జరగని కథ


"గోపాలం చాలా బావుండడు." - వాక్యం చదివీ చదివగానే కిసుక్కుమన్నాడు, చదివినవాడు. "అలా కిసుక్కులూ, కసక్కులూ అంటూ ఉంటే పనులు జరగవు. గబగబా చదివేసి, ఏదోటి రాసేయ్య్.." అంటూ చేతికింద పనివాడు ఉండడం అలవాటులేని బ్రహ్మదేవుడు చురచురలాడాడు, "రాయమన్నా కదా అని ఉన్నదున్నట్టు రాయకు. నీ తెలివి కూడా చూపించు. తలరాతలేసుకొని కూర్చొనే మగడు దొరకటం తన తలరాత అని ఒహటే నస! జనాభా అలా పెరిగిపోయింది, నేనేం చేయను? అంటే అదీ మీ నిర్వాకమేగా అంటుంది. యు... Continue Reading →

చిట్టి ప్రేమకథలు


(ఈ పురుగు నా మెదళ్ళోకి ఎలా చేరిందో తెలీదు - బహుశా, నా స్నేహితుడొకడు, నేను రాసినవి చదివనప్పుడల్లా, ఎకానమీ ఆఫ్ వర్డ్స్ అనేది ఒకటుంటుందని అదే పనిగా గుర్తుచేయటం వల్లననుకుంటా - గానీ, ఇలా తక్కువలో అతి తక్కువ పదాలు వాడి ఏదైనా రాద్దామా? అనుకున్నప్పుడు, ఇది (https://pisaller.wordpress.com/2011/01/06/luvs/) తట్టింది. తర్వాత అలా ఆలోచిస్తూ పోతే, ఇంకొన్ని వచ్చాయి. ప్రేమకథలే ఎందుకూ? అంటే సినిమాల్లో, పుస్తకాల్లో, జనాల్లో ఎక్కడ చూసినా అదే గోలగా.. అందుకని ప్రాక్టిస్... Continue Reading →

When your friend writes a book..


When you win, I feel like a champion! - రోజర్ ఫెదరర్ గెలిచిన ప్రతిసారి గొంతు చించుకొని మ్యూట్ గా నేను అనుకునే మాటలు. మన ఫ్రెండ్స్ విషయంలో కూడా అలానే అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళేదో ప్రపంచాల్ని గెలిచేయాలని కాదు గాని, ఉన్న అవాంతరాలను అధిగమిస్తూ సాధించుకున్న ఏ చిన్న విజయాలైనా చాలు! అందులో మన వంతుగా కాస్త నవ్విస్తూ, కాస్త విసుక్కుంటూ, న-సాధిస్తూ, బ్రేక్‍లిస్తూ, పళ్ళు నూరుతూ, గోళ్ళు కొరుక్కుంటూ, దొంగలకలు అభినయిస్తూ... Continue Reading →

వెదురు ముక్కలమ్మా.. వెదురు ముక్కలు!


నా కృష్ణుడెవ్వరో నాకు తెలీకపోవటం నాకున్న శాపమేమో! నాణేన్ని అటు తిప్పితే ఈ తెలీకపోవటమేదో కూడా నాకు అనువుగానే ఉంది. వాడి పుట్టినరోజును మర్చిపోతానన్న హైరానా అక్కర్లేదు. అత్యుత్తమైనదేదో బహూకరించాలన్న తపస్సూ చేయనవసరం లేదు. బుద్ధి పుట్టినప్పుడు వాడే అటకెక్కి చూసుకుంటాడు. ఆనక, వాడి చిత్తం, నా ప్రాప్తం!* (బాగా రాయగలిగే చాలామంది, రాసుకునేందుకు ఇష్టపడతారుగాని రాయడానికి జంకుతారు. ఆలోచించినప్పుడల్లా, వాళ్ళకున్నంత కార్యదక్షత, ఓపిక, పరిశ్రమించే గుణం నాకు లేవనుకున్నాను. అనుకుంటున్నాను. అయినా ఇంకా జంకురాదే? ఎవరేమనుకుంటారోనన్న... Continue Reading →

School teacher


నిన్న సాయంత్రం మీ అమ్మగారు నాతో మాట్లాడారు. నేను నీ గురించి ఏమేం వింటున్నానో తెల్సా? నువ్వసలు సరిగ్గా తినడం లేదంట, ఇంట్లో? పావని వాళ్ళు నువ్వు స్కూల్లో కూడా తినడం లేదని చెప్తున్నారు? రోజూ బాక్స్ అలానే పట్టుకెళ్తున్నావ్ అట? ఏంటి నీ సమస్య? డైటింగ్? ఆడపిల్లంటే అందంగా కనిపించాలని నూరిపోస్తారు గాని, ఆరోగ్యం లేనిదే అందమెలా వస్తుంది? లావుగా ఉన్నా ఆరోగ్యంగా ఉంటే అదో నిండుతనం. సన్నగా, పాలిపోయి, పీక్కుపోయినట్టుంటే ఎవరూ మొహం చూడరు.... Continue Reading →

స్పందన


ఏంటలా పరగ్గా వెళ్ళిపోతున్నారు? నేనున్నాని గమనించరేం? పొరపాటునైనా? సర్లేండి. పదండలా నడుస్తూ మాట్లాడుకుందాం. ఆకాశం చెక్కిలి మీద ఎరుపెలా తేలిందంటారు? ఎవర్ని కలవబోతున్నందుకో ఆ సిగ్గులకెంపులు? సంద్రాన్ని చూడండి.. ఏరి? అలా బిగుసుకుపోతారేం? ష్... జాగ్తత్తగా వినండి. కిశోర్ కుమార్ వద్ద ఏకలవ్య శిష్యరికం చేసినట్టు, గాలి ఈలలేస్తోంది. మీ పరధ్యానం మీదేనా? అవున్లే, మీ పరధ్యానం మీది కాకపోతే నాదవుతుందా? పదండి, మీరెటు పోతే, నేనూ అటే.. నిర్మానుష్యపు వీధిలో మానవాకరం. అటు తిరిగి నుంచున్నారెవరో?... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑

%d bloggers like this: