విషయం సూటిదే కానీ… : కున్‍వర్ నారాయణ్

Posted by

కవి: కున్‍వర్ నారాయణ్
మూలం: బాత్ సీధీ థీ పర్ (హిందీ)
అనువాదం: పూర్ణిమ

విషయం సూటిదే కానీ ఒకసారి 
భాష అనే చట్రంలో 
కొంచెం వంకరపోయి ఇరుక్కుపోయింది 

దాన్ని దక్కించుకునే ప్రయాసలో 
భాషను ఉల్టాసీదా చేసి 
విరిగొట్టి మెలిపెట్టి 
తిప్పి తిరగేశాను 
విషయం చెప్పడమన్నా జరగాలి
లేదా భాషనుంచి అది బయటకన్నా రావాలి 
కానీ వీటివల్ల భాషతో పాటుగా 
విషయం కూడా పేచీ పెడుతూ పెంకిదైపోయింది. 

ఈ కష్టాన్నంతా ధైర్యంగా ఎదుర్కోకుండా
నేను స్క్రూని విప్పకుండా 
దాన్నింకా బిగించేసేట్టు తిప్పుతూ ఉండిపోయాను 
ఎందుకంటే ఈ పరాక్రమానికి నాకు 
గట్టిగానే వినిపించాయి 
తమాషా చూస్తున్నవాళ్ళ సభాష్‍లు, వాహ్-వాహ్‍లు! 

ఆఖరికి, నేను భయపడుతున్నట్టే అయ్యింది 
జోరు, జబర్దస్తీ చేసినందుకు 
విషయానికున్న స్క్రూధార* చచ్చిపోయింది
అది భాషలో బేకారుగా తిరుగుతూ ఉండిపోయింది. 

ఉసూరుమని నేను దాన్ని మేకుని
కొట్టినట్టు ఉన్నచోటునే కొట్టాను 
పై నుంచి బాగానే ఉంది 
కానీ లోపల్నుంచి 
దాంట్లో బిగువూ లేదు 
బలమూ లేదు 

విషయం, ఒక అల్లరిపిల్లవాడిలా 
నాతో ఆడుకుంటూ, 
నేను చెమటలు తుడుచుకోవడం చూసి అడిగింది - 
"నువ్వు భాషకి
అనుకూలంగా వ్యవహరించడం నేర్పించలేదా?"

*కవి ఇక్కడ చెప్పాలనుకుంటున్న సంగతిని స్క్రూతో పోల్చారు. స్క్రూధార అంటే స్క్రూ మీద ఉండే దారంలాంటి pattern. (రిఫరెన్స్: ఆంధ్రభారతి డిక్షనరీ) అదే లెనప్పుడు స్క్రూని తిప్పడం అవ్వదు కదా!

2 comments

  1. This poem and it’s translation should be included in courses on translation to illustrate translation itself. Very well-done Purnima garu

    Like

    1. Wow! Thank you so much. Though I’ve my doubts if I deserve such high praise, I’m so humbled too. It definitely gives me more courage and confidence to try out new things. Appreciate it.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s