రోడ్లపైన జనాలు బారులు తీరి ఉన్నారు. భారతదేశ జనాభాలో వైవిధ్యానికి నమూన చూపడానికి సరిపడా ప్రజలున్నారు. అన్ని వయసుల వారు. అన్ని మతాల వారు. అన్ని వర్గాల వారు. "అన్నా హజారే జిందాబాద్..", "వి వాంట్ క్లీనర్ ఇండియా!", "అవినీతిని నిర్మూలిద్దాం.. అన్నాకు మద్దతునిద్దాం" అన్న నినాదాల మధ్య, "ఇన్నాళ్ళూ దేశాన్ని దోచుకొని తిన్నారు. ఒక్కసారి ఈ బిల్ రానీ, నా కొడుకులు బతుకులని రోడ్డు మీదకు లాక్కురాకపోతే చూడు.." అన్న ఆగ్రహం, "హైట్స్ యార్.. ఒక డబ్భై... Continue Reading →
అ – అమ్మ. ఆ – ఆలి.
నేను నిన్ను కనలేదు. నా ఉనికి కారణమైన మనుషులిద్దరూ ఒకరికి ఒకరు తెలియక మునుపే మీ అమ్మ నిన్ను కనేసింది; తొమ్మిది నెలల పదకొండు రోజులు నిన్ను తనలో మోసి. ఆ మోయటంలో తన ప్రాణానికే ముప్పు పొంచుండచ్చన్న సంభావ్యతను బేఖాతరు చేస్తూ. పెంచింది; ప్రపంచం కోసం నిన్ను సంసిద్ధుణ్ణి చేస్తూ. ఆకలికి, నొప్పికి, నచ్చకపోవటానికి నువ్వొకే ఏడుపును ఆశ్రయించే రోజుల్లో నీ బాధను నిర్వచించగలిగింది. నీ బోసి నవ్వుల్లో తానో పసిపాప అయ్యింది. ఆమెకు నువ్వో... Continue Reading →