లేని కథ


రాముడు కాదనుకున్న సీతను చితి ఆహ్వానిస్తుంది, కోన ఆశ్రయమిస్తుంది, భూమి తనలో దాచుకుంటుంది. వాల్మీకే వద్దనుకున్న సీతను. లేని కథకు నాయికను.

దాహం.


కంటి అంచుకీ రెప్పకీ మధ్య ఏర్పడిన సూదిమందమంత సందులో తళుక్కుమన్న వెలుతురు, మసగ్గా, అస్పష్టంగా సూదిమొనలాంటి నా ముక్కు కొస, చెక్కినట్టున్ననీ  చెక్కిలి: నిద్ర మత్తు వదలని కంటిరెప్పలు, నాటకం మొదలవ్వడానికి ముందు తెర లేచినట్టుగా మందగమనంతో పై పైకి లేస్తూ వరసుగా సాక్షాత్కరింపజేసిన దృశ్యాలు. మెళుకువ వచ్చి రెప్పలు పూర్తిగా తెర్చుకున్నాక కనపడినవి: నిద్రలో తెరచుకున్న నీ పెదాలకు మల్లే మన ఇరు దేహాలు; ఓ చోట కలిసి, మరో చోట విడిపోయి. ప్రేమించుకున్నాం. పెళ్ళయ్యింది.... Continue Reading →

ఇది కల కాదు! (ఏమో..)


నా ఊపిరికి మరో ఊపిరి జతకూడి, బరువెక్కి బుసులుకొడుతోంది. నిద్రాణమై ఉన్న తాపాగ్నికి కొత్త ఊపిరి పోస్తోంది. నీడను నీడ ముద్దాడుతున్నట్టు, అంత దగ్గరైనా ఆ జత పెదవులు నోటికి అందవేం? ఆ ఊపిరిని అనుసరిస్తూ, ఆ పెదవుల కోసం అర్రులు చాస్తూ పై పైకి లేస్తూ.. ఎత్తైన శిఖరం నుండి కాలు జారి నదిలోకి మునకేసినట్టుగా మెళకువలో పడ్డాను. చీకట్లో చేతులతో తడిమితే, సుబ్బరంగా నిద్ర పోతున్న మా ఆయన! అతడి పని కాదు. కల? ఛీ!... Continue Reading →

(శీర్షిక సెన్సార్ చేయబడింది.)


రాత్రి సమయం. కుండపోత వర్షం. ఆమె వంటగదిలో పనిచేసుకుంటుంది. అతడు తలుపును భళ్ళున నెట్టి రంకెలేయడం మొదలుపెట్టాడు. ఆమె కనిపించగానే తిట్లందుకున్నాడు. మీదమీదకొచ్చాడు.  మద్యం వాసన భరించలేక ఆమె ఈసడించుకొంది. అతడి కోపం పేట్రేగింది. పొయ్యి మీదున్న వేడి పాత్రపై ఆమె చేతిని బలవంతాన ఆన్చాడు. కుడిచేత్తో ఆమె ఎడమ చెంప మీద కొట్టాడు. విసురుగా దూసుకొచ్చిన చేయి అడ్డుగా ఉన్న ఆమె చెంపను చెల్లుమనిపించటంతో కిందకు వాలగా, దాన్ని రివర్సులో లేపి ఆమె ఎడమ చెంపను... Continue Reading →

ఒక తప్పిపోయిన ప్రకటన


(గమనిక: తప్పిపోయింది ప్రకటన కాదు. తప్పిపోయిన ఒకదానిని గురించి ఈ ప్రకటన అని గమనింప ప్రార్థన) పైన లేని ఫోటోలో కనిపించని సదరు అదృశ్య, నిరాకార whatever పేరు నిద్ర. ’సుందరి’, ’దేవి’ లాంటి తోకలు తగిలించుకొని కూడా చెలామణి అవుతుంటుంది. నాబోటి వాళ్ళు ప్రేమాప్యాయతలు అధికమై ’పిశాచి’, ’దెయ్యం’ అని ముద్దుగా పిల్చుకుంటుంటాం. ముమ్మాటలా ఆడదే! వద్దన్నప్పుడు కవ్విస్తుంది. దరిచేరమన్నప్పుడు మొహమైనా చూడదు. పెద్దగా ప్రయాస కూడా పడకుండ తన పంతాన్ని నెగ్గించేసుకుంటుంది. అన్నింటికన్నా ముఖ్య... Continue Reading →

If you’ve cared for this blog..


I'm hoping you haven't opened this page, just out of curiosity. There seem to be a set of people who care for this blog and what's being written in it. That, despite my antics. That, from people I least expect to be around. This post is exclusively for them. First things first, I'm not a great believer... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑

%d bloggers like this: