BRB…

Posted by

madhurimak: ఓయ్య్.. ఉన్నావా?
techie.kiran: ఉన్నా..
madhurimak:
ఏం చేస్తున్నావ్?
techie.kiran: అమ్మాయి గారి రాక కోసం వేయి కళ్ళతో వేయిటింగ్ ఇక్కడ!
madhurimak:
అబ్బా.. ఛ! అంతుందా?
techie.kiran: ఏంటి ఉందా? ఇదో BRB అని అంటూ వెళ్ళావ్.. ఎంత సేపటికీ రావేం?
madhurimak:
ఓహ్.. సారీ కిరణ్. లీడ్‍కి అప్‍డేట్ చేద్దామని వెళ్ళానా, ఇంకేదో టాపిక్ స్టార్ట్ అయ్యింది..మాట్లాడుతూ ఉన్నాం. అందుకే లేట్! అయినా నవ్వు విండో ఓపెన్‍గా పెట్టి, నా (రాక) కోసం దాన్నే  చూస్తూ ఉన్నట్టు అంత బిల్డప్ అవసరమా?!
techie.kiran: బిల్డప్ ఏంటి? నిజంగానే చూస్తూ ఉన్నా! దాన్నే తీక్షణంగా.. దీక్షణంగా!! అయినా ఇలా రోజుల తరబడి రాదల్చుకోలేనప్పుడు BRB కొట్టకూడదమ్మాయ్.. బై చెప్పేస్తే మా విరహ వేదనేదో మేం పడి ఏడుస్తాం.
madhurimak: మహా ప్రభో.. మన్నించు! ఒక ఇరవై నిమిషాలు రాలేదని ఇన్ని క్లాసులా?
techie.kiran: ఇరవై నిముషాలు దాటి ఒక సెకన్! నీకలానే ఉంటుంది.. నీ అక్షరాలు రాకపోతే నాకెమవ్వుతుందో నాకేం అర్థమవ్వదు.. 😦
madhurimak: ఓహో.. అంతదాకా వచ్చిందా?
techie.kiran: వచ్చింది.. ఇంకెందాకా పోతుందో?!
madhurimak:
రేపు సినిమాకెళ్తున్నా నేను..!
techie.kiran: ఎవరితో?
టాపిక్ భలే మారుస్తావ్!
madhurimak:
నా కాలేజ్ మేట్స్.. ఒక ఫ్రెండ్ పెళ్ళికని వచ్చారు. సో.. ఒక సినిమా చూద్దామని ఫిక్స్ అయ్యాం. డిన్నర్ కూడా..
:)… టాపిక్ మార్చటం భలే నేర్పించావ్!
techie.kiran: ఓహో..
madhurimak: పెళ్ళి తెల్లవారు ఝామున. 😦 రాత్రంతా మేల్కోవాలి. మర్నాడు ఆఫీసులో ఇంపార్టెంట్ మీటింగ్. లీవ్ ఆప్రూవ్ కాలేదు. రావాలి 😦
techie.kiran: ఓహ్! ఎగ్గొట్టేయ్య్.. కడుపు నొప్పని చెప్పు..
madhurimak:
హహహ.. కడుపునొప్పి!! :))
అయినా పెళ్ళిళ్ళు ఇంత untimelyగా పెడతారేంటి? నిద్రలు పాడేయ్యేట్టూ..
techie.kiran: మరే! కాఫీ బ్రేక్‍లో ఎంగేజ్‍మెంట్.. లంచ్ బ్రేక్‍లో పెళ్ళీ పెట్టుకోమనాల్సింది.. లీవ్ కూడా అక్కర్లేకుండా!
madhurimak:
హిహిహి.. not a bad idea, i say! 😉 మనం ట్రై చేద్దామా?
techie.kiran: NO WAY.. our marriage would be celebrated in the most grandest of ways, and that is FINAL!!
madhurimak:
నాకు పెళ్ళిళ్ళు సింపుల్‍గా ఉంటేనే ఇష్టం. 
techie.kiran:
అయినా సరే.. I wanna celebrate.. నా జీవితంలోకి నీ రాకను నేను సెలబ్రేట్ చేసుకోవాలి.
You’re special in my life.
madhurimak:
🙂
techie.kiran: blushing?
madhurimak:
అంత లేదు బాబూ… ఒక స్పెషల్‍కే?! ఆహా!!
అయినా.. మీ వాళ్ళింకా ఎవరూ ఏ మాటా చెప్పలేదట, నిన్న రాత్రి నాన్న అంటుంటే విన్నాను. మీ వాళ్ళకి నేను నచ్చలేదా? వస్తారు కదా కిరణ్?
techie.kiran: నువ్వేం ఆలోచించద్దూ.. మనం పెళ్ళి చేసుకుంటున్నాం అంతే!
madhurimak: మీ వాళ్ళు కాదంటే! జాతకాలూ.. అవీ కలవాలి కదా..
techie.kiran:
ఎదిరించి పెళ్ళి చేసుకోవడమే..
madhurimak: అబ్బో.. అప్పుడు మనదీ చరిత్రలో మరో ప్రేమ కథ అవుతుంది. మరో సినిమా తీయ్యచ్చు..
techie.kiran: హహహ..jokes apart, వాళ్ళ సమక్షంలోనే నిన్ను మొదట చూశాను. అప్పుడే చెప్పాను నువ్వు నచ్చావని. ఇప్పుడు కాదూ కూడదూ అంటే నా వల్ల కాదు.
madhurimak:
హమ్మ్..
techie.kiran: మన లవ్ స్టోరీకి పేరు ఆలోచించిస్తూ ఉండు.. ఇప్పుడే వస్తా..
madhurimak:
ఏం?? ఎక్కడికి?? 
techie.kiran: నేనొచ్చేవరకూ ఈ విండోని అలానే చూస్తూ ఉండు.
madhurimak: మన లవ్ స్టోరీలో మొదటి సీస్ జీటాక్ విండోతోనే స్టార్ట్ అవుతుంది 😛
techie.kiran: 🙂 నువ్వలా నాకోసం చూస్తూ ఉన్నట్టా ఆ సీన్‍లో?
madhurimak: దీక్షణంగా.. తీక్షణంగానా? 😉
techie.kiran: అబ్బబ్బా.. వాహ్! క్యా సీన్ హై!
madhurimak:
ఇది అన్యాయం కిరణ్.. కేవలం నన్ను పరీక్షించడానికే వెళ్తున్నావ్ కదా!
techie.kiran: హే లేదు..
madhurimak: చెప్పు మరి.. ఎక్కడికెళ్తున్నావ్?
techie.kiran: అదీ..
madhurimak:
ఊ.. అదీ..
techie.kiran: తల్లీ.. రెస్ట్ రూంకి వెళ్ళాలి.. అది నీతో ఎలా చెప్పేది? మీ అమ్మాయిలతో ఇదే తంటా.. ప్రేమించడానికీ, వేధించడానికీ తేడా ఉండదు..
madhurimak: ఛీ.. పో! పెద్ద వచ్చాడు.. girls psychologist..
techie.kiran:
పోతున్నా.. BRB
madhurimak: 🙂 నేను చూస్తూనే ఉంటాను..

madhurimak: ఓయ్య్.. ఎంత సేపూ?

madhurimak: ఇంకానా? ఏం చేస్తున్నావ్ బాబూ?

madhurimak: seems like you’re caught up with something. ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు. సరే.. నేనిక ఇంటికెళ్తున్నా! ఫోన్ చెయ్యి.. ఫ్రీ అవ్వగానే.. బై!

ఆ విండో close అయ్యింది, ఇంకో కొత్త విండో ఎప్పటికీ తెరచుకో(లే)దు. రెస్ట్ రూంలో జారిపడ్డం వల్ల తలకి గాయమై కిరణ్ క్షణాల్లో గుడ్‍బై చెప్పేశాడు. కొన్ని గంటల తర్వాత అది ముధురిమకి చేరింది. చూసి చూసి విండో క్లోస్ చేసినట్టు, ఎప్పటికో కిరణ్ కూడా జ్ఞాపకాల నీడల్లో దాగిపోతాడు. అప్పుడప్పుడు.. ఉలిక్కిపడేలా గుర్తొస్తూనే ఉంటాడు. 

17 comments

 1. నార్మల్ గా చదువుతూ వచ్చా.. కాని కింద మీరు రాసింది చదివాక … మనసంతా అదోలా అయిపోయింది.

  Like

 2. విధి చేయు వింతలన్నీ..
  మతి లేని చేతలేననీ !!
  😦 ఊహించడానికి కూడా భయమేస్తుంది.

  Like

 3. కొన్ని విషయాలపై ఎలా స్పందించాలో తెలియదు నాకు.అయ్యో పాపం అని మాత్రం అనిపించింది.

  Like

 4. అతని ఆత్మకు శాంతి కలగానలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ…

  Like

 5. BRB అంటే, బీ రైట్ బాక్ లో ఏదైనా కామెడి చెప్తావేమోనని వచ్చా. కానీ ఘోరమైన Trazedy story వినిపించావ్. చాలా బాధేసింది. But nee narration ki hats-off booss..

  Like

 6. ఒక్క స్క్రిప్ట్ రయిటర్ ఏం ఖర్మ పూర్ణిమా..? కథ,స్క్రీంప్లే, దర్శకత్వం అన్నీనూ… 🙂

  ఆలోచించు, క్షణం,క్షణం, ప్రతి క్షణం నా స్క్రిప్ట్ నేనే రాసుకోవటం లేదూ..?
  పుస్తకాల్లో కథలకి, జీవితానికి ఒకటే తేడా.., అక్కడ ఒక్కో కథకి ఇన్ని పేజీలని కేటాయింపు ఉంటుంది. ఇక్కడ కాలం తాలూకు పేజీల్లో, అన్నీ[అందరి] కథలూ ఒకేసారి జరుగుతుంటాయి. సో, మన స్క్రిప్ట్లో ఒక్కో లైను ఆ నిమిషంలో మన చుట్టూ తిరిగే ఇంకా చాలా కథల పై ఆధారపడి ఉంటుంది. ఒక పాత్రకి సంబంధించి అన్ని రోల్స్ [స్క్రిప్ట్,కథ,స్క్రీంప్లే,దర్శకత్వం ] ఒక్కరే మొయాల్సి వచ్చేసరికి, రానున్న స్క్రిప్ట్ పై ఆ ప్రభవం ఉంటుందనుకుంటా…

  “నా జీవితాన్ని, నా భవిష్యత్తుని నిర్ణయించుకుంటోంది నేనే… నా జీవితానికి పూర్తి బాధ్యత నాదే..” అన్న ఆలోచన వచ్చినప్పుడు చాలా ధైర్యం గా ఉంటుంది. నిజం చెప్పాలంటే, అతడి పై భారం మోపినప్పుడు కంటే ఎక్కువగా…. ఇలా అనుకుంటే దేనీకీ అతిగా బాధ కానీ, అతిగా సంతోషం కానీ ఉండవు. ఓన్లీ థ్రిల్ల్… ఇలా ఉండటం వల్ల మనకెలా ఉన్నా పక్కవాళ్ళ కథలో మనం ఒక బోరింగ్ కరెక్టర్ అయ్యే అవకాసాలు మాత్రం ఎక్కువే.. But who cares..? This is my life and it is upto me to choose what to ‘Be’.

  Like

 7. ‘ఈ ట్విస్టేదో బాగుందే!’అనుకునేలోపే నిజజీవితనిజాన్ని చెప్పి గొంతు తడారేలా చేసావు. నిజమే life so predictably unpredictable and other wise as well.

  Like

 8. !!!!! నాకు మాటలు రావట్లేదు. uncertainity అన్నది ఎంత uncertainO ఇలాంటప్పుడే అర్థమౌతూ ఉంటుంది.

  Like

 9. మీలా మనసుకి హత్తుకునేలా వ్రాయటం నేర్చుకోవాలి పూర్ణిమ.

  Like

 10. ‘కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటుదీ జీవితం’ అని ఈ రోజు రెండోసారి (ఇక్కడ మరియు ఇస్మాయిల్ గారు నవతరంగంలో) చదవటం!

  మరమరాలు

  Like

 11. ఏదో మామూలు ఛాటి౦గ్ గురించి వ్రాసారేమో అనుకున్నా.. కానీ….

  >>Why is life so predictably unpredictable?
  Life అంటేనే అంతే కదా…

  Like

 12. మీ టపా చదివిన తర్వాత ఒక్క క్షణం అలా ఉండిపోయాను. ఎప్పుడో ‘7/G బృందావన కాలనీ ‘ చూసినప్పుడు ఇలాంటి ఫీలింగ్ వచ్చింది. మళ్ళీ తర్వాత అంత భావోద్వేగానికి లోనైన సందర్భం ఇదే. ఇలాంటివి చదివినప్పుడు అనిపిస్తుంది మన ఆత్మీయులు ఎంతో విలువైన వారు అని.

  Like

 13. టపాలో చివరన ట్విస్ట్ చాలా త్వరగా చుట్టేసినట్టు అనిపించింది. ఇంకొంచం టపా-టైం ఇచ్చుంటే బాగుండేదేమో. chat conversation చాలా సహజంగా సాగినా మీరింకా ఆకర్షణీయంగా చెప్పగలరని అనిపించింది.

  Like

 14. పూర్ణిమ గారు, మొదటిసారి ఒక బ్లాగు చదువుతూ ఏడ్చానండి.
  అసలు ఆ మాటలు చాలా సహజంగా, స్వచ్ఛంగా ఉన్నాయ్…!
  చివరి మాట..”కొన్ని గంటల తర్వాత అది ముధురిమకి చేరింది. చూసి చూసి విండో క్లోస్ చేసినట్టు, ఎప్పటికో కిరణ్ కూడా జ్ఞాపకాల నీడల్లో దాగిపోతాడు. అప్పుడప్పుడు.. ఉలిక్కిపడేలా గుర్తొస్తూనే ఉంటాడు”.. నా కంట తడికి కారణం…… ఇంతకంటే ఎక్కువ చెప్పలేనండీ..

  మాట మూగబోయింది మనసువిప్పాలంటే.
  చేయి నిలిచిపోయింది కళ్ళు తుడవాలంటే.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s