క్షణాలు.

Posted by

ఇద్దరం కలిసి ఒడ్డున్న కూర్చున్నాం, ఎదురెదురుగా! ఎంత సేపని, మొహమొహాలూ చూస్తూ కూర్చోగలం కనుక! అసలే కొత్తాయే! బిడియం, తత్తరపాటు, భయం, సిగ్గు లాంటివన్నీ “ఆయ్.. శనగల్, శనగల్”, “బాఠాణీలు.. బఠాణీలు” అంటూ తోచనివ్వని అమ్మకందారుల్లా మొహం మీద ముసురుతున్నాయి. ఇలానే మరికాసేపుంటే లోలోతుల్లో నిక్షిప్తమై ఉన్న నిజాలన్నీ బయటకొచ్చేస్తాయి. మాటల మాటునయితే ఉన్న నిజాలను కప్పేయటచ్చు, లేని అబద్ధాలకు ఆయువునివ్వచ్చు. అందుకే తెలివిగా ఒకర్ని చూసుకుని ఒకరం చిర్నవ్వు ఇచ్చి పుచ్చుకున్నాం. నవ్వుకున్నాక ఏం చేయ్యాలో తోచక ఒక ఆట మొదలెట్టాం.

“ఏంటా ఆట?” అంటే ఏమంటారో మరి? మాకూ తెలీదు! ఆడుతున్నాం అనే తెలిసే సరికే ఆటలో మునిగిపోయాం. ఎప్పుడెలా మొదలెట్టామో, అది కాస్తా ఇలా, ఇలా అయ్యిపోయ్యింది.

“ఎలా? ఎలా?” అంటే..

మా ముందు అనంతమైన సంఖ్యలో “క్షణాలు” రాశిగా పోసుంటాయి మాట. అనంతమైన అంటే లెక్కపెట్టే ఓపిక లేనన్ని మాత్రమే! కానీ “అమ్మో” అనిపించే అన్ని క్షణాలన్న మాట. ఇప్పుడు ఈ ఆటలో ఆ అనంతమైన వాటిలో మేము చాలా కొన్ని, కొన్నంటే కొన్ని మాత్రమే పంచుకోవాలి. ఇద్దరమూ కలిసి వాటితో “ఏమైనా” చెయ్యచ్చు. ఆ క్షణాలని ఎంత బాగా ఆదరించి, ఆస్వాదించగలిగితే మేం అంత బాగా ఆడగలుగుతున్నాం అని లెక్క!

ఇద్దరం కలవగానే క్షణాలు ఒక్కొక్కటిగా మా మధ్య నుండి వేగంగా దూసుకుపోతాయి. ఇద్దరి మధ్య నుండి గాలి వెళ్ళినంత సావకాశంగా వెళ్ళిపోతాయి. కానీ వెళ్తూ, వెళ్తూ ఆ క్షణాలు సంక్షిప్తమై జ్ఞాపకాలుగా మెదడులో తిష్ఠ వేస్తాయి. క్షణాలలో గాఢతను బట్టి జ్ఞాపకాల మొండితనం ఏర్పడుతుంది. ఈ లెక్కలో అసలు తిరకాసేటంటే, ఓ క్షణం వెళ్ళిపోతూ మిగిల్చే అనుభూతులతో కూడిన జ్ఞాపకం ఇద్దరి దగ్గరగా ఉన్నా, ఎవరి కాపీలు వాళ్ళవి. ఆ రెండు కాపీలూ ఒక్కటే కావచ్చు, పూర్తిగా వేరూ అవ్వచ్చు.ఈ క్షణాల మాయ ఎలా ఉంటుందంటే.. ఏది యాధృచ్చికమో, ఏది కల్పనో, ఏది నిజమో, ఏది నమ్మకమో ఏమీ చెప్పలేం.

ఒక క్షణంలో తన ఒకటంటే, నేను అదే వింటాను. ఆ క్షణం వెంబడి వచ్చే క్షణాల్లో ఉంటుంది అసలు మజా! నేను ఉడుకుంటాను, తను ఇంకా రెచ్చగొడతాడు. నేను ఏడుపు మొహం పెడతాను, తను గట్టిగట్టిగా నవ్వుతాడు. నేను లోలోపల నవ్వుకుంటూనే మొహం దాచేసుకుంటాను నా చేతుల్లో, అతను బిత్తరపోతాడు. “నిజంగా అనలేదూ” అంటూ నిజాన్ని ఒప్పుకునే క్షణంలో గట్టిగా నవ్వటం నా వంతు.

సరదాగా ఉంది కదూ! ఆటలో ఎంత సరదానో గాయపడడానికి అంత ఆస్కారమూ ఉంటుంది మరి.

అన్యమనస్కంగా ఉన్న నాతో ఏదో అంటాడు. నేను వినిపించుకోను. “ఏమయ్యింది?” అని అడుగుతాడు, “ఏం లేద”ని తప్పించుకుంటాను. “ఏమయ్యింది చెప్పు” అని తను గదమాయించలేడు. ఇంకా కొత్తే కదా! నా మీద అధికారం చూపించలేడు ఆ క్షణంలో. అంతకు మునుపే నా మీద సర్వాధికారాలూ తనకిచ్చేసానని అతనికి తెలీదు. అదే ఈ ఆటలోని అసలు మర్మం. ఒకరనుకుంటున్నది మరొకరికి తెలీదు. అనేవి మాత్రం “అన్నట్టు” వినిపిస్తాయి. అందులో ఏవో నిగుఢార్థాలూ స్ఫురిస్తాయి. కానీ వాటిని సాధికారికంగా నిరూపించలేము. విస్మరించనూ లేము. ఊపిరాడకపోతే ఒక్కటే బాధ! ఈ ఆట – ఊపిరి ఆగడానికి ఆడడానికీ మధ్యన ఊగిసలాడుతుంది. ప్రాణం తోడేస్తుంది.

“ఆడడం సరే! ఎవరు గెలిచేది? ఎలా గెలిచేది?” అంటే సమాధానం ఇక్కడ గెలవడాలుండవు.

“గెలవకపోయేట్టయితే ఇది ఆట ఎందుకవుతుంది?” అంటే.. ఆటకుండాల్సిన అన్ని లక్షణాలు ఉంటాయిందులో, ఓటమితో సహా! గెలుపొక్కటే ఉండదు.

మాకంటూ ఇంకా బోలెడన్ని క్షణాలున్నాయి. “ఇక చాలు! వద్దని” నేనూ, “లేదూ.. ఇంకా ఆడాలి” అని అతనూ. “డ్రాప్ అవుట్ అవుదామ”ని నేనంటే “అది పిరికి వాళ్ళ లక్షణం” అని అతను తిప్పికొడతాడు. “గాయపడితే కోలుకోలేము” అని నేనూ, “ఆపాక గుండే ఆగిపోతే” అని అతను.

క్షణాలున్నాయి కదా అనుకుని ఇంకా ఆడితే ప్రతీ క్షణం మా ఇద్దరినీ మరింత దగ్గరకు తీసుకొచ్చేస్తుంది. ఒక్కో క్షణంలో మనసుల్లోని ఒక్కో తీగ ముడిపడిపోతూ ఉంటాయి. ఓ గుండె మరో గుండెలో తన సవ్వడిని వెత్తుక్కోవటం మొదలెడుతుంది. ఒకరి నిశ్శబ్దం మరొకరిని నీరసింపజేస్తుంది. అవతలి వ్యక్తి మీద ఎంత ఆధారపడిపోతామంటే.. మన ఉనికే ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఆ క్షణంలో గానీ “టైం అవుట్” అని తెలియాలి! మరణాన్ని అతి దగ్గరనుండి చూసే అవకాశం అది. పోనీ దూరాలు కరిగిపోయి, పరదాలు జారిపోయి ఒకరనుకుంటున్నది మరొకరు చదివేస్తుంటే…” ఏమి హాయిలే హలా” అనుకుంటూ పాడుకోడానికి లేదు. “భయం” మొదలవుతుంది. ఆ “అనుకునేవాటి”లో నేను ఇమడగలనా అన్న భయం. ఇంకెన్ని క్షణాలున్నాయో అని భయం. ఆడి, అలసి, ఓడే కన్నా ఇప్పుడే విరిమించుకుంటే మేలు అని నా అభిప్రాయం. అందుకే క్షణాలన్నింటినీ కాళ్ళరాసి దూరంగా పరిగెత్తాలని.

“అది పిరికితనం”! అతడంటూనే ఉన్నాడు. నేను వెళ్ళిపోయాను.

మరుసటి సాయంత్రం మళ్ళీ ఒడ్డున కలిసాం. మళ్ళీ మాటలందుకున్నాం, ఆట మొదలయ్యింది. చెప్పటం మర్చిపోయాను, ఈ ఆటను మొదలెట్టటంలానే ఆపటం కూడా మన చేతుల్లో ఉండదు. ఎప్పుడు ఆగిపోతుందో అదే ఆగాలి!


6 comments

 1. “గాయపడితే కోలుకోలేము” అని నేనూ, “ఆపాక గుండే ఆగిపోతే” అని అతను.”
  – Wow! Nice concept – this post. Nice narration too 🙂 Please keep writing more such stuff … so that people like me can read and enjoy 🙂

  Like

 2. (మనసు) ఆరేసుకోబోయి (క్షణాలు) పారేసుకున్నాను…. హరీ!! 😀

  Like

 3. “ఇద్దరం కలవగానే క్షణాలు ఒక్కొక్కటిగా మా మధ్య నుండి వేగంగా దూసుకుపోతాయి. ఇద్దరి మధ్య నుండి గాలి వెళ్ళినంత సావకాశంగా వెళ్ళిపోతాయి. కానీ వెళ్తూ, వెళ్తూ ఆ క్షణాలు సంక్షిప్తమై జ్ఞాపకాలుగా మెదడులో తిష్ఠ వేస్తాయి. క్షణాలలో గాఢతను బట్టి జ్ఞాపకాల మొండితనం ఏర్పడుతుంది. ఈ లెక్కలో అసలు తిరకాసేటంటే, ఓ క్షణం వెళ్ళిపోతూ మిగిల్చే అనుభూతులతో కూడిన జ్ఞాపకం ఇద్దరి దగ్గరగా ఉన్నా, ఎవరి కాపీలు వాళ్ళవి. ఆ రెండు కాపీలూ ఒక్కటే కావచ్చు, పూర్తిగా వేరూ అవ్వచ్చు.ఈ క్షణాల మాయ ఎలా ఉంటుందంటే.. ఏది యాధృచ్చికమో, ఏది కల్పనో, ఏది నిజమో, ఏది నమ్మకమో ఏమీ చెప్పలేం.”

  beautifully said. The perception of each person and the impression that the moment leaves and the transformation into a memory – fond or otherwise, is so aptly said. Kudos!! 🙂

  “ఒక క్షణంలో తన ఒకటంటే, నేను అదే వింటాను. ఆ క్షణం వెంబడి వచ్చే క్షణాల్లో ఉంటుంది అసలు మజా! నేను ఉడుకుంటాను, తను ఇంకా రెచ్చగొడతాడు. నేను ఏడుపు మొహం పెడతాను, తను గట్టిగట్టిగా నవ్వుతాడు. నేను లోలోపల నవ్వుకుంటూనే మొహం దాచేసుకుంటాను నా చేతుల్లో, అతను బిత్తరపోతాడు. “నిజంగా అనలేదూ” అంటూ నిజాన్ని ఒప్పుకునే క్షణంలో గట్టిగా నవ్వటం నా వంతు.”

  Again – the rendition is fantastic – the simplest of the conversations sometimes are the pearls in the casket called memory, right?

  “మాకంటూ ఇంకా బోలెడన్ని క్షణాలున్నాయి. “ఇక చాలు! వద్దని” నేనూ, “లేదూ.. ఇంకా ఆడాలి” అని అతనూ. “డ్రాప్ అవుట్ అవుదామ”ని నేనంటే “అది పిరికి వాళ్ళ లక్షణం” అని అతను తిప్పికొడతాడు. “గాయపడితే కోలుకోలేము” అని నేనూ, “ఆపాక గుండే ఆగిపోతే” అని అతను.”

  Whatever be the reason for wanting to quit, when you are a heart throb for another, even the most painful of the moments seem like a cake walk – with that one heart throb beside you. Perhaps, life is not so difficult and perspiring, when finding a right companion – in a friend or in a confederate, walking with you, every step of the way…

  And, despite walking away, heart strings are much stronger – they pull and pull- until u walk in the direction they want u to walk. Perhaps, because, that is what we want. whatever be the reason, the spring in the heart is eternal and it need not always be a spring, either.

  Loved this post and I guess, welcome back… Touched me… with this one…

  Like

 4. Touché! Touché!! 🙂

  On a lighter note, The funny and wise Jack Sparrow’s (Pirates of the Caribbean) quote comes to my mind (Well, random stuff) –

  “Have you not met Will Turner? He’s noble, heroic – terrific soprano. Worth at least four… maybe three and a half. And did I happen to mention… **he’s in love? With a girl. Due to be married. Betrothed. Dividing him from her and her from him would only be half as cruel as actually allowing them to be joined in holy matrimony, eh?** ”

  😉

  Like

 5. ఎందుకో తెలియదుగాని, సాండ్స్ ఆఫ్ టైమ్ అనే కథ గుర్తుకు వచ్చింది.
  అద్సరేగానీ – ఉహా? ప్రోహా? అపోహా?
  😀

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s