బడుగు జీవితంలో కొంత #matargashti

Posted by

నీల్ గేమెన్ “క్రియేటివ్ కంపోస్ట్” అని ఒకటి పెట్టుకోమని చెప్తారు. ఒక నోట్‍బుక్‍లో మనం చదువుతున్నవీ, ఆలోచించుకుంటున్నవీ రాసుకుంటూ పోతే అదొక compost లా పనిచేసి మన క్రియేటివికి మంచి ఎరువుని అవుతుందని ఆయన సలహా. ఇలా నోట్‍బుక్‍లు పెట్టుకుని ఎక్కడైనా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా రాసుకోడానికి రచయితలు బాగా మొహమాటపడ్డం చూశాను గానీ, ఆర్టిస్టులు మాత్రం ఎలాంటి జంకూ లేకుండా వాళ్ళ స్కెచ్ ‍బుక్ లోనో, పాకెట్ బుక్‍లోనో, ఏవీ లేకపోతే టిష్యూ పేపర్ల మీదో బొమ్మలు గీసుకుంటూ పోతారు. వాళ్ళని చూస్తే ముచ్చటేస్తుంటుంది నాకు. ముఖ్యంగా, ఫేస్‍బుక్‍లో ఈనాడు శ్రీధర్‍గారి అబ్బాయి పరిచయమైనప్పటి నుంచీ రెండు విషయాలు బలంగా తాకాయి నన్ను:

  1. శ్రీధర్‍గారి కార్టూన్లు రోజూ క్రమం తప్పకుండా వస్తుంటాయి. అయినా ఉద్యోగరిత్యా గీయాల్సిన బొమ్మలు కాకుండా, రోజూ కొన్ని గంటల ప్రాక్టీస్‍కి మాత్రమే కేటాయించి స్కెచింగ్ చేస్తారట. ఆయన ఏ రెస్టారెంట్‍కో వెళ్ళినప్పుడు ఆర్డర్ ఇచ్చి ఫుడ్ వచ్చే లోపు టిష్యూల మీదో, టేబుల్ మీద వేసిన పేపర్ల మీదో బొమ్మలు గీసేస్తుంటారు. ఒకసారి చెట్నీస్‍కి వెళ్ళి అక్కడ చట్నీలు పెట్టే గిన్నెలని ఎంత బాగా గీశారో.
  2. సిద్ధార్థ్ జర్నలిస్ట్, రాయడమంటే బాగా ఇష్టమున్న మనిషి. షూటింగ్ (స్పోర్ట్)లో ప్రవేశముంది. సీరియస్‍గా ప్రాక్టీస్ చేస్తుంటారు. కోవిడ్ లాక్‍డౌన్ అప్పుడు చాలా నెలలు ప్రాక్టీస్‍కి వెళ్ళలేకపోవడం వల్ల షాట్స్ గురి అంతా చెల్లాచెదురుగా తయారైంది. ప్రాక్టీస్ మళ్ళీ ఊపందుకున్నాక మెల్లిమెల్లిగా గురి కుదిరి, మళ్ళీ మంచి స్కోర్‍లు రావడం మొదలైయ్యాయి. ఈ ప్రోగ్రెస్ అంతా ఫోటోలతో సహా ఫేస్‍బుక్‍లో షేర్ చేసుకుంటుంటే నాకు “Write everyday”లో పరమార్థం అర్థమైంది. తుపాకి గురి తప్పిందని తెల్సినంత స్పష్టంగా రచన గురించి తెలీదు కదా! అందుకే, నొక్కి వక్కాణిస్తున్నాను. రచనా వ్యాసంగంలో లోటుపాట్లని, సాధ్యాసాధ్యాలని అర్థం చేసుకోడానికి బయటి నమూనాలు (external models) చాలా అవసరం.

సరే, నేను ఇంతకీ రాయలనుకున్నది నీల్ చెప్పిన “క్రియేటివ్ కంపోస్ట్”లానే నేనోటి తయారుచేసుకోవాలి అనుకుంటున్నాను. ఇది చెప్పడానికి కూడా నాకో మూలన పరమ ఇబ్బందిగా ఉంది, “ఆ పెద్ద పొడిచావ్‍లే, వీటివల్ల లోకానికి ఒరిగిందేమిటి?” అన్న నస ఉంది లోపల. అయినా, ఈ ఏడాదిలో గత మూడు నెలల్లో రచనా వ్యాసంగానికి సంబంధించి నాకు జరిగిన కొన్ని విశేషాలు ఇక్కడ జాగ్రత్త చేసుకోవాలి అనుకుంటున్నాను. ఒక బిజినస్ యూనిట్‍కి ఉండే quarterly reviewల్లా లేదా ఒక క్రికెట్ టీమ్‍ ఆడిన season మొత్తాన్ని రివ్యూ చేయడంలా ఇదీ అనుకోవచ్చు. పైగా “Writing & loneliness” అన్న పోస్ట్ లో రాసినట్టు, ఎప్పుడోగాని మన వద్దకి తిరిగి రాని “మెసేజ్‍ ఉన్న బాటిల్స్” ఇక్కడ దాచుకోవాలని. లేదంటే, అలా ఒకటీ అరా ప్రోత్సహిస్తూ వచ్చిన స్పందనలు మర్చిపోయి నా చుట్టూ ఎప్పుడూ ఉన్న నెగిటివిటికే లొంగిపోతున్నట్టు అవుతుంది.

అదీ కాక, ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో నా బడుగు జీవితంలో నా తాహతుకి కొన్ని బ్రహ్మాండమనిపించినవే జరిగాయి. ఇంతకు ముందు ఎప్పుడూ చేయనివి. ఆ విశేషాలు:

Suspense of a short story:

డిసెంబర్ చివర్లో పది రోజులు సెలవు పెట్టాను, మంటో అనువాదాలు పని కాస్తైనా పూర్తి చేద్దామని. కానీ అనువాదాలు ముట్టుకోకుండా రెండు కథలు రాశాను. ఒకటి ఈమాటలో వచ్చింది, ఒక అల్ట్రా ఫిజూల్ అన్న పేరుతో. ఇంకోదాన్ని తిన్నగా ఉండకుండా, ఈనాడు కథల పోటీకి పంపించాను. (నేను సబ్మిట్ చేసిన మొట్టమొదటి పోటీ ఇదే!)

నా తరహా కథ కాబట్టి చదివినవారందరూ ముక్తకంఠంతో పోటీకి పంపడం అనవసరమన్నారు గానీ, మూడు నెలలకి ఈనాడు వాళ్ళు కథ shortlist అయ్యిందని చెప్పారు. ప్రైజ్ గీజ్ గురించి అందరికీ అనుమానమే, ఎందుకంటే పరమ వెరైటీ కథ, అంత wide readership ఉన్నవాళ్ళు సెలెక్ట్ చేస్తే పాఠకులు గిలగిలా కొట్టుకునే అవకాశముంది. అది తెల్సీ నేనెందుకు పంపానంటే, I want to question the status-quo. Reject, if you will, but it has every right to compete! It is a Telugu story, it belongs there.

Like I won’t censor what and how I’m writing, going forward, I also won’t fore-close any options to reach different cluster of readers.

ఇహ, మొగుడితో గొడవపడి పుట్టింటికొచ్చిన ఆడబడచులా మాటమాటకీ నిష్టూరాలు ఆడ్డం మానేసి నేను బుద్ధిగా చదువుకుని, రాసుకుంటాను. మళ్ళీ అవసరమనిపించినప్పుడు అరుస్తాను. అప్పటిదాకా Danish Sait స్టైల్లో “#peas”.

Mental Health:

HBT Facebook Page

డిసెంబర్ చివరి వారంలోనే రోహిత్, నేను కల్సి “హైదరాబాద్ బుక్ ట్రస్ట్” వాళ్ళ ఫేస్‍బుక్ పేజ్‍కి గెస్ట్ ఎడిటర్స్ గా చేశాం ఒక పదిహేను-ఇరవై రోజులు. ఏవో రెండు మూడు టాపిక్స్ అనుకుని వాటికి సంబంధించి పోస్టులు పెట్టాలి. “మెంటల్ హెల్త్” గురించి చేద్దామన్న సలహా రోహిత్‍దే. ఏం చేద్దాం, ఎలా చేద్దాం అన్న చర్చల్లో “తెలుగులో మెంటల్ హల్త్” అని కొన్ని పోస్టర్స్ చేస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాం. వాటికో డిక్షనరీ ఫార్మాట్ ఇచ్చాం. “text as image” అనేది మా ఇద్దరికీ చాలా ఆసక్తి ఉన్న టాపిక్. ఆ పోస్టర్లు ఇక్కడ షేర్ చేస్తున్నాను. (పోస్టర్ కంటెంట్ & డిజైన్ చేసింది మేమిద్దరే!)

Personal essay on Depression

అదే సమయంలో రోహిత్ నేను చదవడం వాయిదా వేస్తున్న “it’s all in your head, m” పుస్తకాన్ని చదివేలా చేశాడు. అది చదివాక నేనిట్లా కథలు రాసో, పోస్టర్లు చేశో “మెంటల్ హెల్త్” అని గింజుకుంటే సరిపోదు. నా ప్రయాణమేమిటో రాయాల్సిందే అనుకున్నాను. అచ్చంగా, నరేటివ్‍లాగా ఒకటి స్టార్ట్ చేశాను గానీ, అంత డీటేల్డ్ గా చెప్పడానికి నేను మానసికంగా సిద్ధంగా లేనని అర్థమైంది. అందుకని దాన్ని పక్కకు పెట్టేసి, పుస్తకాలకి సంబంధించిన వ్యాసమొకటి రాశాను.

http://pustakam.net/?p=21331

Bairagi holding me all through that write-up.

Talk with Shalini

ఇది కూడా హెచ్బీటిలో భాగంగానే చేశాం. పోయినేడాది షాలిని నిర్వహించే రెండు వర్కుషాపులు చేశాను, మూడు నెలల వ్యవధిలో. అవి చేయకముందే కొంతమంది స్నేహితులతో తెలుగులో ఇలాంటి అంశాల గురించి కంటెంట్ క్రియేట్ చేయడానికి ఏం చేయాలన్నది ఆలోచించాం. కానీ platforms దొరకడం కష్టమనిపించింది. ఒక వేదిక తయారుచేసుకుని మళ్ళీ దాని నిర్వహణా బాధ్యతలు కూడా మనమే తలకెత్తుకోవాలేమో అనే అనిపించింది. అనుకోకుండా కొద్ది నెలలకే హెచ్బీటి అవకాశమిచ్చింది. టాక్ ప్రపోజ్ చేయగానే అందరూ ఉత్సాహంగా ఒప్పుకున్నారు. అన్నీ కలిసీ వచ్చాయి.

నేను కూడా నా బాడీ ఇమేజ్ ఇష్యూస్, నా స్పోకెన్ బ్రోకెన్ తెలుగు డైలమాలు అన్నీ పక్కకు పెట్టి చేయడానికి సిద్ధపడ్డాను. ఈ జన్మానికి ఇదే మొహం, ఇదే శరీరం. అవి జనాలు బాలేదంటారనీ, బాడీ షేమింగ్ చేస్తారనీ ఎన్ని పనులని మానుకుంటాం? (workplaceలో నాకీ గొడవుండదు. తెలుగు సాహిత్య జనాభాలతోనే!) ఇది వదులుకునే అవకాశం కాదనిపించింది. రోహిత్ మోడరేటర్‍గా ఉండడం, నా స్నేహితులు కొందరు నాకోసమే అటెండ్ అవ్వడం అన్నీ నాకూ ధైర్యాన్ని ఇచ్చాయి. మొదట మాట్లాడ్డానికి తడబడినా మళ్ళీ మామూలైపోయాను. టాక్ అయిపోయాక ఒక unmissable positive energy and camaraderie కనిపించింది అందరిలో… అప్పుడప్పుడూ పలకరించుకుంటున్నా, కబుర్లు చెప్పుకుంటున్నా ప్రతి ఒక్కరిలో ఎన్నెన్ని గాధలు దాగున్నాయో అర్థమైంది అప్పుడే!

That’s an evening I’ll treasure for life. (యూట్యూబ్ లింక్ వ్యాసం చివర్న ఇస్తున్నాను.)

కొన్ని చిన్న సంతోషాలు

  1. మొన్న పూర్తైన ఒక ఉర్దూ కోర్సులో నా షేర్-ఒ-షాయరీ చదివి వినిపించాను, పదిమంది (అచ్చంగా పదిమందే ఉన్నారు) ముందు! బాగుందన్నారు. ఇంకా రాస్తూ ఉండమన్నారు. రాయడమేమో గానీ కవిత్వం చదవడానికుండాల్సిన తీరుతెన్నులు (performance) నాకు కష్టమని అర్థమైంది. కానీ నేనసలు ఎప్పుడూ కవిత్వం రాయలేదు కాబట్టి ఇదేదో థ్రిల్లింగ్ గా అనిపించింది.
  2. ఒందు బది కడలు” గురించి పరిచయం రాస్తే స్వయంగా వివేక్ శానభాగే స్పందించారు. (నాకున్న సెలబ్రిటి ఫ్రెండ్స్ వల్ల అలా నా పని సెలబ్రిటీలని చేరుకుంటుందన్నమాట!) ఆయన కోసం చేసిన రఫ్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చదివి “రివ్యూలంటే మామూలుగా సమరీలు రాస్తుంటారు. అలా కాకుండా, కథని చెప్పీ చెప్పకుండా ఎన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు!” అని మురిసిపోయారు. ఆయన మురిపెం చూసి నేను మురిసిపోయాను. “పదేళ్ళ బట్టీ రాస్తున్నా పుస్తకాల గురించి, ఎందుకు వాటిలో లేని నీ పైత్యాన్ని జొప్పిస్తావ్ అన్నవాళ్ళే తప్పించి, ఇలా మెచ్చుకున్నవాళ్ళు లేరండీ” అని నేనూ చెప్పాను. He’s not only a writer par excellence, but also a reader with deep literary sensibilities. And an outstanding editor. ఐ వాస్ ఆన్ క్లౌడ్ నైన్ ఒన్లీ!
  3. నా మట్టుకు నాకు చాలా ప్రత్యేకమైన, ఈమాటలో రాసిన ఈ వ్యాసానికి కొంతే స్పందన వచ్చినా చాలా బలంగా వచ్చింది. ఒక ఫ్రెండ్ పుణ్యమా అని ఒక ఎన్-జి-ఒ వాళ్ళు వాళ్ళ నోటీస్ బోర్డ్ లో ప్రింట్ తీసి ఈ వ్యాసాన్ని పెట్టారు. వాళ్ళ దగ్గర పనిజేసేవాళ్ళూ, వచ్చి పోయేవాళ్ళూ చదువుకునే వీలుగా. ఇది upper class context నుంచి రాసిన వ్యాసం కాబట్టి వాళ్ళకి అర్థమవుతుందో లేదో, కాస్త మార్చి రాయాలనుకున్నాం కానీ అక్కడి కో-ఆర్డినేటర్ “అందరికీ అన్నీ అర్థమవవు. అన్నీ అర్థమవవు. ఎలా ఉందో అలానే ఉండనివ్వండి. ఎవరికి కావాల్సింది వాళ్ళు వెతుక్కుంటారు.” అని అన్నారట. I was so humbled!

On YouTube

నేను సైతం ఒక లిటరరీ ఫెస్ట్ పానెల్‍లో మాట్లాడినాను – అని చెప్పుకోవచ్చు ఇంక. 😛 అంటే, లిటరరీ ఫెస్టుల గురించీ, అందులో పానెల్స్ గురించీ నాకుండే అభిప్రాయాలు నాకున్నాయి. అన్నీ గొప్పవీ, వాటిల్లో పాల్గొనడం చాలా గొప్ప విషయమని అయితే అనను. కానీ అచ్చంగా తెలుగులో చేసిన పనికి గుర్తింపుగా “భాషా లిటరేచర్” గురించిన పానెల్‍కి పిల్చారు కాబట్టి అదొక మంచి విషయమే అనిపించింది. నాతో పాటు పానెల్‍లో ఉన్నవాళ్ళల్లో రవిశంకర్ అనే మలయాళీ కవి/అనువాదుకుడు తప్పించి మిగితా వాళ్ళమంతా పని చేస్తున్నా పెద్ద విజిబిలిటీ లేనివాళ్ళమే! అవకాశం మంచిదే అనిపించింది. బాగానే మాట్లాడుకున్నాం.

దాని వీడియో లింక్ ఇదిగో:

షాలినీ రావ్‍తో మెంటల్ హెల్త్ గురించి టాక్ వీడియో లింక్ ఇది:

ఏప్రిల్‍లో ఇంకొన్ని కబుర్లు ఉండే అవకాశం ఉంది. వాటిని చేసుకునే వెసులుబాటుని, ఇలా పంచుకునేంత వీలుని, తీరికని మా ప్రాజెక్ట్ నాకు ప్రసాదిస్తే బాగుణ్ణు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s