నా కృష్ణుడెవ్వరో నాకు తెలీకపోవటం నాకున్న శాపమేమో! నాణేన్ని అటు తిప్పితే ఈ తెలీకపోవటమేదో కూడా నాకు అనువుగానే ఉంది. వాడి పుట్టినరోజును మర్చిపోతానన్న హైరానా అక్కర్లేదు. అత్యుత్తమైనదేదో బహూకరించాలన్న తపస్సూ చేయనవసరం లేదు. బుద్ధి పుట్టినప్పుడు వాడే అటకెక్కి చూసుకుంటాడు. ఆనక, వాడి చిత్తం, నా ప్రాప్తం!*
(బాగా రాయగలిగే చాలామంది, రాసుకునేందుకు ఇష్టపడతారుగాని రాయడానికి జంకుతారు. ఆలోచించినప్పుడల్లా, వాళ్ళకున్నంత కార్యదక్షత, ఓపిక, పరిశ్రమించే గుణం నాకు లేవనుకున్నాను. అనుకుంటున్నాను. అయినా ఇంకా జంకురాదే? ఎవరేమనుకుంటారోనన్న భయంలేదే? బహుశా, అటకెక్కిన వేణువులకన్నా, వేణువు తయారీలో ఉన్న అద్వితీయానందం.. నాకు మాత్రమే సొంతమైన ఆనందం, అనుభవించేశాక, అంతటి ఆనందాన్ని ఇచ్చిన వాటిని మూలపడేయబుద్ధికానందుకేమో?!)
నోట్: మా బాపూ గీసిన అందమైన బొమ్మను ఖూనీ చేస్తావా? అని కయ్యానికి రాకండి. ఇవిగో, ముందస్తుగానే నా క్షమాపణలు!
*ముళ్లపూడి ’కానుక’ కథ చదవనివారికి, నాలోని తిక్క తెలియనివారికి ఈ సొద అర్థం కాదు. నవ్వుకోడానికీ, నవ్వడానికీ అనుమతి ఇవ్వబడింది. 🙂
నేను కథ చదవలేదు. సో, అర్ధం కాలేదు. 🙂
But, బొమ్మ చాలా బాగుంది. You have a spark in it gal…..
Keep drawing.. Good Luck! 🙂
LikeLike
మరేమో, బాపు గారి సంతకం కనబడ్డంత స్పష్టంగా ఈ ఫొటోలో నీ సంతకం కనబడలేదు గా … కొంచెం అది కూడా ఫొటోలో తీసి పెడుదూ……
LikeLike