New Books – కొత్త పుస్తకాలు: Kunwar Narayan

Posted by
New books, at first 
from a distance 
stare at me
with a shyness

Then, shrugging off any hesitation
they sit and spread 
in front of me, on the table I read

The first introduction... touch 
with the thrill of a handshake 
a beginning... 
they open up slowly
page by page 
intense proximity 

Some become friends 
Some become deeper friends 
Some effortlessly touch my heart
Some become a part of my thought
Some are favorites of the household 
Most of them, have something or the other to offer 

But still 
For my sake, I keep searching 
in the vast world of books 
a companion for life 
a little special-spunky-beautiful 
book full of soul 
in whose company, I can open up too 
like a book, page by page 
and it too 
reads me with all love and attention
కవి: కు‍నవర్ నారాయణ
మూలం: నయీ కితాబేఁ (హిందీ)
అనువాదాలు: పూర్ణిమ
కొత్త కొత్త పుస్తకాలు, మొదట్లో  
దూరంనుంచే చూస్తాయి 
నన్ని సిగ్గుపడుతూ 

తర్వాత సంకోచాన్ని వదిలి 
కూర్చుండిపోతాయి, పరుచుకుని 
నా ముందు, చదువుకునే బల్ల మీద 

వాటితో తొలి పరిచయం... స్పర్శ 
చేతులు కలిపినంత గగుర్పాటు
ఓ ఆరంభం... 
తెరుచుకుంటాయవి మెల్లిగా 
పేజీ తర్వాత పేజీ 
చిక్కబడే సాన్నిహిత్యం

కొన్నింటితో స్నేహం
కొన్నింటితో   గాఢమైన స్నేహం
కొన్ని అనాయాసంగా తాకుతాయి నా మనసుని
కొన్ని నా ఆలోచనల్లో భాగమైపోతాయి 
కొన్ని మొత్తం కుటుంబానికే ఇష్టం
చాలా వాటిల్లో ఏదో ఒకటి దొరుకుతుంది 

అయినా 
నాకోసం ఎప్పుడూ వెతుక్కుంటుంటాను
పుస్తకాల ఇంత పెద్ద ప్రపంచంలో 
ఒక జీవితకాలపు తోడుని
కాస్త అపురూపం-సరసం-అందం అయినది
ఆత్మీయమైన పుస్తకం 
దాని ఎదురుగా నేనూ తెరుచుకోవచ్చు 
పుస్తకంలా, పేజీ తర్వాత పేజీ
అది నన్నూ 
ప్రేమతో మనసు పెట్టి చదువుతుంది. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s