Learning Spaces: An experience report

Posted by

శాంతా గోఖలే “అవినాష్” అనే నాటకం 1988లో రాశారట. అందులో ఒక యువకునికి మానసికపరంగా ఏదో కండిషన్ ఉంటుంది, అందుకని ఇంట్లోవాళ్ళు ఆయణ్ణి కట్టి ఒక గదిలో పెడతారు, డాకర్లకి చూపించకుండా. నిన్న జరిగిన ఒక ఇంటర్వ్యూలో శాంతగారిని ఒకరు అడిగారు, “సాహిత్యం సమాజం మీద చూపే ప్రభావం ఎలాంటిది?” దానికి ఆవిడ చాలా animated అయిపోతూ, తల అడ్డంగా ఆడిస్తూ ఇలా అన్నారు:

 “నాటకం చూడగానే తల్లిదండ్రులు ఎవరైనా ఇంటికి పరిగెత్తుకెళ్ళి ఇలాంటి సమస్యలున్న వారిని ఆసుపత్రికి తీసుకెళ్తారని నేను అనుకోను. సాహిత్యం అలా పని చేయదు. Art can’t ever claim to be helpful.”

సమాజానికి, సాహిత్యానికి మధ్య సంబంధం గురించిన మరో ప్రశ్నకి సమాధానంగా: 

“ఏదైనా విషయంలో ఒక్కోసారి సమాజం ముందుంటే, ఒక్కోసారి సాహిత్యం ఉండచ్చు. ఆ విషయమై ఎక్కువ సాహిత్యం వస్తున్నంత మాత్రాన సమాజ దృక్పథం కూడా మారిపోతుందనేం లేదు. రాకపోయినంత మాత్రనా సమాజానికి అవగాహన లేనట్టు కాదు.”

ఇట్లాంటివి విని వచ్చాక తెలుగు సాహిత్యపు ఉదాసీన చర్చ(?)లు వింటుంటే భలే నీరసమొస్తుంది. అయినా ఆవిడిచ్చిన ఉత్సాహంతో ఇది రాస్తున్నాను. 

శాంతగారు అన్నట్టు సాహిత్యం చేసే సహాయం ఎలా అయితే 108 నెం. కి కాల్ చేయగానే వచ్చే ఆంబులెన్స్ లాంటిది కాదో, సాహిత్యం చదవడం వల్ల, దాని గురించి సంభాషించుకోవడం వల్ల, చర్చించుకోవడం వల్ల మనం నేర్చుకునేది కూడా అంత immediate and tangible అయితే కాదు.  అదో రాంక్ కార్డ్, స్కోర్ కార్డ్ కాదు. అలా అని అదొక “learning process” కాదు అంటే కూడా నేను ఒప్పుకోను. నిన్న ఫేస్‍బుక్‍లో చైతన్య దీని గురించి భారీ స్థాయిలో ఆవేశపడ్డాడు. కొన్ని అత్యవసరమైన ప్రశ్నలు లేవదీశాడు. (ఆ పోస్ట్ ఫేస్‍బుక్‍లో ఉంది.) ఇప్పుడు నేను రాస్తున్నది అచ్చంగా దానికి సమాధానం (answer) కాదు. ఒక స్పందన (response) మాత్రమే. నా వ్యక్తిగత అనుభవం మాత్రమే –  in all its incoherence, inefficiency and inarticulation!

అయితే, అసలు టాపిక్ మొదలెట్టే ముందు ఇక్కడ గమనించుకోవాల్సిన విషయాలు కొన్ని: 

 1. ఈ వ్యాసంలో నేను “learning” అనే పదాన్ని నేర్చుకోవడం, తెల్సుకోవడం అనే రెండు అర్థాల్లోనూ వాడబోతున్నాను. రెంటికీ తేడా ఏంటంటే
  1.  నేర్చుకున్నది అచ్చంగానో, కొద్దిమార్పులతో మళ్ళీ ప్రయోగించచ్చు. ఉదా: ఒక కొత్తపదమో, పదబంధమో. 
  2. తెల్సుకున్నదానికి ఆ utilitarian value ఉండచ్చు, ఉండకపోవచ్చు. ఉదా: “I’ve learnt that you’ve been away from home.”
 2. నేను మోడస్టీ గీడస్టీ కాసేపు పక్కకు పెడితే, సాహిత్యాన్నే కాదు, ప్రపంచాన్ని చూసే విధానంలోనూ, దాన్ని తిని అరాయించుకునే విషయంలోనూ నేను ప్రత్యేకం.
  1. ఉదాహరణ: స్వాతి, మెహర్‍లు రాసేవి నేను గత పదేళ్ళుగా చదువుతున్నాను. వాటిలో కొన్ని అంశాలు నన్ను అంతగా ఆకట్టుకోకపోవచ్చు, కొన్నింటితో పేచీలు కూడా ఉండచ్చు. నేను చదివే తెలుగు, ఇంగ్లీషు సమకాలీన సాహిత్యంలో నా దృష్టిలో వాళ్ళు టాప్ స్ఫాట్‍లో ఉండచ్చు, ఉండకపోవచ్చు. కానీ వాళ్ళు పడుతున్న గొడవేంటో అన్న క్యూరియాసిటీ నాకెప్పుడూ ఉంటుంది. ఏం రాస్తున్నారు, ఎలా రాస్తున్నారు అన్నదాని మీద ఒక కన్నేసే ఉంచుతాను. అది నా నైజం. 
  2. అట్లా నేను కన్నేయని కథలు, కవితలూ కూడా బోలెడు వస్తుంటాయి కదా, అన్నింటినీ చదివే ఓపిక ఉండదు. కానీ, ఒకవేళ చదవడం జరిగితే, “నాకేం చెప్పగలరు వీళ్ళు?” అన్న dismissive attitudeతో అయితే నేను చదవను. నేను ఒక మనిషితో transactional exchangesకి మించి మాట్లాడుతున్నానంటే, ఒక పుస్తకం చదువుకోడానికి ఎన్నుకున్నానంటే వాళ్ళనుంచి తెల్సుకునేది, నేర్చుకునేది ఉందని నమ్ముతాను. వాళ్ళు ఎవరైనా, ఏమైనా.
 3. “అనవసరంగా టెక్నాలజి ఎక్కువుంటుంది నీ కథల్లో! ఇంగ్లీషు ఎందుకంత వాడ్డం?”, “నాలుగుసార్లు చదివినా అర్థంకావు ఆమె రాసేవి” అన్న స్టేట్మెంట్స్ ఇచ్చి మొహం మీద తలుపేసేసేవాళ్ళ నుంచి కూడా నేర్చుకునేది ఉంటుంది. “నువ్వు రాసినవాటిని గురించి అంటున్నారని ఏడ్వడం కాదు, నువ్విలా ఇంకొకరి expressionని కొట్టిపారేయకు,” అని గుర్తుపెట్టుకోవచ్చు.  
 4. నే రాసిన కథలు పొరపాటున ఎవరన్నా చదవడమే కాక మళ్ళొచ్చి వాటి మీద చర్చ పెట్టడం మహా అరుదు. కానీ, అట్లాంటప్పుడు నేను గమనించింది ఒకటుంది. “నాకు కథలో ఫలానా ఫలనా నచ్చలేదు, దాన్ని ఇలా ఇలా రాసుంటే బాగుండేది,” అన్న దగ్గర ఆగరు. “నువ్వు ఒప్పుకో ఆ ఫలనా బాలేదనీ, ఇలా ఎందుకు రాయలేకపోయాననీ ఫీల్ అవ్వు” అన్న బలవంతం ప్రతిధ్వనిస్తుంది. 
  1. ఉదాహరణకి: “కెరీర్ ఓరియంటడ్ మాన్” కథని అటు మాట్రియార్కీలో నలుగుతున్న మగాడు గురించి కాకుండా, ఇటు పాట్రియార్కీలో మగ్గుతున్న ఆడదాని గురించి కాకుండా, ఒక screwed up premise (the patriarchy is intact with all its glory and ugliness, but the power lies with women – with no plausible explanations within the story for the shift in power) పెట్టుకుని రాసి ఏం లాభమని ఒకరికి అనిపించచ్చు. ఆ ముక్క నాతో అన్నప్పుడు నాకూ, “హమ్మ్… ఆలోచించచ్చు దీని గురించి” అనిపిస్తుంది.  అంత మాత్రం చేత నేను రాసిన కథ తప్పైపోదు, అనవసరమైపోదు, అర్థరహితమైపోదు. నేను దాన్ని disown చేసుకోవాలా అనేంత మదనపడనక్కర్లేదు. However fucked up the premise maybe, I pulled off the story within its realms. 
  2. ఓ కథ రాయడానికి నా బుర్రలో ఒక వంద న్యూరాన్స్ మధ్య కనెక్షన్స్ ఏర్పడుంటే, “ఇదో screwed up premise కాదా?” అన్న కామెంట్ నూట ఒకటో న్యూరాన్‍కి కనెక్షన్ ఏర్పడేలా చేయచ్చు. ఆ కనెక్షన్ నాకు అప్పటికప్పుడు ఉపయోగపడుతుందనో, లేదా వెంటనే కథని వెనక్కి తీసుకునేలా చేస్తుందనో అనుకోను.  ఇది ఇంకెప్పుడో, ఇంకెలానో అక్కరకు వస్తుంది. అది కథ రాసేటప్పుడే జరుగుతుందనేం లేదు, ఏ కోడింగ్ చేసేటప్పుడో వెలగచ్చు.  That’s the charm of the human brain. It works in an incredulous fashion.  
  3. అందుకే నేను ఈ కామెంట్‍ని ఒక learning opportunityగా చూస్తాను. పాయింట్ లేవదీసిన మనిషికి థాంక్స్ చెప్పుకుంటాను. కానీ పైకి మాత్రం “అవును, నేను తప్పు చేశాను. అనవసరంగా అలా రాశాను” అని అనను కనుక వాళ్ళకి నాకు పొగరు, విమర్శను తీసుకోలేను టైపు అభిప్రాయాలు కలగచ్చు. దానికి నేనేం చేయగలను? ఇట్లాంటి బలవంతపు రుద్దుళ్ళు  ఇంతకు ముందూ అయ్యాయి. “వీలైతే నేను రాసినవి చదవకండి, చదివినా దయచేసి నా దగ్గర వాటిని ప్రస్తావించకండి, పోయి మీ వాల్‍పై రాసుకోండి” అని చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. 

ఇంత ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నేను రాయబోయేది Learning Spaces, వాటిలో hierarchies, power dynamics గురించి. వాటిని గురించి అసలెప్పుడూ తెలుగు సాహిత్యంలో ప్రస్తావన వచ్చి ఉండదు! అందుకని, మొదలెట్టే ముందు, అసలు నేను ఎక్కడ్నుంచి వస్తున్నా (where I’m coming from) అన్నది క్లియర్ చేయడానికి ప్రయత్నించాను. 

నేను వాచస్పతిని, ప్లాటోని కోట్ చేయలేను. నా అనుభవంలోంచే రాయగలను. అసలది కూడా అవసరం లేదనుకున్నాను. కానీ పొద్దుపొద్దున్నే ఒక కామెంట్‍లో “మీట్స్ అనేవి సోషల్ కనెక్షన్స్ కోసం. పుస్తకాలు అమ్ముకోవడం కోసం. ప్రాచుర్యం కోసం. తోటి రచయితలకి వసుధేంద్ర నుంచైనా ఏముంటుంది నేర్చుకోడానికి?” అన్న అభిప్రాయం చూశాక కొంచెం తల తిరిగింది. అనువాదానికి సంబంధించి రాత్రి చూసిన ఒక టాక్‍లో కొన్ని వివరణలకి మురిసిపోయిన దద్దమ్మని, బహుశా అది కూడా “మేమింత కష్టపడి అనువాదం చేశాం. మీరా మాత్రం ఒక కాపీ కొని చదవలేరా?” అన్న place నుంచే వచ్చుండచ్చని గ్రహించి, తెలుగు సాహిత్య జగత్తులో ఇదే రివాజు అని వెలిగి, “నేను పరమ తేడా కాండిడేట్‍ని మీ మధ్య” అని చెప్పడానికి ఎనిమిదొందల పదాలు ఖర్చు చేయాల్సి వచ్చింది. 😦

Learning Spaces 

ఏడాది కూడా నిండని బ్లాగానుభవాన్ని నేను “Back to school” అని అభివర్ణించుకున్నాను. ఇప్పుడు పదమూడేళ్ళు దాటుతున్నా అదే మాట. ఇదో పాఠశాలే నాకు. కానీ స్కూల్ అన్నాక బోలెడన్ని కబుర్లు ఉంటాయిగా, సిలబస్, పరీక్షలే కాకుండా. వాటిని పరికించుకునే అవకాశమిది. 

గురుశిష్య పరంపర 

తెలుసు కదా ఇదేంటో… గురువుగారి సేవలకే అంకితమై, వారి పర్యవేక్షణలో వాళ్ళు చెప్పిన విధాన నేర్చుకుని ఎల్లవేళలా వినయవినమ్రతలతో ఉండాలి. బ్లాగు మొదలెట్టిన టైమ్‍లో ఇట్లా ఉబలాటపడిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. రాస్తున్న మాకన్నా ఒక పదిహేను, ఇరవై సంవత్సరాలు పెద్దవాళ్ళు వీళ్ళు. మమల్ని under their wings తీసుకోవాలని తెగ ఉత్సాహం. అబ్బాయిలు ఈ విషయంలో పరమ స్మార్ట్ – వాళ్ళనెప్పుడూ ఆమడ దూరంలో ఉంచేవారు. అమ్మాయిల్లో కూడా కొందరు “ఎందుకీ extra నస మనకి? Extended families లో దొబ్బించుకుంటుంది చాలడం లేదా?” అని దూరం పెట్టినవాళ్ళున్నారు. కానీ నేను మాత్రం ఒక naiveityతో తిరిగేదాన్ని. అలా అని ఒక blinded trust ఎప్పుడూ లేదు. పైగా, పట్టుదొరకని అబ్బాయిలు, తప్పించుకున్న అమ్మాయిలు నా స్నేహితులే కాబట్టి వాళ్ళూ నా మీద ఓ కన్నేసి ఉంచేవారు (ఉంచుతుంటారు). డైరెక్టుగానో, ఇన్‍డైరెక్టుగానో నాకు హెచ్చరికలు వస్తూనే ఉండేవి (ఉన్నాయి). 

ఈ పద్ధతిలో ఏంటంటే నేర్పించేవాళ్ళు / తెలియజెప్పేవాళ్ళు ఎప్పుడూ ఒక అందలం (pedestal) మీదుంటారు. వాళ్ళు ఇచ్చేవాళ్ళు, మనం పుచ్చుకునేవాళ్ళు. సీను ఊహించుకోవాలంటే వాళ్ళు ఒక పీఠం మీద కూర్చుంటారు. వాళ్ళ కుడి అరచేయి కిందివైపుకి “ఇచ్చే పొజిషన్”లో ఉంటుంది. మనం కిందుండి (మోకాలిపైనో, లేదా సగం వంగో) మన అరచేతులు దోసిళ్ళు పట్టుంటాయి. ఈ సీన్ మారే సమస్యే లేదు. అంటే, ఇలా జ్ఞానం తీసుకుంటూ తీసుకుంటూ నేను జ్ఞానపీఠ్ వచ్చేంత గొప్ప రచయితని అయిపోయినా కూడా వాళ్ళు “ఈమెకే జ్ఞానపీఠ్ తెప్పించగలిగామంటే…” అని ఇంకో మెట్టు పైకి వెళ్తారే గానీ కిందకొచ్చే సమస్య లేదు. 

దీనివల్ల నేర్చుకున్నది లేదా? అంటే బోలెడుంది. సాహిత్యం సంగతి అటుంచి, జీవితంలో నడిసముద్రంలో మునిగిపోతున్నప్పుడు ఏదో పట్టుకుని తేలుతూ ఉంచే పాఠాలేవో నేర్చుకున్నాను. సాహిత్య చర్చలూ బానే జరిగేవి – అంటే, వాళ్ళు చెప్పేవాళ్ళు, నేను వింటుండేదాన్ని, but still so much to learn. దానికి బోలెడంత కృతజ్ఞతా ఉంది. కానీ ఇందులో ఉన్న power dynamics నన్ను ఇబ్బంది పెట్టడం మొదలెట్టాక నేను మొహమాటం లేకుండా దూరంగా జరగడం మొదలెట్టాను. 

ఇలా ఉబలాటపడేవాళ్ళల్లో మగవాళ్ళు ఎక్కువ. ఆడవాళ్ళూ ఉన్నారు. కానీ ఆడవాళ్ళకి, contrary to the popular opinion, సహనం తక్కువ. వాళ్ళేదో కథలెలా రాయాలి అని నాకు లెక్చర్లు ఇస్తుంటారు, నేను బుద్ధిగా ఊ కొడుతుంటాను. సడెన్‍గా ఒక “ఆరెక్స్ మారేజ్” పబ్లిష్ చేస్తాను. “మేం చెప్పిందేంటి, నువ్వు రాసిందేంటి?” అని ఊగిపోతారు. నేను మళ్ళీ ఊ కొడతాను. చిర్రెత్తి సౌమ్య దగ్గరకి పోయి పంచాయితి పెడతారు, “నువ్వన్నా చెప్పలేవా?” ఆ అమ్మాయి, “నేను చదవనే చదవను ఆ కథలు” అన్నాక గత్యంతరం లేక నన్ను ఫేస్‍బుక్‍లో బ్లాక్ చేస్తారు. కథ అయిపోతుంది. 

మగాళ్ళు అట్లా కాదు. కథా, పాయింట్ ఆఫ్ వ్యూ, వంకాయ ఇవ్వేమీ కూడా అక్కర్లేదు. ఇట్లాంటి ఒక పోస్టు చాలన్న మాట. 

దీని గురించి నాకో లెక్చర్ సెషన్ ఉంటుంది. సచిన్ కవర్ డ్రైవ్ ఎందుకు గొప్పది కాదు, ఎందుకు కొట్టలేడు, రోజర్ బాక్‍హాండ్‍తో ఎందుకు పోల్చకూడదు – Interminable mansplaining! ఇందులో లేవా నేర్చుకోడానికి అంటే ఉన్నాయి – బాట్స్ మెన్ ఎత్తు బట్టి షాట్‍ని మలిచే విధానం ఎలా మారుతుంది వగైరా. But I don’t want it. Not at least in this context. And note the date there. By then, I’m already in my early thirties. I’ve been following Sachin from the age of 6 and Roger from my early twenties! I’ll have some ideas about them? Have you heard of “benefit of doubt”? Gimme that, at least?  

ఈ గోలే కాకుండా, అప్పట్లో నాకు తెలీలేదు కానీ, a lot of casual toxicism and sexism used to creep into these conversations. నాకవి ఆ క్షణంలో తట్టేవి కావు. తట్టాక కూడా కోపమొచ్చేది కాదు, అయోమయంగా, గందరగోళంగా అనిపించేది. “నాకు నచ్చటం లేదిది” అని చెప్పేంతటి space నాకుందనిపించలేదు. కానీ మరెవరికో జరిగిన ఘటన నా కళ్ళు తెరిపించింది. ఆ మరెవరి స్థానంలో నేను ఉండకుండా flukeలో తప్పించుకున్నానని అర్థమైంది. అప్పుడు కోపం తన్నుకొచ్చింది. వాళ్ళ మీదకన్నా నా మీద కోపం. నేను ఎప్పటికప్పుడు ఆ sexist, discriminatory comments ని తిప్పికొట్టలేదని కోపం. ఉదాహరణగా చెప్పాలంటే, నేను వెల్లుల్లి తింటాను అన్నదాని మీద ఊరికే కామెంట్స్. మరి ఒక meat-eating casteలో పుట్టి కూడా నేను మాంసం తినను కాబట్టి, నన్ను ఎత్తిపొడవడానికి ఇది దొడ్డిదారేమోనని నాకప్పుడు అనిపించలేదు. నేను నవ్వేసి ఊరుకునేదాన్ని. పైగా నాకు కొత్తిమ్మీర కూడా ఇష్టమని చెప్పేదాన్ని. అంతకన్నా ఎక్కువ ఆలోచించలేదు. But the topic of garlic is there for a reason! 

I love MY garlic.  Equate that to meat-eating. Equate that to beef-eating. Equate that to cannibalism. Equate that to పంచమహాపాతకాలు. I don’t give a hoot. I LOVE MY GARLIC! 

ఇది చాలా సిల్లీ విషయంగా అనిపించచ్చు. కానీ ఇదే ఇంత తిక్కరేపితే ఇంక జరిగిన bodyshaming, language-shaming, culture-shaming గురించి ఇప్పుడు చెప్పుకుని ఏడ్చే ఓపికలేదు. నేను ఐఐటిలలో చదవలేదు కాబట్టి నాకు ఫలనా సాహిత్యం చదవడం రాదని డిసైడ్ చేసేసేవాళ్ళు. కొన్ని పుస్తకాల గురించి అడిగినప్పుడు, “ఆ… అది మీరు చదవలేరులెండి” అనేవారు. “మీరు బయటకెళ్ళి పెద్ద యూనివర్సిటీలలో చదువుకోలేదుగా, మీకు అర్థం కావులే discourses ఎలా నడపాలో, critique ఎలా చేయాలో” అని మొహం మీదే అనేవారు. వీటన్నింటినీ పక్కకు పెట్టినా నాకు పూర్తిగా తిక్క పుట్టించే మాటలు: 

 1. ఫిక్షన్ escapistల కోసం. అందులో ఏం ఉండదు నేర్చుకోడానికి, కేవలం టైమ్-పాస్. నాన్-ఫిక్షన్ చదవడమే అసలైన సాహిత్య పఠనం. 
 2. తెలుగులో కుప్పలుతెప్పలుగా కథలూ, కవితలూ వస్తున్నాయి. సాహిత్య వ్యాసాలు రావడం లేదు. విమర్శ రావడం లేదు. రాస్తే అవి రాయాలి. 
 3. అసలు రాయడమనేదే దండుగ పని. రాయాల్సిందంతా ఎవరో ఎప్పుడో రాసేశారు. 

ఇవి మామూలుగా కూడా వినిపించే మాటలే. కానీ నాతో అనేటప్పుడు అంతర్లీనంగా, “మిమ్మల్ని కాదులెండి. మీరంతకన్నా ఏం చదవగలరు? రాయగలరు?” అన్న అర్థం ధ్వనించేది. ఈ మూడు ముక్కలకీ మాత్రం నేను తల అడ్డంగా ఆడిస్తూ ఒప్పుకోనంటే ఒప్పుకోను అనేదాన్ని. నేను చదవాలనుకున్నవి చదివాను, వాటి మీద రాయాలి అనిపించినట్టు రాశాను. I take immense pride in being a fiction writer! కామెడీగా, ఏళ్ళు గడిచేకొద్దీ ఇలా అనేవాళ్ళల్లో కొందరు ఫిక్షన్ చదివారు, కథలు రాశారు! ఎందుకో మరి. 🙂 రాయడానికేం లేదంటూనే ఫేస్‍బుక్‍లో మాత్రం పరమ ఆక్టివ్‍గా ఉంటారు. మరి అవి ఆల్రెడీ ఎవరో ఎప్పుడో చెప్పేసి లేరా? 😛

ఇట్లా బాగా చేతులు కాల్చుకున్నాక బుద్ధి వచ్చి నేనిప్పుడు మహా జాగ్రత్తగా ఉంటున్నానన్న మాట. ఈ mansplainingతో జీవితం మీద విరక్తి వస్తుంటుంది అప్పుడప్పుడూ. ఆఫీసులో కూడా అలాంటి సందర్భాలుంటాయి – కానీ అలాంటిదేదో జరుగుతుండగానే నా మొహంలోనో గొంతులోనో కోపం పసిగడతారు కాబట్టి వెనక్కి తగ్గుతారు. వాళ్ళు అచ్చంగా ఇంజినీర్లే కాబట్టి “ఓహ్…ఈ మనిషికి నచ్చడం లేదు” అని స్పృహ కలుగుతుంటుంది వాళ్ళకి. 🙂 కానీ ఈ సాహిత్యలోకంలో ఆ మాత్రం ఆశ పడ్డానికీ లేదు. చిరాకుపడుతూ, విసుక్కుంటూ ఫేస్‍బుక్‍లో రిప్లైలు ఇచ్చినా, మీమ్స్ షేర్ చేసినా మళ్ళీ మళ్ళీ అదే వ్యవహారం. 

నా స్పేస్‍ని, నా అనుభవాన్ని, నా విద్వత్తునీ నిరాకరించే, కొట్టిపారేసే ఏ learning నాకు అవసరం లేదని నిశ్చయించుకున్నాను. I better be poorer in terms of intellect and wisdom than be robbed of myself. నాకన్నా తక్కువ వయసు ఉన్నవాళ్ళతో ఉన్నప్పుడు ఈ పాడు toxicity అంతా నాకు తెలీకుండా కూడా creep అవుతుందేమోనని నేను జాగ్రత్తగా ఉంటాను. కానీ దాన్ని అలుసుగా తీసుకుని కూసే పిల్లకాయలూ (toxicity doesn’t honor gender or class or age or anything for that matter) ఉంటారుగా. అప్పుడు మాత్రం మరో ఆలోచన లేకుండా, చేయి వెనక్కి మెలిపెట్టి, “You better behave well, kid!” అని నవ్వుతూ చెప్పక తప్పటం లేదు. 

Workshop Model

ఇట్లా ఓ ఏడేళ్ళు ఆన్‍లైన్ స్కూల్ నడిచాక బెంగళూరికి వచ్చాను. ఏదో ఒక కెఫెలో ఎవరో ఏదో మాట్లాడుకుంటూ ఒక చోట అటకాయించారు. నేను “Bertha Mason” అని అందించాను. తర్వాత కాసేపు ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ ని, నేను నా ఫ్రెండ్స్ ని వదిలేసి Jane Eyre గురించి మాట్లాడుకున్నాం. నాకది ప్రత్యేకానుభవం. నాకు తెల్సిన సాహిత్యాభిమానులు అందరూ ఆన్‍లైన్ పరిచయం అయిన వాళ్ళే. ఎప్పుడో ఒకసారి కల్సుకున్నా ఎక్కువ మాటలు చాట్స్ లోనే. ఇట్లా అచ్చంగా ఒక మనిషి ఎదురుగా ఉండి, కాసేపు అచ్చంగా సాహిత్యమే మాట్లాడుకుని తర్వాత ఎవరి దారినవాళ్లు వెళ్ళిపోవడం నాకు పిచ్చపిచ్చగా నచ్చేసింది. ఆ వెంటనే వర్క్ షాపులు చేయాలని నిశ్చయించుకున్నాను. 

కానీ నాకు వర్క్ షాపుల్లో ఏం చేస్తారో తెలీదు. చేరాక తెల్సింది – వర్క్ చేయాలని. Learning through doing అని. నేను వాళ్ళు చెప్పినవి నోట్స్ రాసుకుంటే సరిపోతుందనే అపోహలో చేరాను. వాళ్ళు నాచేత పిచ్చ పని చేయించారు. ఒక రైటింగ్ వర్క్ షాప్ సెషన్‍కి వెళ్ళేముందు ఇన్ని చేసుకుని వెళ్ళాలి:

 1. ఆ వారానికి ఇచ్చిన టాపిక్ మీద కథ రాయడం. (అదో, అలా ఎవరో రాయమంటే రాసేది సాహిత్యం కాదు అన్న ఏడుపు అందుకోనక్కర్లేదు ఇంతలోనే. అలా రాసినవన్నీ అచ్చేయమని వాళ్ళేం పీకల మీద కూర్చోరు. అదో exercise అంతే) 
 2. ఆరు-ఏడుగురుండే బాచ్‍ చేసిన సబ్మిషన్లన్నీ క్షుణ్ణంగా చదివి క్రిటీక్ చేయడం. (అంటే, నాకు క్రికెట్ నచ్చదు కాబట్టి నేను కథ చదవను, లేదూ ఇందులో బోలెడు సెక్స్ సీన్స్ ఉన్నాయి, మా అమ్మ కొడుతుంది ఇట్లాంటివి చదివితే అన్న వంకలేం పెట్టకుండా అవతలివాళ్ళు ఏం రాసినా, ఎట్లా రాసినా దాన్ని తీసిపారేయకుండా అందులో what’s working, what’s not working, దాన్ని ఎలా మెరుగుపర్చచ్చు అని క్రిటీక్ రాయాలి.)   
 3. పేరుపొందిన కథలో, నవలల్లోని భాగాలో ఆ వారం సెషన్‍లో డిస్కస్ చేయడానికి చదువుకుని వెళ్ళాలి. ఈ పేరుపొందిన రచయితలు నోబెల్ ప్రైజ్ విన్నర్లే అయినా కూడా, రెండో పాయింట్‍లో చేసిన పనే ఇక్కడా చేయాలి: ఏం నచ్చింది ఈ రచనలో, ఏం నచ్చలేదు. ఏం నేర్చుకోవచ్చు. దేనితో విభేదిస్తున్నాము. వగైరా.

సేషన్‍లో కల్సినప్పుడు ఒక సర్కిల్‍లో కూర్చుని ఇవే మాట్లాడుకుంటాం. ఫెసిలిటేటర్ ఎంత సేపు మాట్లాడతారో తక్కినవాళ్ళు అంత సేపే మాట్లాడతారు. విభేదిస్తారు. వాదులాడుతారు. చర్చ మరీ అదుపు తప్పకుండా ఉండేలా చూసుకోవడమే ఫెసిలిటేటర్ పని కాని, ఒక అందలం కూర్చుని, నాకు తెల్సిందంతా చెప్తాను, నీకేం తెలీదు కాబట్టి విను అన్నట్టుండదు. 

Hierarchies break చెయ్యటమంటే ఇదే! 

నువ్వు ఎవరైనా కానీ ఏమన్నా కానీ నేనూ-నువ్వూ అదే స్థానాన్ని, అంతే స్థలాన్నీ పంచుకోవడమంటే ఇదే! 

తొక్కలో “personal is political” అని రొడ్డుకొట్టుడు డైలాగులు కొట్టడం కాదు. ఈ ఫలనా రచయిత కథ నువ్వు మొదటిసారి చదివినా, నేను ఆయన రచనల మీద పి.హెచ్.డి చేసినా నీకూ అవకాశం వస్తుంది మాట్లాడానికి, నాకూ వస్తుంది. నేను చెప్పే పాయింట్ ఎంత విలువైనదో, నువ్వు చెప్పే పాయింట్ కూడా అంతే విలువైంది. అదీ democratic process అంటే! 

మళ్ళీ ఉదాహరణ చెప్పుకుందాం. బాలగోపాల్ రీడింగ్ గ్రూప్‍లో మేం గ్లోబలైజేషన్‍కి సంబంధించి వ్యాసాలు చదివాక, నేను పోయి, “నాకు అన్యాయమైపోయింది. అందరూ కల్సి నన్ను కార్పరేట్ బానిస చేసేశారు. పనిచేయలేక నా ఒళ్ళు హూనమైపోతుంది. ఇంత చదువూ చదివి, ఇంత జీతమూ వస్తున్నా మొగుడూ పిల్లలూ లేకపోతే మళ్ళా ఆ బాదుడు వేరు.  Women empowerment ఆ? మన్నూ మశానమా?!  ఎవడెప్పుడు ఉద్యోగంలోంచి పీకేస్తాడోనని భయం. ఎవరికీ చెప్పుకోడానికి లేదు. ఒక లేబర్ యూనియన్ లేదు. టాక్సులు మాత్రం కట్టాలి,” అనే భోరుమంటాను. Neo-liberalism, anchor castes, historical timeline of capitalism etc వాడితేనే నీకీ debateలో స్థానమని వాళ్ళు అనరు. వాటిని గ్రూప్‍లో తక్కినవాళ్ళు, ఆ అకడమిక్ బాక్‍గ్రౌండ్ లేదా ఆ vocabulary ఉన్నవాళ్ళు నా బాధని కూడా ఆ భాషలోకి తర్జుమా చేస్తారు. ఈ సెషన్స్ కి ముందే మేం ఆయా వ్యాసాలు చదువుకుని వెళ్ళాలి. నేనసలు అంతకుముందు బాల్‍గోపాల్ పేరు వినడం తప్పించి ఏం చదవలేదు. ఈ చర్చల్లో నేనొక్కదాన్నే మాటిమాటికి, “అసలు దీనికీనూ పార్టిషన్‍కీనూ సంబంధం ఉన్నట్టుంది” అని అంటాను. వాళ్ళకి అది కొత్త పాయింట్.  వాళ్ళు చెప్పేవి నాకు కొత్త. నేర్చుకోడమంటే ఇదే! 

ఈ అనుభవాన్ని నాకిచ్చిన spacesని ఇలా విభజించుకోవచ్చు: 

 1. డబ్బులు కట్టిన వర్క్ షాపులు – సాహిత్యం, పెయింటింగ్, సైకాలజి, థియటర్ (మీడియం: ఇంగ్లీష్)
 2. డబ్బులేం కట్టనవసరం లేని రీడింగ్ గ్రూప్స్, కమ్యూనిటి వాట్సాప్ గ్రూప్స్ (మీడియం: ఇంగ్లీష్) 
 3. కొందరి స్నేహితులతో సుధీర్ఘ సంభాషణలు (మీడియం: తెలుగు, ఇంగ్లీష్.)

ఓ రకంగా ఈ మూడో పాయింట్ కోసమే ఈ మొత్తం ఆర్టికల్ రాశాను. నాకింకా ఆశ మిగిలి ఉందని చెప్పడానికే రాసుకుంటున్నాను. ఈ పాయింట్‍లో ఉన్నవాళ్ళంతా తెలుగబ్బాయిలే. తెలుగులో రాస్తున్న, రాయగల, రాయాలనుకుంటున్నవారే. ప్రపంచ సాహిత్యం బాగా చదివినవాళ్ళు. ప్రపంచాన్ని చదవడానికి నానా రకాలుగా ప్రయత్నిస్తున్నవాళ్ళు. అందరూ నాకన్నా కనీసం ఏడెనిమిదేళ్ళు చిన్నవాళ్ళు. “బడీ హూఁ బోల్‍కె జాదా భావ్ నక్కొ దెవ్.. ఉత్తా సీన్ నయ్యె మేరెకొ…” (పెద్దదాన్ని అని నాకేం ఎక్కువ విలువ ఇవ్వకు, నాకంత సీన్ లేదు) అని వీళ్ళకి ముందే చెప్పేసి పెడతా. మెల్లిమెల్లిగా వాళ్ళకీ ఆ పాయింట్ అర్థమవుతుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ గుర్తుచేయక్కర్లేదు. 😛 

ఏదైనా టాపిక్ మీద ఇద్దరికీ ఎంచుమించుగా అంతే అవగాహన ఉంటే “నువ్వు నీ పాయింట్ చెప్పు, నేను నాది చెప్తా” అంటూ సాగుతుంది. కానీ ఇద్దరిలో ఒకరు subject matter expert అయినప్పుడు invariably లెక్చర్ మోడ్ మొదలవ్వక తప్పదు. అప్పుడు అవతలి మనిషి గడగడా ఓ అరగంటో, గంటో మాట్లాడుతూ పోతారు. నేను శ్రద్ధగా వింటూ నోట్స్ తీసుకుంటుంటాను. కాసేపటికి లెక్చర్ అయిపోతుంది. కానీ మజా అప్పుడే మొదలవుతుంది. 

లెక్చర్‍లో ఏముంటుంది మామూలుగా? ఏదైనా టాపిక్ మీద ఆల్రెడీ ఎవరో రాసినవీ, అన్నవీ, వాటిని అర్థం చేసుకోడానికి చేసిన ప్రయత్నాలు, ఆ ప్రయత్నాల్లో లోటుపాట్లు. ఉదా: మహాభారతాన్ని గత శతాబ్దంలో రచయితలు/కవులు ఎలా తమ కథావస్తువుగా తీసుకున్నారు, దానితో ఏమేం చేశారు అన్నది టాపిక్ అయితే బోలెడన్ని పుస్తకాలు, రిఫరెన్సులు, థియరీలు, కాంట్రవర్సీలు వీటి గురించి ఉంటాయి లెక్చర్‍లో. కానీ అది అయిపోయాక, ఈ లెక్చర్ ఇచ్చిన మనిషి ఆ పోడియం నుండి దిగిపోయాక, ఇన్ని సంగతులు చెప్పగల మనిషీ, ఇప్పుడిప్పుడే వాటిని తెల్సుకున్న నేనూ తీరిగ్గా కూర్చుని మహాభారతాన్ని మాకు తోచిన రీతిలో గీకి పీకచ్చు. దాంట్లో, “అసలు ధర్మరాజుకెందుకంత ప్రాముఖ్యత? నాకు భలే చిరాకు” అని నేనంటే అసలు మహాభారత ఏ ఉద్దేశ్యంతో రాశారన్న వాదన ఉందో, దానికి అనుగుణంగా ధర్మరాజు ఎందుకు హీరో ఆఫ్ ది టెక్స్ట్ అన్నది వాళ్ళు చెప్పచ్చు. లేదూ, ద్రౌపది గురించి మాట్లాడుకుంటూ, “అసలు ద్రౌపదికి బాల్యం లేదు. బాల్యమే లేని మనిషి మనసు, మెదడు వేరుగా పనిజేయచ్చునని మనం మర్చిపోకూడదు” అని నేనంటే ఇద్దరం కాసేపు ఆలోచించి దానితో ఎలా కుస్తీ పట్టాలో తెలీక వదిలేయచ్చు.

పాఠకుడిలో సహృదయతో తొక్కో ఎలా ఉండాలి, ఏం చేస్తే వస్తుందో నాకు తెలీదు. విమర్శకులు అనేవాళ్ళు లేరు, ఆ లేబుల్ తగిలించుకున్నవాళ్ళు తప్ప. కానీ ఒక మనిషిగా ఇంకో మనిషికి స్పందన ఇవ్వచ్చు మనస్పూర్తిగా, నిండుగా. మనిషికి మనిషిగా స్పందించలేనప్పుడు సాహిత్యానికేం స్పందిస్తాం? ముందు ఉండాల్సినవి pre-requisites: 

 1.  అవతలి మనిషి ఎవరైనా, ఏమైనా, ఏం కాకున్నా, వారికి గౌరవం ఇవ్వగలగాలి. వాళ్ళ చెప్పేదాంట్లోనూ విలువ ఉండే అవకాశముండచ్చునని నమ్మాలి. 
 2. మనకన్నా అవతలి వాళ్ళు ఎంత వేరుగా, విరుద్ధంగా, విపరీతంగా ఉంటే మనకి తెల్సొచ్చేవి అంత ఎక్కువగా ఉండే అవకాశముంది. 
  1. ఉదా: ఒకసారి సాయి పద్మగారు ఏదో బుక్ అడిగితే, నేను పైరేటెడ్ కాపీ చదివాను, మీకు ఒకేనా మరి? అని అడిగాను. దానికి ఆవిడ, “నేను చూసే సినిమాలన్నీ అవే. థియటర్‍కి వెళ్ళలేను కదా!” అన్నారు. అప్పటినుంచి నేను ఎప్పుడు సినిమా హాల్‍కి వెళ్ళినా, ముఖ్యంగా టికెట్ చూపించి, సీట్ వరకూ వెళ్ళే సమయంలో ఖచ్చితంగా ఈ దారిలో వీల్‍చెయిర్ నడుస్తుందా? అన్న ఆలోచిస్తాను. చాలాసార్లు, సాధ్యపడదు అనే సమాధానమే వస్తుంది. మనసు నొచ్చుకుంటుంది. మరి దీన్ని “ఇదేం నేర్చుకోవడం? నువ్వేమైనా wheelchair friendly interiors మీద పని చేయడం మొదలెట్టావా? లేదా కనీసం ఓ  కథన్నా రాశావా?” అని విసుక్కోవచ్చు. కానీ నేను మొదట్నుంచీ చెప్తుందదే. This space of a cinema hall, which I can get access to with a few bucks, is inaccessible to a few even if they pay the same amount. నాకది చాలా విలువైన పాఠం. అది నా privilegesని చెప్తుంది, system మొత్తం నాలాంటి privileges ఉన్నవాళ్ళ చుట్టూనే ఎందుకు తిరుగుతుందో చెప్తుంది. 
  2. అలా అని అందర్నీ భరించలేం. “మీరు ముస్లిములకి వ్యతిరేకంగా కుట్ర పన్ని నా పుస్తకాన్ని తొక్కేస్తున్నారు” అని ఏ ఆధారం లేకుండా నా మీద నింద వేశాక, నా గౌరవం ఒకసారి పోగొట్టుకున్నాక సహృదయతా, తొక్కా నేనేం చూపించను. 
 3. మనమంతా perenially work-in-progressలం. ఈ పూట మాట్లాడుకోడానికి ఇప్పటివరకూ తెల్సినదానితో మాట్లాడుకోవచ్చు గానీ, అదేం రాయి మీద రాసిన శాసనం కానక్కర్లేదు. పొద్దున్న లేచి మళ్ళీ కొంచెం అడ్జస్ట్ అయి మళ్ళీ సర్దుకోవచ్చు. ఉమ్ము  పెట్టి పలక మీద రాసింది చెరుపుకోవచ్చు. 🙂 ఎవరూ కొట్టరు. అందుకని వాదోపవాదాలని, కథలు నచ్చడమూ నచ్చకపోవడాన్ని మనకి ఆపాదించుకోలేం. నదిలో ఒకటే నీటిలో రెండు సార్లు మునకలేయలేం అన్నట్టే ఇది కూడా. 
 4. మనం నేర్చుకునేవి, తెల్సుకునేవి అన్నీ consciousగా ఏం చేయం. కానీ ప్రతి రాత్రి పడుకునేముందు “ఇవ్వాళ నేను నేర్చుకున్న రెండు కొత్త సంగతులు” అని నిజాయితీగా రాసుకుంటే ఎన్నెన్ని సంగతులు బయటపడతాయో చెప్పలేము. This is my learning అని గుర్తించడం కూడా ఒక learning. 
 5. నేర్చుకోవడం గురించి ఇంత మాట్లాడుకున్నాక, Randy Pausch ని , ముఖ్యంగా Head Fake learning,  తల్చుకోకుండా  నేనుండలేను: https://aksharf.com/2008/09/14/the-last-lecture

“We’re all learning,” అని నేను గట్టిగానే నమ్ముతాను. వసుధేంద్రనుంచీ నేర్చుకోవచ్చు, ఇంకా కథ రాయని కొత్త కుర్రాడినుంచీ నేర్చుకోవచ్చు. If we’re a bit open-minded!

నేను హాజరైన ఒకే ఒక్క తెలుగు సమావేశం సాయి పాపినేని నిర్వహించిన “హిస్టారికల్ ఫిక్షన్” వర్క్ షాప్. అందులో కూడా పదేసి గంటల సేపు లెక్చర్లే నడిచాయి. నేను అన్నీ అంటే అన్నీ విన్నాను. అట్లా అన్ని విషయాలని బుర్రలోకి ఒకసారే కుక్కడాన్ని cramming అంటారు. ఆ రోజు చెప్పిన చాలా సంగతులు మర్చిపోయానెప్పుడో. అది హాజరవ్వకున్నా బుద్ధిపుట్టినప్పుడు ఎప్పుడో చారిత్రక కథలేవో రాసుండేదాన్ని. కానీ ఆ కార్యశాల వల్ల నాకు బాగా తెల్సొచ్చిన సంగతి ఏంటంటే, చరిత్ర అంటే పెద్దపెద్ద ఘటనలు, యుద్ధాలు, రాజులే కాదు, local histories కూడా చాలా ముఖ్యం. అవ్వన్నీ పుక్కిట పురాణాలు కావు, కాకమ్మ కథలు కావు. Genuine histories. నేను వాటిని గుర్తించడం మొదలెట్టాను. వాటి గురించి ఆలోచించడం మొదలెట్టాను. కథ రాస్తానో లేదో, రాస్తే ఎప్పటికి రాస్తానో తెలీదు, కానీ నేనెప్పటికీ చరిత్రని un-see or overlook చేయలేను ఇంక. I’ve lost that inability now. That for me is a learning for a life!  

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s