When your friend writes a book..

Posted by

When you win, I feel like a champion! – రోజర్ ఫెదరర్ గెలిచిన ప్రతిసారి గొంతు చించుకొని మ్యూట్ గా నేను అనుకునే మాటలు.

మన ఫ్రెండ్స్ విషయంలో కూడా అలానే అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళేదో ప్రపంచాల్ని గెలిచేయాలని కాదు గాని, ఉన్న అవాంతరాలను అధిగమిస్తూ సాధించుకున్న ఏ చిన్న విజయాలైనా చాలు! అందులో మన వంతుగా కాస్త నవ్విస్తూ, కాస్త విసుక్కుంటూ, న-సాధిస్తూ, బ్రేక్‍లిస్తూ, పళ్ళు నూరుతూ, గోళ్ళు కొరుక్కుంటూ, దొంగలకలు అభినయిస్తూ వాళ్ళ చేత పనిజేయిస్తే, ప్రతిఫలంగా పని పూర్తయ్యాక ఆనందాతిశయాలకన్నా ముందు “హమ్మయ్య!” అని నిట్టూర్చటంలోని అనుభూతి తెలిసొస్తుంది. ఆ అనుభవమేదో నాసొంతం చేసినందుకు సౌమ్యకు థాంక్స్!

మా జనాభా మొత్తానికి (ఈనాడు పుణ్యమా అని నేను తెలీనివారికి కూడా) సౌమ్య తెల్సుకాబట్టి, అందరి తరఫున మూకుమ్మడి కంగ్రాట్స్!

Oh..by the way, witnessing your friend writing a book – in fact, when (s)he goes against tide to achieve something – is as thrilling as a Tendulkar’s 100th run or a Federer’s championship point! Excruciating pleasure!

అందుకని ఫ్రెండ్స్ ద్వయంలో టాలెంటుతో పాటు చేయాలన్న తపనున్న మనుషులు చెలరేగి విజృంభిస్తే, “పార్టీ.. పార్టీ!” అని గోల చేయడానికి మాబోటివారలం సర్వసన్నద్ధం అని సభాముఖంగా తెలియజేస్తున్నాం.

3 comments

  1. Very true. A friend’s victory is victory and a half!! 🙂
    అలాగే ఆ తంతు లో ఎవడన్నా అడ్డొచ్చినా, కష్టాన్ని సరిగ్గా గుర్తించకుండా, పేరు వేరే వాడు కొట్టేసినా [కొట్టేయ్యాలనుకున్నాడని తెలిసినా చాలు] కాళ్ళు విరగ్గోట్టేయ్యాలన్నంత కోపం కూడా వస్తుంది.
    ఈ విషయాల్లో వాళ్ళ కంటే మనమే ఎక్కువ react అవుతాం. అదేంటో!! I love it tho.!

    btw – దొంగలకలు ప్రయోగం బాగుంది. 😀

    Congrats to sowmya and
    Congrats and a half to you. ! 🙂

    Keep rocking gals…

    Like

Leave a comment