(గమనిక: తప్పిపోయింది ప్రకటన కాదు. తప్పిపోయిన ఒకదానిని గురించి ఈ ప్రకటన అని గమనింప ప్రార్థన)
పైన లేని ఫోటోలో కనిపించని సదరు అదృశ్య, నిరాకార whatever పేరు నిద్ర. ’సుందరి’, ’దేవి’ లాంటి తోకలు తగిలించుకొని కూడా చెలామణి అవుతుంటుంది. నాబోటి వాళ్ళు ప్రేమాప్యాయతలు అధికమై ’పిశాచి’, ’దెయ్యం’ అని ముద్దుగా పిల్చుకుంటుంటాం. ముమ్మాటలా ఆడదే! వద్దన్నప్పుడు కవ్విస్తుంది. దరిచేరమన్నప్పుడు మొహమైనా చూడదు. పెద్దగా ప్రయాస కూడా పడకుండ తన పంతాన్ని నెగ్గించేసుకుంటుంది. అన్నింటికన్నా ముఖ్య (ఆడ) లక్షణం, సవతి పోరు అసలు ఒప్పదు. వేరొకరిని వలచామో..
ఓ నిద్రా! నీవు నన్ను వీడి వెళ్ళిన దగ్గర్నుండి నా మనసు మనసులో లేదు. నా మనసు మనసులో లేనందు వల్లనే నీవు నన్ను వీడిపోయావని నీవు వాదించవచ్చు. తప్పు నా వైపునున్నా సరే, నీవు లేకుండా, ప్రతి రాత్రి నీతో పేచీల్లేకుండా ఉండగలనేమో గాని, కాన్ఫరెన్స్ కాల్‍లో బాస్‍గాడితో సహా అందరూ గుర్రు పెట్టి నిద్రపోతున్నప్పుడు కూడా నువ్వు నన్ను కనికరించకపోతే.. జాలిగా చూస్తున్నారు జనం నన్ను. ప్లీజ్.. నా ఇమేజ్, నా గ్లామర్ దారుణంగా దెబ్బతింటున్నాయి. అసలు విషయం చెప్పటం మరిచా, మొన్నటి రైలు ప్రయాణంలో చూసిన పిల్లను దాదాపుగా మర్చిపోయినట్టే. ఇంకేం ఆలోచనలూ పెట్టుకోను. నీకే లోటూ రానివ్వను. వచ్చేయ్..
నా నిద్ర ఆచూకీ తెలిపినవారికి, మున్ముందు జన్మల్లో నిద్ర మీతో కుంభకర్ణుణితో ఉన్నంత సఖ్యంగా, గాఢంగా ఉండగలదు.*
(*అది తధాస్తు దేవతల మూడ్ మీద ఆధారపడుంది.**
* తధాస్తు దేవతల మూడ్ వారి వారి అప్రైసల్స్ మీద ఆధారపడగలదు. ***
***వారి వారి అప్తైజల్స్ వారి పనితనం మీద ఆధారపడదు.)
:))))))
నీ నిద్రను నాకు ఇంతకు ముందే పరిచయం చేసి ఉండి ఉంటే, ఈ పాటికి ఆచూకీ ఇట్టే పట్టేసేదాన్ని కదా… ఇప్పుడు తను నా దగ్గరకు వచ్చినా నేను గుర్తుపత్ట్టలేనే..!!
ఇక ఆ నిద్ర నీకు రహస్య స్నేహం[దెయ్యం] అయ్యుంటే గనక, ఎవరూ ఏమీ చేయలేరు.
Anyway, “శీఘ్రమేవ good నిద్ర ప్రాప్తిరస్తు.” 😀
LikeLike