(ఈ కథ "ఇన్ ది మూడ్ ఫర్ లవ్" అనే కథా సంకలనంలో మొదటిసారిగా ప్రచురితమైంది, 2018లో) “ఉష. ఇంజనీరింగ్ క్లాస్మేట్.” టెంపోకి మళ్ళీ బ్రేక్ పడింది. అర్థరాత్రి కావస్తున్నా బెంగళూరుకి మాత్రమే అలవాటైన ట్రాఫిక్. డ్రైవర్ కాబిన్ దగ్గర నుంచొన్న వాళ్ళిద్దరూ ముందుకు తూలబోయారు. ముందు సీటులో ఉన్నవారు చేతులు అడ్డుపెట్టుకున్నారు. ఆమె బాలెన్స్ ఆపుకుంటూ అతడి చేయి పట్టుకుంది. “మొండిది. పట్టుకుంటే వదలదు.” ఇరవై మంది దాకా ఉన్న ఆ టెంపోలో వాళ్ళకి చెప్పాడు... Continue Reading →
లింగం లైంగికత – సాహిత్యం, సంభాషణ
(భూమిక సంస్థ వారు రెండు రోజుల పాటు లింగం-లైంగికత: సాహిత్యం, సంభాషణ అనే వర్క్షాపుని నిర్వహించారు, జూలై 10-11న. పాతికమంది పైగా LGBTQIA+ కమ్యూనిటీ వారు, పది-పదిహేను మంది ఇతరులు (for once! 🙂 ) ఇందులో పాల్గొన్నారు. పి.సత్యవతి, వసుధేంద్ర, వి.ప్రతిమ లాంటి దిగ్గజాలు తమ అనుభవాలని పంచుకున్నారు. లైంగికత మీద, సాహిత్యం గురించి దాదాపుగా సమానంగా చర్చ జరిగింది. అందులో నాకు పాల్గునే అవకాశాన్ని ఇచ్చిన అపర్ణ తోటకి అనేకానేక ధన్యవాదాలు. ఆ కార్యశాలలో... Continue Reading →