ఆకులపై నీళ్ళు పడ్డాయికి ఉన్న అర్థం నీళ్ళపై ఆకులు పడ్డాయికి ఉన్న అర్థానికన్నా భిన్నమైనది జీవితాన్ని పూర్తిగా పొందడానికీ పూర్తిగా ఇచ్చేయడానికీ మధ్య ఒక నిండైన మృత్యు చిహ్నం ఉంటుంది తక్కిన కవిత పదాలతో రాయబడదు అస్తిత్వాన్ని మొత్తం గుంజి ఒక విరామంలాగా ఎక్కడో చోట విడిచివేయబడుతుంది.
కవి: కున్‍వర్ నారాయణ్
మూలం: బాకీ కవిత (హిందీ)
అనువాదం: పూర్ణిమ