“శశీ.. నాకు నిద్ర ముంచుకొచ్చేస్తుందీ, పడుకుంటాను. నీకింకా పని ఉందా?”
“హమ్మ్.. రేపో ప్రెజంటేషన్ ఇవ్వాలి. చాలా ఇంపార్టెంట్! నువ్వు పడుకో.. “తన భార్యకి గుడ్ నైట్ చెప్పి శశీ తన పనిలో మునిగిపోయాడు, లాప్టాప్లో లీనమయ్యి. కమ్మని శాస్త్రీయ సంగీతం చెవుల్లో నుండి హృదయంలోకి జాలువారుతుంటే, వేళ్ళు చకచకా కీబోర్డ్ పై కదిలుతూ పని పూర్తి చేసేస్తున్నాయి. సమయం పదకొండున్నర కాబోతుంది. ఇంకో అయిదు నిమిషాల్లో పని అయ్యిపోతుందన్న ఆనందంలో అపశ్రుతిలా “డబ్” అంటూ శబ్దం వినిపించిందీ.
“dude.. bomb blasts in mumbai.. watching news?” జీటాక్లో మెసేజ్ కనపడగానే నిద్రలో ఉల్లిక్కిపడిన వాడిలా చుట్టూరా చూసుకున్నాడు.
“WTH??” అని సమాధానం ఇస్తూనే టివి వైపుకి పరిగెత్తాడు.
చకచకా న్యూస్ ఛానల్స్ అన్నీ తిప్పాడు. అన్ని చోట్లా “బ్రేకింగ్ న్యూస్” అంటూ ఎర్ర ఎర్రని అక్షరాలతో నింపేసిన తెర వెనుక నుండీ ఆందోళనా పూరిత కంఠాలు వినిపిస్తున్నాయి. అసలెక్కడ ఏం జరిగిందో మాత్రం తెలీటం లేదు. అంతా అరకొ సమాచారం. ఏదీ ధృవీకరించింది కాదు. రిమోట్ అక్కడ పడేసి, మిగులున్న పనిని పూర్తిచేస్తుండగా మళ్ళీ జీటాక్ విండో..
“హే.. నువ్వూ, ఫామిలీ సేఫ్ కదా?” అని ఓ కజిన్ మెసేజ్. అంతా క్షేమమే అని సమాధానం ఇచ్చి, మళ్ళీ కాసేపటికి నెట్ అవీ పని చేస్తాయో లేదో అని వెంటనే అందరికీ తాను క్షేమమే అంటూ మేల్ కొట్టాడు. పనికి సంబంధించి అన్ని పనులూ పూర్తి చేసుకుని, టివీ ముందు లాపీతో కూలబడ్డాడు.
“బాంబ్ బ్లాస్ట్స్.. బాంబ్ బ్లాస్ట్స్!! ఎక్కడ చూడూ అదే మాట. అసలెన్నాళ్ళిలా? దొరికిన ప్రతీ ఒకడినీ ఉరి తీయక కాలక్షేపం చెయ్యడం వల్ల పేట్రేగిపోతున్నారు.. వెధవలూ.. వాళ్ళు కాదు,మన వాళ్ళూ” అనుకుంటూ వార్తలు చూస్తున్నాడు. మెల్లి మెల్లిగా అయినా సరే వార్తల్లో స్పష్టత ఏర్పడుతుంది. జరిగినవి ఇంతకు మునుపులా బాంబ్ బ్లాస్ట్స్ కావనీ, ఒక హోటల్నీ టెర్రరిస్టులు తమ కబ్జాలో ఉందని తెల్సి కంగారు పడ్డాడు. తనకు తెలిసిన వాళ్ళు అక్కడెవరైనా ఉన్నారేమో అని. ఎవరూ లేరనగానే ఏదో రిలీఫ్ క్షణకాలం పాటు. లైవ్ విజువల్స్ అంటూ వస్తున్న వాటిని చూపిస్తూ వార్తలు కొనసాగుతున్నాయి.
“ఓహ్.. గాడ్! ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒక హోటెల్ లోకి ఆగంతకులు చొరబడి అందరినీ చెరబడుతున్నారు. కొంతమంది అతిథులు వెనుక ద్వారం నుండి తప్పించుకోగలిగారు. కానీ చాలా మంది ఇర్రుక్కుపోయారు!”
“ఎన్కౌంటర్ స్పెషలిస్ట్స్, టాప్ అఫిషయల్స్ ని చంపి, బయటకు విసిరేసారు..”
“టెర్రరిస్ట్ దాడికి ఆపరేషన్ మొదలవ్వడానికి ఇంకా సమయం పట్టేట్టు ఉంది.. అత్యవసరంగా దళాలను ఇక్కడ తెప్పించే మార్గం లేదంటున్నారు”
“ఇప్పటికి మృతుల సంఖ్య ఆరు..”
వార్తలు ఆగడం లేదు.. అతని ఆలోచనలూ ఆగడం లేదు. “ఏం చేస్తున్నారూ మన చేతగాని వెధవలూ? ఇంట్లోకి చొరబడి మరీ వాళ్ళు ఆక్రమిస్తుంటే.. ఛా.. ఏది మన డిఫెన్స్ అసలూ! వెధవ వోటు బాంక్ రాజకీయాలూ వీళ్ళూనూ? దొంగోట్లతో నెగ్గడం, దేశాన్ని పడి దోచుకోవడం.. అంతే!” అంటూ సాగుతున్న ఆలోచనలకి ఫోన్ రింగయ్యి, కట్ చేసింది.
“లేదు రా అన్నయ్యా.. నేను ఇంట్లోనే ఉన్నాను. రమ్యా, పిల్లలూ నిద్రపోయారు. మాకేం ప్రమాదం లేదు రా! కంగారు పడకు”
“చాలా సేపటి నుండి ట్రై చేస్తున్నా.. కలవడం లేదు.. జాగ్రత్త రా.. ఎప్పటికప్పుడు కాల్ చెయ్యి..”
“ష్యూర్ రా.. మీరేం టెన్షన్ పడ్డద్దూ! వదినకి కూడా చెప్పు..”
“మీరు జాగ్రత్త.. Be vigilant బయటకదీ వెళ్ళినప్పుడూ.. నే టచ్లో ఉంటా.. అమ్మకి..”
“హలో.. హలో.. హలో??”
ఫోన్ లో మాట్లాడుతూ బెడ్ రూం వైపు తన చూపు పడింది. తన భార్యా పిల్లలు అంత ప్రశాంతంగా హాయిగా నిద్రపోతున్నారన్న ఆలోచనలో నుండి ఏదో కలత పుట్టుకొచ్చింది. ఈ రాత్రి ఆ స్టేషన్లో తానుండి ఉంటే?! రేపు పిల్లల స్కూల్ మీద ఎవరైనా అటాక్ చేస్తే?! తనకీ పిల్లలకీ ఏమైనా అయితే రమ్య ఏమైపోతుందో! అన్నయ్యా వదినా వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారో! అమ్మా వాళ్ళ ఈ వయస్సులో ఇంత కష్టం భరించగలరా? వెంటనే ఇక్కడి నుండి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలి. మళ్ళీ అమ్మా వాళ్ళ దగ్గరికే అయితే? కానీ అక్కడేం చేస్తాం? నా ఉద్యోగమో? పిల్లల చదువులు మళ్ళీ మొదటికొస్తాయి. ఆలోచనలు అంతూ పొంతూ లేకుండా సాగిపోతున్నాయి. పోవు మరి? నడిరోడ్డూ మీద కుక్కల్ని కాల్చినట్టు పారేస్తుంటే ఎలా బతుకుతాం? అన్న సమర్ధింపూ వచ్చేసింది. మళ్ళీ టివి ముందు కూలబడ్డాడు. వార్తలను చూస్తూ ఉన్నాడు. కాస్త నిర్లిప్తతతో. ఆశ్చర్యంలో నుండి పుట్టిన భయం ఇప్పుడు మొద్దుబారిపోయింది. వస్తున్న కొత్త సమాచారాన్ని చాలా మెకానికల్ గా డికోడ్ చేసుకుంటుంది బుర్ర. నలుగురు మృతుల నుండి నాలుగొందల మంది అనే వార్త వరకూ చూశాడు. అప్పుడే తెల్లవారుఝామున నాలుగయ్యిందని గ్రహించి, కాసేపు నిద్రకి ఉపక్రమించాడు.
తెల్లారొచ్చిన న్యూస్ పేపర్ చూడగానే రమ్య గజగజ వణికిపోయింది. పిల్లల్ని స్కూల్ కి పంపన్నంది. అతడూ సరే అన్నాడు. “నువ్వూ వెళ్ళకు ఈ ఒక్క రోజుకి..ప్లీజ్” అని ప్రాధేయపడింది. ఆగిపోవాలని అతనికీ ఉంది. కానీ దీన్ని ఇంకో రోజులా మొదలెట్టక తప్పదు. ఆమెని దగ్గరకు తీసుకుని నుదిటిపై ముద్దు పెడుతూ “నువ్వూ, నీ ప్రేమా నాకు తోడుగా ఉన్నంత వరకూ నాకేం కాదురా!” అని నమ్మకంగా పలికాడు. ఆ నమ్మకం “నిజమా?” అన్న అనుమానం ఆమెకి రాకపోలేదు. నిన్న రాత్రి, చనిపోయిన వాళ్ళ, చనిపోతున్న వాళ్ళూ అనాధలు కారు. ఇలాంటి ఎన్నో ప్రేమ బంధాలను తమకి తెలీకుండానే తెంచుకుపోయారు. ఆ ఆలోచన ఆమెను మరింత కలవరపెట్టి, అతన్ని గట్టిగా చుట్టుకుంది. “ఏం కాదు.. బీ స్ట్రాంగ్” అని మళ్ళీ మళ్ళీ చెప్పటంతో ఆమె ఒప్పుకుంది. అతడు ఆఫీసుకెళ్ళాడు. మీటింగ్ కంప్లీట్ చేశాడు. అఫీషియల్ డిలిగేట్స్ తో లంచ్ కి వెళ్ళాడు. ఆ రోజూ మరో రోజులానే గడిచింది, మరి కొన్ని దుర్వార్తలూ, కొన్ని ఖండనలూ, ఇంకొన్ని ఆర్తనాదనలూ అన్నీ ఎప్పటికప్పుడు “గూగుల్” చేస్తూ చూడడం తప్పించి, అంత షరా మూమూలుగానే కొనసాగింది.
🙂
thanks for the invite. Thanks a lot 🙂
LikeLike
Test Comment
LikeLike
Welcome back :)!!
షరా మామూలే.. ఏవరి దారి వారిది.. జరిగిన దానికి జాలి, ఆవేశం, కోపం, నిస్సహాయత అన్ని ఓక సారి మనల్నితట్టీ, ఓక ఆలోచన, తరువాత మన జీవితం…
Captured the feeling of an innocent civilian in the city of chaos absolutely well, particularly that of his thought of his wife and kid. How many of them have been terrorised by this insanity? How many of them had the thought of leaving the place for some place safe…
when will this insanity end? Can time provide an answer? OR will our society provide an answer? Will “A Wednesday” stupid common man act? Is it that simple? 🙂
LikeLike
haha…enti anni cAvu postle???
LikeLike
So true.
LikeLike