ఒక దేశంలోని ఒక నగరంలో ప్రజలపై పోలీసుల జులం చేసినందుకు వారంతా కల్సి పోలీసు-మంత్రి దిష్టిబొమ్మను దహనం చేయాలని తీర్మానించుకున్నారు.
దిష్టిబొమ్మ మొహాన్ని వికృతంగా, భయానకంగా తయారుజేశారు.
కానీ సెక్షన్ 144 అమలుపరచి, పోలీసులు దిష్టిబొమ్మను స్వాధీనపరచుకున్నారు.
ఇప్పుడు పోలీసులకో సమస్య వచ్చిపడింది, దిష్టిబొమ్మను ఏం చేయాలి? అని. పోలీసోళ్ళు పెద్ద ఆఫీసర్ల దగ్గరు వెళ్ళి అడిగారు, “సార్! ఈ దిష్టిబొమ్మ అందరికి అడ్డుగా ఎంతకాలం ఉంటుంది? దీన్ని తగలెట్టటమో, లేదా ద్వంసమో చేసేసేదా?”
ఆఫీసర్లు అన్నారు, “మతిపోయిందా? మంత్రిగారి దిష్టిబొమ్మ ఇది. దీన్ని మనమెలా తగలెడతాం? ఉద్యోగంపై ఆశలు లేవా?”
ఇంతలో రామ్‍లీల రోజులు వచ్చాయి. ఒక పెద్ద పోలీసు ఆఫీసర్‍కు “బ్రెయిన్ వేవ్” వచ్చింది. రామ్-లీల్ వాళ్ళని పిలిపించి చెప్పాడు, “దసరా రోజున కాల్చడానికి రావణుడి దిష్టిబొమ్మ కావాలిగా మీకు? దీన్ని తీసుకుపోండి. దీనికి కేవలం తొమ్మిది తలలు తక్కువ, అవి మీరు పెట్టేసుకోండి.”