Writing & Loneliness

Posted by

“Sometimes, it is important to look back, Purnima!” అని మా మానేజర్ ఉద్ఘాటించారు, ఈ ఏడు జరిగిన appraisal meetingలో. కోవిడ్ ఉంది కనుక ఈసారి జీతాలు గట్రా ఎక్కువ పెంచరనుకున్నా కానీ నాకు బానే పెంచారు. అయినా కూడా నేను పోయినేడాది ప్రమోషన్ వచ్చినప్పుడు “ఓహ్… నైస్!” అని చప్పరించి వదిలేసినట్టే ఈ ఏడాది కూడా స్పందిస్తుంటే, నాలో కాస్తైనా ఉత్సాహం తెప్పించడానికి ఈ కంపెనీ జాయిన్ అయిన దగ్గర్నుంచీ నా కెరీర్ గ్రాఫ్ ఎలా పెరిగిందో స్పష్టం చేసే స్టాట్స్ ఓపెన్ చేసి చూపించారు. “మొదటి రెండేళ్ళు నువ్వు విపరీతంగా స్ట్రెస్ అయ్యావ్, కాదనను. అయినా, ఆరేడేళ్ళు పట్టేసే ప్రోగ్రస్ నువ్వు సగం సమయంలో సాధించావ్. అది గొప్ప విషయం!” అని నొక్కి వక్కాణించారు. మీటింగ్ రూమ్‍లో మేమిద్దరం ఉండుంటే నా మొహంలోని కవళికలు చూసి ఆయన నిరాశపడుండేవారేమో, ఇది ఆడియో కాల్ మాత్రమే కాబట్టి, “అవును. నేను బాగా పనిజేశాను. కోవిడ్ అదీ తగ్గిపోయి అంతా మామూలైయ్యాక నేను సెలబ్రేట్ చేసుకుంటాను, ఐ విల్ ట్రావిల్ ఆండ్ సెలబ్రేట్,” అని నేనూ నొక్కి చెప్పి నమ్మించాను.

ఆ ముందు రోజే ఒక ఫ్రెండ్‍తో మాట్లాడుతుంటే, “నీవి ఫలనా ఫలనా పుస్తకం తీసుకురావాలి, అన్నీ విసిరేసినట్టున్నాయి ఇప్పుడు” అని అన్నాడు. నేను వెంటనే, “ఎవరు చదువుతారు? ఎందుకు దండగ?” టైపు మొదలెట్టాను. తిక్కరేగి సాలిడ్ ఒక రెండు గంటలు లెక్చర్ పీకాడు. నేనూ తిట్టించుకున్నాను, బుద్ధిగా. మా మానేజర్‍కి అందుబాటులో ఉన్నట్టు ఒక ఇన్ఫోగ్రాఫిక్ లేదు మా ఇద్దరి దగ్గరా – నా నిరాశనో, అతని ఆశావాదాన్నో ధృవీకరించే, తిరస్కరించే undisputable evidence ఏం లేదు.

Writing & Company


నేను రాసేవాటికి స్పందన పల్చగా ఉంటుంది. ఆ అంతంతమాత్రపు స్పందనలో మళ్ళీ నన్ను అపార్థం చేసుకుంటూ, నన్ను తక్కువ చేసి మాట్లాడే మాటలే ఎక్కువ! ఇందులో నేను “నా” అనుకునేవాళ్ళూ ఉంటారు తయారుగా. “ఆ రాశావ్‍లే… అయితే ఏంటి?” అన్న టోన్ ఇంట్లోవాళ్ళది. “రాశావ్ గానీ… ఇది మా సెన్సిబిలిటీస్ ని హర్ట్ చేస్తుంది, ఇది మా ఎస్థటిక్స్ ని గాయపరుస్తుంది,” అని సాహిత్యం ద్వారానే పరిచయమైన స్నేహితులే కంప్లైన్ చేస్తుంటారు. అదే గమనించాలిక్కడ –
“బాగుంది, బాలేదు, నచ్చింది, నచ్చలేదు”లని దాటి నిందాపూర్వకంగా మాట్లాడుతుంటారు. కానీ వేరేవాళ్ళు అలాంటివే రాసినప్పుడు మాత్రం స్పందన మారిపోతుంటుంది. ఉదా: నేను మాస్టర్‍క్లాస్.కామ్ లాంటి సైట్ గురించి మాట్లాడితే “ఏవో కాకిలెక్కలతో సాహిత్యాన్ని భ్రష్టుపట్టిస్తున్నావ్” అన్నట్టు. అదే కామన్ ఫ్రెండ్స్ లో ఇంకొకళ్ళు రికమెండ్ చేస్తే “కూల్. షీ ఇస్ వెల్ రెడ్ ఆండ్ నోస్ ది వరల్డ్!” “ఆరెక్స్ మారేజ్ లాంటివి చదవడం మా ఇంటా వంటా లేదు. సచ్ చీప్ లిటరేచర్.” అని నేను అడక్కపోయినా చెప్తారు, కానీ వీళ్ళే “కాట్ పర్సన్” లాంటి కథలు చదివి, వాటి గురించి రాస్తుంటారు.

ఇవన్నీ నాకు లెక్చర్ ఇచ్చిన మనిషికి తెలీక కాదు. అయినా నేను పూర్తిగా నిరాశానిస్పృహలలో కొట్టుకుపోయేదాకా వెళ్ళకూడదన్న తాపత్రయంలో పుట్టిన concern అది. ఆల్సో, ఇన్నేళ్ళల్లో సాహిత్యం గురించి సుధీర్ఘంగా చర్చించుకుని, కొన్ని పుస్తకాలు కలిసి కూడా చదివిన స్నేహితులున్నా కూడా నేను రాసేవి అప్పుడోసారి అప్పుడోసారి చదివో/చదవకుండానో/చదవలేకపోయో వాటి మీద జడ్జ్మెంట్స్ పాస్ చేసిన వాళ్ళే తప్ప ఇలా వాటిలో ఏదో కాస్త విలువుంది అని మాట్లాడినవాళ్ళు లేరు. కామెంట్స్ అడపాదడపా వస్తుంటాయి గానీ, ఏమో… నాకిలా underdog, anonymousగా ఉండడం అలవాటు లేని పని. నేను ఎటెళ్ళినా కాస్త పనిచేస్తే చాలు ఒక impact క్రియేట్ చేయగలుగుతాను. అవతలివాళ్ళు గుర్తించకుండా ఉండలేనంత ఇంపాక్ట్. అసలు ఏ మాత్రం పనిచేయకపోయినా, కేవలం కల్చరల్ ఈవెంట్స్ కి వెళ్ళి తోచిందేదో ఫేస్‍బుక్ లో రాస్తున్నందుకే బెంగళూర్ థియటర్ కమ్యూనిటికి నేనంటే ఒక అవగాహన ఉంది. పొగడ్తలు, external validation కోసం తాపత్రయం కాదిది. డైలాగ్ అవ్వాలంటే ఇద్దరుండాలి, ఒక్కళ్ళే మాట్లాడుకుంటే మోనోలాగ్‍కి మించి ఏమీ అవ్వదు. తెలుగు సాహిత్యంలో మాత్రం నేనెప్పటికీ, ఎంత పనిచేసినా, దాని ఇంపాక్ట్ ఎలాంటిదైనా నాకా acknowledgment అయితే రాదని స్పష్టమైపోయింది.

అలా అని రాయడం మానేయాలనుకుంటున్నానని కాదు. తెలుగులోనే రాస్తుంటాను, ఏది ఏమైనా. ఎవరేమన్నా. Though the very act of writing is an act of solitude, we do need a community to thrive as writers. కానీ అది అందరికి దక్కే భాగ్యం కాదు. 

It would be great to have some good company along the road, but the path to the peak that gives you the most beautiful sight is always a lone trek. నేనింకా ట్రెకింగ్ మొదలెట్టక ముందు ట్రెక్‍కి వెళ్ళొచ్చిన ఒక ఫ్రెండ్‍ని అడిగాను, ఎంతమంది వెళ్ళారు, కొత్తవాళ్ళతో ఎలా ఉంది అని. వాడికీ అలవాటు లేదలా ముక్కూమొహం తెలీని ఓ ఇరవై మందితో ట్రెక్‍కి వెళ్ళడం. అప్పుడు వాడు, “ఎంతమందితో వెళ్తే ఏముందిలే! Trek is about making that long path alone. చుట్టూ ఎంత మందున్నా మన నడక ఒంటరిదే!” అన్నాడు. అది విన్నాకే ట్రెకింగ్ ఎలా అయినా చేయాలి అని డిసైడ్ అయ్యాను.

ట్రెక్కింగ్ లో కూడా జడ్జమెంట్స్ ఉంటాయి, ఒక గుంపులోనే వెళ్తుంటాము కాబట్టి. ఎవరు ఎక్కువ అలసిపోతున్నారు, ఎవరికి తక్కువ చెమటపడుతుంది, ఎవరు భయపడుతూ అడుగులేస్తున్నారు, ఎవరు చకచకా దూసుకుపోతున్నారు, ఎవరెంత కాస్ట్లీ షూస్ వేసుకొచ్చారు – కొండ ఎక్కబోతున్నంత  మాత్రన మన రోజూవారి అలవాట్లు, కండిషనింగ్‍లు అన్నీ అమాంతంగా మాయమైపోవు. వాటితోనే కొండెక్కుతాం. But since it is a moderate to intense physical activity, the body is over the mind. మనకి ఆయాసమొస్తుందా, ఉత్సాహం ఉరకలేస్తుందా అన్న దాన్ని బట్టి మన వేగం ఖరారు అవుతుంది. అక్కడ ఇంకోళ్ళని ఇంప్రెస్ చేయడానికో, లేదా ఇన్‍సెక్యూరిటితో కుమిలిపోడానికో ప్రయత్నించినా కుదరదు. కుదిరినా కాసేపటివరకే! ఆ తర్వాత మళ్ళీ మన మైండ్-బాడీ (దిల్-ఒ-దిమాగ్) ఏం నిర్దేశిస్తే అదే చేయాల్సి వస్తుంది.

రాయడం, the very act of writing, కూడా అలాంటిదే. It’s what your mind-body informs you that you write. నాట్యంలోలా, నాటకప్రదర్శనలోలా రాసేటప్పుడు శరీరాన్ని అంతగా కదిలించడం ఉండదు కాబట్టి ఇది కేవలం ఒక మానసికమైన పనిలా అనిపిస్తుంది, కనిపిస్తుంది కానీ మన ప్రతీ ఆలోచనకి మనకి కనిపించని విధంగా శరీరం కదులుతుంది. ఏదైనా రచన “కదిలించింది” అని అన్నప్పుడు అది figuratively గానే కాదు, literally కూడా నిజమే! కనిపించని విధంగా మనం కదులుతాం. నేనైతే రాసేటప్పుడు, ముఖ్యంగా కథ రాసేటప్పుడు, అసలు కుదురుగా కూర్చోలేను. పేరా పేరాకి లేచి నడవాలి, లేదూ పక్కకు ఒరిగిపోవాలి, తలపట్టుకోవాలి, లేదూ ఆశ్చర్యం పట్టలేక నోటికి చేయి అడ్డుపెట్టుకోవాలి. ఒక్కో వాక్యమో, పేరానో కలిగించే భావావేశాలకి అనుగుణంగా ఏదో ఒకటి involuntarily అయిపోతుంది. అదృష్టమేమిటంటే ఇవన్నీ ఎవరూ చూసే అవకాశం లేదు కాబట్టి, నేనెన్ని డాన్సులేసేది ఎవరికీ తెలీదు. అదే, ఆఫీసు పని చేసేటప్పుడు (which can get creative in its own way) నేను గంటలు గంటలు కుర్చీలోంచి లేవను. పక్కనున్న వాళ్ళెవరో గుర్తుచేయాలి, అదింకో రకంగా నిమగ్నమవ్వడం – immersion. Equally gratifying, if I may dare to compare the two.

Understanding the process of writing through Gestalt

“నువ్వు రాసేవాటి గురించి ఇన్ని అనుమానాలు, అపనమ్మకాలు పెట్టుకుని కూడా ఇన్నెలా రాస్తున్నావో నాకు అర్థం కావడం లేదు” అని ఫ్రెండ్ విసుక్కున్నాడు కాల్‍లో. “ఎవరి గురించి ఏం పట్టదు నాకు, రాస్తున్నంత సేపూ” అని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేశాను గానీ అది ఇద్దరికీ రిటారిక్ లానే తోచింది. “రాసేటప్పుడు లేనిది, రాసేసిన తర్వాత మాత్రం ఎందుకు?” అన్న ప్రశ్నకి జవాబు రాలేదు. అందుకని కాస్త లోతుగా ఆలోచించి అసలు జరుగుతున్నది ఏంటా అని తరచి చూసుకుంటే అర్థమైంది ఇది: నేను రాసినదానికి జనాలు లైకులు కొడతారా, పొడుగుతారా, తిడతారా, అసలు నేను చెప్పాలనుకుంటున్నదాంట్లో విషయముందా, ఈ టాపిక్ మీద ఇంకా గొప్పగా రాసేవాళ్ళు ఉండకపోతారా – ఇలాంటివన్నీ రాయకముందూ, రాసేశాక వచ్చే అనుమానాలు. అంటే, కొండ ఎక్కక ముందు, దిగిపోయిన తర్వాత. ఎక్కడం మొదలెట్టాక కూడా ఒక పాయింట్ వరకూ వెనక్కి దిగి వచ్చే అవకాశం ఉంటుంది. అది దాటిపోయిన తర్వాత, ఇక ముందుకెళ్ళక తప్పదని తెల్సినప్పుడు ఎలాంటి లెక్కలకి, అనుమానలకి ఆస్కారం ఉండదు. నడుస్తూ ఉండడమే. రాస్తూ ఉండడమే. 

Gestalt* అనేది సైకాలజీలో ఒక బ్రాంచ్‍. మన ఎరుక/సృహని (awareness) అందులో మూడు లేయర్లుగా విభజించారు: 

౧) బహిర్గత క్షేత్రం (outer zone): Stimulus. అంటే చలిగాలి వీచింది, వేడి సెగ తగిలింది, చెవిలో ఎవరో గట్టిగా అరిచారు. 

౨) ఆంతరంగిక క్షేత్రం (inner zone): అంటే, మనకి మాత్రమే సొంతమైన లోకం. Sensations, tingles, feelings etc. ఒళ్ళు జివ్వుమనడం, మంట పుట్టి చేయి వెనక్కి తీసుకోవడం, చెవులు మూసుకోవడం. 

౩) మధ్యస్థ క్షేత్రం (middle zone): Constructs – making meaning of what we experience in the inner & outer zones. మనకి కలుగుతున్న అనుభవాలు, మనకి అనిపిస్తున్న భావావేశాలకి నామకరణాలు (naming) చేసి, చెడనో, మంచనో వేర్వేరు వర్గాలుగా విభజించేది (labelling) ఇక్కడే.

ఆశలు, అంచనాలు, భవిష్యత్తుని గురించి ఆలోచనలనూ అన్నీ మధ్యస్థ క్షేత్రం స్పృహ సృష్టించినవి. ఒకసారి పై నిర్వచనాలని గమనిస్తే – గాలి వీయగానే మనకి ఎలా అనిపించాలనేది మనం నిర్ణయించలేం. మన శరీర తత్వం బట్టి ఆ గాలి పుట్టించిన స్పందన మన ఆంతరంగిక క్షేత్రంలో కలుగుతుంది. హాయిగా అనిపించచ్చు లేదా చలేయచ్చు. ఇందులో మన వివేకం, విచక్షణకి ప్రమేయం ఉండదు. అయితే, చలి అనిపించాక స్వెటర్ వేసుకోవడమా, లేదా ఇంకాసేపు అలా చలిలో ఉండడమా అన్నది మధ్యస్థ క్షేత్రానికి సంబంధించిన సంగతి. అందుకే, తొలిచూపు ప్రేమలో నడిరోడ్డు మీదున్న హీరోకి వాహనాలకి మీదకొస్తున్నా పక్కకు జరగాలన్న స్పృహ ఉండదు. ఎందుకంటే, హీరోయిన్ కలిగిస్తున్న భావావేశాలు మధ్యస్థ క్షేత్రం తాలూకు స్పృహ లేకుండా చేసేంత తీవ్రంగా ఉన్నాయన్న మాట.

సినిమా హీరోకైతే డబ్బులిస్తారు కాబట్టి హిరోయిన్ ఎలా ఉన్నా ప్రేమలో పడినట్టు నటించక తప్పదు. నిజజీవితాల్లో ఏమో అట్లాంటి మనిషి కనిపించగానే మనకి లోపల గిటార్లు మోగుతున్నా “పెళ్ళైయ్యుంటాదా?”, “మనం నచ్చుతామా?”, “మన మతమేనా?”, “ఇంట్లో ఒప్పుకుంటారా?” లాంటి సవాలక్ష ప్రశ్నలు వస్తాయి. ఆ సిగ్నల్ దగ్గరే వాళ్ళతో పరిచయం తప్పిపోకపోతే ఈ మీమాంసలన్నీ తప్పవు. మన ఉన్న ప్రపంచం (the industrialized, capitalistic, consumeristic world) ఈ మధ్యస్థ క్షేత్రంలోనే మనం ఎక్కువగా ఉండేట్టు మనల్ని తయారుచేస్తుంది. ఏపిల్ ఫోన్‍ లేకపోతే జీవితం దండుగని అనిపించడానికి మార్కెట్ సృష్టించిన మాయని మనం ఒక constructగా తయారుచేసుకుని దాన్నే నమ్మడం. ఏపిల్ పోయి, రేపు బనానా వస్తే అదీ మారిపోతుంది.

సరే, మళ్ళీ మన టాపిక్‍కి. ట్రెక్ చేసేటప్పుడు, రాసేటప్పుడు మన మధ్యస్థ క్షేత్రపు స్పృహకి ఎక్కువ ఆస్కారం ఉండదు. ఏ రాయి మీద అడుగేస్తే మన బాలెన్స్ నిలుస్తుంది అన్నంత ప్రాథమికమైన నిర్ణయాలు అడుగడుక్కీ తీసుకుంటుంటాము కాబట్టి, ఒక్కో పదాన్ని తరిచి చూసుకుంటూ వాక్యం తర్వాత వాక్యం రాసుకుంటూ పోతుంటాం కాబట్టి రాయడమనేది ఇన్నర్ జోన్‍లోనే జరుగుతుంది అని నాకనిపిస్తుంది. అయితే ఏం రాయాలి, ఎలా రాయాలి అన్నది మాత్రం మిడిల్ జోన్‍లోనే జరిగే పనే! The non-writing part of writing (conceptualization) happens in the middle zone, but the very act of writing (creation) is in the inner zone! అని నాకు బలంగా అనిపిస్తుంది. నిపుణులు కాదనచ్చు, కానీ నాకైతే అలానే అనిపిస్తుంది. రైటర్స్ బ్లాక్ అంటే మనం ఆ ఇన్నర్ జోన్‍లోకి వెళ్ళలేక మిడిల్ జోన్‍లోనే కొట్టుకోవడం అని అర్థం చేసుకోవచ్చు. 

 ఒక పుస్తకంగా నా రచనల్ని తీసుకురావాలా, వద్దా అన్న ప్రశ్నకి నా మిడిల్ జోన్ సమాధానమిస్తుంది. కానీ నేనో పుస్తకాన్ని పరిచయం చేయాలా, ఒక కథ రాయాలా, ఒక ఫేస్‍బుక్ పోస్ట్ పెట్టాలా అన్నది నా ఇన్నర్ జోన్ నుంచి వస్తుంది. అందుకని నేను రాయడానికి వెనుకాడను. ఇంటర్నెట్‍లో పబ్లిష్ చేయడం నాకు డైరీలో రాసుకున్నంత సులువు, వెసులుబాటు – ఎందుకంటే నేను రాయడం మొదలెట్టిందే ఇంటర్నెట్ మీద. పుస్తకం అనగానే మాత్రం నాకు చాలా మెంటల్ బ్లాక్స్ ఉన్నాయి. పుస్తకంగా వచ్చినంత మాత్రన, ప్రస్తుతం తెలుగులో ఉన్న పరిస్థుతుల దృష్ట్యా పెద్ద లాభం లేదని నా వాదన. వాటికి విలువ ఉన్నా కూడా విలువిచ్చేవాళ్ళు పట్టుమని పదిమంది కూడా లేనప్పుడు ఎందుకని. నా సర్కిల్‍లో లేనంత మాత్రన అసలు ఉండకుండా పోతారా అన్నది ప్రతివాదన కావచ్చు. నేనలా పాజిటివ్‍గా ఆలోచించడం లేదన్నది మాత్రం నిజం. 

Looking back to look forward

లెక్చర్ ఇచ్చిన ఫ్రెండ్‍తో కాల్, మేనేజర్‍తో మీటింగ్ అయ్యి ఐదారు గంటలు కూడా కాకముందే, ఇంకో ఫ్రెండ్‍కి నేనో లిటరరీ ఫెస్ట్ లో పానెల్‍‍లో మాట్లాడానని చెప్పాను. వెంటనే, “You’ve had such an eventful last few months,” అని అన్నాడా అబ్బాయి. మా మాటల్లో సాహిత్యానికి సంబంధించిన సంగతులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చిన్నాచితకా నుంచి కాస్త చెప్పుకోదగ్గవనేవి వరకూ అన్ని కబుర్లు చెప్పుకుంటుంటాం. మా మానేజర్ అన్న “we’ve to look back sometimes” అన్నదే గుర్తొచ్చింది అతని వ్యాఖ్యలో. ఆయన చూపించిన స్టాట్స్ అంత స్పష్టత ఇచ్చే మాట కాదిది, అయినా అంతే బలంగా తాకింది. 

ఆర్టిస్టుగా, రచయితగా మనం కెరీర్ మొదలెట్టినప్పుడు ఎలాంటి స్పందన ఉండదనీ, సీసాలో సందేశం పెట్టి ఒంటరి ద్వీపం నుంచి సముద్రంలోకి వదిలేసినట్టుగానే మన పనిని/కళని కూడా వదిలేస్తుంటామని, ఎప్పటికీ సమాధానం రాకపోవచ్చుననీ అంటారు నీల్ గెమెన్, “మేక్ గుడ్ ఆర్ట్” అనే స్పీచ్‍లో. అయినా మనం పనిచేస్తూనే ఉండాలన్నది ఆయన సందేశం. మన పంపిన సీసా ఎవరి కంటైనా పడి, వాళ్ళు దాన్ని తెరిచి, పెట్టిన కాగితపు ముక్కని తీసుకుని చదవి, దానికి స్పందనగా ఒకటి రాసి ఇంకో సీసాలో పెట్టి మనకి పంపించడమనేది ఎప్పుడోగాని జరగని వింత. వాళ్ళలా పంపినా మనదాకా చేరడమనేది ఇంకో వింత.

అదే లెక్చర్‍లో ఆయనే చెప్తాడు, వదిలిన సీసాలన్నీ మళ్ళీ తనదాకా వచ్చాయని, చాలా ఎక్కువ వచ్చాయని, కానీ అలా వచ్చాయన్న సంబరాన్ని “ముందేమవుతుందోన”న్న అభద్రత మిగేసిందని. “ఎంజాయ్ ది సక్సస్” అని స్టీఫన్ కింగ్ స్వయాన చెప్పినా కూడా ఆయన ఆ సలహా పాటించలేదని, తాను చేసిన తప్పు చేయొద్దనీ మరీ మరీ చెప్తాడు. (నేను పొద్దున్ననుంచీ మూడుసార్లు విన్నాను. మొత్తం స్పీచు రాసేట్టున్నా) 

నేను వదిలిపెట్టే సీసాలని శ్రద్ధగానే వదిలిపెడుతున్నా అడపాదడపా తిరిగొస్తున్న సీసాలని అలక్ష్యం చేస్తున్నట్టున్నాను. తెలుగు పుస్తకాలకి అమ్మకాలు లేవు, ఒక ప్రొఫెషలనిజం లేదు అని విసుక్కునే నేను, నిజంగానే లక్షల కాపీలు అమ్ముడుపోయి, బోలెడంత డబ్బు, పేరు వచ్చే అవకాశముంటే వాటితో పాటు జతగా వచ్చే పోటీని, ఒత్తిడిని తట్టుకుని రాయగలుగుతానా? అంతే బాగా రాయగలుగుతానా? 

2002-03లో ఆస్ట్రేలియా సీరీస్ తర్వాత వివిఎస్ ఒక ఇంటర్వ్యూలో “I’d play cricket even if there’s no match fee!” అని అన్నాడు. అప్పుడు నేను తెగ మురిసిపోయాను. ఇప్పుడు తెలుగులో రాయడం కూడా ఫీ లేకుండా మాచ్ ఆడ్డం లాంటిదే! ఇంకా చెప్పాలంటే ఫీయే కాదు, రిఫరీ, అంపైర్, స్కోరర్ ఎవరూ లేకుండా ఆడ్డం లాంటిదే! ఇదే నా ఫ్రెండ్ నెత్తీనోరు కొట్టుకుని చెప్పాడు, “ఇంకెవ్వరో నీ పనిని గమనించే అవకాశమే లేదు. అట్లాంటి support structures మనకి లేనే లేవ”ని. అలాంటప్పుడు నేనే స్కోర్ లెక్కపెట్టుకుని, ప్రతీ యాభై పరుగులకి నేనే బాట్ ఎత్తుతూ ఉండాలి. అది నా మొడస్టీకి అడ్డని అనుకున్నా ఇన్నాళ్ళు, కానీ ఇంకెవ్వరూ లేనప్పుడు, మన వెన్ను మనమే తట్టుకోవాలి, మనకి పొగరెక్కిపోతుంటే మనమే గుర్తించుకోవాలి. Tough ask, but we have to play with the cards we’re dealt with!    

అందుకని ఇప్పట్నుంచీ ఈ బ్లాగ్‍ని ఇలాంటి మీమాంశలతో కొంచెం ఆక్టివ్‍గా ఉంచుతా, మరీ డంపింగ్ యార్డ్ లా మార్చేశాను. కామెంట్స్, పొగడ్తలు-తిట్లు ఏవైనా ఇక్కడ కూడా షేర్ చేస్తుంటాను. అందుకు ఇన్సిపిరేషన్‍గా నిలిచిన మా శిరీష్ బ్లాగ్ మీద కూడా ఒక లుక్కేయండి, it has brought back the old charm of blogging to me: http://adiunplugged.blogspot.com/ 

PS: *Gestalt గురించి ఇంగ్లీషులోనే కొంచెం తేలిగ్గా అర్థమయ్యే నాన్-అకడమిక్ బుక్స్ లేవు. అది ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్న డిసిప్లైన్ కూడా కాదు. నేనేదో నా నోట్స్ నుంచి ఆ vocabularyకి అనువాదం చేశాను. I hope the concept and my application of it was clear enough.

నీల్ గెమెన్ “మేక్ గుడ్ ఆర్ట్” వీడియో లింక్ ఇది. No matter, we shall keep making art – good or bad, let time be the jury.

3 comments

  1. మాలాంటి కొంత మంది మీరు రాసే ప్రతి వాక్యాన్ని చదువుతారని మర్చిపోవద్దు 🙂
    శిరీష్ అన్న బ్లాగు చౌరస్తా మీద గుడి లెక్క. అడ్రస్ కోసం ఎన్నేళ్ళైనా వాడుకోవచ్చు 🙂

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s