పుస్తకం.నెట్ అట..

Posted by

హే .. పుస్తకాలకి ఏదో సైట్ పెడుతున్నారట కదా?
ఓ తెల్సిందా?! అవును.. పుస్తకం.నెట్ అనీ.. జనవరిలో ప్రారంభమవుతుందది.

పుస్తక సమీక్షలూ గట్రా ఉంటాయా?
ఊ..

పుస్తక సమీక్షలూ అవీ అంటే అబ్బో బా చదివేవారికోసం కానీ.. 
సమీక్షలనే కాదు, పుస్తకాలతో ఏ చిన్ని అనుభవమున్నా అందులో రాసుకోవచ్చు.

అనుభవాలా? అక్కడెందుకూ? బ్లాగులున్నాయి కదా!
నచ్చిన పుస్తకమనో.. మెచ్చని రచననో ఆనందావేశాలలో రాసేసి బ్లాగుల్లో పెడతాం.  ఓ రెండ్రోజుల్లో అది మరుగున పడిపోతుంది. ఆ తర్వాత దాన్ని విశ్వప్రయత్నంతో వెతకచ్చనుకోండి.. అదే కొత్త వాళ్లకయితే అదీ తెలీదు. అందుకే తెలుగు బ్లాగుల్లో రాసే ఏ పుస్తకం గురించయినా ఒక చోట పెట్టుకుంటే బాగుంటుంది కదా అన్న ఆలోచనతోనే మొదలయ్యింది ఈ ప్రయత్నం. బ్లాగర్లలో పుస్తకాల గురించి టపాలు బానే వస్తున్నాయి. వాటికి “one stop” arrangement అన్న మాట!

ఓహ్.. అయినా నేనెక్కువ పుస్తకాలు చదవను.. టైం ఉండదులే..
అయినా ఫర్వాలేదు! ఈ సైటులో వచ్చే టపాలు చూస్తూ ఉండండి. మీకేదైనా రాయాలనిపించినప్పుడు రాయండి.. తక్కిన వేళల్లో మీ అభిప్రాయాలనో విమర్శలనో చెప్పి వెళ్ళండి. 

పుస్తకం కొని చదవనప్పుడూ.. ఇంకెందుకమ్మాయ్ ఇవి చదువుకోవడం? అనవసరంగా ఊరి ఊరి ఊరుకోవడం..
అదీ నిజమేనేమో. కానీ నాకు పని వత్తిడి వల్ల చదవలేని పరిస్థుతుల్లో సమీక్షలు చదివి అట్టే పెట్టేసుకునేది. సమయం దొరికినప్పుడు ఏం చదవాలో ఎక్కువ వెత్తుక్కోనవసరం లేకుండా! అనుకోకుండా తగలాల్సినవి తగులుతూనే ఉంటాయి. స్వానుభవం చెప్తున్నా.. చదవి తీరాలీ అని కాదు.

నేను అడపదడపా ఓ పుస్తకం చదివినా, అలాంటి పుస్తకాల మీద ఇంటెరెస్ట్ ఉంటుందో లేదో జనాలకి..
ఓహ్.. మన ఫ్రీక్వెంన్సీకి మాచ్ అయ్యే వాళ్ళందరూ మనకి తెలీదులెండి. ఎప్పుడో చట్టుక్కున తగులుతారు. అందుకే మరో ఆలోచనలేకుండా రాసేయ్యండి.

అదే.. అటు చేసి, ఇటు చేసి, “రాయండి.. రాయ(లే)కపోతే కనీసం చదవనైనా చదవండీ” అంటావ్..
మరీ అంత సూటిగా ఎలా అంటాను? అలా కాదు గానీ… ఇంకో మాట అనుకుంద్దాం..

అదేలే.. చదవడం అలవర్చుకోండి.. కనీసం రాయడం కోసమైనా చదవండీ అంటావ్..
అయ్యోయ్యో.. రాయడం కోసం ఎప్పుడూ చదవకోడదండీ! చదవడం..చదవడం కోసమే.. for the sheer pleasure of it.

సరే.. నువ్వే చెప్పు..
చదువండి.. ఆ అనుభవాలు పంచుకోవాలంటే ఈ సైటుందని గుర్తుంచ్చుకోండి..

సరే.. చూద్దాం..
అదే అంటున్నా, చూడ్డం ఒక్కటే సరిపోదు

సరే.. చదువుద్దాం, రాద్దాం
ఆ మాత్రం మాటిస్తే చాలు… ఇహ చూస్కోండి..

ఉండనా మరి?
ఒకె.. చదువుతూండండి, రాస్తూండండి 🙂

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు !

15 comments

 1. హార్థిక నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు

  Like

 2. హార్థిక నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు

  Like

 3. పుస్తకం.నెట్ ..బాగుంది 🙂

  మీకు కూడ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  Like

 4. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు..

  Like

 5. భలే రాస్తారండీ మీరు!.మంచివిషయమూ చెప్పారు,సరదాగానూ చెప్పారు.

  Like

 6. పూర్ణిమ గారూ..
  అయితే సరే మరి.. మీరు చెప్పింది ఫాలో అయిపోతాం 🙂
  మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు..!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s