాలా బాగుంది 🙂

  Like

  Reply
 13. నిశాంత్

  బాగుంది అనే పదం మీ పోస్టులకి తక్కువే.
  ఒక చిన్న ఎడబాటుని బాగా వర్ణించారు… “బై, టేక్ కేర్…..” నిజంగా ఒక మధురానుభూతి సుమండీ. ఒక పక్క ఎన్నో మట్లాడుకున్నాం అనే భావనతో మనసుని నింపేస్తూనే ఇంకా ఎదో మట్లాడాలేకపోయామనే వెలితిని కలిగిస్తుంది. అన్నిటికీ ఒకటేనండీ కారణం – ‘ మనసు ‘ – చాలా జాదూ అండి.
  ఏమైతేనేం ఎడబాటుని ఎగసిపడే ఊహలతో బాగా వర్ణించారు.
  “నీవు లేవు నీ పాట ఉంది” అంటూ తిలక్ గారి అనుభూతి అనుభవానికి వచ్చింది మీ “ఎడబాటు”తో.

  Like

  Reply
 14. Purnima

  ఇస్మాయిల్ గారు: వాహ్.. వాహ్.. డాక్టర్ సాబ్! 🙂

  మహేశ్ గారు, జాన్హైడ్ గారు: బాగుంది ప్రయత్నం.

  దిలీప్: హమ్మ్.. థాంక్స్!

  వేణూ, నిషీ, నిశాంత్, : థాంకులు

  Wanderer: nice song that you recollected.

  బాబాగారు: చాలా బాగుంది!

  Like

  Reply
 15. Purnima

  భైరవభట్ల కామేశ్వర రావు గారు:

  మీ అనువాదం ఉన్నదనే దాన్ని ప్రచురించాను. లేకపోతే ఇది ఎప్పుడో రాసిపెట్టిన పోస్టు.

  పున్నమి అంటే అరువుతెచ్చుకున్న వెలుగు. తారది స్వయం ప్రకాశం.. ఇప్పుడు చెప్పండీ.. ఏది గొప్పా? 🙂

  యోగి: హహహ.. that’s the line, I like most as well! 🙂

  Like

  Reply
 16. మురారి

  @ Purnima,

  Beautiful!!.

  @బొల్లోజు బాబా గారు,

  మీ ప్రయత్నం కూడా బాగుంది.

  Like

  Reply
 17. మోహన

  పూర్ణిమా..

  వర్ణన చాలా బాగుంది. “ఫువ్వు లాంటి గుండెలోన దారమల్లె దాగుతావు ” అని ఎవరో అన్నారు ఇక్కడ. ఆ మాటకి నిలువెత్తు టపా రూపంలా తోచింది.

  కానీ టపా ని Merwin కవితతో పాటు చదివితే నేను అంతలా ఆస్వాదించలేకపోయాను.
  టపాలోని భావంలో కనిపించిన కష్టం ఆ కవితలో నాకు కనిపించలేదు.

  A thread in a needle doesnt make any difference to the existence of the needle, but its purpose.

  Like

  Reply
 18. డా.వి.ఆర్ . దార్ల

  నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Basic HTML is allowed. Your email address will not be published.

Subscribe to this comment feed via RSS

%d bloggers like this: