హెచ్చరికో హెచ్చరిక
నేను స్కూల్/కాలేజీలలో ఉండగా ఈనాడు ఆదివారంలో ఒక కథ వచ్చింది. ఒక ఊర్లో ఒకడుంటాడు. భోజనప్రియుడు. శుభకార్యాలు, దినాలు అన్న తేడా లేకుండా అన్నింటికీ వెళ్ళి బాగా మెక్కుతాడు, కానీ తినేశాక మాత్రం “భోజనం బాలేదండీ, ఉప్పు ఎక్కువ, కారం తక్కువ, అసలు తినలేకపోయాను” టైపు కామెంట్స్ చేసి ఏర్పాట్లు చేసినవారికి ఇబ్బంది కలిగేలా మాట్లాడతాడు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, గొప్పోళ్ళు, పేదోళ్ళు అన్న తేడా లేదు – ఎక్కడికైనా వెళ్ళడం, వెళ్ళి తినేసి నానా మాటలు అనడం.
అదే ఇంట్లో ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన అన్నదమ్ములు ఒక విందు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఈ మనిషి ఇలానే చేస్తాడు. అయితే వాళ్ళు “అలాగా అండీ!” అని ఊరుకోక, అతడికి కలిగిన ఇబ్బందికి పరిహారంగా కూర్చున్న చోట నుంచి లేవకుండా నచ్చిందనే వరకూ ఏదో ఒక వంటకం వడ్డిస్తూనే ఉన్నారు. ఇతడికి తినీ తినీ పొట్టపగిలేంత పని అవుతుంది కానీ ఆ అన్నదమ్ములు చేయి మాత్రం కడగనివ్వరు. చివరకి చేస్తున్న పొరపాటుని ఒప్పుకుని అతడు క్షమాపణలు చెప్పాక అప్పుడు వదులుతారు.
నేను రాసే కథలు కూడా ఒక ఆరోగ్యవంతమైన ఆకలి ఉన్నవారికి కోసం మాత్రమే. (Natural and healthy appetite, moderate aptitude) అంతే కానీ, సాహిత్యమంటే మాకేవో పాచిపట్టిన ఐడియాలున్నాయి, అందుకు అనుగుణంగా రాయడం లేదు కాబట్టి నిన్ను వెలివేస్తూ ఉంటామంటే నాకూ ఆ ఒక్క వేలూ (you-know-which-finger) చూపించడం వచ్చు, నా సంస్కారం ఎంత అడ్డొచ్చినా కూడా.
పాతాళభైరవి సినిమా కథ ఆధారంగా నేను రాసిన “నేటికెవ్వరు మరి కథానాయకుడు?” అనేది ఒక ప్రత్యేకమైన కథ, ఆసక్తికరమైన కథ. జనాల చేత “నువ్వు తోపు, తురుము” అనిపించుకునే కథ కాదు. అందరికీ నచ్చే కథ కూడా కాదు. అయినా దాని గురించి పంచుకోవాల్సిన సంగతులు కొన్ని ఉన్నాయనిపించి ఇది రాస్తున్నాను. పై కథలో చెప్పినట్టు చక్కగా తినలేని వాళ్ళు, తిన్నది అరగక తిప్పలు పడేవాళ్ళ కోసం రాయడం లేదు.
ఆ కథ నా పూర్వీకుడైన పింగళికి నాకూ మధ్య జరిగిన ఒక అపురూప సంభాషణ. ఈ వ్యాసం నాకూ నా తర్వాత వచ్చేవాళ్ళకి మధ్య మాటల వారధి. వీలైతే కథా రచనా వ్యాసంగంలో దీన్నో masterclassగా చూడండి. లేదా, ఊరికే ఉండండి. మీ ఒట్టి డొల్ల పొగడ్తలు, వెటకారాల అవసరం నాకైతే లేదు. I fucking know how well I write.
*****
2012లోనో ఎప్పుడో, హైదరాబాద్‍లో సురభి నాటక కంపెనీవాళ్ళు పాతాళ భైరవి నాటకం రవీంద్ర భారతిలో వేస్తుంటే వెళ్ళాం. ఇందులో మాంత్రికుడు తనికెళ్ళ భరణి, పాతాళ భైరవి మంజు భార్గవి వేశారు. నాటకం సినిమా ఆధారంగానే తీశారు. అలా నాకు ఈ సినిమా కథతో పరిచయం ఏర్పడింది.
ఇంకొన్నాళ్ళకి సురభివాళ్ళు ప్రభుత్వ ప్రోత్సాహంతో రవీంద్ర భారతి ఆడిటోరియమ్ లో కాకుండా బయట ఆవరణలో ఉచితంగా నాటక ప్రదర్శనలు చేయడం మొదలెట్టారు. అలా పాతాళ భైరవి వేస్తున్నారని తెల్సి మళ్ళీ చూద్దామని నేను వెళ్తూ ఒక తెలుగబ్బాయి, ఫ్రెండ్ ని పట్టుకెళ్ళాను. ఆ అబ్బాయికి నాటకం చూడ్డం అదే తొలి అనుభవం. అన్నింటికీ బానే అడ్జస్ట్ అయిపోయి ఆనందించడం మొదలెట్టాడు కానీ హీరోయిన్ వేసిన అమ్మాయి రాగానే నసగడం మొదలు. ఆ అమ్మాయి నచ్చలేదు. తెలుగు సినిమా స్టాండర్డ్స్ తో పోల్చుకుంటే ఆ అమ్మాయి ఏ వైపునుంచి హీరోయిన్‍గా అనిపించలేదు. ఏదో ఒకట్రెండు సార్లు అని ఊరుకుంటే నేనూ పట్టించుకుని ఉండకపోయేదాన్ని. కానీ అమ్మాయి వచ్చినప్పుడల్లా “ప్చ్”, “అబ్బా” అన్నవి కొనసాగుతూనే ఉన్నాయి, నాటకం మొత్తం.
అప్పుడే నాకో కథ ఐడియా వచ్చింది. పాతాళ భైరవి నాటక ప్రదర్శన మొదలయ్యాక హీరో ఆ పాత్ర వేయడానికి ఒప్పుకోకుండా వెళ్ళిపోతాడు, అప్పుడు మిగితా నాటకమంతా చచ్చినట్టు హీరోయిన్, మాంత్రికుడు నడిపించాల్సి వస్తుంది. ఫ్రెండ్ విసుగుకి కారణమైన హీరోయిన్ అందచందాలే కారణంగా చూపించాలని మొదట అనుకున్నాను – కానీ ఆ పాటికే నేను ఒకటో అరో కథలు రాశాను, అమ్మాయిలు అందంగా లేకపోవడం వల్ల పడే ఇబ్బందులు గురించి. మళ్ళీ అదే ఎత్తుకోవాలంటే నాకు విసుగనిపించింది. అందుకని, తోటరాముడు పాత్ర వేసే కుర్రాడికి సినిమాల మీద ఆసక్తి ముదిరి సురభి కంపెనీని వదిలేస్తాడని రాద్దామనుకున్నాను. కానీ అదే సమయంలో ఆ కంపెనీ మీద నాకు ఆసక్తి పెరగడం, వాళ్ళు ఎలా పనిజేస్తారు, ఎలా ప్రాక్టీస్ చేస్తారు, ఇవ్వన్నీ తెల్సుకోవడం వల్ల వాళ్ళల్లో ఎవరూ ఇలా చీప్‍గా గ్లామర్ వైపు పరిగెత్తరు అన్నది అర్థమైంది. అట్లా రాసి కంపు చేయడమే అవుతుందని ఊరుకున్నాను.
కానీ ఇలా తోటరాముడుని కథలోంచి తోలేసి మాంత్రికుడు, ఇందు (హీరోయిన్ పేరు) మధ్య కథ నడపాలన్న దురద మాత్రం తగ్గలేదు. కాసేపు ఇది వదిలేసి, రాముణ్ణి కథలోంచి తోలేసి రావణుడు సీత మధ్య కథ నడపాలనే దుర్భుద్ధి పుట్టింది. అప్పుడే బెంగళూర్‍కి మకాం మార్చిన రోజులు. ఇక్కడో నాటకానికి వెళ్తే ఒక సంస్థ వాళ్ళు ఎవరో వేసిన మాగజైన్ లాంటి బుక్ దొరికింది. వేర్వేరు దేశాల్లో రామాయణ కథలని ఎన్ని వెరైటీలలో ప్రదర్శిస్తారో అన్నది అందులో ప్రధానాంశం. వాటిల్లో ఒకటి (ఇండోనేషియాది అనుకుంటా), అశోకవనంలో సీత దగ్గరకి రావణుడు వచ్చి వరించమని అడిగినప్పుడు ఆ దివ్యమనోహర రూపాన్ని చూసి సీత కూడా ఒక క్షణం అతణ్ణి గాంఢంగా కోరుకుంటుంది. కానీ క్షణంలో తేరుకుని అలా కోరుకున్నందుకు అపరాధ భావనతో ఆత్మహత్య చేసుకుంటుంది. (లేదా ప్రయత్నిస్తుందో, గుర్తులేదు. నా బాడ్ లక్, ఆ ఒక్క పుస్తకానికే బాగా తేమ పట్టేసి పాడైపోయింది. 😦 )
ఇదో మధ్యలో Tom Gauld ఇలా నన్ను రెచ్చగొట్టాడు. First Block.

ఇవ్వన్నీ చదివాక సంప్రదాయ కథలో విలన్-హిరోయిన్ మధ్య ఈక్వేషన్‍ని explore చేయాలన్న కోరిక ఇంకా బలపడింది. అందుకని పాతాళ భైరవి నాటకాన్నే తీసుకుని ప్లాట్ మొత్తం ఫ్లో చార్ట్ గా గీసి, తోటరాముడు వెళ్ళిపోతే ఏం అవ్వచ్చు అన్నది ఇంకో ఫ్లో చార్ట్ గీసాను. కన్నూర్‍కి వీకెండ్ ట్రిప్ వెళ్తూ ట్రెయిన్ లో కూర్చుని చాలా వరకూ కథ రాశాను. అందులో హీరో ఎందుకెళ్ళిపోతాడో ఉండదు. వీళ్ళిద్దరూ కథలో ఉండిపోయి, వెయిట్ చేస్తూనే ఉంటారు. ఏ ముగింపు ఇవ్వాలో అర్థం కాలేదు. ఈ వర్షన్ చూపించిన ఇద్దరు స్నేహితులు ఐడియాకి తెగ సంబరపడిపోయారు. (God bless them!) ఇక కథ ఫైనల్ చేయడానికి సిద్ధమవుతూ అసలు సినిమా ఎలా ఉంటుందో చూద్దామని మొదలెట్టాను.
*****
పింగళి మీద ఫిదా అయిన విధానంబెట్టిదనిన…
నాటకాలు చూడ్డం ప్రేమించడం లాంటిది. అసలు జరిగినదానికన్నా మన ఊహల్లోనే దాని ఉనికి ఎక్కువ. అసలేం జరిగింది అన్నదానికన్నా మనకేం అనిపించింది, ఎలా గుర్తుండిపోయింది అనేదే ముఖ్యం. సినిమాలు పెళ్ళి చేసుకోవడం లాంటిది. ఊహలకి ఆస్కారం తక్కువ. In-your-face-reality ని తప్పించుకోలేము. పాతాళ భైరవి సినిమా లేకపోయుంటే, నాటకం మాత్రమే అయ్యుంటే ఇక్కడ నా ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ పోవచ్చు. చాలా మంది చూసుండరు, చూసినవాళ్ళు కూడా “ఏమో, మనం మిస్ అయ్యామేమో ఈ పాయింట్” అని ఊరుకుంటారు. సినిమా మాత్రం ఎవ్వరైనా వెళ్ళి చూడచ్చు, వాళ్ళకీ నాకూ కనిపించే సీన్లు, పాటలు ఒక్కటే… కానీ దాని interpretation వేరుగా ఉంటుంది. అందుకని నేను రాయబోతున్న దానితో మీరు ఏకీభవించాలనేం లేదు.
పాతాళ భైరవి సినిమా మొదటిసారి చూడగానే నన్ను బలంగా తాకిన విషయాలు. (అప్పటికే కథ బాగానే పరిచయమై ఉన్నా కూడా)
- ప్రేమ గోల: “ప్రేమ కోసమే వలలో చిక్కెను…”, “ఎంత ఘాటు ప్రేమయో” లాంటి పాటలున్నా ఆ సినిమా డైలాగుల్లో అన్ని సార్లు, చీటికీ మాటికీ (ఏదో యనభై, తొంభైల్లో వచ్చిన సినిమాలా ) “ప్రేమ” ప్రస్తావన ఉండడం నాకు కొంచెం వింతగా తోచింది. (అప్పటికి ప్రేమ అనే పదం వినిపిస్తే కరిచేట్టున్నాను కాబట్టి కాస్త చిరాకు కూడా వేసింది.)
- మెటా (meta) మాయాజాలం: నేనోదే నా 21st century brain fed on European fiction మాత్రమే ఊహించగల మెటా-ఫిక్షన్ ఛాయలు కథలో కనిపించడం. (దీని గురించి వివరంగా కింద)
- డైలాగ్స్ – డైలాగ్స్ – డైలాగ్స్: Pingali is a master in storytelling, characterization but he nails dialogues to such extent that he can take the story to an elevated level. The sound, rhythm and texture of those dialogues is such a feast to any craftsman. I was blown away.
- Representation of alienation – తెలుగుకాని దాన్ని తెలుగుకాని దానిలా ఉంచుతూనే, అంటే దాని ప్రత్యేకత, exclusivityని పోగొట్టకుండానే దాని కథని తెలుగులో, తెలుగువాళ్ళకి చెప్పడం: దీనికి ప్రధానమైన ఉదాహరణ మాంత్రికుడు పాత్ర చిత్రీకరణ. కథ ఉజ్జయినిలో జరుగుతుంది, వాళ్ళ కట్టూ బొట్టూలో అంత తెలుగుదనమేం ఉట్టిపడదు లాంటివి కూడా ఉంటాయి గమనిస్తే, కానీ మాంత్రికుడి ఆహార్యం , భాష (to represent the foreignness) చాలా విభిన్నంగా ఉంటాయి, నేపాలీవాడు కాబట్టి. “చేయడం”ని “శాయడం” అనడంలో, “గడబిడ శాయకే బుల్‍బుల్” లాంటి చిన్నచిన్న మాటలతో వీటిని establish చేశాడాయన.
సినిమా చూస్తున్నప్పుడు “అయ్యో, ఇంతటి మాస్టర్‍పీస్‍ని ముట్టుకోవడం తప్పు కదా, దీన్ని re-interpret చేయడం దీన్ని అగౌరవపరచడం అవుతుందేమోన”ని అనిపించింది ఒక్క క్షణం, కానీ సినిమా పూర్తవ్వగానే వేయి ఏనుగుల బలం వచ్చినట్టు అయ్యింది. ప్రస్తుతం తెలుగు సినిమాలు, సాహిత్యంలో ఎంత దిగజారిపోయున్నాయో, వాటి వల్ల కలిగే నీరసం ఎంతటిదో! వాటిని మటుమాయం చేసి ఒక unadulterated and gushing creative energyని ఈ సినిమా అందించింది. అంతకు మించి “ఈ మాత్రం కథనంలో ప్రయోగాలు చేయలేకపోతే, కథా రచయితవు ఎలా అవుతావే డింభకీ!” అని నిలదీసినట్టు అనిపించింది.
“సాహసే ధైర్యే లక్ష్మి” అన్నది ఎంత నిజమో, “సాహసే ధైర్యే సరస్వతి” కూడా అంతే నిజమనిపించింది. ఆ మాత్రం తెగువూ, దమ్ము లేకపోతే సృష్టించడం సాధ్యమేనా?!
అప్పటి వరకూ కేవలం ముఖ్యపాత్రలని తీసుకుని, కథ ఔట్‍లైన్‍ని తీసుకుని మాత్రమే రాయాలనుకున్న నేను (మొదటి డ్రాఫ్ట్ అలానే ఉంటుంది) ఒకసారి సినిమా చూసేసరికి మొత్తం తల్లకిందులైపోయింది. పింగళి రాసిన కథ, మాటలు, పాటలు వాడుకుంటూనే మరో కథ రాయొచ్చనని అర్థమైంది. పైగా కథకి నాయకుడికి ఉన్న సంబంధం మనం అనుకున్నంత granted కాదనీ (అంటే, కథంటే ఖచ్చితంగా నాయకుడుంటాడు, వాడు Hero’s Journey మీద వెళ్ళడానికి ఉబలాటపడుతుంటాడు లాంటి అంచనాలు) , నాయకుణ్ణి కథనుంచి గెంటేయాలన్న నా దుర్భుద్ధి మరీ అంత unrealistic కాదనీ పింగళి మాటల్లోనే దొరకడం నాకో అద్భుతమైన అనుభవం. ముఖ్యంగా “ఇతిహాసం విన్నారా” అనే పాట ఈ కథ existential dilemmas బయటపెడుతుంది. పాతాళంలో నిధులున్నాయి, సాహసులు మాత్రమే దక్కించుకోగలరు, ఇంతకుముందు కొందరు అలా నాయకులయ్యారు, మరి ఇప్పుడు నాకెవ్వరు దిక్కు అని అడుగుతుంది. 🙂 ముఖ్యంగా, ఆఖరి చరణంలో:
నాటివారి వలె నేటివారునూ
చాటగలరయ్యా సాహసమంటూ
ఘాటు ఘాటుగా కథ నడిపింపగ
నేటికెవరు మరి కథానాయకుడు?
నీవా… నీవా… మరి నీవా?
పూర్తి పాటకి లింక్ ఇక్కడ:
https://www.youtube.com/watch?v=62xVbFEy5Kg
పాతాళ భైరవి అంటే “ఎంత ఘాటు ప్రేమయో” మాత్రమే కాదు, అంతకు మించిన మౌలికమైన ప్రశ్నలున్నాయి దానికి. నాకేమో ఈ కథ ఎప్పుడూ “ఇప్పుడెట్లారా దేవుడా, ఎట్ల బతికి గట్టేది?” టైపులో hyper self-conscious అవుతూ ఉంటుందనిపిస్తుంది. అంటే, foreshadowing అనే టెక్నిక్ పాతదే, కథలో రానున్న మలుపుని చూచాయిగా ముందే చెప్పడం. అది కథ మొత్తం బానే జరుగుతుంటుంది (ఉదా: జోస్యుల ద్వారా రాకుమారికి కీడు ఉందని చెప్పడం వగైరా) కానీ ఈ పాట అలా కాదు. స్పష్టంగా, సూటిగా నాకో నాయకుడు కావాలి, ఎవరున్నారు అని అడుగుతుంది. (గుర్తించుకోవాల్సిన విషయం, ఈ పాట వచ్చే సమయానికి మాంత్రికుడి ఎంట్రీ కూడా అవ్వదు.)
పింగళి ఈ కథని కాశీ మజిలీ కథలనుంచి తీసుకున్నారని వికీ ఉవాచ. ఒరిజినల్ కథ ఎలా ఉంటుందో తెలీదు, ఆయన దాన్ని ఎంత మార్చారో తెలీదు. కానీ ఈ సినిమాలో “హీరోస్ జర్నీ” కాస్త విభిన్నంగా ఉంటుంది. ఇంటర్వెల్ క్లైమాక్స్ అనుకుని పొరబడేలా ఉంటుంది. కథ అయిపోయిందనిపించిన చోట మళ్ళీ మొదలవుతుంది. దాన్ని వివరించడానికి ఈ కింది బొమ్మలు గీశాను. (నాకు ఇప్పుడు ఓపిక లేదు పెద్దగా, బొమ్మలు నీట్‍గా గీయలేదు. కేవలం ఐడియా కోసమే.)
విలన్స్ జర్నీ
పై సెక్షన్‍లో చెప్పిన నాలుగు పాయింట్లు నాకు చాలా సహాయపడ్డాయి, కథని తిరగరాయడంలో. ముందు “ప్రేమ, ప్రేమ” అని జోరీగలా అనిపించి విసుగొచ్చింది కాబట్టి “తోటరాముడు రాకుమారితో ప్రేమలో పడడు” అని ఫిక్స్ అయ్యాను. దానికి కారణం, ఆమె అందం లాంటి కారణాలు కాకుండా, నిరాసక్తి (plain disinterest)గా చూపించాను. తోటరాముణ్ణి కథలోంచి పంపేయడం అన్నింటికన్నా తేలికైన పని!
ఇహ అప్పుడు మాంత్రికుడు, రాకుమారి మాత్రం మిగులుతారు. వీళ్ళద్దరిని ఏం చేయాలన్నది నా ముందున్న సమస్య. దానికీ నేరుగా కాకపోయినా పింగళి సహాయపడ్డారు. పైన చెప్పా కదా, కథలో హీరోస్ జర్నీ రెండు సార్లు ఉంటుందని, దాన్ని కాసేపు పక్కకు పెట్టి “విలన్స్ జర్నీ” దృక్కోణంతో కథ చూడడానికి ప్రయత్నించాను. అలా చూసినప్పుడు నాకు ఒక విషయం అతకలేదనిపించింది. మొదటి సగంలో మాంత్రికుడికి పాతాళ భైరవి తప్ప మరో ధ్యాస ఉండదు. వ్యసనపరుడుగానో, స్త్రీలోలుడుగానో చూపించరు. ఒకటే ధ్యాసతో ఉంటాడు మనిషి. తోటరాముడి చేతిలో చావుదెబ్బ తింటాడు. సంజీవిని వల్ల బతికాక అనుకున్నట్టే ముందు పాతాళ భైరవి బొమ్మని సాధిస్తాడు, మోసపూరితంగా. తనని చంపినందుకు ప్రతీకారంగా రాకుమారిని ఎత్తుకుపోయాడనుకోవచ్చు. కానీ ఆమెని వాంచించడం, చెరబట్టడం నాకు అసంబద్ధంగా అనిపించాయి. అంటే అయితే గియితే ఆమెని బలవంతం చేయాలి కానీ, ఆమె మోహంలో పడి శక్తులన్నీ పోగొట్టుకోవడం, ఆమె రాముడి ప్రస్తావన తెచ్చినప్పుడు రగిలిపోవడం వీటిల్లో నాకు కాస్త రామాయణ ఛాయలు కనిపించాయి. అంటే, మళ్ళీ కథ తనకి తానుగా, “చూడు ప్రతీ సాహస కథలో విలన్ అంతమైతే గానీ నాకు సుఖాంతం అవ్వదు. ఏదోటి చేసి మాంత్రికుణ్ణి చంపితే కానీ వీడు నాయకుడు కాలేడు, నేను సాహసగాథ కాలేను” అని హైరానా పడుతున్నట్టే అనిపించింది.
ఇది మన పురాణాల్లో కూడా వినిపించే సంగతే. శాపగ్రస్తులైన వాళ్ళు రాక్షసులుగా పుట్టి, త్వరత్వరగా పాపాలు చేసి సంహరించబడి, స్వర్గానికి పోతారు. ఇప్పుడు లింక్ వెతికే ఓపిక లేదు కానీ, ఆంధ్రభారతి.కామ్ లో ఒక చంధస్సు పద్యాలతో ఉన్న కథ/కవిత ఉంటుంది. రావణుడు సంధ్యావదనం చేస్తూ “నేను సీతని ఇక వేధించలేకపోతున్నాను. నాకు మరణం కావాలి వీలైనంత త్వరగా. రాముణ్ణి ఎలా అయినా ఇక్కడికి చేర్చు” అని. (quoting from memory, but something very close to these lines.) మాంత్రికుడికి కూడా అలాంటి యావ ఒకటి లేకపోతే రాకుమారిని మోహించడేమోనన్నది నా థియరీ.
దాన్నే కథలో వాడుకున్నాను. మాంత్రికుడు కథ పట్ల, తన పాత్ర పట్ల అత్యంత నిజాయితీతో ఉంటాడు. అతడి అంతిమ లక్ష్యం రాకుమారి కాదు. రాకుమారి వంకన కలిగే మరణం. అదే అతడికి ముక్తి. అందుకే తోటరాముడు వెళ్ళిపోవడం అతడికి కోలుకోలేని దెబ్బ. (side note: మా అమ్మవాళ్ళు చిన్నప్పుడు వీధిసినిమాల్లో ఈ సినిమా చూసి, అందులో మాంత్రికుని చూసి జడచుకుని జ్వరాలు వచ్చాయంట. నా చిన్నప్పుడు ఈ సినిమా హిందిలో వచ్చింది, ఖాదర్ ఖాన్ మాంత్రికుడు. ఆయణ్ణి చూసినా భయమేసేది అని టాక్ ఉన్నట్టు గుర్తు. బట్ నాకు మాత్రం, మాంత్రికుడు (ముఖ్యంగా ఎస్వీఆర్ వేసినప్పుడు) cutely villain-ish, vulnerable అనిపించాడు. All of my heart was with him! 😀 )
ఎంతగా అంటే, అప్పట్లో నా ఫేస్‍బుక్ కవర్ ఫోటో కూడా ఈయనే అన్నమాట. ఎవరో కథ చదివి “బ్యూటీ ఆండ్ బీస్ట్” అన్నారు. నేనేమో, “హి ఈజ్ ది బ్యూటి, ఐ యామ్ ది బీస్ట్” అని అన్నాను.

సినిమా మొత్తంలో రాకుమారికి పెద్ద పాత్రేం ఉండదు. ఆల్మోస్టు ప్రాప్‍లా ఉంటుంది. ఏవో కొన్ని డైలాగులు కొడుతుంది అప్పుడప్పుడూ – అంతే. నా కథలో ఆమే పరమ బిజీ. ఏదో ఒకటి చేస్తుంటుంది. ఆగిపోయిన కథని కదిలించడానికి, ముందుకి నడిపించడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమె కూడా అందులోనే ఇరుక్కుపోయుంటుంది. అంటే, కదలకుండా నిల్చిపోయిన కథని బోను అనుకుంటే అందులో వీళ్ళిద్దరూ ఉన్నారు, బోను బయటకి రాలేరు. మాంత్రికుడు ఆ బోనులో కూడా కదలకుండా ఒకే చోట ఉంటాడు, ఏవో కొన్ని ప్రయత్నాలు చేశాక. రాకుమారి మాత్రం నిరంతరం అందులో కలియతిరుగుతూనే ఉంటుంది, తప్పించుకోడానికి, దాన్నే ఒప్పుకోడానికో శతవిధాల ప్రయత్నిస్తుంది. (ఈ కథ ఇంగ్లీష్ వర్షన్ చదివినవాళ్ళు, ఆమెకి agencyని ఇస్తూనే ఆమెని passiveగానే ఉంచేశాను, ఆమెని ఈ కథకి ఎందుకు హీరో చేయలేదు? Why she still remains victim? అని అడిగారు. తెలుగు పాఠకులనుంచి అలాంటి ప్రశ్నలు ఆశించడం కూడా దండగ. కథలు చదవడం కోసం కాకుండా, కేవలం రచయితలని పొగడ్డానికో, ఆడిపోసుకోవడానికో కోసం చదివేవాళ్ళకి అలాంటి ప్రశ్నలు రావు. సాహిత్యం చదవడం కూడా ఒక కళ.)
ఇవి ప్రధానమైన అంశాలు, హీరో-హీరోయిన్-విలన్ మోటివేషన్స్ నిశ్చయించుకోవడం. ఒకసారి అది అయిపోయాక, కథని సెట్ చేయడానికి, నడిపించడానికి కావాల్సిన సరంజామాని అంతా పింగళి మాటల్లోంచే తీసుకోగలిగాను. వాటినే సందర్భానుసారంగా వాడి, కాస్త అటు ఇటు తిప్పితే సరిపోయింది. ఆఖరికి టైటిల్ కూడా ఆయన ఇచ్చిందే! 🙂 నేను కొత్తగా తలబాదుకోవాల్సిన అవసరం రాలేదు. సినిమాలో చిన్నచిన్న పాత్రలని కూడా నా అవసరానికి తగ్గట్టు ఎలా వాడానో అది నా పనితనం. అది చావ ఉన్న పాఠకులకి మాత్రమే అర్థమవుతుంది.
Just to immerse in that world of words, డైలాగులు కొన్ని రాసుకుంటూ పోయాను, సినిమా చూస్తున్నప్పుడు. ఎవరన్నా పాతాళభైరవి screenplay బుక్‍లా చేసిస్తే వాళ్ళకి నజరానా ఇచ్చుకుంటాను. 🙂
పాతాళ భైరవి మాయాబజార్‍లా ఇప్పటికీ నోళ్ళల్లో నానుతున్న సినిమా కాదు. కథ చాలా మందికి తెలీదు. ఫేమస్ డైలాగులు, పాటులు అంతే! కథ ఎడిటింగ్ చేసేటప్పుడు అసలు కథని కూడా కొత్త కథలో చెప్పాలా అన్న చర్చలు జరిగాయి. పాఠకులకి ఒక refresherలాగా. మళ్ళీ వద్దనుకున్నాం. పాతకథ తెలియకుండా ఈ కథని అర్థంచేసుకుని, ఆస్వాదించే విధంగా అన్ని జాగ్రత్తలు, డిటెయిల్స్ ఇచ్చాం. ఈమాటలోనే ఒక కామెంట్ వచ్చింది. కథ చదివి, సినిమా చూసొచ్చి, కథ మళ్ళీ చదివిన కామెంట్ అది. If one reader has sat through a 3hrs movie to try and understand what I’m trying to convey with a retelling, that means I’ve triumphed in my attempt. తెలుగు పాఠకుల మీద నాకు కాస్తో, కూస్తో ఇంకా నమ్మకం మిగిలుంది వీళ్ళలాంటి వల్లే.
మేం ఊహించినట్టుగానే ఈ కథకి వచ్చిన స్పందన – భయంకరమైన నిశ్శబ్దం. Thundering silence. That seals the deal for me. నాకసలు నా కథల లింక్స్ అవీ ఇచ్చి చదవమనడం అలవాటు లేదు. ఈ ఒక్క కథకీ మాత్రం ప్రస్తావన వచ్చినప్పుడు లింక్ ఇచ్చాను కొందరికి. అయినా స్పందన లేదు. మరి తెలుగు సాహిత్యంలో కీలక పాత్రలు పోషిస్తూ, దాన్ని మార్గనిర్దేశం చేస్తూ, కథలు రాస్తూ, విమర్శలు రాస్తూ ఉన్నవాళ్ళకి కూడా దీని పట్ల కనీస ఆసక్తి కలగకపోవడం (మామూలుగా వినిపించే, అర్థంకాని కథ లాంటి మాటలు కూడా వినిపించకపోవడం) విడ్డూరం. Some things are beyond hopeless. Slipping through the cracks into oblivion shall be my biggest achievement, given the state of Telugu literary affairs.
నాకు మాత్రం ఈ కథ అనుకోవడం, అనుకున్నదానికి తగ్గట్టుగా రాయడమనేది మర్చిపోలేని ఆనందాన్ని, తృప్తిని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. అంతకు ముందు కూడా నేను చెప్పాలనుకున్న కథలని చెప్పాలనుకున్నట్టే చెప్పాను. కానీ దీని తర్వాత నాకు పింగళి ఆశీర్వాదమూ ఉందనిపించింది. ముఖ్యంగా ఒక ఆంగ్ల పదం కూడా రాయకుండా రాసిన కథ అని తట్టింది ఒకసారి. కానీ అంతలోనే మాంత్రికుని భాషలో ఎంత foreignness ఉందో గుర్తుతెచ్చుకుంటే నవ్వు వస్తుంది. అప్పటి వరకూ నన్ను నేను బ్లాగర్ అనే చెప్పుకునేదాన్ని, ఎవరన్నా “రచయిత” అన్నా ఒప్పుకునేదాన్ని కాను. ఇది రాశాక మాత్రం, I knew I’ve arrived as a Telugu writer. In inimitable style. And that there would be no stopping me. I’m on my own little literary “hero’s journey”.
మన చుట్టూ నీరసం, నిరాసక్తి, డొల్లతనం మాత్రమే ఉన్నప్పుడు అవి మనకి అంటుకునే ప్రమాదం, అవి మన నిజాలుగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. “నేటికెవరు మరి కథా నాయకుడు?” అని ఒక్కోసారి వెనుకటికాలంలో వెతుక్కోవాలని నాకర్థమైంది. పింగళికి నేనెప్పుడూ పెద్ద ఫంకానే, కానీ ఆయన శిష్యరికంలో చేరాక తెల్సుకున్నవి మరిన్ని. నా పూర్వీకులు గొప్ప సాహసవంతలు. వాళ్ళకి ఘాటు ఘాటుగా కథ నడిపించడం వచ్చు. నాచేత అలా రాయిస్తూ నన్ను నడిపించే బాధ్యత కూడా వాళ్ళదే! 🙂
కథకి లింక్:
చివరిగా మరోసారి, పింగళీ, నమో నమః! మాయబజార్ గురించి రాసుకున్న చిన్న నోట్:

ఏ కళాకారుడినైనా వేధించే ఒక ప్రధానమైన ప్రశ్నని ఈ సినిమాలో పింగళి మాంత్రికుడి ద్వారా అడిగిస్తారు. అతడి శిష్యుని ద్వారా బదులు ఇప్పిస్తారు. ఈ మంత్రోదపదేశం నేను గత ఐదారేళ్ళల్లో ఒకసారి కూడా మర్చిపోలేదు. మనం నమ్మి రాసింది/చేసింది చేరవల్సినవారికి తప్పక చేరుతుంది. మనమే జనం. జనమే మనం.
“అయితే డింగరి, జనం కోరేది మనం శాయడమా? మనం చేసేది జనం చూడడమా?”
“మన కన్నే, మన చెవే, మన మాటే మన జనం. జనం అంతా నేనే. మనం కోరతాం, మీరు చేయండి.”
అందుకే తెలుగు రాసేవాళ్ళ అందరికీ నాది ఒకటే సలహా: సాహసే ధైర్యే సరస్వతి. సాహసం శాయరా/శాయవే డింభకా/డింభకీ! సంకల్పం సిద్ధిస్తుంది. ఆత్మతృప్తి లభిస్తుంది.
పూర్తి వ్యాసం చదివాక నాకు మూడు విషయాలు అర్థమయ్యాయి.
* కథ పట్ల మీ తపన కేవలం తపన వరకే ఆగిపోకుండా దానికి తగ్గ పూర్తి శోధన జరగడం.. హడావిడిగా కాకుండా తగిన సమాచారం తెలుసుకుని కథ రాయడం. అది మేం కొత్తవాళ్లం నేర్చుకోవాల్సిన పాఠం.
* అందరిలాగే మీకూ మీ కథల్లోని కొన్నింటిని విమర్శకులు పట్టించుకోలేదన్న చిన్నపాటి బాధ ఉందన్నమాట!
* మీరు నేను అనుకునేంత గంభీరమైన వ్యక్తి కాదు. మీలోనూ చాలా అల్లరి ఊహలు ఉన్నాయి. అవి పాతాళభైరవి సినిమానే కథ మార్చి మరో కథ రాయించేలా చేశాయి. 😀😀
LikeLike
Isn’t Patalabhairavi, a reworking of Alladin and his magic lamp?
LikeLike
According to tewiki:
Pathala Bhairavi is based on Kasi Majilee Kathalu, written by Madhira Subbanna Deekshitulu, though it was also partially inspired by the story of Aladdin.
LikeLike
great fan of Pathala Bhairavi since school days, have watched it countless times. Would love to read your version. is it available on public domain ?
LikeLike
The link was given in the article. Here you go:
LikeLike