Translation from Hindi. Original: HariShankar Parsai’s जाती.
****
కార్ఖానా మొదలయ్యింది. కార్మికుల బస్తీ తయారయ్యింది. నాయుడుపాళెం నాయుడుగారూ, బ్రాహ్మణపురం దీక్షితులగారూ కార్ఖానా పనులు చేసుకుంటూ, ఎదురుబొదురు బ్లాక్‌లలో ఉండడం మొదలెట్టారు.
నాయుడిగారి అబ్బాయి, దీక్షితులగారి అమ్మాయి వయసులో ఉన్నారు. ఇద్దరి మధ్య పరిచయం కలిగింది. పరిచయం ఇద్దరూ ఒకరినొకరు పెళ్ళి చేసుకోడానికి సిద్ధపడేంతగా పెరిగింది.
ఈ ప్రస్తావన రాగానే దీక్షితులవారు అన్నారు – “ఇది ముమ్మాటికి జరగని పని. బ్రాహ్మణుల పిల్ల నాయుడింట మెట్టటమా? కులం నాశనమైపోదూ?!”
అమ్మాయి-అబ్బాయి చిన్నపిల్లలు కాదనీ, చదువుకున్నవారనీ, వాళ్ళని పెళ్ళి చేసుకోనివ్వమనీ కొందరు నచ్చజెప్పారు. ఒకవేళ పెళ్ళికి ఒప్పుకోకపోతే, వాళ్ళు చాటుమాటున కలిస్తూ, సంబంధాన్ని పెంచుకుంటూ పోతే, అది వ్యభిచారమనిపించుకుంటుందనీ చెప్పారు.
దీనికి నాయుడిగారు, దీక్షితులు ఇలా అన్నారు – “అయితే అవ్వనివ్వండి. వ్యభిచారం వల్ల కులం నాశనం అవ్వదు. పెళ్ళివల్ల అవుతుంది.”
ఏవిటీ? హిందీ లో నాయుడూ, దీక్షితులూ అని వాడారా???? 😉
LikeLike
‘సింగీతం’ గారి ‘క’ రాజు కథలు చదివారా? ఇంత చిన్నగా చెప్పలేదు గానీ ఇంకా చాలా చెప్పారు…
LikeLike